“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, జూన్ 2010, బుధవారం

యాండీ హూగ్ - ది బ్లూ ఐడ్ సమురాయ్


జపాన్‍లో ఉన్న కరాటే స్టైల్స్ లో గ్రాండ్‍మాస్టర్ మాస్ ఒయామా గారి 'క్యొకుషిన్‍కాయ్ కరాటే' చాలా ప్రమాదకరమైనది. సమురాయ్ సూత్రం అయిన'ఇచిగెకి - హిస్సాట్సు'(ఒకే దెబ్బ-మరణంఖాయం) అన్నదానిపైన ఆధారపడి కరాటే స్టైల్ తయారు చెయ్యబడింది.

నా కాలేజి రోజులనుంచీ కరాటేలోని చాలా స్టైల్స్‍తో ఎక్స్ పెరిమెంట్ చేశాను. ఫుల్ కాంటాక్ట్ కరాటేలో క్యోకుషిన్‍కాయ్ కరాటే మూర్ఖంగానూ అతి ప్రమాదకరం గానూ ఉంటుందని నేను స్వానుభవంతో చెప్పగలను.నా 18 ఏటినుంచీ నేను మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తున్నాను. ప్రస్తుతం నాకు 46 ఏళ్ళు. నేటికీ నా బిజీ షెడ్యూల్‍ను అడ్జస్ట్ చేసుకుంటూ రోజుకు ఒక గంటసేపు 'ఎస్సెన్షియల్ ఫైటింగ్ టెక్నిక్స్'  సాధన చేస్తాను.


ఈ స్టైల్ లో నాకు నచ్చిన కొంతమంది వీరులలో మొదటివాడు యాండీ హూగ్. ఇతను స్విట్జర్‍లాండ్ దేశస్తుడైనప్పటికీ జపాన్ దేశపు మార్షల్ ఆర్ట్ అయిన కరాటేలో మంచి ప్రావీణ్యత కలిగినవాడు. ఇతనికి ఇష్టమైన టెక్నిక్- "ఏక్స్ కిక్". ఈ కిక్ తగిలిందంటే మనిషి తిరిగిలేవడం చాలా కష్టం. తగిలే ప్రదేశాన్ని బట్టి ప్రాణాలు తత్క్షణమే పోయే చాన్సులు ఎక్కువగా ఉంటాయి.లో కిక్స్ లో ఇతని స్పెషల్ టెక్నిక్ 'విరల్ విండ్ కిక్'.ఇది చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది కాని సరిగ్గా మోకాలి పక్కన ఉన్న నాడీ కేంద్రానికి తగిలితే మనిషి లే
చి సజావుగా నడవడానికి కనీసం ఒక గంట పడుతుంది. మోకాలువరకూ కాలు విరిగిపోయేటట్లు కూడా ఈ కిక్ వాడవచ్చు.

ఆల్ జపాన్ కరాతే పోటీలలో యోధానుయోధులతో తలపడి చివరివరకూ నెగ్గుకొచ్చి, చివరలో ఇంకొక వీరుడు షొకీ మట్సూయ్ తో జరిగిన పోటీలో టెక్నికల్ పాయింట్ లో ఓడిపోయాడు హూగ్.రెండవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చినప్పటికీ ఇతని అభిమానులు ఇతనే వరల్డ్ చాంపియన్ గా భావిస్తారు.

గ్రాండ్ మాస్టర్ మాస్ ఒయా
మా చేసినటువంటి రోజుకు 12 గంటల కఠోర సాధనను ఆదర్శంగా తీసుకొని ఇతను కూడా సాధన చేశాడు.ఐరన్ బాడీ ట్రెయినింగ్ వల్ల ఇతని శరీరం ఉక్కులా ఉండేది.ప్రత్యర్ధులకు దడపుట్టించే హైకిక్స్ లో ఇతనికి మంచి ప్రావీణ్యత ఉండేది. ఇతనికి కరాటేలోనే గాక కిక్ బాక్సింగ్‍లో కూడా ప్రావీణ్యత ఉండేది.సంస్థలోని కొన్ని రాజకీయాలు కుతంత్రాలవల్ల ఇతను క్యోకుషిన్‍కాయ్ కరాటేను వదలి సీడోకాయ్‍కాన్ కరాటే స్టైల్‍లోకి మారాడు.చివరిరోజులలో ఇతను సాఫ్ట్ స్టైల్ అయిన "తాయిచీ" అభ్యాసం చేసేవాడు. జపానీయులు ఇతన్ని అమితంగా అభిమానించి "బ్లూ ఐడ్ సమురాయ్" అని పిలిచేవారు.

విధి వైపరీత్యం వల్ల ఇతను బ్లడ్ కాన్సర్ తో 2000 లో 35 ఏళ్ళ చిన్న వయసులోనే చనిపోయాడు. కానీ లక్షలాది అభిమానుల గుండెలలో ఇంకా బతికున్నాడు. మార్షల్ ఆర్ట్స్ ను సూచించే గ్రహస్థితులు, మరియు చిన్న వయస్సులోనే ఇతను ఇలా చనిపోవడానికి జ్యోతిష్య కారణాలు తరువాతి పోస్ట్ లో చూద్దాం.

ఇతని కాంపిటీష
న్ ఫైట్స్ కొన్నింటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇతని వెబ్ సైట్ ఇక్కడ చూడవచ్చు
.