“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

23, ఫిబ్రవరి 2010, మంగళవారం

నీల్ అర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగు పెట్ట లేదా?


"విధిని చేతుల్లోకి తీసుకోగలమా" అని నేను వ్రాసిన పోస్ట్ కి ఒక అజ్ఞాత స్పందిస్తూ-- నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని మీద దిగినప్పుడు అతని జాతకంలో చంద్రుని సంబంధం ఏమి ఉండవచ్చు --అంటూ అడిగారు. అదీ ఎందుకు అడిగారో నాకు తెలియదు, బహుశా జ్యోతిష్యం అంటే మనుషులలో సహజం గా ఉండే ఎగతాళి తో కావచ్చు కాని, నేను జవాబిస్తూ తప్పకుండా సమయంలో చంద్ర దశ ఆయన జాతకంలో జరుగుతుండ వచ్చు లేదా చంద్రునికి సంబంధించిన దశ కావచ్చు, దూర/విదేశీ ప్రయాణం సంబంధం ఉండవచ్చు అని చెప్పాను.తరువాత నేను యాదాలాపంగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ జాతకం చూచాను. దానితో అనేక కొత్త విషయాలు తెలీడమే కాక, అనేక అనుమానాలు కూడా తలెత్తాయి. అసలు అమెరికా వారు చంద్రుని మీద అడుగు పెట్టింది నిజమా లేక బూటకమా అని సందేహాలు కలిగాయి.

కాని
ఒక్క విషయం కొట్టొచ్చినట్లు కనిపించింది. వీరు చంద్రుని మీద దిగినట్లు గా చెబుతున్న 20-7-1969 నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ జాతకంలో నిజం గానే చంద్ర దశ జరుగుతున్నది. నేను యాదాలాపంగా ఊహించింది నిజం అయింది. ఆయన జాతకం పక్కన ఇచ్చాను.నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 5-8-1930 12.10 కి ఒహియో రాష్ట్రం లోని సెయింట్ మేరీస్ లో పుట్టాడని నెట్ లో దొరికింది. కాని అదీ సరైన సమయం కాదు. కుంద స్ఫుట విధానం తో సరి చేయగా సరియైన సమయం 12.09 అని తేలింది. దానిని బట్టి ఆయన లగ్నం వృషభం 27.48 మరియు నక్షత్రం= మూలా ఒకటో పాదం అని తేలింది.జాతకాన్ని పూర్తిగా చూడలేదు. కాని వీరు చంద్రుని మీద దిగిన ఒక్క సంఘటన మాత్రమె చూచాను. రోజున ఆయన జాతకంలో చంద్ర/కేతు/రాహు/కుజ/చంద్ర దశ (దశ/అంతర్దశ/విదశ/సూక్ష్మ దశ /ప్రాణ దశ) జరిగింది. ఇక విశ్లేషణ చూద్దాం.

>>
చంద్రుడు తృతీయాధిపతిగా ప్రపంచం తో కమ్యూనికేషన్ ను చూపుతున్నాడు. అలాగే దగ్గర ప్రయాణాన్ని సూచిస్తున్నాడు.అమెరికా నుంచి చంద్రుని మీదకు పోవటం దగ్గర ప్రయాణం కాదు. కనుక ప్రపంచానికి అబద్దపు కమ్యూనికేషన్ ఇచ్చినట్లు సూచిస్తున్నది.

>>
కాని చంద్రుడు నవమాధిపతి అయిన శని తో కలసి ఉండటం తో దూరపు ప్రయాణం, విదేశీ ప్రయాణం సూచితం అయింది. కాని అదే శని వక్రించి ఉండటం తో అదీ నిజం కాదు అని తేలుతోంది. అదీగాక శని చంద్రులు అష్టమంలో ఉండటంతో అది వక్ర బుధ్ధీతొ ఆడిన నాటకం కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది.

>>
శని తృతీయ దృష్టి దశమం మీద ఉంది. కనుక వృత్తి పరమైన, అబద్ద పూరిత కమ్యూనికేషన్ ప్రపంచానికి ఇవ్వడానికి ఇది సూచన గా ఉంది. అంతర్దశ, విదశా నాదులుగా ఉన్న కేతు/రాహులు ఆరు/పన్నెండు ఇళ్ళలో ఉండి రహస్య కార్యక్రమాలు, శత్రువుల ఒత్తిడు లను చూపుతున్నారు. చంద్రునికి వీరి సంబంధం ఎంత మాత్రం మంచిది కాదు. కనుక శత్రువులైన రష్యా (కేతువు) వారి పోటీని అధిగమించడానికి రహస్య ప్లాన్( రాహువు) తో నాటకం ఆడి ఉండ వచ్చు.

>>
సూక్ష్మ దశా నాధుని గా ఉన్న కుజుడు లగ్నానికి మంచి వాడు కాదు. సప్తమాధిపతి గా పార్ట్ నర్లకు సూచకుడు. ఆయన లగ్నం లో కొచ్చి కూచోడం తో భాగ స్వాముల (నాసా అడ్మినిస్ట్రేషన్) వత్తిడికి లొంగి పోవలసి వస్తుంది. పైగా ఈయన ద్వాదశాదిపతిగా రహస్య కుట్రలకు సూచకుడు. ద్వాదశంలో రాహువు స్తితి దీనికి బలాన్ని ఇస్తున్నది.

>>
ప్రాణ దశా నాదునిగా మళ్ళీ చంద్రుడే ఉన్నాడు. కనుక మళ్ళీ మళ్ళీ ఆయన్ను లెక్కించ నవసరం లేదు.

>>
మన విశ్లేషణ నిజమా కాదా అనే విషయం లో ఈయన వృత్తి పరమైన విషయాలు చూపించే దశమాంశ సహాయం తీసుకుందాము. దశమాంశ లో లగ్నం తులాలగ్నం అయింది. సప్తమంలో శని నీచలో ఉన్నాడు. రాశి చక్రంలో వృత్తి స్థానాధిపతి గా ఉన్న శని, వృత్తిని చూపే దశామాంసలో నీచ స్తితి ని బట్టి, చంద్రుని మీద దిగటం అబద్దం కావచ్చు అని తేలుతున్నది. ప్రపంచం నివ్వెర పోయే అటువంటి విజయం సాధించే జాతకం ఖచ్చితం గా ఇలా ఉండదు. అంతే కాదు ఇది భాగ స్వాముల కుట్ర (సప్తమంలో శని నీచ స్తితి) అని క్లియర్ గా సూచనలు ఉన్నవి.

>>
అదీగాక దశమాంశ లో వాక్ స్థానం అగు ద్వితీయం లో గురు/బుధ/కేతువుల స్తితి ఏమి చెబుతున్నదో చూద్దామా. గురువు, ఆకాశ యాన కారకునిగా, బుధ+కేతు యుతితో, కుట్ర పూరిత బుద్ధితో, వృత్తి పరమైన అబద్ద పూరిత వాక్కును చెప్పినట్లు సూచన క్లియర్ గా దశమాంశ చక్రం చూపిస్తున్నది.

>>
చంద్రుని మీద దిగినట్లు గా చెపుతున్న 20-7-1969 తేదీనాడు గోచార శని మళ్ళీ మేష రాశిలో నీచ స్తితిలో ఉన్నాడు. ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి?

>>
ఇంకొంత లోతుగా చూద్దాము. లగ్నారూడం మకరం అయింది. అనగా తొమ్మిదో స్థానం అవటం తో దూర ప్రయాణానికి+శనికి దశమ ఆధిపత్యం తో వృత్తి సంబంధం గా ఈ జాతకుడు ప్రఖ్యాతి పొంద గలడు అని తెలుస్తున్నది. కాని ఇక్కడే అసలు రహస్యం ఉంది.ఇదే మకరం లో గుళిక స్తితుడై ఉండటం చూడ వచ్చు. కనుక పైన అనుకున్న విషయం లోనే అసలైన రహస్యం దాగుంది అని గుళిక గ్రహం చూపిస్తున్నది.

>>
ఇక పొతే ఇప్పటికీ మన విశ్లేషణ తప్పేమో ఇంకా చూద్దాం అని పరిశీలించగా--దశమ ఆరూడం చూద్దాం. దశమాధిపతి శని దశమానికి పదకొండింట ఉండటం వల్ల దశమారూడం శని ఉన్న ధనుస్సు నుంచి పదకొండు అయిన తులా రాశి అయింది. అంటే పేరు ప్రఖ్యాతులు వృత్తి పరం గా వచ్చే అదృష్టం ఉంది అని తెలుస్తున్నది. కాని ఇక్కడ కేతువు స్తితుడై ఉండటం తో పరిస్తితి అంతా తారు మారు అయింది. కేతువు వల్ల రహస్య మాయమైన కుట్ర వల్ల ఆ పేరు వస్తుంది అని సూచితం అవుతున్నది.
పొతే, ఇలాంటి అనుమానాలు పాశ్చాత్య జ్యోతిష్కులకు కూడా వచ్చాయని ఇంటర్నెట్ లో వెతికితే కొన్ని వందల సైట్లు దర్శనం ఇచ్చాయి. పోనీలే మన వాదనకు కొంత బలాన్నిచ్చే వారు వారిలోనే ఉన్నారు అని అనిపించింది. ఇవీ అజ్ఞాత గారడిగిన నీల్ అరం స్ట్రాంగ్ ప్రశ్న వల్ల తెలిసిన విషయాలు.

కనుక
ఇవన్నీ చూస్తె నాకు ఒకటే అనిపిస్తున్నది. అసలు అమెరికా వారు చంద్రుని మీద అడుగు పెట్టలేదు. ప్రపంచాన్ని నమ్మించటానికి స్టూడియో లో సెట్టు వేసి సినిమా తీసి లోకాన్ని నమ్మించారు. అని జ్యోతిష్య విజ్ఞానం చెప్తున్నది. నిజా నిజాలు దేవునికి, నాసా వారికి ఎరుక.