“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, ఏప్రిల్ 2015, గురువారం

4-4-2015 చంద్రగ్రహణం - ప్రభావాలు

4-4-2015 తేదీన రాబోతున్న సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశం అంతటా కనిపిస్తుంది.కనుక ఈ గ్రహణ ఫలితాలు మన దేశం మీదా,పౌరుల మీదా ఆరునెలల వరకూ ఉంటాయి.అవి ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

ఈ గ్రహణం శనివారం నాడు సాయంత్రం 15.47  నుంచి 19.15 వరకూ ఉంటుంది.ఆ సమయంలో కన్యారాశిలోని హస్తానక్షత్రం నాలుగో పాదంలో చంద్రుడు సంచరిస్తూ రాహుగ్రస్తుడౌతున్నాడు.

కనుక కన్యా లగ్నంలో పుట్టినవారి మీదా,శనివారం నాడు పుట్టినవారి మీదా,హస్తానక్షత్ర జాతకుల మీదా ఆర్నెల్లపాటు దీని ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫలితాలు హస్త-4 పాదంలో పుట్టినవారి మీద బలంగా ఉంటాయి.వీరి మానసికస్థితిలో ఈపాటికే మార్పులు గోచరిస్తూ ఉంటాయి. ఎవరికి వారు గమనించుకోవచ్చు.

లగ్న/చంద్రరాశి పరంగా వీటిని గమనించండి.

మేషం
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూచుకోవాలి.అప్పులు చెయ్యరాదు.శత్రువులనుంచి జాగ్రత్తగా ఉండాలి.రాష్ డ్రైవింగ్ పనికిరాదు.అనాలోచిత నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు.

వృషభం
మానసిక చింత ఎక్కువౌతుంది.సంతానపరమైన చికాకులు బాధపెడతాయి. ప్రేమికుల ప్రేమ విఫలం అవుతుంది.చదువులో,పోటీ పరీక్షలలో,ఆటంకాలు అపజయాలు కనిపిస్తాయి.

మిధునం
గృహజీవితంలో అశాంతి పెరుగుతుంది.సుఖం లోపిస్తుంది.చదువు కుంటు పడుతుంది.వాహన ప్రమాదాలు జరుగుతాయి.తల్లికి గండం.ఆలోచన లేని నిర్ణయాలవల్లా, ఎమోషనల్ గా తీసుకున్న నిర్ణయాలవల్లా నష్టం కలుగుతుంది.గుండె జబ్బు ఉన్నవారికి ప్రమాదం పొంచి ఉన్నది.అతి జాగ్రత్త అవసరం.

కర్కాటకం
మాట దురుసు వల్ల,కమ్యూనికేషన్ చేతగాకపోవడం వల్ల నష్టపోతారు. తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు గండం.ఇష్టం లేని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.ENT సమస్యలు వెంటాడతాయి.

సింహం
కంటిరోగాలు వెంటాడతాయి.మాట తీరు మార్చుకోకపోతే ఘోరమైన నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.సమయానికి తిండీ తిప్పలు లోపిస్తాయి.ఇంటిలో ఉన్న పరిస్థితుల వల్ల శాంతి ఉండదు.

కన్య
నష్టాలు ఎదురౌతుంది.స్నేహితులు మోసగిస్తారు.పొరుగువారి ఇంటిలో ఒక దుర్ఘటన జరుగుతుంది.మానసిక చింతా,భయమూ పీడిస్తాయి.అనారోగ్యం వెంటాడుతుంది.యాక్సిడెంట్ జరుగవచ్చు.జాగ్రత్తగా ఉండాలి.

తుల
అనుకోకుండా విపరీతమైన ఖర్చు అవుతుంది.ఒక చెడు సంఘటన వల్ల ఆస్పత్రిని దర్శిస్తారు.ఉన్న చోటిని విడచి పెట్టవలసి వస్తుంది.నష్టం ఎదురౌతుంది.

వృశ్చికం
అన్నలకు అక్కలకు స్నేహితులకు గండకాలం.లాభం ఆశించిన చోట నష్టం ఎదురౌతుంది.యాక్సిడెంట్ జరిగి మోకాళ్ళు,పిక్కలకు దెబ్బలు తగులవచ్చు. వాతరోగాలు ఎక్కువౌతాయి.ఇరుగు పొరుగువారికి,సేవకులకు నష్టాలు ఎదురౌతాయి.

ధనుస్సు
వృత్తి వ్యాపారాలలో అనుకోని చెడు ఎదురౌతుంది.కొందరికి ఉద్యోగాలు ఊడిపోతాయి.నష్టం సంభవిస్తుంది.తండ్రిగాని,తండ్రి సమానులు గాని మరణిస్తారు లేదా ఏదైనా రోగంతో మంచాన పడతారు.లేదా వారికి యాక్సిడెంట్ జరుగుతుంది.సమాజంలో చెడ్డపేరు వస్తుంది.

మకరం
కుటుంబంలో ఒక చెడువార్త వింటారు.పెద్దలుగాని,గురువులు గాని పితృసమానులుగాని గతిస్తారు.లేదా ఒక దుర్ఘటనను ఎదుర్కొంటారు.ఒక అనవసరమైన దూరప్రయాణం చెయ్యవలసి వస్తుంది.ఆధ్యాత్మిక ప్రగతి మందగిస్తుంది.

కుంభం
ఒక ఘోరమైన నష్టాన్ని చవిచూస్తారు.ఒక దీర్ఘరోగం పట్టుకుంటుంది లేదా తిరిగి విజ్రుంభిస్తుంది.కోర్టు కేసులలో చుక్కెదురౌతుంది.ఆస్తి నష్టపోతారు.

మీనం
జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.వారినుంచి పోరు ఎక్కువౌతుంది.ఒక మానసిక సమస్య తీవ్రంగా వేధిస్తుంది.సమాజంలో నీలాపనిందలు ఎదుర్కుంటారు.

ఈ ఫలితాలను ఎదుర్కోడానికి -- తెలిసినవారి వద్ద సరియైన పరిహారాలు తెలుసుకొని వ్యక్తిగత జీవితంలో వాటిని ఆచరిస్తూ, ఆర్నెల్ల పాటు జాగ్రత్తగా ఉండాలి.

టీవీలలోనూ,రోడ్డు పక్కనా,ఎవరుబడితే వారు చెప్పిన పిచ్చిపిచ్చి రెమెడీలు చేసి డబ్బు నష్టపోవద్దు.తార్కిక శాస్త్రీయత లేని పరిహారాలు పనిచెయ్యవు.

ఈ ఫలితాలు అందరికీ జరుగుతాయని భయం వద్దు.ఇవి అందరికీ జరగవు.ఎవరికైతే చెడు దశలు జరుగుతున్నాయో,ఎవరికైతే ఏలినాటి శని, అష్టమశని,అర్దాష్టమ శని వంటి గోచారాలు జరుగుతున్నాయో వారికి మాత్రమే ఇవి జరుగుతాయి.మంచి దశలు జరుగుతున్నవారికి స్వల్పమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తాయి.కనుక అనవసరమైన భయాందోళనలు పనికిరావు.