“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, సెప్టెంబర్ 2009, సోమవారం

YSR జాతకం-ఒక పరిశీలన


YSR జాతకం చూద్దామని వెతుకుతుంటే జననసమయం ఎక్కడా దొరకటంలేదు. 

చాలాప్రయత్నం మీద రాత్రి 8.01 అని ఒకచోట దొరికింది. సమయానికి వేసిన జాతకంతో జరిగిన సంఘటనలు పోల్చి చూచాను. మొదటగా జనన సమయాన్ని కుందస్ఫుట విధానంతో సరిచేయగా అది రాత్రి 8.00 అని తేలింది. సమయానికి వేశిన జాతకం ప్రక్కన ఇస్తున్నాను.

మనిషి ఆకారం, మనస్తత్వం పోల్చి చూడగా:
>>ఈ సమయానికి లగ్నం నాలుగో నవాంశలో పడుతుంది.అనగా మకరలగ్నం-మేష నవాంశ అవుతుంది. ఈ యోగానికి కళ్యాణవర్మ తన "సారావళి" లో ఇచ్చిన ఫలితం ఏమనగా-ఈ వ్యక్తి ఎరుపుజీరలు కలిగిన పెద్ద కళ్లు, పెద్దనుదురు,కృశించిన శరీరం, చేతులు,మధ్యలో ఖాళీలు ఉన్న పండ్లు,అస్తవ్యస్తమైన జుట్టు,ఆగిఆగి మాట్లాడే వాక్కు కలిగి ఉండును.వీటిలో మొదటి లక్షణం కోపానికి సూచనగా తీసుకోవాలేమో.ఏదేమైనా ఇందులో కొన్నికొన్ని లక్షణాలు - ముఖ్యంగా-పెద్ద నుదురు(బట్టతలవల్ల అలా కనిపించవచ్చు),ఆగిఆగి మాట్లాడే మాటలు బాగానే కలిశాయి.
>>తరువాత- ఈ జాతకానికి కుజుడు ఆత్మ కారకుడయ్యాడు. కనుక కుజుని లక్షణాలైన మొండిపట్టు, తాననుకున్న పని సాధించే పట్టుదల,ఘర్షణకు భయపడని మనస్తత్వం,ఫేక్షనిజం వగైరాలు బాగానే సరిపోయాయి.

ఇదే సమయం సరియైనది అనుకోని-మిగిలిన జాతకాన్ని కూడా పరిశీలించగా:

>>గురువు వక్రస్థితి వల్ల ఈయనకు గురువులు, మహనీయులకు సంబంధించిన దోషం లేదా శాపం ఉంది అని చెప్పవచ్చు.సామాన్యంగా గురువు వక్రించిన జాతకాలలో ప్రతి 12 సంవత్సరాలకు పూర్తయ్యే ఒక ఆవ్రుత్తితో ఏదో ఒక చెడుసంఘటన జరగటం చూడవచ్చు. 60 ఏళ్ళకు గురువు 5 ఆవృత్తులు పూర్తీ చేసి మళ్ళీ జనన సమయానికి ఉన్న స్థితికి వస్తాడు. ప్రస్తుతం దుర్మరణం జరిగినపుడు కూడా గురువు మళ్ళీ వక్రస్థితిలో ఉన్న విషయం గమనించవచ్చు. ఇటువంటి జాతకాలలో ఉన్న రహస్యం ఏమనగా- ఈ గురుదోషాన్ని క్రమేణా పరిహారం చేసుకుంటూ గురువులకు,దైవానికి,ధర్మానికి వినమ్ర భావంతో ఉంటూ, అధర్మ ఆర్జనకు పోకుండా, పవిత్ర జీవితం గడుపుతూ,జాగ్రత్తగా ఉంటే,గురువు సంతుష్టుడై ఆ దోషాన్ని తొలగిస్తాడు. కాని తెలిసో తెలియకో దాన్ని ఎక్కువ చేసుకుంటే, జన్మతా ఉన్న దోషం క్రమేణా ఎక్కువై, గోచార రీత్యా గురువు వక్రించినస్థితికి వచ్చినపుడు గురువు ఆగ్రహం వల్ల తీవ్రపరిణామాలు కలుగుతాయి. ప్రస్తుతం జరిగింది అదే అని అనిపిస్తున్నది. కర్నూలులో కంచి శంకరాచార్యస్వామిని అరెస్టు చెయ్యటం(మరణం కూడా కర్నూలు దగ్గరలోనే జరగటం దీని ఫలితమేనా?), తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణలో ఎక్కువగా జోక్యం చేసుకోవటం మొదలైన పనుల వల్ల జన్మతా వచ్చిన గురుదోషం అనేక రెట్లు ఎక్కువ అయ్యింది. గురు గ్రహం పంచతత్వాలలో ఆకాశతత్వానికి అధిపతి. మరణానికి కారణం కూడా ఆకాశ ప్రయాణం అయింది చూచారా?
>>పంచమంలో కుజస్థితి, శనిదృష్టి తో ఒక కొడుకు ఒక కూతురు కలిగారు. కనుక ఇది కూడా సరిపోయింది.
>>లగ్నం మకరం కావటంతో, కష్టపడి పని చేసే తత్త్వం, పట్టుదల కలుగుతాయి. ఇవి కూడా సరిపోయాయి.
>>జైమినివిధానంలో-ఆత్మకారక నవామ్శకు దశమంలో శనిస్థితితో ప్రజాదరణ, సామాన్య జనంలో అభిమానం కలుగుతాయి. ఇది కూడా సరిపోయింది.

ఇప్పుడు జాతకంలో కొన్ని ముఖ్యసంఘటనలు- దశలతో సరిపోతాయో లేదో చూద్దాం.
>>వివాహం 1971 లో జరిగింది. అప్పుడు శుక్ర/శని దశ జరుగుతున్నది. శని లగ్నాధిపతి గా తనను, శుక్రుడు సప్తమంలో ఉండి వివాహాన్ని సూచిస్తున్నారు. సరిపోయింది.
>>1973 లో పులివెందులలో ఆస్పత్రి నిర్మాణం చేసి వైద్య సేవలు అందించటం జరిగింది. అప్పుడు జాతకంలో శుక్ర/బుధ దశ జరుగుతున్నది. శుక్రుడు దశమాదిపతిగా సప్తమంలో ఉంటూ పబ్లిక్ రిలేషన్ను+బుధుడు ఆస్పత్రులను సూచించే షష్టమాధిపతిగా వైద్యగ్రహమైన రవితో కూడి ఉండటం చూడవచ్చు.
>>1978 లో MLA అయినపుడు రవి/గురు దశ జరిగింది. రవి నవాంశలో ఉచ్ఛ స్థితి. కనుక పదవీ యోగం పట్ట్టింది.
>>1980,1983 లలో మంత్రిగా చేసినపుడు రవి దశ చివర, చంద్రదశ మొదలు జరిగాయి. నవాంశలో చంద్రుడు రవితో కలిసి ఉండటంవల్ల అదే ఫలితాలు కొనసాగాయి.
>>2003 వేసవిలో పాదయాత్ర చేసినపుడు రాహు/గురుదశ జరుగుతున్నది.రాహువు సహజ కారకత్వమైన తిప్పటతో దేశమంతా తిప్పటం జరిగింది. కాని ఇది గురుచండాల యోగదశ కావటంతో ఉద్దేశాలు అనుమానాస్పదాలు కావచ్చు.మరియు అంతిమంగా చెడుకు దారి తియ్యవచ్చు.
>>చివరిగా దుర్మరణం రాహు/ కేతు/ కుజ/ శని/ రాహుదశలలో జరిగింది. మరణసమయంలో గురు హోర జరుగుతున్నది గమనించండి. రాహుకేతువులు మంచి స్థానాలలో ఉన్నారు గనుక ప్రమాదం జరుగలేదు అని కొందరు జ్యోతిష్కులు పత్రికలలో వ్రాశారట. నేను చూడలేదు.

పైపైన చూస్తె అలా అనిపించటం సబబే. కాని వీరు ఒక్క విషయం గమనించాలి. రాహువు,గుళికతో కూడి మీన రాశిలో 28 డిగ్రీలలో ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్లో ఉన్నాడు. రాహువు గురువు గారి రాశిలో ఉండి పరోక్షంగా గురువును సూచిస్తున్నాడు.గురువు మకర లగ్నానికి మంచివాడు కాదు. ప్రస్తుతం గురువు గోచారంలో మళ్ళీ నీచలో ఉన్నాడు. ప్రత్యన్తర్దశా,సూక్ష్మదశా,ప్రాణదశా నాథులైన కుజ/శని/రాహువుల కలయిక భయంకర అగ్ని ప్రమాదంకు (explosive blast) సూచన అని జ్యోతిశ్శాస్త్రం తెలిసిన వారు చెప్పగలరు. ఈ కోణంలో నుంచి చూచి ఉంటే జరుగబోయే సంఘటన బాగా అర్థమై ఉండేదేమో.కాని దృఢ కర్మను, అదీకాక గురుగ్రహ ఆగ్రహానికి గురైన ఫలితాన్ని ఎవరు ఆపగలరు?

జనన సమయం ఖచ్చితమైనది లేకపోవటంతో కొందరు ఔత్సాహిక జ్యోతిష్కులు ప్రశ్న విధానంలో జాతకం చూచి తిరిగి రావటం అనుమానమే,దుర్ఘటన జరిగింది అని చెప్పారు.ఈలింకుచూడండి.

http://www.astrocamp.com/vedicastrology/2009/09/ysr-reddy-missing-dead-or-alive.html