“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

13, అక్టోబర్ 2009, మంగళవారం

రూలింగ్ ప్లానేట్స్

ప్రశ్న శాస్త్రంలో అనేక విధానాలున్నాయి. ముఖ్యంగా అవి భారతీయ, పాశ్చాత్య విధానాలుగా విభజన చెయ్యవచ్చు. మన పద్ధతులలో కూడా తాజిక విధానం పాశ్చాత్య పద్ధతికీ దగ్గిరగా ఉంటుంది.

ప్రశ్న లగ్నం కనుగొనే విధానాల వల్లే వీటిలో చాలావరకూ తేడాలు వస్తాయి. దీనికోసం రకరకాలైన పద్దతులుఉన్నాయి. కాళిదాసుని ఉత్తరకాలామృతం నుంచి నేటి కే.పీ సిస్టం వరకూ అన్నీ చక్కగా పని చేస్తాయి. వాటిని ఉపయోగించుకునే విధానం మనకు తెలియాలి. కొంత మంత్రోపాసనకూడా ఉండాలి. అప్పుడే జ్యోతిర్విద్య ఫలిస్తుంది. ఎందుకంటే ఇది వేదాంగములలో ఒకటి కాబట్టి దీనికి ఉపాసన తప్పకకావాల్సి ఉంటుంది.

మన గ్రంధాలు చాలావరకూ ముస్లిం దండయాత్రలో మరియు వారి విచక్షణా రహిత విధ్వంస కాండలలో నాశనంఅయ్యాయి. అందుకే సబ్జెక్ట్ లో చాలా ఖాళీలు మనకు కనిపిస్తాయి. అందువల్లే వేదిక్ జ్యోతిష్యంలో ఖచ్చితమైనఫలితాలు చెప్పాలంటే అవి జ్యోతిష్కుని స్ఫురణ శక్తి మీదా, అనుభవం మీద అతను తయారు చేసుకున్న ప్రత్యెకపద్దతుల మీదా ఆధారపడవలసి వస్తుంది.

ఈ లోపాలను పూరించటానికి ప్రొఫెసర్ కృష్ణ మూర్తి గారు తయారు చేసినదే కృష్ణ మూర్తి పధ్ధతి లేదా కే. పీ సిస్టం. దీనిలో ఆయన భారతీయ మరియు పాశ్చాత్య విధానాలలోని ఉత్తమ అంశాలను తీసుకున్నాడు. ఉదాహరణకు మనంవాడే శ్రీపతి పద్ధతిని వదలి, పాశ్చాత్యుల ప్లాసిడస్ పద్దతిని భావ స్ఫుట గణనలో ప్రామాణికం గా తీసుకున్నాడు. ఇంకాఅనేక ఇతర పద్దతులు మార్పులు చేర్పులు చేసి తనకంటూ ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. ప్రస్తుతం కే పీ సిస్టం గురించి వ్రాయటం నా ఉద్దేశం కాదు కాబట్టి ఇంతకంటే వివరం అవసరం లేదు.

వీటిలో ముఖ్యంగా ఆయన కనుగొన్నది రూలింగ్ ప్లానేట్స్ అనబడే కొత్త పద్దతి. ఇది నిజానికి కొత్త పద్దతి కాదు. నాడీజ్యోతిష్యానికి ఆద్యుడు అని చెప్పబడే సత్యాచార్యుడు తన సత్య సంహిత లో వీటిని గురించి క్రీస్తు పూర్వమేప్రస్తావించాడు. దానిలో ఆయన రాశి, నవాంశ నాదులకు, కారక గ్రహం యొక్క నవాంశాదిపతికి ప్రాముఖ్యత నిచ్చాడు. కృష్ణ మూర్తి గారు ఇంకొంచం దీన్ని మార్చి రూలింగ్ ప్లానేట్స్ సిద్ధాంతాన్ని పరిపూర్ణం చేసాడు.

ప్రపంచంలో ప్రతి విషయాన్ని ఆ సమయానికి ఉన్న కొన్ని గ్రహాలు నియంత్రిస్తాయి. వీటినే రూలింగ్ ప్లానేట్స్ అంటారు.జన్మ జాతకంలో గాని ప్రశ్న జాతకంలో గాని వీటి పాత్ర అమోఘం. ఇవి ఎటువంటి ప్రశ్న కైనా ఖచ్చితమైన జవాబుఇవ్వగలవు. ఈ పద్దతి ద్వారా జన్మ జాతకం లేకుండా, కేవలం ప్రశ్న ద్వారా ఏ విషయం గురించి అయినా భూతభవిష్యత్ వర్తమానాలను మనం తెలుసుకోవచ్చు. వీటి ద్వారా జనన కాల సంస్కరణ దగ్గర నుంచి, నిత్య జీవితంలోఎదురయ్యే ఏ రకమైన సందేహానికైనా మనం జవాబు తెలుసుకోవచ్చు.

కృష్ణ మూర్తి గారు అనేక పరిశోధనల అనంతరం రూలింగ్ ప్లానేట్స్ గా వీటిని స్థిరపరిచారు. ఇవి బలంలో క్రమవరుసలో పైనించి కిందకు తగ్గుతూ ఉన్నాయి.

>లగ్న సబ్ అధిపతి
>లగ్న నక్షత్రాధిపతి
>లగ్నాధిపతి
>చంద్ర సబ్ అధిపతి
>చంద్ర నక్షత్రాధిపతి
>చంద్ర రాస్యధిపతి
>దినాధిపతి

ఖచ్చితమైన ఫలితాలకు సబ్ మరియు సబ్ సబ్ అధిపతులు చాలా ముఖ్యం. వీరు వింశోత్తరీ దశా లలో సూక్ష్మ దశాప్రాణ దశానాదుల వంటి వారు. నా పరిశోధనలో హోరాధిపతి కూడా చాలా ముఖ్యమైన గ్రహంగా వచ్చింది. కనుక ఈఎనిమిది గ్రహాలతో ఎటువంటి ప్రశ్న కైనా మనం జవాబు తెలుసుకోవచ్చు. సామాన్యంగా సబ్ సబ్ అధిపతి అవసరంరాదు. సబ్ అధిపతి వరకే సరిపోతుంది. వీటికి కృష్ణ మూర్తి సబ్ లార్డ్ టేబుల్స్ అవసరం.

ఈ రూలింగ్ ప్లానేట్స్ లో ఏవైతే మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయో అవి ఆ ప్రశ్నకు ప్రతినిధులు. ఇక అడుగబడిన ప్రశ్ననిజమైనదా లేక ఎగతాళికి అడిగిందా తెలుసుకోవడం మొదలుకొని ఆ పని జరుగుతుందా లేదా ఒకవేళ జరిగితే ఎప్పుడుజరుగుతుంది మొదలైన అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అయితే వక్ర గ్రహ నక్షత్రంలో గాని సబ్ లో గాని ఉన్నగ్రహం రూలింగ్ ప్లానెట్ గా వస్తే దానిని తొలగించాలి. ఈ విధంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని అనుసరించి రూలింగ్ప్లానేట్స్ ను ముందుగా కనుగొని తరువాత అప్పటి గ్రహ స్థితిని బట్టి విశ్లేషణ చేస్తే అన్ని వివరాలు మనకు తెలుస్తాయి.

కాని ఇతర ఏ విధానం కైనా కావలసిన విశ్లేషణా నైపుణ్యం దీనిలో కూడా అవసరం. అది అనుభవం మీదా, పరిశీలనమీదా, గ్రంధ పఠనం మీదా వస్తుంది.

ఈ రూలింగ్ ప్లానేట్స్ అనేవి అద్భుతమైన జవాబులు ఇస్తాయి. కాని అడిగే ప్రశ్న వెనుక తపన, నిజంగా సమాధానంతెలుసుకోవాలని కోరిక మరియు వినయం ఉండాలి. లేకుంటే ఫలితాలు సరిగా రావు. ఇది కూడా నా అనుభవం లోఅనేక సార్లు రుజువు అయింది. ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు కూడా ఇదే చెప్పారు.

ప్రశ్న శాస్త్రానికి కృష్ణ మూర్తి గారు చేసిన గొప్ప సేవ రూలింగ్ ప్లానేట్స్ ను కనిపెట్టి ఇవ్వటమే అని ఘంటా పదంగాచెప్పవచ్చు.