అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

29, ఏప్రిల్ 2018, ఆదివారం

ఆశారాం బాపూ జాతకం

నా బ్లాగును గత పదేళ్ళ నుంచీ కరెక్ట్ గా ఫాలో అవుతుంటే మీకొక నైపుణ్యం ఇప్పటికి వచ్చేసి ఉంటుంది. అదేంటంటే - ఒక జాతకాన్ని మీరంతట మీరే చెప్పగలుగుతారు. ఒకరు పుట్టిన సమయం లేకున్నా సరే, జస్ట్ జననతేదీ ఉంటే చాలు, అతని జాతకాన్ని చాలావరకూ చదవవచ్చు అనేది మీరీ పాటికి నా పోస్టులను బట్టి గ్రహించే ఉంటారు. ఒకరి జననతేదీ మనకు తెలిస్తే చాలు అతని కేరెక్టర్ ఎలాంటిదో అతి తేలికగా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ఇస్తున్నది ఆశారాం బాపూ జాతకం. ఈయన 17-4-1941 న పాకిస్తాన్లో పుట్టాడు. ఇతని జాతకంలోని గ్రహయోగాలను బట్టి ఇతను నిజంగా రేపులు చేసి ఉంటాడా లేదా నేను చెప్పనక్కరలేదు. మీరే చెప్పండి మరి !!



ఈ జాతకాన్ని అర్ధమయ్యేలా చేసే గ్రహయోగాలు ఇవీ !

లగ్నాన్ని లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే జననసమయం తెలియదు గనుక.

సూర్యుడు, కుజుల ఉచ్చస్థితి.
బుధుడు నీచస్థితి.
నీచబుధునితో కలసి గురువును సూచిస్తున్న కేతువు.
నీచశనితో కలసి ఉన్న శుక్రుడు.
పూర్తిగా అస్తంగతుడైన శుక్రుడు.
అక్కడే ఉన్న గురువు.
చంద్రుని నుంచి పంచమంలో రవి, బలహీనశుక్ర, నీచశని, గురువులు.

లోతైన విశ్లేషణలోకి పోకుండా పైపైన గ్రహాల  స్థితులు మాత్రం ఇచ్చాను. అర్ధం చేసుకుంటే ఇవి చాలు ! 

మరి అర్ధమైందా విషయం ?
read more " ఆశారాం బాపూ జాతకం "

26, ఏప్రిల్ 2018, గురువారం

ఆశారాం బాపూ - రజనీష్ - ధనూరాశిలో శనికుజులు


ఆశారాం బాపూ
మొన్న 22 తేదీన ఒక పోస్ట్ వ్రాస్తూ ధనూరాశి సహజ నవమ స్థానంగా ధార్మిక సంస్థలకు. దేవాలయాలకు, గురువులకు సూచిక కాబట్టి అందులో శనికుజుల సంచారం వల్ల ఈ రంగాలకు దెబ్బలు తగులుతాయని వ్రాశాను. ఇది వ్రాసి మూడు రోజులు కూడా గడవక ముందే, వివాదాస్పద గురువు ఆశారాం బాపూ కు రేప్ కేసులో యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ తీర్పు వచ్చింది. ఇది స్పష్టంగా శనికుజయోగం ఇచ్చిన తీర్పే.

రజనీష్
ఆశారాం బాపూ యొక్క వివాదాస్పద చరిత్రలోకి నేను పోదలచుకోలేదు. అది నాకనవసరం. గురువులపైన శనికుజుల ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రమే నేనిక్కడ మాట్లాడదలచుకున్నాను.

శనీశ్వరుడు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 30 ఏళ్ళు పడుతుందనేది అందరికీ తెలిసినదే. శని కుజులు సరిగ్గా 30 ఏళ్ళ క్రితం ధనూరాశిలో ఇదే పరిస్థితిలో ఉన్నారు. సమాజం మీదా మనుషులమీదా గ్రహప్రభావం అనేది నిజమే అయితే, అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉండాలి. అవేమిటో గమనిస్తే మనుషులపైన గ్రహప్రభావం ఎంత స్పష్టంగా ఉంటుందో అర్ధమౌతుంది. ప్రపంచం చేత ఎంతో గౌరవించబడే సోకాల్డ్ మహనీయులు కూడా గ్రహశక్తుల ముందు కీలుబోమ్మలేనన్నది స్పష్టం. 

30 ఏళ్ళ క్రితం మార్చ్ - 1988
శనికుజులు ధనూరాశిలో
సరిగ్గా 30 ఏళ్ళ క్రితం 13-2-1988 నుంచి 28-3-1988 వరకూ శని కుజులు ధనూరాశిలో సంచరించారు. విచిత్రం !! ఇదే సమయంలో వివాదాస్పద గురువు ఓషో రజనీష్ జీవితంలో చివరి దశ జరిగింది. ఆయన 1990 జనవరిలొ చనిపోయాడు. విచిత్రంగా అప్పుడు కూడా ధనూరాశిలో శని కుజుల సంయోగం జరిగింది.

నిజానికి 30 ఏళ్ళ క్రితం ఇదే సమయంలో  పూనా ఓషో ఆశ్రమం అనేక లుకలుకలలో చిక్కుకుని ఉన్నది. అమెరికాలో ఆశ్రమం పెడదామని వెళ్ళిన ఆయన చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అయి, అమెరికా ప్రభుత్వం చేత వెనక్కు పంపబడ్డాడు. 1985 లొ వెనక్కు వచ్చిన ఆయన అప్పటినుంచీ పూనా ఆశ్రమంలోనే ఉంటూ వచ్చాడు. కానీ 1988 ఇదే సమయంలో పూనా ఆశ్రమంలో అనేక రాజకీయాలు, శిష్యుల మధ్యన గొడవలు, అధికారం కోసం కుట్రలు జరిగాయి. రజనీష్ ఆరోగ్యం అప్పటికే బాగా క్షీణించింది. ఇంక కొద్ది నెలలలో ఆయన చనిపోతాడని తెలుసుకున్న శిష్యులు వేల కోట్ల రూపాయల ఆయన ఆస్తులకోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో వారి మధ్యన ఎన్నో గొడవలు జరిగాయి. ఒక స్టేజిలో రజనీష్ ను పోలీసులు అరెస్ట్ చెయ్యబోయారు కూడా. ఇలాంటి గొడవలన్నీ సరిగ్గా 30 ఏళ్ళ క్రితం పూనాలో జరిగాయి. ఇవి కూడా స్పష్టంగా ధనూరాశిలో శనికుజుల ప్రభావమే.

అంతేకాదు. ఇంకా కొన్ని పోలికలున్నాయి. రజనీష్ ఆశ్రమంలో, ఇష్టపడిన వారి మధ్యన ఫ్రీ సెక్స్ అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. అంతేకాదు అక్కడ స్మగ్లింగ్, డ్రగ్స్ వంటి నేరాలు కూడా జరుగుతూ ఉండేవి. ప్రస్తుతం ఆశారాం బాపూ ఆశ్రమంలో జరిగినవి కూడా సెక్స్ నేరాలే. పూనా ఆశ్రమంలో రజనీష్ సన్నిహితులు ఇన్నర్ సర్కిల్ వారికి కూడా ఈ నేరాలతో సంబంధాలున్నాయి. ప్రస్తుతం కూడా ఆశారాం బాపూ కుమారుడు నారాయణ సాయి కూడా ఇంకో రేప్ కేసులో దోషిగా ఉన్నాడు. ఇంతకు ముందు కూడా ఇతని మీద ఇలాంటి ఆరోపణలున్నాయి. ఇంకా మిగిలిన కోణాలు దర్యాప్తులో బయటపడొచ్చు.

రజనీష్ ఆశ్రమం కూడా ఇండియాకు పశ్చిమ తీరంలోనే ఉంది. ఆశారాం బాపూ కూడా గుజరాత్ వాడే. పశ్చిమతీర రాష్ట్రాలలోనే ఆయనకు మంచి అనుచరగణం ఉన్నది. ఈ కోణం కూడా గమనించదగ్గదే. రజనీష్, ఆశారాం ఇద్దరూ కూడా గడ్డాలు పెంచుకుని దాదాపు ఒకలాగే కనిపిస్తారు. ఈ కోణాన్ని కూడా గమనించాలి.

జనవరి 1990 రజనీష్ మరణ సమయంలో
శని కుజులు ధనూరాశిలో
కనుక గ్రహప్రభావం అనేది, అది జరిగిన ప్రతిసారీ దాదాపుగా ఒకే రకమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది అనేది స్పష్టం. కాకపోతే మారిన పరిస్థితుల దృష్టా వ్యక్తులు మారవచ్చు, ప్రాంతాలు మారవచ్చు, సంఘటనలు మారవచ్చు. కానీ ట్రెండ్ అనేది మాత్రం ఒకలాగే ఉంటుంది. హ్యూమన్ డ్రామా చాలా విచిత్రంగా అవే సన్నివేశాలతో రకరకాల చోట్ల రకరకాలుగా జరుగుతూ ఉంటుంది.

ఇదంతా చూస్తున్న తర్వాత, మనుషుల మీద గ్రహప్రభావం ఏమాత్రమూ ఉండదని తెలివైనవాళ్ళు ఎవరైనా ఎలా అనగలరు?
read more " ఆశారాం బాపూ - రజనీష్ - ధనూరాశిలో శనికుజులు "

19, ఏప్రిల్ 2018, గురువారం

గత నెలరోజులుగా యాక్సిడెంట్లు - లైంగిక నేరాలు - గ్రహప్రభావం

ధనూరాశిలో శనికుజుల యుతి మీద గతనెల 27 వ తేదీన ఒక పోస్ట్ వ్రాస్తూ నేను చెప్పిన సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో జరుగుతూ ఉండటం మీరందరూ చూస్తున్నారు కదా ! సరిగ్గా చెప్పాలంటే మార్చి 8 వ తేదీన కుజుడు ధనూరాశిలోకి ప్రవేశించి శనీశ్వరుడితో కలిశాడు. ఆ రోజునుంచీ యాక్సిడెంట్ల పర్వం మొదలైంది. మార్చి 21 న ఈక్వినాక్టియల్ డే నుంచీ మరీ ఎక్కువైంది.

ఈ నలభై రోజులుగా నేను ఎన్నో వార్తలు విన్నాను. అంతర్జాతీయ స్థాయిలో గాని. జాతీయ స్థాయిలో గాని. సిటీలో గాని, మాకు తెలిసిన వారిలో గాని ఈ కాలంలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. వీటిలో, వందలాదిమంది సైనికులు చనిపోయిన విమాన ప్రమాదాలనుంచి, టూ వీలర్ ప్రమాదాలనుంచి. కార్లు ఆటోల ప్రమాదాల నుంచి, ఊరకే నడుస్తూ క్రింద పడి గిలక బెణికిన వారివరకూ, మోకాళ్ళు మోచేతులు ఎముకలకు దెబ్బలు తగిలినవారి వరకూ అన్ని రకాల కేసులూ ఉన్నాయి.


మార్చి 22 తేదీ రాత్రి స్వయంగా నాకూ యాక్సిడెంట్ అయింది. రాత్రి పదిగంటల సమయంలో నరసరావుపేట నుంచి గుంటూరుకు వస్తుండగా బైక్ యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం నాకు చాలా చెడుదశ జరుగుతున్నది. అందులో నా ప్రాణాలే పోవలసింది. ఎప్పుడో చేసిన పుణ్యం కాస్త మిగిలి ఉండబట్టి, ఇలాటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించి రెమెడీలు చేస్తూ ఉండబట్టి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాను. కుడిమోకాలు ప్రాక్చర్ అయింది. లిగమెంట్స్ తెగిపోయాయి. నాలుగురోజులు ఆస్పత్రిలో ఉండి ప్రమాదం నుంచి బయటపడి కోలుకుంటూ ప్రస్తుతం ఇంకా బెడ్ రెస్ట్ దశలోనే ఉన్నాను. ఇంకా ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ లోనే ఉండాలి. పనీపాటా లేదని అనలేను. పని ఒక్కటే లేదు, పాటలున్నాయి, అందుకే బ్లాగులో ఈ పాటల వెల్లువ !

ఇదే సమయంలో మనకు ఖగోళంలో కనిపిస్తున్న ఇంకొక యోగం మీనరాశిలో శుక్రుని ఉచ్ఛ స్థితి, మరియు ఆ తర్వాత ఉచ్ఛ సూర్యునితో మేషరాశిలో ఆయన యుతి. ఇదంతా ఒకటి రెండు నెలలనుంచీ జరుగుతూ ఉన్నప్పటికీ, మార్చి 27 తేదీన శుక్రుడు మేషరాశిలోకి అడుగుపెట్టినప్పటినుంచీ కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. అవే - లైంగిక నేరాలు లేదా లుకలుకలు.

ఈ యోగం వల్ల దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్న రేప్ కేసుల్లో జమ్మూలో జరిగిన ఆసిఫా రేప్ కేసు తలమానికం. అలాగే తెలుగు సినిమా రంగంలో 'కాస్టింగ్ కౌచ్' ఉందా లేదా అని యూట్యూబ్ లో రచ్చరచ్చగా జరుగుతున్న అనవసరమైన చర్చ కూడా ఇందులో భాగమే. చిలికి చిలికి గాలివాన అయినట్లుగా, ఇది సినిమా రంగంలోని ప్రముఖుల మెడలకూ, రాజకీయ నాయకుల మెడలకూ కూడా చుట్టుకుని ప్రెస్ మీట్లూ, యూట్యూబ్ వీడియోలతో, చాలా అసహ్యకరమైన గోలగా తయారైంది. ఎవరి వెనుక ఎవరున్నారో, ఎవరికి డబ్బులిచ్చి ఎవరు మాట్లాడిస్తున్నారో, ఎవరు ఎవర్ని ఎగదోస్తున్నారో తెలియనంతగా ఈ గోల జరుగుతున్నది. ప్రతిరోజూ వెల్లువెత్తుతున్న ఈ ఛండాలపు గోల చూడలేక అసలు యూట్యూబ్ ఓపన్ చెయ్యడమే ఎంతోమంది మానేశారు.

మనుషులమీదా లోకంమీదా గ్రహప్రభావం ఖచ్చితంగా ఉంటుందనీ, జరిగే ఈవెంట్స్ ఆ గ్రహప్రభావం వల్లే ప్రేరేపించబడతాయనీ, జరుగుతాయనీ, వెలుగులోకి వస్తాయనీ ఇవన్నీ మళ్ళీ నిరూపిస్తున్నాయి.
read more " గత నెలరోజులుగా యాక్సిడెంట్లు - లైంగిక నేరాలు - గ్రహప్రభావం "

15, ఏప్రిల్ 2018, ఆదివారం

శ్రీవిద్యా రహస్యం - 2nd Edition - E Book రిలీజైంది

అశేషాంధ్ర పాఠకుల విశేషాభిమానాన్ని సశేషంగా చూరగొన్న మా పుస్తకం 'శ్రీవిద్యా రహస్యం' మొదటి ముద్రణలో వేసిన పుస్తకాలన్నీ అయిపోవడంతో రెండవ ముద్రణకు ముందుగా, పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేర్పులు చేద్దామని భావించడం జరిగింది.

ఈ క్రమంలో భాగంగా, 'నాలుగు ఆచారములు' అన్న క్రొత్త అధ్యాయాన్ని పుస్తకానికి చేర్చాము. అందులో, శ్రీవిద్యోపాసనలోని నాలుగు ఆచారాలను దాదాపు ఏభై పద్యాలలో వివరించడం జరిగింది. అక్కడక్కడా పాతపద్యాలను మార్చడం, కొన్ని అధ్యాయాలలో అవసరమైన చోట్ల కొంత వివరణను పెంచడం జరిగింది. ఆయా అధ్యాయాల ముందుగా శ్రీ యంత్రంలోని నవావరణల చిత్రాలను చేర్చడం జరిగింది. ఈ మార్పులతో మా పుస్తకానికి ఒక పరిపూర్ణత వచ్చినట్లుగా భావిస్తూ రెండవ ముద్రణకు వెళ్ళబోతున్న సందర్భంగా, ముందుగా 'ఈ - బుక్' ను విడుదల చెయ్యడం జరిగింది.

పుస్తకం కావలసినవారు ఇంతకు ముందు మాదిరిగానే, google play books నుంచి పొందవచ్చు.

ఈ పుస్తకాన్ని రివ్యూ చెయ్యడంలో విసుగు లేకుండా సహకరించిన నా అమెరికా శిష్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం ఇంగ్లీషు వెర్షన్ The Secret of Sri Vidya అనే పేరుతో అమెజాన్ లో కూడా లభ్యమౌతున్నది. అతి త్వరలో ఆ 'ఈ-బుక్' కూడా అప్ డేట్ చెయ్యబడుతుంది.
read more " శ్రీవిద్యా రహస్యం - 2nd Edition - E Book రిలీజైంది "

10, ఏప్రిల్ 2018, మంగళవారం

మీ పాటలు వేరే బ్లాగ్ లొ పెట్టండి

నా బ్లాగ్ పాఠకులలో కొందరు ఆధ్యాత్మికత కోసమే చదివే వారుంటారు. కలగూరగంప లాంటి నా బ్లాగ్ వారిలో అనేక విరుద్ధ భావాలను కలిగిస్తూ ఉంటుంది. పాపం వారిలో కొంతమంది నాకు మంచిగానే కొన్ని సలహాలను ఇవ్వబోతూ ఉంటారు. అలాంటి వారినుంచి నాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. అలాంటివాటిలో తరచుగా నాకోచ్చే మెయిల్ ఇది.

'మీరు ఆధ్యాత్మికత మీద చాలా బాగా వ్రాస్తూ ఉంటారు. కానీ మీ బ్లాగులో పాటలు కూడా పాడి పెడుతూ ఉంటారు. అవి మాకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఈ ఆధ్యాత్మికత పక్కనే అలాంటి పాటలు వినాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనుక మా సలహా ఏమంటే, మీ పాటల వరకు ఇంకో బ్లాగ్ తయారు చేసుకోండి. అందులొ ఆ పాటల్ని పెట్టుకోండి.'

పాపం వీరి పాయింట్ నాకు చక్కగానే అర్ధం అయింది. అందరికీ వ్యక్తిగతంగా జవాబు ఇవ్వలేను గనుక బ్లాగు ముఖంగా ఈ పోస్ట్ అన్నమాట !

ఆధ్యాత్మికత అంటే ముందుగా మీ అభిప్రాయం మార్చుకోండి. అది ఏదైనా కావచ్చు గాని సరియైన దృక్కోణం మాత్రం కాదని నేనంటాను. మడి కట్టుకుని పూజామందిరంలో కాసేపు చేసే పూజ మాత్రమే ఆధ్యాత్మికత అనే భావానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. నేను నమ్మేది, ఆచరించేది, నా శిష్యులకు నేర్పించేది  అయిన ఆధ్యాత్మికత - జీవితంలో ఒక ముక్క కాదు. కాసేపు చేసే పార్ట్ టైం ఉద్యోగం కాదు. నా ఆధ్యాత్మికత నా జీవితం మొత్తాన్నీ ఆవరించి ఉంటుంది. పూజామందిరంలో ఉన్నప్పుడు నేనెలాంటి స్థితిలో ఉంటానో టాయిలెట్లో ఉన్నపుడు కూడా అలాటి స్థితిలోనే ఉండటానికి ఇష్టపడతాను. నా ఆధ్యాత్మికతను చిన్న మాటల్లో చెప్పాలంటే ఇంతే !

పాటలు పాడినంత మాత్రానా, ఆటలు ఆడినంత మాత్రానా జారిపోయే ఆధ్యాత్మికత అసలు ఆధ్యాత్మికత కాదని నేనంటాను. పాటలు పాడటం అనేది భగవంతుడు ఇచ్చిన వరం. అదొక కళ. అన్ని కళలూ జగన్మాత వరాలే. దానిని సక్రమంగా చూడటమూ సక్రమంగా వాడుకోవడమూ నిజమైన ఆధ్యాత్మికత అని నేనంటాను.

నిజానికి నా పాటలను, అవి సినిమా పాటలైనా సరే, మనసు పెట్టి వింటే మిమ్మల్ని ధ్యానపు లోతుల్లోకి తప్పకుండా తీసుకుపోతాయి. అవి మిమ్మల్ని వెంటాడతాయి. కొన్ని రోజులపాటు వాటిని హమ్మింగ్ చెయ్యకుండా మీరుండలేరు. ఎంతో మంది నాకు మెయిల్స్ ఇస్తూ చెప్పిన, చెబుతున్న మాట ఇది ! 

ఎందుకంటే అవి ఉత్త గొంతుతో పాడిన పాటలు కావు. మనసుతో పాడిన పాటలు కాబట్టి !

అసలైన ఆధ్యాత్మికత దేనినీ కాదనదు. నిమ్నత్వాన్ని తప్ప ! అత్యున్నత స్థాయిలలో నిమ్నత్వాన్ని కూడా అది కౌగలించుకుంటుంది. అలాంటప్పుడు తక్షణ తన్మయత్వాన్నీ, ఔన్నత్యాన్నీ ఇచ్చే సంగీతం ఆధ్యాత్మికత కాకుండా ఎలా ఉంటుంది మరి?

ఇప్పుడైనా అర్ధమైందా అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో?
read more " మీ పాటలు వేరే బ్లాగ్ లొ పెట్టండి "