“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

19, జూన్ 2015, శుక్రవారం

సూర్య నమస్కారాలు చెయ్యడం తప్పా?

మన పదకోశంలో రెండు మాటలున్నాయి.

కృతజ్ఞత -- కృతఘ్నత

మనం ఎవరి వద్దనైనా ఒక మేలును పొందితే దానికి మనకు కృతజ్ఞత కలుగుతుంది.మనిషిగా పుట్టిన ఎవడికైనా ఈ స్పందన హృదయంలో నుంచి పెల్లుబికి వస్తుంది.

అలా కాకుండా పొందిన మేలును మర్చిపోతే దానిని కృతఘ్నత అంటాం.అది మానవ లక్షణమూ మానవత్వ లక్షణమూ కాదు.రాక్షస లక్షణం.

సూర్య నమస్కారాలు చెయ్యడం సూర్యునికి మనం చూపించే కృతజ్ఞతలో ఒక భాగం.అవి చెయ్యడం వల్ల మననుంచి సూర్యుడికేమీ ఒరగదు.మళ్ళీ దాంట్లో కూడా మనకే ఆరోగ్యపరంగా మేలు జరుగుతుంది.

భూమిమీద జీవం పుట్టుకకూ మనుగడకూ కూడా సూర్యుడే కారకుడు.మనం బ్రతుకుతూ ఉన్నామంటే దానికి కారణం సూర్యుడే.సూర్యశక్తినే మనం ఆహారంగా తీసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం.

మరి మన మనుగడకు కారణమైన సూర్యుడికి నమస్కరించడం తప్పెలా అవుతుంది?

ఏదో పుస్తకంలో వ్రాసుందట.

ఏమని?

దేవుడికి తప్ప సృష్టిలో దేనికీ నమస్కరించరాదు అని.

ఆ పుస్తకం వ్రాసిన వాడి తెలివి తెల్లవారినట్లే ఉన్నది.

అంటే ఈ సృష్టిలో దేనికీ ఎవరికీ నమస్కారమే చెయ్యకూడదన్నమాట !!!

చాలా గొప్ప బోధన.

అంటే -- మనల్ని కని పెంచిన తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యకూడదు. మనల్ని రక్షిస్తున్న పంచభూతాలకూ ప్రకృతి శక్తులకూ నమస్కరించకూడదు. మనకు సహాయం చేసినవారికి కూడా నమస్కరించ కూడదు.

మరేం చెయ్యాలి?

మనకంటే కొద్దిగా తేడాగా ఉన్న అందరినీ విచక్షణా రహితంగా చంపుతూ పోవాలి.మంచిమంచి కళాఖండాలనూ దేవాలయాలనూ ధ్వంసం చెయ్యాలి. వాటి ఆస్తుల్ని దోచుకోవాలి.అక్కడున్న పండితులనూ పూజారులనూ చంపి పారెయ్యాలి.లేదా తన గుంపులో కలుపుకోవాలి.కనిపించిన ప్రతి ఆడదానికీ ముసుగేసి జనానాలోకి జమచెయ్యాలి.ఇష్టం వచ్చినంత మందిని కని పారెయ్యాలి.చివరికి అంతమంది పెళ్ళాలూ వాళ్ళ పిల్లలూ ఎవరూకూడా పట్టించుకోకపోతే,వాళ్ళ చేతే ఒక జైల్లో పెట్టబడి,అక్కడే మగ్గుతూ ప్రాణం వదలాలి.

చాలా గొప్ప బోధనలేగా మరి ? ప్రపంచం మొత్తం మీద ఇంత గొప్ప బోధనలు ఎక్కడనుంచి వస్తాయి?

మనిషికంటూ ప్రాధమికంగా ఉండవలసిన లక్షణం -- కృతజ్ఞత.

ఆ 'కృతజ్ఞత' అనేదే లేకుండా, ప్రతిదాన్నీ దోపిడీ చేస్తూ ధ్వంసం చేస్తూ పోయేవాడికి,ఒక సౌందర్యమూ,ఒక సౌకుమార్యమూ,ఒక కళాదృష్టీ,ఒక లాలిత్యమూ, ఒక ఔన్నత్యమూ,ఒక మానవత్వమూ ఎలా అర్ధమౌతాయి? ఎక్కడనుంచి వస్తాయి? ఇవేవీ లేనివాడికి దైవత్వం ఎలా వస్తుంది?

మూర్ఖుడికి మొగలిపువ్వు సౌందర్యమూ సువాసనా ఎలా అర్ధమౌతాయి?

కనిపించే దేవుడికి నమస్కారం పనికిరాదట.కనిపించని దేవుడికి మాత్రం ఒంటి చేత్తో కుంటి నమస్కారం చెయ్యాలట.ఒంటిచేతి కుంటి నమస్కారాలకు అలవాటు పడినవారికి, రెండుచేతులూ జోడించి తలవంచి మనస్ఫూర్తిగా చేసే నమస్కారం యొక్క విలువ ఎలా అర్ధమౌతుంది?

అసలు--ఈ సృష్టిని సృష్టించిన దేవుడి అడ్రస్ ఏమిటి? ఆయనెక్కడుంటాడు?ఇది మాత్రం ఎవరికీ తెలీదు.అసలు దైవాన్ని 'దేవుడు' అని పుంలింగంతో ఎందుకు సంబోధిస్తున్నావు? అంటే పుస్తకం వ్రాసిన నీవు మొగవాడివి గనుక దేవుడిని కూడా మొగవాడిని చేసి కూచోబెట్టావా? దైవం స్త్రీ ఎందుకు కాకూడదు? అంటే ఆడది నీకు ఎల్లకాలం బానిసగా పడుండాలి గనుక ఒక స్త్రీరూపంలో దైవాన్ని నీవు ఒప్పుకోలేవు.అంతేగా? అసలు దైవం అనేది ఈ రెండు లింగాలకీ అతీతం కూడా ఎందుకు కాకూడదు?

'దేవుడు'- అనే పదంలో ఉన్నట్లుగా దేవుడు మొగవాడైతే, స్త్రీ తోడు లేకుండా ఆయన సృష్టిని ఎలా చేశాడు? అసలు మొదట్లో ఆ దేవుడు ఎలా సృష్టింప బడ్డాడు?ఆ దేవుడిని సృష్టి చేసినది ఎవరు?తనకు స్త్రీ అవసరం లేనప్పుడు ఈ సృష్టిలో స్త్రీలను ఎందుకు సృష్టించాడు?అంటే, తనొక్కడే హాయిగా బేచిలర్ గా ఉంటూ, తన సృష్టిలో మొగవాళ్ళను మాత్రం ఇబ్బంది పెడదామనే దుర్బుద్ధి దేవుడికి ఉన్నట్లేగా? ఇలాంటి దుర్బుద్ధి ఉన్నవాడు అసలు దేవుడెలా అవుతాడు?

ఈ ప్రశ్నలలో దేనికీ ఆయా పుస్తకాలలో జవాబులు ఉండవు.

సృష్టికి భిన్నంగా దేవుడెక్కడున్నాడు? మొన్నటి దాకా మేఘాల అవతల దేవుడున్నాడని కొన్ని మతగ్రంధాలు చెబుతూ వచ్చాయి. నేడు మనకు తెలుసు మేఘాల అవతల ఏ దేవుడూ లేడని.ఉంటే, విమానాలలో ప్రయాణం చేసే అందరికీ ఆయన దర్శనం ఇప్పటికి కొన్ని వందలసార్లు అయ్యి ఉండాలి. 

అసలిలాంటి పుస్తకాలు వ్రాసిన వారికి IQ అనేది బిలో ఏవరేజ్ అని నా అనుమానం.ఇలాంటి పిచ్చి భావనలు పోయి సత్యమేమిటో తెలియాలంటే హిందూ మత మూలగ్రంధాలను చదవాలి.

దేవుడికి తెలివనేది ఉంటే సూర్యుడికి నమస్కారం చేస్తే ఒద్దని అననే అనడు. ఎందుకంటే - "సూర్యుడి ద్వారా మనిషి గౌరవిస్తున్నది తననే" - అని ఆ దేవుడికి తెలుస్తుంది.ఎదురుగా కనిపిస్తున్న సూర్యుడికి నమస్కారం చెయ్యడం ద్వారా కంటికి కనిపించని తనకే ఆ మనిషి నమస్కారం చేస్తున్నాడని దేవుడికి తెలుస్తుంది. ఈ మాత్రం తెలివికూడా లేనివాడు అసలు దేవుడెలా అవుతాడు?

సూర్యునికి నమస్కరిస్తేనే కోపం తెచ్చుకుని నిన్ను నరకంలోకి త్రోసే దేవుడు అసలు ఆ పదానికే అనర్హుడు.అంత జెలసీ ఉన్నవాడు అసలు దేవుడెలా అవుతాడు?

ఇంత చిన్న లాజిక్ కూడా అర్ధం చేసుకోలేని మనుషులు వ్రాసిన గ్రంధాలను అసలు మానవాళి ఎందుకు అనుసరించాలి? అలా అనుసరించడం ద్వారా, ఇంకా ఇంకా అజ్ఞానంలోకి ఎందుకు కూరుకుపోవాలి?

పుట్టిన దగ్గరనుంచీ పోయేవరకూ తన బ్రతుకుకు ఎవరైతే ఆధారమో, ఆ సూర్యుడిని ఆరాధించకపోవడమే మనిషి చేస్తున్న అతి ఘోరమైన తప్పు.

ఈ తప్పును మనిషి ముందుగా దిద్దుకోవాలి.

సూర్యుని ఆలయాలను కూలగొట్టిన మూర్ఖులకు సూర్యోపాసనలో ఉన్న అద్భుతాలు ఎలా అర్ధమౌతాయి?

మనిషిగా పుట్టిన ప్రతివాడూ సూర్యనమస్కారాలను తప్పనిసరిగా చెయ్యాలి. అలా చెయ్యడం తప్పని ఏ గ్రంథమైనా చెబితే ఆ గ్రంధాన్నే పక్కన పెట్టవలసిన అవసరం మానవజాతికి ఉన్నది.సత్యానికి వ్యతిరేకంగా చెప్పే ఏ పుస్తకాన్నీ అనుసరించవలసిన అగత్యం మనిషికి లేదు.

అలాంటి తప్పు భావాలతో నిండిన గ్రంధాలు వ్రాయడానికి కావలసిన వెలుతురును ఇచ్చినది కూడా సూర్యుడే. తన ఆలయాలను ధ్వంసం చేస్తున్నవారి కళ్ళు కనబడటానికి అవసరమైన వెలుతురును ఇచ్చినది కూడా సూర్యుడే. 

ఇలాంటి క్షమా ఓర్పూ దేవుడికి కాక ఇంకెవరికుంటాయి?

సూర్యుడిని దైవంగా కొలవడం మనిషి చెయ్యగలిగిన ఉత్తమమైన ఉపాసనలలో కెల్లా అత్యుత్తమమైనది.మనం కట్టుకున్న గోడముందో గొబ్బెముందో మ్రొక్కడం కంటే,మన మనుగడకు కారణమైన సూర్యుడికి మ్రొక్కడం అత్యుత్తమం కాదూ?

సంధ్యోపాసనా,గాయత్రీ ఉపాసనా నిజానికి సూర్యోపాసనలే.వీటిని ఆచరించడం ద్వారా ఈ దేశంలో కొన్ని వేల,లక్షలమంది ప్రవక్తలు ఉద్భవించారు.నేటికీ ఉద్భవిస్తున్నారు.

ఇతరమతాలలో ఎక్కడో ఒకరో ఇద్దరో ప్రవక్తలు ఉంటే ఉండవచ్చుగాక. "ఇతరమతాల వారిని నరకండి చంపండి"- అని వారు తెలివితక్కువగా బోధిస్తే బోధించి ఉండవచ్చుగాక.ఇంకా చెప్పాలంటే -- కనిపించని దేవుడిని కొలవడం వల్ల కలిగే రాక్షస మనస్తత్వం ఇలాగే ఉంటుంది.

కానీ, సూర్యుడిని దైవంగా పూజించే ఈ దేశపు ఏ ప్రవక్తా అలా చెప్పలేదు.

"ప్రపంచమంతా నీ కుటుంబమే,పరాయివారు ఎవరూ లేరు.ఎవరినీ దోచుకోకు.ఈ సృష్టిలో ఎవరికీ హాని చెయ్యకు.కావాలంటే నీ వస్తువులనే త్యాగంచెయ్యి.అంతేగాని ఎదుటి జీవిని హింసించకు"- అని గొప్ప మానవత్వాన్ని బోధించిన ప్రవక్తలు ప్రతితరంలోనూ పుట్టిన గడ్డ ఇది. సూర్యుడిని దైవంగా భావించడం వలన కలిగే పరిపక్వత ఇలా ఉంటుంది.

హిందూమతంలో ప్రతితరంలోనూ వందలాది ప్రవక్తలున్నారు.ఒక కాలంలోనైతే, ఈ దేశపు ప్రతి కుటుంబంలోనూ ఒక ఋషి ఉన్నాడు.ఒక ప్రవక్త ఉన్నాడు.ఈ అద్భుతానికి కారణం కళ్ళ ఎదుట కనిపించే సూర్యుని ద్వారా కళ్ళకు కన్పించని దైవాన్ని దర్శించడమే.

'సూర్యునికి నమస్కారం చెయ్యవద్దు'- అనడం క్షమించరాని పాపం మాత్రమే కాదు,దైవం పట్ల మహాఘోరమైన కృతఘ్నత కూడా.

అనుక్షణం మనం ఎవరినుంచి అయితే మేలును పొందుతున్నామో, ఎవరినుంచి అయితే జీవాన్ని పొందుతున్నామో, ఎవరిద్వారా ఆహారాన్ని పొందుతున్నామో,అలాంటి సూర్యుడు దైవం కాకుంటే ఇంకెవరు దైవం? ఎక్కడున్నాడో తెలియని ఒక ఊహామాత్రపు భావన దైవమా?

మనుషులని చీకటి యుగాలలోకి తీసుకుపోతున్న ఇలాంటి దుష్టభావాల పట్టు నుంచి ఈ మానవాళిని వెలుగు ప్రదాత అయిన ఆ సూర్యభగవానుడే రక్షించాలి.పాపం ఆయన తప్పేమీ లేదు.ఆయన తన వెలుగును అందరికీ సమానంగా ప్రసరిస్తూనే ఉన్నాడు.మనమే గబ్బిలాల లాగా చీకట్లోనే అఘోరిస్తాం అంటే ఆయనేం చెయ్యగలడు?

ప్రపంచం అంతా సత్యపు వెలుగులో ముందుకు పోతున్నది.అయినా సరే-- మేం మాత్రం చీకటియుగాల భావాలను వదలకుండా అంటిపెట్టుకుని, అడవి మనుషులలాగా బ్రతుకుతూ ఉంటాం. అక్కడనుంచి ఎంతమాత్రం ముందుకు రాము -- అంటే మనమేం చెయ్యగలం??

మాకు మా పుస్తకపు చీకటిలోనే ఆనందంగా ఉంది అంటే--ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు?