“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

మాస్టర్ యిప్ చున్ ఫైట్

వింగ్ చున్ దివంగత గ్రాండ్ మాస్టర్ యిప్-మాన్ పెద్దకుమారుడు మాస్టర్ ఇప్ చున్. ఆయనకు ఇప్పుడు 85 ఏళ్ళు. వయసులో "యిప్ మాన్- ది లెజెండ్ ఈస్ బార్న్" సినిమాలో తన తండ్రి యిప్ మాన్ కు ఒక గురువైన "ల్యూంగ్ బిక్" గా నటించాడు. అంతేకాదు అందులో యిప్ మాన్ గా నటించిన "డెనిస్ టో" తో ఫైట్ సీన్ లో అద్భుతమైన ఫైట్ చేసాడు. డానీయెన్ హీరొ గా వచ్చిన రెండు సినిమాలకూ ఈ సినిమా ప్రీక్వెల్.

దీనికి ముందు తీసిన రెండు సినిమాల్లో డానీ యెన్ హీరొ గా నటించాడు. కాని మూడో సీక్వెల్ (ప్రీక్వెల్) మాత్రం మొదటి రెంటి కన్నా చాలా బాగుంది. దానికి కారణాలు: డానీ యెన్ మంచి ఫైటరే కాని అతనికి అసలైన వింగ్ చున్ కుంగ్ ఫూ రాదు. అతను అందులో మొదట్నించీ ట్రైనింగ్ తీసుకోలేదు. సినిమా కోసం కొద్ది నెలలు వింగ్ చున్ అభ్యాసం చేసాడు. అందుకే అతని మూమెంట్స్ లో ఒరిజినల్ వింగ్ చున్ కుంగ్ఫూ కనిపించదు.

కాని మూడో సీక్వెల్ లో హీరో గా నటించిన "డెనిస్ టో" మాత్రం వింగ్ చున్ కొన్నేళ్ళుగా అభ్యాసం చేసాడు. అతనికి స్టైల్లో గట్టి పునాది ఉంది. అందుకే అతని మూమెంట్స్ లో అసలైన వింగ్-చున్ కుంగ్ ఫూ కనిపిస్తుంది. అతనూ మాస్టర్ యిప్ చున్ కలసి చేసిన ఫైట్ చాలా బాగుంది. ఇద్దరూ మంచి మాస్టర్లే కనుక ఫైట్ చాలా బాగా వచ్చింది. వింగ్ చున్ అభిమానులను ఫైట్ బాగా అలరిస్తుంది. విద్య తెలిసినవారికి ఇందులో ఉన్న వింగ్ చున్ కిటుకులు బాగా నచ్చుతాయి.