కాలసర్పయోగం అనే పదం మీరు విని ఉంటారు. కానీ కాలగ్రస్తయోగం అనే పదం విని ఉండరు. ఎందుకంటే ఇది నేను కాయిన్ చేసిన పదం కాబట్టి.
అన్ని గ్రహాలూ రాహుకేతువుల మధ్యలో ఉంటే దానిని కాలసర్పయోగం అంటామని మనకు తెలుసు. కానీ అవే గ్రహాలు కేతురాహువుల మధ్యన ఉంటే దానిని సాధారణంగా అపసవ్య కాలసర్పయోగం అంటున్నారు. కొన్నేళ్ళ క్రితం నేను కూడా దీనిపైన కొన్ని పోస్టులు వ్రాశాను. కానీ ఈ పదం నాకు సమ్మతం కాదు. అందుకని నేను దీనిని కాలగ్రస్తయోగం అంటున్నాను. కారణం ఎందుకో ఈ పోస్టులో క్లుప్తంగా వివరిస్తాను.
ప్రస్తుతం ఈ యోగం అంతరిక్షంలోని గ్రహాలమధ్యన ఉన్నదని గమనించండి.
ప్రస్తుతం ఈ యోగం అంతరిక్షంలోని గ్రహాలమధ్యన ఉన్నదని గమనించండి.
కాలసర్పయోగంలో లాగా ఈ యోగంలో, అన్ని గ్రహాలూ రాహువు నోటిలో పడే దిశగా ప్రయాణించవు. రాహుకేతువుల శరీరం మీద ఉన్నట్లుగా అవి ఉంటాయి. లేదా వాటి పొట్టలో ఉన్నట్లుగా అనిపిస్తాయి. అందుకే దీనిని కాలగ్రస్తయోగం అని నేనంటాను.
దీని ఫలితాలు కాలసర్పయోగం కంటే భిన్నమైన రీతిలో ఉంటాయి. ప్రస్తుతం 21-8-2017 నుంచి 6-2-2018 వరకూ 165 రోజులపాటు ఈ యోగం ఖగోళంలో ఉంటున్నది.
కనుక ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవితాలలో అనేక ఊహించని మార్పులు కలుగుతాయి. అనేక కష్టనష్టాలకు ప్రజలంతా గురౌతారు. ఈ కష్టనష్టాలు ఆయా జాతకాలను బట్టి, వారివారి జాతకాలలో జరుగుతున్న దశలను బట్టి ఎవరికి వారికి విభిన్నంగా ఉంటాయి. అయితే మధ్య మధ్యలో చంద్రుడొక్కడే ఈ రాహుకేతువుల పట్టు నుంచి నెలలో పన్నెండు రోజుల పాటు బయటకు వస్తూ ఉంటాడు. అలా వచ్చినపుడు మాత్రం మళ్ళీ మామూలుగా కొంచం రిలీఫ్ గా ఉంటుంది. మళ్ళీ చంద్రుడు ఈ పట్టుయొక్క పరిధిలోకి రావడం తోనే ఈ యోగం పనిచెయ్యడం మొదలు పెడుతుంది. మళ్ళీ జనాలకు ఖర్మ కాలుతుంది.
ఈ 165 రోజుల సమయంలో తమతమ పూర్వపు చెడుకర్మలను ప్రజలందరూ రకరకాలుగా అనుభవించే ముఖ్యమైన సమయాలను (ఈ రోజునుంచి ముందుకు) ఇక్కడ ఇస్తున్నాను. గమనించండి.
25-9-17 to 26-9-17
30-9-17 to 31-9-17
9-10-17 to 10-10-17
13-10-17 to 14-10-17
17-10-17 to 20-10-17
22-10-17 to 28-10-17
26-10-17 to 28-11-17 -- ఈ మొత్తం కాలవ్యవధిలో 33 రోజుల ఈ కాలం చాలా గడ్డుకాలం. మళ్ళీ ఇందులో ముఖ్యమైన సమయాలు. 7-11-17 to 10-11-17 మళ్ళీ 16-11-17 to 26-11-17.
5-12-2017 to 8-12-2017
16-12-17 to 20-12-17
1-1-18 to 4-1-18
12-1-18 to 16-1-18
28-1-18 to 1-2-18
ఈ టైంలో, ఊహించని ఉపద్రవాలను ప్రజలు ఎదుర్కొంటారు. అదంతా వారివారి పూర్వకర్మననుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరుగుతుంది. ఈ సమయాలలో నేను చెప్పినవి జరుగుతాయో లేదో మీమీ జీవితాలలో, మీమీ జాతకాలలో మీరే గమనించుకోండి మరి !!