నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, జనవరి 2009, శుక్రవారం

కాల సర్ప యోగం -3 కొన్ని నిజాలు

ఈ పోస్ట్ లో కాల సర్ప యోగం లోని నిజా నిజాలను చూద్దాం. అసలు ఈ యోగం ప్రామాణిక గ్రంథాలలో లేదు. నేను ఇంతకూ ముందు కోట్ చేసిన శ్లోకం ఒక్కటే ఆధారం. అది కూడా దేశ జాతకం గురించి తప్ప వ్యక్తీ జాతకం గురించి చెప్పలేదు. కనుక దీనికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వవలసిన పని లేదు. కాని నేడు టీ వీ లలో మాగజైన్ లలో ఎక్కడ చూసినా కాల సర్ప యోగాన్ని గురించిన చర్చలే. ఈ మధ్యన పని గట్టుకుని చాలా మంది ఈ యోగాన్ని ప్రొమోట్ చేస్తున్నారు. కాళహస్తి గుడి ఉన్నట్లుండి ఇంత పేరు సంపాదించిందంటే దానికి ఈ యోగమే కారణం. మొన్న ఉద్యోగ వశాత్తూ ఆ గుడి దర్శనం జరిగింది. అక్కడ ఈవో తదితరులు చెప్పిన ప్రకారం. కాళ సర్ప యోగం వల్ల కాళ హస్తి గుడి బాగు పడింది. దీనిని చూసి గుంటూరు దగ్గర పెదకాకాని శివాలయం లో ఉన్నట్లుండి రాహు కేతు విగ్రహాలు ప్రతిష్ట చేయించి పూజలు అంటూ ప్రచారం చేసి వారూ బాగానే మార్కెటింగ్ చేస్తున్నారు. తెలీని జనాలు పాపం దిక్కు తోచక ఎవరు ఏది చెబితే అది చేస్తూ చిలుము వదల్చు కుంటున్నారు. ఇంతకీ దోషం పోయిందా అంటే ఎవరూ చెప్పలేరు. డబ్బు వదిలించు కున్నవాడు పోయిందని చెప్పక పోలేదని చెప్పడు కదా. అసలు నిజం ఏమిటంటే ఈ యోగానికి అంత విలువ ఇవ్వ వలసిన పని లేదు. జాతక చక్రం ని మొత్తం కూలంకషంగా అంశ చక్రాలు, అష్టక వర్గు, గోచారం మొత్తం పరిగణన లోకి తీసుకుని విశ్లేషణ చెయ్యాలి కాని ఇలా ఒకే ఒక్క యోగాన్ని బట్టి చెప్పరాదు. రాహు కేతు దీక్షలు కూడా మొదలయ్యాయని వింటున్నాము. వెర్రి వెర్రి అంటే వేలం వెర్రి అంటే ఇదే. ఇక పొతే జాతకాన్ని సరిగా విశ్లేషణ చెయ్యలేని వారు అనేకులు యంత్రాలని, రుద్రాక్షలని, స్ఫటికాలని, సాల గ్రామాలని అమ్ముకుంటూ లక్షల్లో బిజినెస్స్ చేస్తున్నారు. కొంచం నమ్మకంతో జ్యోతిష్కుల వద్దకు పొతే వాడిని గంగిరేద్దుని చేసి రాళ్ళు రప్పలు రుద్రాక్షలు వంటి నిండా తొడిగి, ఇంటి నిండా యంత్రాలతో నింపి జేబు ఖాళీ చేసి పంపిస్తునారు. ఉన్నా కాస్త నమ్మకం పోగొట్టుకొని వాళ్లు జ్యోతిష్యాన్ని విమర్శిస్తూ నారు. నా ఉద్దేశంలో అసలు కాల సర్పాలు నేటి జ్యోతిష్కులే. అమాయకులను మోసం చేస్తూ పాపాన్ని మూట గట్టు కుంటున్నారు. కావున కాల సర్ప యోగాన్ని గూర్చి భయ పడకండి. దాన్ని మించిన అనేక దరిద్ర యోగాలు జాతకంలో ఉంటాయి. వాటిని బట్టి జరుగుతుంది. కాబట్టి నిస్వార్థ పరుడైన జోతిష్కుని సంప్రదించండి. అంటే గాని బోర్డులు చూసి మోస పోకండి. బీ వీ రామన్, కే ఎన్ రావ్ ఇతర జ్యోతిష్కుల అభిప్రాయం కూడా ఇదే.