“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

5, మే 2016, గురువారం

Mere Naina Saavan Bhado - Kishore Kumar


Mere Naina Saavan Bhado...

అంటూ కిశోర్ కుమార్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1976 లో వచ్చిన "మెహబూబా" అనే చిత్రం లోనిది.ఇదికూడా మరపురాని మధురగీతాలలో ఒకటే.దీన్ని వ్రాసినది ఆనంద్ బక్షి అయితే సంగీతాన్ని సమకూర్చినది రాహుల్ దేవ్ బర్మన్.ఈ సినిమాలో రాజేష్ ఖన్నా, హేమమాలిని నటించారు.ఈ పాటను కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ విడివిడిగా సోలో పాటగా ఆలపించారు.ఇద్దరూ ఈ పాటను అద్భుతంగా పాడారు.

పాతకాలంలో సినిమా కవులు కూడా అద్భుతమైన భావాలను వ్రాయగలిగేవారు.ఇప్పటివారికి ఇలాంటి భావాలను వ్రాయడం అలా ఉంచితే - కనీసం వాటిని ఊహించడం కూడా చేతకాదు. పూర్తిగా నేలబారు బ్రతుకులు బ్రతుకుతుంటే ఉన్నతమైన భావాలు ఎలా కలుగుతాయి?

"కన్నుల ద్వారా మనస్సే లోకాన్ని చూస్తూ ఉంటుంది.ఆ కన్నులు కన్నీటితో నిండి ఉన్నాయి.కానీ అదే కన్నులలోనుంచి చూస్తున్న మనసుకు మాత్రం ఇంకా దాహంగానే ఉన్నది" - అంటూ ఒక అద్భుతమైన భావాన్ని ఆనంద్ బక్షి ఎంతో చక్కగా ఈ గీతంలో ఆవిష్కరిస్తాడు.ఇంత గొప్ప భావాన్ని కలిగిఉన్న గీతాన్ని మరపురాని మధురమైన రాగంలో పొదగడంలో R.D.Burman కృతకృత్యుడైనాడు. 

స్వార్ధానికీ ప్రేమకూ ఎప్పుడూ పొసగదు.స్వార్ధం గతాన్ని మరచిపోతుంది.ప్రస్తుతపు లాభమే దానికి సర్వస్వం.కానీ ప్రేమతో నిండిఉన్న హృదయం గతాన్ని సులభంగా మరచిపోలేదు.అది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.గతానికీ వర్తమానానికీ మధ్య అది ఊగిసలాడుతూ ఉంటుంది.దానికి లాభనష్టాలతో పనిలేదు.అదొక ప్రేమైక జీవి.దానికి ఈ ప్రపంచపు నాటకాలు తెలియవు.దానికి తెలిసిన ఏకైక దైవం ప్రేమ ఒక్కటే. ఆ దైవపు పాదాల చెంతనే అది మౌనంగా రోదిస్తూ కూచుని ఉంటుంది.

అనేక జన్మలు దాని కళ్ళముందు ఋతువులలా గడచిపోతూనే ఉంటాయి.కానీ దానికవేవీ నచ్చవు.దాని దృష్టి అంతా ప్రేమమీదే ఉంటుంది.ప్రేమకోసమే అది చకోర పక్షిలా ఎదురుచూస్తూ ఉంటుంది.తన ప్రేమకు స్పందించే హృదయం కోసం అది కాలాన్ని అధిగమించి అలా నిరంతరం ఎదురుచూస్తూనే ఉంటుంది.

అది కోరుకునే ప్రేమ దానికి లభిస్తుందా?

ఏమో? చెప్పలేం...

అద్భుతమైన ఫీల్ ను ఇచ్చే పాటల్లో ఇదొకటి.అమెరికా గడ్డ మీద నుంచి పాడిన నాలుగో పాట ఇది.

వినండి మరి.

Movie:--Mehbooba (1976)
Lyrics:--Anand Bakshi
Music:--Rahul Dev Burman
Singer:--Kishore Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------
Oo hoo - uhu hoo hoo hoo
[Mere naina saavan bhaado - Phir bhi mera man pyaasa
Phir bhee meraa man pyaasa}-2

Aiy dil deewane - Khel hai kya jaane
Dard bhara ye - Geet kaha se
In hoton pe aye - Door kahee le jaaye
Bhool gaya kya - bhool ke bhee hai
Mujhko yaad zaraa sa - Phir bhee meraa man pyaasa

Baat purani hai - Ek kahani hai
Ab sochu tumhe - yaad nahee hai
Ab sochu nahee bhule - Vo saavan ke jhoole
Rit aaye rit jaaye deke
jhoota ek dilasa - Phir bhi mera man pyasa

Barso beet gaye - hamko mile bichde
Bijuri bankar - gagan ke chamke
Beete samay ki rekha - maine tumko dekha
Man sang aakhmichole khele
Aasha aur nirasha - Phir bhi mera man pyasa

Mere naina saavan bhaado - Phir bhi mera man pyaasa
Phir bhee meraa man pyaasa...

Meaning

My eyes are full of tears like raindrops
Yet my mind is still thirsty for love

My heart is insane
It does not know the game (of the world)
This sad song comes onto my lips from where?
this song, which takes me to far off places
Although I have forgotten many things (of the past)
Yet I still remember a few things
My mind is still thirsty for love

The issue is from the very distant past
Our story too is
I think you forgot everything
But I still remember the swing of monsoon
Seasons come and go
leaving a sense of false comfort with us
Yet my mind is thirsty for love

Many years passed since we separated
I see Time as a streak of lightening in the sky
and in that lightening, I see you
Hope and despair
play the hide and seek game with my mind
Yet my mind is thirsty for love...

My eyes are full of tears like raindrops
Yet my mind is thirsty for love

తెలుగు స్వేచ్చానువాదం

నా కన్నులు వర్షపు ధారల వంటి
కన్నీటితో నిండి ఉన్నాయి
కానీ మనస్సు ఇంకా దాహంతోనే ఉంది

ఈ హృదయం ఒక పిచ్చిది
దీనికి ఈ ప్రపంచపు కల్మషం తెలియదు
ఎక్కడనుంచి ఈ విషాద గీతం
నా పెదవుల మీదకు వస్తోందో
ఇది నన్ను ఏ సుదూర తీరాలకు
తీసుకుపోతోందో
దానికి ఏమాత్రం తెలియదు
నేను గతాన్ని పూర్తిగా మరచిపోయినా
కొన్ని సంగతులు మాత్రం ఇంకా గుర్తున్నాయి
నా మనసు ఇంకా దాహంతోనే ఉంది

మన కధ ఇప్పటిది కాదు
చాలా పాతది
నువ్వు అంతా మరచిపోయావు
కానీ ఆ వర్షాకాలపు ఊయలను
నేనింకా మరచిపోలేదు
ఎన్నో ఋతువులు వచ్చి పోతున్నాయి
ఒక కృత్రిమ సంతోషాన్ని అవి కలిగిస్తున్నాయి
కానీ నా మనస్సు ఇంకా దాహంతోనే ఉంది

మనం విడిపోయి ఎన్నో ఏళ్ళయింది
ఆకాశపు మెరుపులాగా
కాలం మెరిసి మాయమౌతోంది
ఆ మెరుపులో కూడా నిన్నే చూస్తున్నాను
ఆశ నిరాశలు నా మనసుతో
దాగుడు మూతలు ఆడుతున్నాయి
అయినా నా మనస్సు ఇంకా దాహంతోనే ఉంది

నా కన్నులు వర్షపు ధారల వంటి
కన్నీటితో నిండి ఉన్నాయి
కానీ నా మనస్సు ఇంకా దాహంతోనే ఉంది