“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

10, మార్చి 2017, శుక్రవారం

Tumhe Yaad Karte Karte - Lata Mangeshkar


Tumhe Yaad Karte Karte Jayegi Rain Saari

అంటూ లతా మంగేష్కర్ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1966 లో వచ్చిన Amrapali అనే చిత్రంలోనిది. లతా మంగేష్కర్ పాడిన అనేక మధుర గీతాలలో ఇది ఒక మరపురాని మధుర గీతం. శైలేంద్ర సాహిత్యానికి శంకర్ జైకిషన్ సంగీతం బంగారానికి సువాననను అద్దింది. ఒక సుమధుర గీతాన్ని ఆవిష్కరించింది.

ఒక రసార్ద్రమైన భావాన్ని హృద్యంగా నాలుగు పంక్తులలోకి తేగలిగిన వాడే అసలైన కవి. ఇటువంటి ప్రక్రియలో శైలేంద్ర లబ్దప్రతిష్టుడు.రెండే రెండు చరణాలలో విరహబాధను ఎంత చక్కగా అక్షరబద్ధం చేశాడో !!

ఇది మేల్ సాంగ్ కాదని మనం ఏమీ వెనుకంజ వెయ్యనక్కరలేదు. మధురమైన గానాన్ని ఆస్వాదించడానికి ఆడా మగా తేడా ఏమీ అక్కర్లేదు. అందుకే లతాజీ పాడిన ఈ పాటను ఆలపిస్తున్నాను. రాగ ప్రధానమైన పాటలు ఎంత మధురంగా ఉంటాయో చెప్పడానికి ఈ పాట ఒక ఉదాహరణ.

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:--Amrapali (1966)

Lyrics:--Shailendra
Music:--Shankar Jaikishan
Singer:--Lata Mangeshkar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------
[Tumhe yaad karte karte Jayegi rain saari
Tum legaye ho apne Sang neend bhee hamari]- 2
Tumhe yaad karte karte

Mann hai ke ja basa hai - Anjaan ik nagar me
Kuch khojtaa hai paagal - Khoyee huyi dagar me
Itne bade mehal me - Ghabraavu main bechari
Tum legaye ho apne Sang neend bhee hamari
Tumhe yaad karte karte

Birha ki is chita se - Tum hi mujhe nikalo
Jo tum na aa sako tho Mujhe swaapn me bulalo
Mujhe aise mat jalavo Meri preet hai kuwaari
Tum legaye ho apne Sang neend bhi hamari

Tumhe yaad karte karte Jayegi rain saari
Tum legaye ho apne Sang neend bhi hamari
Tumhe yaad karte karte - 3

Meaning

Thinking of you, my whole night passes
You have taken away my sleep along with you
Thinking of you the whole night

My heart has abandoned me 
and settled in an unknown city
Poor mad thing, it is searching for something unknown
in a forgotten lane
In such a spacious palace, I feel very much lonely
You have taken away my sleep along with you
Thinking of you the whole night

From this pyre of separation, you must pull me out
If you can't come personally, atleast call me into your dreams
Please !! Do not torment me like this
For my love is innocent and naive
You have taken away my sleep along with you
Thinking of you the whole night

Thinking of you, my whole night passes
You have taken away my sleep along with you
Thinking of you the whole night

తెలుగు స్వేచ్చానువాదం
నిన్ను తలచుకొంటూ తలచుకొంటూ
ఈ రాత్రి మొత్తం గడచిపోయేటట్లుంది
నువ్వు పోతూ పోతూ
నా నిద్రను కూడా నీతోబాటు తీసుకెళ్లావు
నిన్ను తలచుకొంటూ తలచుకొంటూ
ఈ రాత్రి మొత్తం గడచిపోయేటట్లుంది

నా హృదయం నన్ను వదలి
ఏదో ఒక అజ్ఞాత నగరంలో పోయి స్థిరపడింది
అదొక పిచ్చిది
దారి తెలియని వీధులలో
ఏదో తెలియని దానికోసం వెదుకుతోంది
ఇంత విశాలమైన భవనంలో ఇంత ఒంటరితనం...
నాకు చాలా భయంగా ఉంది
నువ్వు పోతూ పోతూ
నా నిద్రను కూడా నీతోబాటు తీసుకెళ్లావు
నిన్ను తలచుకొంటూ తలచుకొంటూ
ఈ రాత్రి మొత్తం గడచిపోయేటట్లుంది

నీ ఎడబాటు చితిమంట నుంచి
నువ్వే నన్ను బయటకు లాగాలి
నువ్వు స్వయంగా రాలేకపోతే
కనీసం నీ కలలోకైనా నన్ను ఆహ్వానించు
నన్నింతగా ఏడిపించకు, ఎందుకంటే
నా ప్రేమ చాలా అమాయకమైనది

నిన్ను తలచుకొంటూ తలచుకొంటూ
ఈ రాత్రి మొత్తం గడచిపోయేటట్లుంది
నువ్వు పోతూ పోతూ
నా నిద్రను కూడా నీతోబాటు తీసుకెళ్లావు
నిన్ను తలచుకొంటూ తలచుకొంటూ
ఈ రాత్రి మొత్తం గడచిపోయేటట్లుంది...