“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, డిసెంబర్ 2015, ఆదివారం

Beladingalagi Baa - Dr.Raj Kumar



బెళదిం గళాగి బా...తంగాళే యాగినాను...

వెన్నెలగా మారి నా వద్దకు రా..
చల్లని గాలిని నేనౌతాను...
ఇద్దరం ఏకమై ఆనందంలో కరిగిపోదాం... 

డా||రాజ్ కుమార్ గళంలో నుంచి సుతారంగా జాలువారిన సుమధుర ప్రేమగీతాలలో ఇది ప్రధమస్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.ఈ పాటను ఆయన ఎంతో భావయుక్తంగా పాడాడు.ఈ పాట 'హుళియ హాళిన మేవు' చిత్రంలోనిది.ఈ చిత్రం 1979 లో రిలీజైంది.

డా||రాజ్ కుమార్ దగ్గర కొన్ని గొప్ప గుణాలున్నాయి.క్రమం తప్పకుండా ప్రతిరోజూ యోగా చేసేవాడు.అందుకే 30 ఏళ్ళ వయస్సులో ఎంత ఫిట్ నెస్ తో ఉన్నాడో 60 లో కూడా అంతే ఫిట్ నెస్ తో ఉండేవాడు.పొట్ట అనేది ఉండేది కాదు.

అంతేకాదు ఈయన ప్రతిరోజూ క్రమం తప్పకుండా సంగీతసాధన చేసేవాడు. అందుకే తన పాటలను అంత మధురాతి మధురంగా పాడగలిగాడు.

ఈ పాటను ఎంత సుతారంగా పాడాడో వింటే, ఆయనయొక్క సంగీత ప్రావీణ్యం అర్ధమౌతుంది.ఈ పాట చిత్రీకరణ కూడా చాలా హృద్యంగా ఉంటుంది.సరసం అంటే తెలుగువారికి తెలిసింది మోటుసరసం మాత్రమే.హీరోయిన్ చేతులూ కాళ్ళూ మెలిదిప్పుతూ కుస్తీపట్టి దాని ఒళ్ళు హూనం చేసే డాన్సులు తప్ప, చక్కని హృద్యమైన చిత్రీకరణలు మన డ్యూయెట్లలో ఎక్కడా ఉండేవి కావు. అందుకే మన డ్యూయెట్స్ లో మధురమైన ప్రేమతో కూడిన లలితశృంగారం ఎక్కడా కనపడదు.ప్రస్తుతపు సినిమాలలో కనిపిస్తున్న -- హీరోలు కూడా కోతుల్లా ఎగురుతూ డాన్స్ అనబడే డ్రిల్లు చేసే -- ఛండాలపు ట్రెండ్ ను సృష్టించింది నేడు మహానటులుగా పొగడబడుతున్న గత తరపు అగ్రవెకిలి నటులే.అంతా కలిమాయ !!!

మన తెలుగు చిత్రాలలో సున్నితమైన ప్రేమను వ్యక్తీకరిస్తూ వ్రాయబడిన పాటలు చాలా తక్కువ.ఎక్కడో ఒకచోట 'సినారె' వంటి కవులు మాత్రమే అంత ఫీల్ తో వ్రాయగలరు.అలాంటి పాటలున్న సినిమాలు తీస్తే డబ్బులు రావు గనుక మన నిర్మాతలు తియ్యరు.

మన తెలుగుచిత్రాల తీరుకు భిన్నంగా,ఈ పాట చిత్రీకరణను గమనిస్తే,ఎంత చక్కగా,ఎంత సున్నితమైన ప్రేమభావాన్ని చిత్రీకరించారో గమనించవచ్చు.ఈ పాటలో రాజ్ కుమార్,జయప్రదా నటించారు.సున్నితమైన ప్రేమను ఇష్టపడేవారు ఎవరైనా సరే ఈ పాటను తప్పకుండా లైక్ చేస్తారు.

ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా గురువైన జీ.కె.వెంకటేష్. ఎంతో చక్కని రాగాన్ని ఈ పాటకు ఆయన సమకూర్చాడు.

ఈపాటను వింటుంటే ఏదో హిందీపాట రాగం లీలగా మనస్సుకు సోకుతోంది కదూ? అదేంటో చెబుతాను వినండి.

1996 లో ఒచ్చిన Papa Kehte Hai అనే సినిమాలో - 'ఘర్ సే నికల్తే హి కుచ్ దూర్ చల్తే హి రస్తే మే హై ఉస్ కా ఘర్' అనే పాటలో కూడా ఇదే రాగాన్ని వాడుకున్నారు.దీనిని ఉదిత్ నారాయణ్ పాడాడు.

ఇంకొన్ని తెలుగు పాటలలో కూడా ఇదే రాగాన్ని వాడారు.

'అందమే ఆనందం(1977)' సినిమాలో సత్యంగారి సంగీతంలో బాలూగారు పాడిన 'మధుమాసవేళలో మరుమల్లెతోటలో' అనే పాటా,జీ.కె.వెంకటేష్ సంగీతంలో 'జమీందారుగారి అమ్మాయి(1975)' సినిమాలో ఆయనే పాడిన 'మ్రోగింది వీణా పదేపదే హృదయాల లోనా' అనే పాటా ఈ రాగచ్చాయ లోనివే.

ఇది బెటర్ వెర్షన్ కనుక ఈ పాటను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.
------------------------------------

Movie:--Huliya Haalina Mevu(1979)
Lyrics:--Udaya Sankar
Music:--G.K.Venkatesh
Singer:--Dr Raj Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------------
బెళదింగళాగి బా...
బెళదింగళాగి బా...తంగాళే యాగినాను
ఆనందవా నీడువే...ఒందాగువే..
బెళదింగళాగి బా...తంగాళే యాగినాను
ఆనందవా నీడువే...ఒందాగువే..
బెళదింగళాగి బా..

కణ్ణల్లి తుంబి చెలువా
ఎదయల్లి తుంబి వలవా
బాళల్లి- తుంబిదే- ఉల్లాసవా
నన్నెదయ తాళ నీను
నన్నుసిర రాగ నీనూ
నన్నోడల జీవనీ సంతోషవే
నేనెల్ల వాదరే...ఈ ప్రాణ నిల్లదే-2

బెళదింగళాగి బా...తంగాళే యాగినాను
ఆనందవా నీడువే...ఒందాగువే..
బెళదింగళాగి బా..

కావేరి తాయె నన్నా
బాయెందు కూగి నిన్నా
నీడిడలు బాళిగే బెళకాగళూ
ఆ దేవి యాణే నేనె సంగాతి కేళే జాణే
నీడువెను భాషెయా బిడు చింతేయా
ఏ నమ్మ ప్రేమకే.. నా కొడళే కాణికే-2

బెళదింగళాగి బా...తంగాళే యాగినాను
ఆనందవా నీడువే...ఒందాగువే..
బెళదింగళాగి బా...

Meaning:--

Come to me like moonlight...


Come to me like moon light

I will become cool breeze
Let us merge into oneness and enjoy the bliss
Come to me like moon light

My eyes are filled with your beauty
my heart is filled with your love
you filled my entire life with happiness
you are the rhythm of my heart
you are the tune of my breath
you are my life
you are my joy
Without you, I have no life

Come to me like moon light
I will become cool breeze
Let us merge into oneness and enjoy the bliss
Come to me like moon light

Mother Kaveri brought you to me
and gave you as a gift (to me)
I promise on Her name
Listen dear...you are my soul mate
Here is my promise...
forget all your worries
this is my offering to our love

Come to me like moon light
I will become cool breeze
Let us merge into oneness and enjoy the bliss
Come to me like moon light...

తెలుగు స్వేచ్చానువాదం

వెన్నెలవై నీవు రా
చల్లని గాలిని నేనౌతాను
ఇద్దరం కలసి ఆనందంలో కరగిపోదాం
వెన్నెలవై నీవు రా

నాకన్నులలో నీ సౌందర్యం నిండి ఉంది
నా హృదయంలో నీ ప్రేమ నిండి ఉంది
నాలోని ఉల్లాసంగా నువ్వే ఉన్నావు
నా గుండెలో లయవు నువ్వే
నా ఊపిరిలో రాగం నువ్వే
నా జీవన సంతోషానివి నువ్వే
నువ్వు లేకుంటే నా జీవితమే లేదు

కావేరీ మాత నిన్ను తెచ్చి
నాకు బహుమతిగా ఇచ్చింది
ఆమాత మీద ఒట్టు
నువ్వే నా ప్రేయసివి
నన్ను నమ్ము
నీ భయాలన్నీ వదలిపెట్టు
ఇదే నేను నీకిస్తున్న ప్రేమకానుక

వెన్నెలవై నీవు రా
చల్లని గాలిని నేనౌతాను
ఇద్దరం కలసి ఆనందంలో కరగిపోదాం
వెన్నెలవై నీవు రా....