“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, మే 2016, సోమవారం

Phoolon Ke Rang Se - Kishore Kumar



Phoolon Ke Rang Se Dil Kee Kalam Se

అంటూ కిశోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1970 లో వచ్చిన 'ప్రేమ్ పూజారి' అనే సినిమాలోది.ఈ సినిమాని దేవానంద్ నిర్మించాడు.దీనికి కధనూ దర్శకత్వాన్నీ అతనే సమకూర్చాడు.ఆ సినిమాలోని మధురగీతాలలో ఇదీ ఒకటి.ఈ పాటను నీరజ్ వ్రాయగా,SD బర్మన్ సంగీతాన్ని సమకూర్చాడు.

జీవితంలో కొన్ని కొన్ని విచిత్రాలు ఉంటాయి.వాటిల్లో ఒకటి - వెదుకులాట.

మనం చాలా విషయాల కోసం జీవితమంతా వెదుకుతూ ఉంటాం.చివరకు వాటిని చేరుకుంటాం.కానీ అవి మనకు దక్కేనాటికి, వాటిమీద మనకు ఇంటరెస్ట్ పోతుంది. అప్పుడు మనకొక విషయం అర్ధమౌతుంది.

అదేమంటే - వెదుకులాటలోనే మాధుర్యం ఉన్నది గాని గమ్యం చేరడంలో లేదు.ఎందుకంటే జీవితంలో గమ్యం అంటూ ఏదీ లేదు.ఉన్నదల్లా వెదుకులాట మాత్రమే.అయితే గియితే,వెదుకులాట నడుస్తూ ఉండాలి.దానిలో ఒకవిధమైన మాధుర్యం ఉన్నది.లేదా విసుగుపుట్టి వెదుకులాట అనేది పూర్తిగా ఆగిపోవాలి.దానిలో ఇంకా గొప్ప ఆనందం ఉన్నది.అంతేగాని, జీవితంలో ఒక గమ్యం అంటూ ఎక్కడా లేదు. దొరకదు.ఉంది అనుకోవడం పెద్ద భ్రమ.

అమెరికాలో పాడిన మూడో పాట ఇది.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి. 

Movie\-- Prem Pujari (1970)
Lyrics|--Neeraj
Music|--S.D.Burman
Singer}--Kishore Kumar
Karaoke Singer}--Satya Narayana Sarma
Enjoy
--------------------

Phoolon Ke Rang Se Dil Ki Kalam Se Tujhko Likhi Roz Paati
Kaise Bataaoon Kis Kis Tarah Se Pal Pal Mujhe Tu Sataati
Tere Hi Sapne Lekar Ke Soya Teri Hi Yaadon Mein Jaaga
Tere Khayaalon Mein Uljha Raha Yoon Jaise Ki Maala Mein Dhaaga
Haan Badal Bijli Chandan Pani Jaisa Apna Pyar
Lena Hoga Janam Humein Kayi Kayi Baar
Haan Itna Madir Itna Madhur Tera Mera Pyar
Lena Hoga Janam Hameh Kayi Kayi Baar
Sanson Ki Sargam Dhadkan Ki Veena Sapnon Ki Geetanjali Tu
Man Ki Gali Mein Mehke Jo Hardum Aisi Juhi Ki Kali Tu
Chhota Safar Ho Lamba Safar Ho Sooni Dagar Ho Ya Mela
Yaad Tu Aaye Man Ho Jaaye Bheed Ke Beech Akela
Haan Badal Bijli Chandan Pani Jaisa Apna Pyar
Lena Hoga Janam Humein Kayi Kayi Baar
Haan Itna Madir Itna Madhur Tera Mera Pyar
Lena Hoga Janam Hameh Kayi Kayi Baar

Purab Ho Paschim Uttar Ho Dakkin Tu Har Jagah Muskuraye
Jitna Hi Jaoon Main Door Tujhse Utni Hi Tu Paas Aaye
Aandhi Ne Roka Pani Ne Toka Duniya Ne Hanskar Pukara
Tasveer Teri Lekin Liye Main Kar Aaya Sab Se Kinara
Haan Badal Bijli Chandan Pani Jaisa Apna Pyar
Lena Hoga Janam Hume Kayi Kayi Baar
Haan Itna Madir Itna Madhur Tera Mera Pyar
Lena Hoga Janam Hameh Kayi Kayi Baar
Kayi Kayi Baar
Kayi Kayi Baar


Meaning

With the Ink of flowers
and with the pen of my heart
I paint your picture, daily in my thoughts
How can I explain
in how many ways you tease me always
I sleep in your dreams
and I wake up in your memories
I remain immersed in your thoughts
like a bead in a string, I am always tied to you
Our love is very pure
like clouds and lightening,
like sandalwood and water
we will have to be born again and again
for the sake of our Love
Our love is flawless and very sweet
we will have to be born again and again
for the sake of our Love

You are like the music of my breath
You are the string of my heart's lute
You are the beautiful love song of my dreams
In the lane of my mind
You are a flowery bud,fragrant and blossoming
Let my journey be short or long
May my life be a lonely place or a crowded fair
Whenever I remember you,
My heart suddenly becomes a lonely place
even though I am surrounded by many

Our love is very pure
like clouds and lightening,
like sandalwood and water
we will have to be born again and again
for the sake of our Love
Our love is flawless and very sweet
we will have to be born again and again
for the sake of our Love

May it be East or West, North or South
I see your smiling face everywhere
As much as I go away from you
So much you seem to come nearer to me
The storms tried to stop me
The oceans obstructed my path
And people of the world mocked me
Despite all this, I continue to search for you
Keeping a picture of you in my mind

Our love is very pure
like clouds and lightening,
like sandalwood and water
we will have to be born again and again
for the sake of our Love
Our love is flawless and very sweet
we will have to be born again and again
for the sake of our Love

తెలుగు స్వేచ్చానువాదం

పూలరసంతో, హృదయపు కలంతో
ప్రతిరోజూ నీ చిత్రాన్ని నా మనసులో గీస్తూ ఉంటాను
ఎన్ని రకాలుగా నన్ను సతాయిస్తున్నావో
నీకెలా చెప్పగలను?
నీ కలలతో నిద్రపోతున్నాను
నీ స్మృతులతో మేల్కొంటున్నాను
దండలోని పూసలాగా ఎప్పుడూ నీ ఆలోచనలోనే
చిక్కుకుని ఉన్నాను
మేఘాలు మెరుపులలా
గంధమూ మంచినీరులా
మన ప్రేమ చాలా స్వచ్చమైనది
దానికోసం మనం ఇంకా ఎన్నో జన్మలెత్తాలి
మన ప్రేమ కల్మషం లేనిది, మధురమైనది
దానికోసం మనం ఇంకా ఎన్నో జన్మలెత్తాలి

నా శ్వాసలో సంగీతానివి నీవు
నా హృదయపు వీణ తీగవు నీవు
నా స్వప్నాలలో ధ్వనించే ప్రేమగీతానివి నీవు
నా మనోవీధిలో నిరంతరం వికసిస్తూ
సువాసనలు వెదజల్లే దేవతా పుష్పానివి నీవు
నా ప్రయాణం చిన్నదో పెద్దదో, ఏదైనా కానీ
నా జీవితం ఒక ఏకాంతమైనా
లేదా రణగొణధ్వనితో కూడిన సంత అయినా
నువ్వు నాకు గుర్తొచ్చిన క్షణంలో
నా హృదయం పరమ ఏకాంతాన్ని అనుభవిస్తుంది
నేను ఎంత గందరగోళం మధ్యలో ఉన్నాసరే

తూర్పు,పడమర,ఉత్తరం,దక్షిణం
ఎటు చూచినా నీ నవ్వు ముఖాన్నే చూస్తున్నాను
నీనుంచి నేను ఎంత దూరంగా పోతే
నీవు అంత దగ్గరగా వస్తున్నావు
సముద్రాలు నన్ను ఆపాలని చూచాయి
తుఫానులు నన్ను బెదిరించాలని చూచాయి
మనుషులందరూ నన్ను వెక్కిరించారు
అయినా సరే,వాటిని ఏమాత్రం లెక్కచెయ్యకుండా
నీ చిత్రాన్ని నా మనసులో నిలుపుకుని
నీకోసం వెదుకుతున్నాను

మేఘాలు మెరుపులలా
గంధమూ మంచినీరులా
మన ప్రేమ చాలా స్వచ్చమైనది
దానికోసం మనం ఇంకా ఎన్నో జన్మలెత్తాలి
మన ప్రేమ కల్మషం లేనిది, మధురమైనది
దానికోసం మనం ఇంకా ఎన్నో జన్మలెత్తాలి
ఎన్నో జన్మలెత్తాలి
ఎన్నో జన్మలెత్తాలి
ఎన్నో జన్మలెత్తాలి...