అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

9, జూన్ 2016, గురువారం

ఇప్పుడు మేమేం చెయ్యాలి?

నా గత పోస్ట్ చదివిన చాలామంది, ఇప్పుడు మేమేం చెయ్యాలి? అని అడుగుతున్నారు.అందరికీ విడివిడిగా సమాధానం రాయడం కుదరదు గనుక, వారికోసం ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

స్త్రీ గర్భవతి అయిన దగ్గరనుంచీ హోమియో ట్రీట్మెంట్ లో ఉంటే, పుట్టిన పిల్లకు ఎటువంటి టీకాలూ అక్కరలేదు.టీకాలు వెయ్యకపోయినా పాపకు ఏమీ కాదు.ఇదొక అనవసర భయంమాత్రమే.

నేను మా అమ్మాయికి ఏ టీకాలూ వేయించలేదు.తను శుభ్రంగా హాయిగా ఉంది.ఇప్పుడు హోమియో డాక్టర్ కూడా అయింది.నేను చెప్పేదే చేస్తాను.చేసేదే చెప్తాను.నేను ఆచరించి ఇతరులకు చెబుతాను గాని ఊరకే కబుర్లు చెప్పను.

కానీ నాలా ఉండాలంటే మీకు చాలా ధైర్యం ఉండాలి. తర్వాత్తర్వాత పిల్లలకు ఏ అనారోగ్యం వచ్చినా వారికి హోమియో ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వాలి.ఇంకే విధమైన మందులూ వాడక్కరలేదు.నేనలాగే చేశాను.కనుక నమ్మకంగా చెప్పగలను.

టీకాలనేవి చాలా అసహజమైనవి.అవి జంతుసిరం నుంచి తీసినవి.కొన్నేమో సింధటిక్ గా తయారు అయినవి.అవి మనిషికి ఏ మాత్రం అవసరం లేదు.కానీ వాడిస్తున్నారు.వాడుతున్నారు. పడుతున్నారు.మరి ఆయా రోగాలు వస్తే ఎలా అని మీ అనుమానం కదా? చిన్నప్పటినుంచీ హోమియో ట్రీట్మెంట్ లో ఉంటే ఈ రోగాలు ఏవీ మీ దగ్గరకి కూడా రావు.ఆరోగ్యం కూడా బాగుంటుంది.ఇప్పుడైనా కళ్ళు తెరవండి.సత్యమార్గంలో నడవండి.

"USA లో హోమియోపతి లేదు.వాడనివ్వరు. మాకు మంచి డాక్టర్ దొరకరు" - అంటే నేనేమీ చెప్పలేను.అవన్నీ నాకూ తెలుసు.మీరు వెదకాలి.అన్నీ రెడీగా మన ఒళ్లోకి వచ్చి పడవు.ప్రయత్నం చెయ్యాలి.అప్పుడే ఫలితం ఉంటుంది.

మంచి మొగుడు,మంచి భార్య,మంచి పిల్లలు,మంచి స్నేహితుడు/స్నేహితురాలు,మంచి డాక్టరు,మంచి గురువు, మంచి దారి చూపేవాడు - ఎవరైనా సరే దొరకాలంటే మన ఎకౌంట్లో మంచి కర్మ ఉండాలి. లేకపోతే వాడు/వాళ్ళు మన పక్క ఇంట్లోనే ఉన్నాకూడా మనకు దొరకరు.వాడే ఎదురుగా వచ్చి హెల్ప్ చేస్తానన్నా సరే మనం తీసుకోము,పైగా అనుమానిస్తాము. అవమానిస్తాము.

ఇది కర్మ నియమం.కర్మను జయించాలంటే విశ్వప్రయత్నం చెయ్యాలి.ఊరకే కూచుంటే ఏదీ కాదు.కాలం దొర్లిపోతుంది. అంతే.

గొప్పగొప్ప పనులన్నీ గొప్పవైన ప్రయత్నం వల్లనే జరిగాయిగాని ఊరకే కూచుంటే జరగలేదు.ఊరకే కూచుంటే ఆత్మజ్ఞానం మాత్రం వస్తుంది.ఇంకేమీ రాదు.అదొక్కటే నాకు చాలు అనుకుంటే అలాగే కూచోవచ్చు.కానీ అలా కూచోడం కూడా అందరూ చెయ్యలేరు. ప్రపంచంలోని అన్ని పనులలోకీ అతి కష్టమైన పని అదే అన్న సంగతి అందులోకి దిగిన అతి త్వరలోనే తెలుస్తుంది.

చాలామంది ఇలా అనుకుంటారు.

'సమయం వచ్చినపుడు అదే జరుగుతుంది.మనం ఏమీ చెయ్యక్కర్లేదు.సమయం వస్తే, దేవుడే నన్ను దగ్గరకు తీసుకుంటాడు.గురువే నా దగ్గరకు వెతుక్కుంటూ వస్తాడు'- ఇలా అనుకుంటారు.

ఇది ఎన్నటికీ జరగదు.ఆ "సమయం" అనేది ఎప్పటికీ రాదు.ఈలోపల చావు మాత్రమే వస్తుంది.ఇలా ఆలోచించడం మనం అహంకారానికి పరాకాష్ట తప్ప ఇంకేమీ కాదు.విశాల విశ్వంలో మనమెంత మన బ్రతుకెంత? మనకు ఇంత అహంకారం అవసరమా? అందరూ మనల్ని వెతుక్కుంటూ రావడానికి మనమేమైనా రామకృష్ణ పరమహంసలమా? ఇంత అహంకారం మనిషికి తగునా?

అలా ఏమీ చెయ్యకుండా కూచుంటే ఏదీ జరగదు.సమయం వృధా అవుతుంది.జీవితం వృధా అవుతుంది.చివరకు చింతించవలసి వస్తుంది.జీవితంలో ప్రయత్నం అనేది చాలా అవసరం.సరియైన దారికోసం ప్రయత్నం అవసరం.అది దొరికాక దానిలో నడవడానికి ఇంకా ఎక్కువ ప్రయత్నమవసరం.

ఆటిజం అనేది వచ్చాక ఒక్క హోమియోపతి సిస్టం లోనే తగ్గుతుంది.ఇంక ఏ వైద్య విధానమూ దీనిని తగ్గించలేదు.ఇది నిజమో కాదో మీరే అనుభవంలో చూడండి.తెలుసుకోండి.

సరియైన దారేంటో నేను చెబుతున్నాను కదా.

ప్రయత్నించండి.
read more " ఇప్పుడు మేమేం చెయ్యాలి? "

8, జూన్ 2016, బుధవారం

Humne Tujhko Pyar Kiya Hai Jithnaa - Mukesh



Humne Tujhko Pyar Kiyaa...
Humne Tujhko Pyar Kiya Hai Jithna
Koun Karega Itna

అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1964 లో వచ్చిన Dulha Dulhan అనే సినిమాలోది.ఈ సినిమాలో రాజ్ కపూర్, సాధనా శివదాసాని నటించారు.

ఈ గీతానికి సాహిత్యాన్ని ఇందీవర్, సంగీతాన్ని కళ్యాన్ జీ ఆనంద్ జీ సమకూర్చారు.

చాలా అద్భుతమైన మధురగీతం.

నా స్వరంలో కూడా ఈ పాటని వినండి మరి.

Movie:--Dulha Dulhan (1964)
Lyrics:--Indeevar
Music:--Kalyanji Anandji
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------
Humne tujhko pyar kiya hai jithna
Kaun karega itnaa - Koun karega itna

Tune hampar laakh jafaa kee - Hamne adaa hi samjhee

Tujh se koyee bhool huyee tho - Apni khataa hi samjhee
Saamne tere Yu has has ke -2
Lutthe rahe ham jithnaa
Kaun lutegaa itna -2

Pyaar me mere naaz tume tha - Yaad karo vo nazaaraa

Haath pe apne likh lethe the - Jab tum naam hamaara
Teri adaa ke bhole pan pe -2
Mitthe rahe ham jithna
Kaun mitega itnaa-2

Roye bhee tho dil hee dil me - Mehfil me muskaaye

Tujh se heem hum tera ye ghum - Baraso rahe chupaye
Pyar me tere chupke chupke -2
Jalthe rahe hum jithna
Kaun jalega itnaa-2

Humne tujhko pyar kiya hai jithna

Kaun karega itnaa - Koun karega itna

Meaning

As much as did I love you,
Who else can love you dear?
Who else can love you dear?

How many times you ditched me?
Yet,I took all that as your style
If you did any wrong I took it as my mistake
I was just smiling always,
and fooling myself always
Who will fool himself for you like this,dear?

You used to value my love so dearly, remember..
You used to write my name on your hand
Seeing your innocent good heart
I fell for you always
Who will fall for you like this, dear?

After so much of crying,
Finally our hearts met in a musical evening
For your sake I suffered this agony for years
In your love,I have been burning for ages
Who will burn for you like this,dear?

As much as did I love you,
Who else can love you,dear?
Who else can love you,dear?

తెలుగు స్వేచ్చానువాదం

నిన్ను నేను ప్రేమించినంతగా
ఇంకెవరు ప్రేమించగలరు?
ఇంకెవరు ప్రేమించగలరు?

నువ్వెన్ని సార్లు నన్ను మోసం చేసినా
అది నీ తీరులే అని ఊరుకున్నాను
నువ్వు ఎన్ని తప్పులు చేసినా
అవన్నీ నేనే చేశానులే అని భావించాను
అన్నీ సహించి నీ ఎదురుగా నవ్వుతూ ఉన్నాను
నన్ను నేను మోసగించుకుంటున్నాను
ఇంకెవరైనా ఇలా చెయ్యగలరా,నీకోసం?

నా ప్రేమను నువ్వెంతగా ప్రేమించేదానివో గుర్తు తెచ్చుకో
నా పేరును నీ చేతిమీద వ్రాసుకునేదానివి
నీ అమాయక సౌందర్యాన్ని చూచి
నేను దాసోహం అయిపోయాను
ఇంతగా ఎవరైనా అవుతారా, నీకోసం?

ఎంతో వేదన తర్వాత మన హృదయాలు
ఒక మధుర సాయం సమయంలో ఒకటయ్యాయి
నీకోసం ఈ వేదనను ఎన్నో ఏళ్ళు భరించాను
నీ ప్రేమలో యుగాలుగా కాలిపోతున్నాను
ఇంతగా ఎవరైనా జ్వలిస్తారా,నీకోసం?

నిన్ను నేను ప్రేమించినంతగా
ఇంకెవరు ప్రేమించగలరు?
ఇంకెవరు ప్రేమించగలరు?
read more " Humne Tujhko Pyar Kiya Hai Jithnaa - Mukesh "

7, జూన్ 2016, మంగళవారం

మా అమెరికా యాత్ర - 18 (ఆ రోగమే మహాభాగ్యము)

మనకందరికీ తెలిసిన మంచి మాట ఒకటున్నది.

'ఆరోగ్యమే మహాభాగ్యము' అనేదే ఆ మాట.

కానీ అమెరికాకెళ్ళి వచ్చాక దీనిని 'ఆ రోగమే మహాభాగ్యము' అని పిలవాలేమో అని నాకనిపించింది.

దానిక్కారణం - అమెరికాలో అందరూ దేవతలలాగా ఏ విధమైన రోగాలూ లేకుండా, నిత్యయవ్వనులుగా,హాయిగా సుఖంగా ఉన్నారేమోనన్న భ్రమలో ఇప్పటివరకూ నేనుండటం కావచ్చు.

కానీ ఇప్పుడా భ్రమ పటాపంచలై పోయింది.అక్కడి వాళ్ళకూ మనకున్నన్ని రోగాలున్నాయి.ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువే ఉన్నాయి.

అయితే, అమెరికా రోగాలకూ మనదేశపు రోగాలకూ కొన్ని తేడాలున్నాయి.

మన దేశంలో అశుభ్రత వల్లా, కాలుష్యం వల్లా వచ్చే రోగాలు ఎక్కువ. అమెరికాలో ఈ రెండూ లేవు.కానీ అక్కడ అతిభయంతో కొని తెచ్చుకుంటున్న రోగాలు ఎక్కువగా ఉన్నాయని నాకర్ధమైంది.

మన రోగాలు అజ్ఞానంతో వచ్చేవి. వాళ్ళ రోగాలేమో అతితెలివి వల్ల వచ్చేవి.

"ఏ రాయైతేనేం తల పగలడానికి?" - అని మనకు ఇంకో సామెతుంది. అజ్ఞానంతో వచ్చినా అతితెలివితో వచ్చినా రోగం రోగమేగా?

వినడానికి వింతగా ఉంది కదూ?

వినండి చెప్తాను.

అమెరికాలోని ఆడవారిలో చాలామందికి థైరాయిడ్ సమస్య ఉన్నది.మగవారిలో కూడా ఉన్నప్పటికీ, ఆడవారిలో ఈ సమస్య చాలామందిలో ఉండటం చాలా విచిత్రం అనిపించింది. ఇక్కడ మనదేశంలో ఉన్నపుడు లేనివారికి కూడా అక్కడ ఒక రెండు మూడు నెలలు ఉంటె ఈ సమస్య వచ్చేస్తుంది.ఇలా ఎందుకు జరుగుతోంది?

సామాన్యంగా ఆడవారిలో ఒక కాన్పు అయిన తర్వాత ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది.కానీ అక్కడ పెళ్ళికాని వారిలో కూడా ఈ రోగం వస్తున్నది.ఉప్పులో అయోడిన్ తక్కువైతే ఈ రోగం వస్తుందని సామాన్యంగా అంటూ ఉంటారు.మరి అమెరికాలో అలా ఉండదు కదా?అక్కడ ఉప్పుతో సహా ప్రతిదానిలో ఏది ఎంత ఉండాలో ఖచ్చితంగా లెక్కవేసి తక్కువైతే కలిపి మరీ స్టోర్స్ లో సప్లై చేస్తూ ఉంటారు. అయినా సరే సమాజంలో ప్రతి రెండో మనిషికీ ఈ రోగం ఎందుకొస్తున్నది?

అమెరికాకు వెళ్ళే మనవాళ్ళందరూ డబ్బుకోసమూ, ఇక్కడ కంటే మంచి జీవితం కోసమూ వెళతారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, మంచి పక్కనే చెడుకూడా కాచుకుని ఉన్నట్లుగా, సంపద పక్కనే రోగాలు కూడా కాచుకుని ఉన్నాయన్నమాట.

పాతకాలంలో నిధికి కాపలాగా సర్పాలు ఉండేవి. ఆ నిధికోసం వెదికేవారిని అవి కాటు వేసి చంపుతూ ఉండేవి. ఆ విధంగా, అమెరికాలో విలాస జీవితంకోసం మనవాళ్ళు వెళుతుంటే, అక్కడ వీళ్ళకోసం నానా రకాల రోగాలూ వెయిట్ చేస్తున్నాయి.

ఈ థైరాయిడ్ సమస్య ఒక్కటే కాదు, అక్కడ మనవాళ్ళకు డయాబెటీస్ ఉన్నది. హైపర్ టెన్షన్ ఉన్నది. ఊబకాయం ఉన్నది. ఇంకా ఘోరమైన రోగం ఇంకోటి ఏమంటే - పిల్లల్లో "ఆటిజం" అనే వ్యాధి ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తున్నది.

"ఆటిజం" అనే రోగం ఒక పిల్లకో పిల్లాడికో ఉంటె - ఇక ఆ తల్లిదండ్రులకు వేరే శాపాలు ఏమీ అక్కర్లేదు. వాళ్ళ జీవితాంతం ఆ సంతానాన్ని పెంచుకుంటూ శాపగ్రస్తులలాగా బ్రతకడమే వారికి సరిపోతుంది.జీవితంలో ఇంకెన్ని ఉన్నా, ఈ ఒక్క శాపంతో అవన్నీ తుడిచి పెట్టుకుని పోతాయి.

అమెరికాలో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది.వాళ్లకు ఒక అబ్బాయి. అతనికి 18 సంవత్సరాలు.కానీ ఇప్పటికీ మాటలు రాలేదు.సోషల్ బిహేవియర్ తెలీదు.భయాలు ఎక్కువ.నలుగురిలో కలవలేడు.ఇంట్లో ఒక మూల కూచుని బిక్కుబిక్కుమని చూస్తూ ఉంటాడు.ఆ తల్లిదండ్రుల క్షోభ ఇంతా అంతా కాదు. వాళ్ళ సోషల్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది.ఎక్కడకూ పోలేరు.ఏమీ చెయ్యలేరు.ఆ అబ్బాయిని చూచుకుంటూ కుమిలిపోతూ జీవితాలు వెళ్లదీస్తున్నారు.వాళ్ళు అమెరికాలో ఉంటే మాత్రం ఏం లాభం? ఇలాంటి కుటుంబాలు అక్కడ వేల సంఖ్యలో ఉన్నాయి.

ఇంతా చేస్తే, ఈ ఆటిజం అనే వ్యాధికి మూలం ఏమిటో చెప్పనా? నేను చెప్పే నిజం వింటే మీరు బిత్తరపోతారు. పుట్టినప్పటి నుంచీ క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించడమే ఈ ఆటిజం రావడానికి ప్రధానమైన కారణం.

నమ్మశక్యంగా లేదు కదూ !!

ఇది పచ్చి నిజం.కానీ ఘనత వహించిన మన ఇంగ్లీషు వైద్యులకు ఈ విషయం తెలీదుగాక తెలీదు. వారు దీనిని ఒప్పుకోరు కూడా.కానీ హోమియోపతి బాగా వచ్చినవారికి ఈ నిజం తెలుసు.

హోమియో పితామహులలో ఒకరైన James Crompton Burnett అనే వైద్యుడు టీకాల వల్ల మనిషికి కలుగుతున్న అనేక దుష్ప్రభావాల గురించి చాలా విస్తృతంగా రీసెర్చి చేశాడు. ఆ రీసెర్చి ఫలితంగా, ఆయన కొన్ని నివ్వెరపోయే నిజాలను కనుగొన్నాడు.

ఒక పాపకు టీకా వేయిస్తే, ఆ విషం ఆ పాప శరీరంలో చనిపోయేదాకా ఉంటుంది.ఆ విషపు ఫలితంగా ఆ పాప ఆరోగ్య స్థితిలో సమూలమైన చెడు మార్పులు కలుగుతాయి.టీకా వేసిన క్షణం నుంచీ ఆ పాప ప్రాణశక్తి వేగంగా క్షీణిస్తూ ఉంటుంది. శరీరంలో సజావుగా జరిగే జీవక్రియలకు ఈ టీకా విషం అడుగడుగునా అడ్డు తగులుతూ ఉంటుంది.అప్పటికే ఆ పాప శరీరంలో ఉన్న అనేక వంశపారంపర్య రోగాలకు తోడు, ఈ యానిమల్ సిరం నుంచి తయారైన టీకా విషం కూడా తోడై -  ఆటిజం - అనే భయంకరమైన బుద్ధిమాంద్య వ్యాధిగా అది రూపుదాలుస్తుంది.

నమ్మడం కష్టంగా ఉంది కదూ?

ఇది పచ్చి నిజం.కానీ అన్ని పచ్చినిజాల లాగే ప్రపంచం దీనిని నమ్మదు. అలా నమ్మకపోవడమే కర్మకు కావాలి. నమ్మి సత్యమైన దారిలో నడిస్తే పూర్వం చేసుకున్న పాపఖర్మను అనుభవించడం ఎలా సాధ్యమౌతుంది? కాదు.కనుక ఎవరూ నిజాలను నమ్మరు.అలా నమ్మకపోవడం ద్వారానే, వారి వారి ఖర్మను అనుభవిస్తూ బ్రతుకుతూ ఉంటారు.

ఇది ప్రపంచాన్ని నడిపిస్తున్న తిరుగులేని రహస్య కర్మనియమం.

ఒక టీకాకే శరీరంలో ఇంత డ్యామేజి జరిగితే, ఇక రెండు మూడు టీకాలు కలిపి తయారు చేస్తున్న టీకాలు ఎంత ప్రమాదకరమైనవో ఊహించండి !! 

మీకొక విషయం తెలుసా? 

కొన్ని దేశాలలో అయితే,స్కూలు పిల్లలకు ఈ మల్టి పర్పస్ టీకాలు వేసినప్పుడు,అలా వేసిన అరగంటలో ఆ పిల్లలు కుప్పకూలి చనిపోయారు.అందుకే ఇప్పుడు అనేక దేశాలలో - Say No To Vaccination - అనే ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. నేను చెబుతున్నది తెలివి ఉండి, కళ్ళు తెరిచి, నిజానిజాలు గమనించి, అర్ధం చేసుకుంటున్న దేశాల సంగతి. గుడ్డెద్దు చేలో పడినట్లు పోతున్న మన దేశం లాంటి దేశాల గురించి కాదు. 

Vaccination యొక్క భయంకరమైన చెడు ప్రభావాల గురించీ, పిల్లల ఆరోగ్యాలను అది ఎలా దెబ్బతీస్తుందన్న విషయం గురించీ, నెట్లో వెదకండి !! దిగ్భ్రమ కలిగించే నిజానిజాలు మీకే తెలుస్తాయి.

ఈ అజ్ఞానభ్రాంతికి అమెరికా కూడా ఏమీ అతీతం కాదు. అమెరికాలో ఉన్నన్ని ఆటిజం కేసులు ప్రపంచంలో ఇంకే దేశం లోనూ లేవు. దానికి కారణం నేను చెప్పనా?

భయం !!

ప్రపంచంలో ఎక్కడ ఏ రోగం వచ్చినా, అది తమకు సోకుతుందని అమెరికా వాడు ముందుగా భయపడి పోతాడు.గజగజా వణికి పోతాడు. ఆ రోగానికి ఒక టీకాను తయారు చేస్తాడు.అవసరం ఉన్నా లేకపోయినా,పుట్టిన ప్రతి పిల్లకూ పిల్లాడికీ ఆ టీకాను పొడుస్తాడు.ఆ రకంగా అనేక టీకాల విషం అనవసరంగా ఆ పిల్లల ఒంట్లోకి చేరిపోతూ,వాళ్ళ ప్రాణశక్తిని క్రుంగదీస్తూ ఉంటుంది. ఆ పిచ్చిప్రాణం మాత్రం ఎంతకని ఈ విషాలను తట్టుకుంటుంది? చివరకు అదీ చేతులెత్తేస్తుంది.ఆ పిల్లలు ఆటిజం పిల్లలుగా మారిపోతారు.

క్రమం తప్పకుండా పిల్లలకు టీకాలు వేయిస్తున్న తల్లిదండ్రులారా!! ఒక విషయం గుర్తుంచుకోండి.మీ పిల్లల శరీరాలలోకి మీరే విషం ఎక్కిస్తున్నారు.వాళ్ళను బుద్ధిమాంద్య పిల్లలుగా మీరే మారుస్తున్నారు. ఇది నిజం. కానీ మీకర్ధం కాని, మీరర్ధం చేసుకోలేని సత్యం.

అమెరికాలో ఉన్న మనవాళ్ళ ఖర్మ ఏమంటే - ఈ నిజాలు తెలిసినా కూడా వాళ్ళ పిల్లలకు టీకాలు వెయ్యకుండా వాళ్ళు ఆపలేరు. అలా ఆపితే అది నేరం అవుతుంది. స్కూళ్ళలోనే ఈ టీకాలు వేసే కార్యక్రమం జరిగిపోతుంది. రికార్డులలో నమోదు అవుతుంది.అలా చేయించకపోతే ఆ తల్లిదండ్రులు సోషల్ క్రైం చేసినట్లు లెక్కలోకి వస్తారు.

నిజాలు తెలిసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో అమెరికా తల్లిదండ్రులున్నారు. అదే వాళ్ళ ఖర్మ !!

కార్పోరేట్ స్కూళ్ళలో జరిగేది ప్యూర్ బిజినెస్ మాత్రమేననీ, పిల్లల్ని వాటిల్లో చేర్చి వాళ్ళను మానసికంగా శారీరకంగా హింసకు గురిచేసి కోళ్ళ ఫారాలలో కోళ్ళ మాదిరిగా వాళ్ళను నరకయాతన పెట్టడమేననీ తెలిసినా కూడా - తమ పిల్లలను అక్కడే చేరుస్తున్న ఇండియా పేరెంట్స్ కూ, ఈ టీకాల విషయంలో నిస్సహాయ స్థితిలో ఉన్న అమెరికా NRI పేరెంట్స్ కూ పెద్ద తేడా ఏమీ లేదు.

మీరు చెప్పేది నిజమే అయితే, టీకాలు వేయించుకున్న ప్రతి పిల్లవాడూ ఆటిజం బేబీగా మారాలి కదా? మరి అలా మారడం లేదు కదా? కనుక మీరు చెప్పేది నిజం ఎలా అవుతుంది?- అని మీకు అనుమానం రావాలి.అలా వస్తేనే మీరు సైంటిఫిక్ గా ఆలోచిస్తున్నట్లు నేను ఫీలౌతాను.

దీనికి నాదగ్గర జవాబుంది.

టీకాలు వేయించుకున్న ప్రతి పిల్లవాడూ ఆటిజం బేబీగా మారడు. కానీ అతని ప్రాణశక్తి తప్పకుండా క్షీణిస్తుంది. టీకాలు వేయించక ముందూ వేయించిన తర్వాతా అతని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనించండి.మీకే అర్ధమౌతుంది. టీకాలు వేశాక అతనిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.అంతకు ముందు లేని అనేక రోగాలు అప్పుడు వస్తూ ఉంటాయి. అలేర్జీలకూ వాతావరణ మార్పులకూ తేలికగా స్పందించడం మొదలౌతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను చెప్పేది నిజమని అర్ధమౌతుంది.

మరి ఆటిజం ఎవరికి వస్తుంది?

అప్పటికే ఆ పిల్లవాడి తల్లిదండ్రులలో ఉన్న వంశపారంపర్య దీర్ఘరోగాలు అతనికి జీన్స్ లో వచ్చేసి ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే, మేనరికాలు, లేదా, ఒకేరకమైన రోగాలు తల్లిదండ్రులలో ఉంటే, అలాంటి వారికి పుట్టిన పిల్లలలో ప్రాణశక్తి ఇప్పటికే క్షీణించి ఉంటుంది.అలాంటి పిల్లలకు టీకాలు ఇస్తే, ఖచ్చితంగా వారు ఆటిజం బేబీలుగా మారుతారు.ఎందుకంటే అప్పటికే క్షీణించి ఉన్న ప్రాణశక్తి, ఈ టీకాల విషాన్ని ఏమాత్రమూ తట్టుకోలేక, పూర్తిగా రిజైన్ చేసి మూలకూచుంటుంది. అప్పుడు ఆటిజం విజ్రుంభిస్తుంది.

కనుక టీకాలు వేయించిన ప్రతి పిల్లాడూ ఆటిజం బేబీగా మారడు. ఇప్పటికే ప్రాణశక్తి బాగా క్షీణించిన ఉన్నవాడికి టీకాలు వేయిస్తే,వాడు మాత్రమే అలా మారతాడు.ప్రాణం కొంచం బలంగా ఉంటే,అనేక రకాల కొత్త రోగాల బారిన పడతాడు.అంతే.

అసలీ ప్రాణశక్తి ఏమిటి? అదెక్కడుంది? అని ఇంగ్లీషు వైద్యం తప్ప ఏమీ తెలియని వారికి అనుమానం రావచ్చు.

ఈ 'ప్రాణశక్తి' అన్న కాన్సెప్ట్ ను మర్చిపోవడం వల్లనే ఇంగ్లీషు వైద్యం మనుషుల ప్రాణాలు తీసేలా తయారైంది.ఈ వైద్యులకు శరీరం ఒక మిషన్ తో సమానం. దానిలో ఒక లైఫ్ ఫోర్స్ ఉన్నదనీ ఆ ఎనర్జీ మాత్రమే శరీరాన్ని నడుపుతూ ఉన్నదనీ వారికి తెలియదు. మిషన్ లో ఒక పార్టు పాడైతే దానిని మనం రిపేర్ చేస్తినట్లు, శరీరాన్ని కూడా రిపేర్ చెయ్యాలని వారనుకుంటారు. ఒక రోగం ముదిరి సర్జరీ స్టేజికి వచ్చినపుడు మాత్రమే ఈ కాన్సెప్ట్ పని చేస్తుంది.అంతకు ముందు స్టేజిలలో తనను తాను బాగుచేసుకోడానికి శరీరం శతవిధాలుగా ప్రయత్నిస్తుంది.నిజానికి అలా ప్రయత్నించేది శరీరంలో ఉన్న ప్రాణశక్తి మాత్రమే.

అలా ప్రయత్నించే ప్రాణశక్తికి, సహాయపడుతూ, దాని పని తాము చెయ్యకుండా, దానికి శక్తిని సమకూర్చేవి హోమియో ఔషధాలు.కానీ ఇంగ్లీషు మందులు అలా కాదు.ప్రాణశక్తి చేసే పనిని తామే 'చాలా క్రూడ్ గా' చెయ్యడానికి అవి తయారౌతాయి.ఆ క్రమంలో ప్రాణం 'ఇక నాకెందుకులే' అని తప్పుకుంటుంది.అందుకే - ఇంగ్లీషు మందులు వాడేవారిలో క్రమేణా రోగం ముదురుతూ పోతుంది లేదా మెయింటెయిన్ అవుతూ ఉంటుంది గాని పూర్తిగా తగ్గదు.

ఉదాహరణకు - పాంక్రియాస్ సరిగ్గా పనిచెయ్యకపోతే ఇన్సులిన్ లేక, శరీరంలోని గ్లూకోజ్ శాతాలలో మార్పులు వస్తాయి. అందుకని ఆ ఇన్సులిన్ ను మనం శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తాం. అది చెయ్యాల్సిన పనిని మనమే చేస్తున్నాం కదా, ఇక పాంక్రియాస్ కు పనిలేదు కదా.అందుకని అది హాయిగా పడుకుంటుంది. కానీ - మనం ఇంజెక్ట్ చేసే ఇన్సులిన్ కూ శరీరం సహజంగా తయారు చేసుకునే ఇన్సులిన్ కూ క్వాలిటీలో చాలా తేడా ఉంటుంది.కనుక మనం కృత్రిమంగా శరీరానికి ఇచ్చే ఇన్సులిన్ వల్ల ప్రస్తుతానికి పని జరిగినట్లు అనిపించినప్పటికీ, లాంగ్ రన్ లో మనిషికి చాలా డ్యామేజి జరుగుతుంది. అది ఎలా జరిగిందో తెలిసేసరికి పరిస్థితి చెయ్యి దాటి పోతుంది.ఏ చెయ్యో కాలో తీసెయ్యవలసిన పరిస్థితి వచ్చేస్తుంది.ఇది సర్వసాధారణంగా ప్రతిచోటా జరుగుతూనే ఉంటుంది. కళ్ళు తెరిచి చూడండి.

కానీ హోమియో ఔషధాలు పని చేసే తీరు వేరేగా ఉంటుంది.అవి శరీరానికి ఇన్సులిన్ ను సప్లై చెయ్యవు.అంతర్గత అవయవాలు చేసే పనిని ఇవి చెయ్యవు.ఆ అవయవాలు తిరిగి తమ పనులు తామే చేసుకునేలా అవి బాగు చేస్తాయి.అప్పుడు శరీరంలో సక్రమ స్థితి సహజంగా పునరుద్ధరించబడుతుంది.

ఇంగ్లీషు మందులు పనిచేసే తీరుకూ హోమియో ఔషధాలు పనిచేసే తీరుకూ ఇంత భేదం ఉంటుంది.

ఇంగ్లీషు మందులు వాడేవారి శరీరాలలో ఇంకో విచిత్రం జరుగుతుంది.

ప్రతి ఇంగ్లీషు మందుకూ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి.ఎందుకంటే ఈ మందులు ఎలుకలు కోతుల మీద ప్రయోగింపబడి ప్రూవ్ చెయ్యబడినవి. అవి మనుషులలో కూడా - ఎలుకలలో లాగా కోతులలోలాగా అదే పని చేస్తాయని ఖచ్చితంగా చెప్పలేము.మనకు తెలియని డామేజిని కూడా అవి మానవ శరీరంలో చేస్తాయి.

అంతేకాక, రకరకాలైన ఇంగ్లీషు మందులు కలగలిపి,చాలా కాలం పాటు రోజూ వాడటం వల్ల, అవి మనం ఊహించలేనంతగా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ను డ్యామేజి చేస్తూ పోతుంటాయి.

ఈ క్రమంలో వచ్చేవే ' ఆటిజం' వంటి అంతుబట్టని వ్యాధులు.

పెరిగి పెద్దైన తర్వాత అమెరికాకు వెళ్ళిన మనవాళ్ళకు అక్కడి ప్రాసెస్ కాబడిన తిండి తిని, థైరాయిడ్(హైపో/హైపర్), డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఊబకాయం మొదలైన రోగాలు అనేకం వస్తున్నాయి. కానీ అక్కడే పుట్టిన పిల్లలకు మాత్రం ఆ తిండీ, ఆ హార్మోన్ పాలూ, ఆ టీకాల విషమూ,ఆ మందులూ కలసి వాళ్ళను 'ఆటిజం' కేసులుగా మారుస్తున్నాయి.

నమ్మలేక పోతున్నారు కదూ?మీరు స్వర్గమని అనుకుంటున్నది సడెన్ గా నరకంగా కనిపిస్తున్నది కదూ?

అలాగే ఉంటుంది మరి !!

ఇప్పుడొక మౌలికమైన ప్రశ్న వేసుకుందాం.

అసలు,  నిజమైన ఆరోగ్యవంతుడంటే ఎవరు?

ప్రతిరోజూ ఏ మందులు మ్రింగకుండా, తిన్నది చక్కగా అరుగుతూ, నిద్ర బాగా పడుతూ,ఫ్రీ మోషన్ అవుతూ, ఏ విధమైన రోగమూ లేకుండా, హాయిగా జీవితం గడిపేవాడే నిజమైన ఆరోగ్యవంతుడు. అలా కాకుండా,తిన్నది అరగడానికి ఒక మందు,మోషన్ కావడానికి ఒక మందు,నిద్ర పట్టడానికి ఇంకొక మందు,టెన్షన్ తగ్గడానికి మరొక మందు, ఇలా రోజూ అనేక పిల్స్ మ్రింగుతూ, తాను చాలా విలాసంగా దర్జాగా బ్రతుకుతూ ఉన్నానన్న భ్రమలో ఉండేవాడే నిజమైన రోగిష్టివాడు.

పడిపోతున్న గోడను పోటీలు పెట్టి నిలబెట్టినట్లు, కుప్పకూలడానికి రెడీగా ఉన్న ప్రాణశక్తిని ఈ రోజువారీ మందులతో అలా నిలబెడుతూ ఉంటారు ఇలాంటివారు.

ఈ కోణంలో చూచినప్పుడు, అమెరికాలో ఉంటున్న మనవాళ్ళలో నిజమైన ఆరోగ్యవంతులు ఎవరూ నాకు కనిపించలేదు.వాళ్ళు పైకి చాలా బాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు - కానీ నిజానికి మాత్రం కాదు.వారిలో చాలామంది ప్రతిరోజూ అనేక పిల్స్ మ్రింగుతున్నారు. రోజూ అన్నన్ని పిల్స్ వరసగా మ్రింగేవారు ఆరోగ్యవంతులు ఎలా అవుతారు?

దీనికి తోడు, అక్కడున్న ఆడవారిలో ఇంకొక భయంకరమైన రోగం ఉన్నది.అదేమంటే - బ్యూటీపార్లర్ల వెంట తిరిగి, బ్లీచింగులూ, వ్యాక్సింగులూ, త్రెడ్డింగులు,ఇంకా నానారకాల ట్రీట్మెంట్లు చేయించుకుని, అడ్డమైన క్రీములు రకరకాలు వాడటం. ఈ క్రీముల వల్ల ఆడవారి ఆరోగ్యం ఎంత ఘోరంగా పాడౌతుందో నేను చెప్పానంటే ముందు ఆ క్రీములన్నీ కట్టగట్టి మీరు ట్రాష్ లో పారేస్తారు.

సౌందర్య పోషకాలుగా ముఖానికి రాసుకునే అన్ని బ్యూటీ క్రీములూ ఆడవారి reproductive system మీద సూటిగా ప్రభావం చూపిస్తాయి. చిన్న ఉదాహరణ ఇస్తాను.అప్పుడు మీకు విషయం క్లియర్ గా అర్ధమౌతుంది.

ఆడపిల్లలు సిగ్గుపడితే బుగ్గలు ఎరుపెక్కుతాయి.దీనినే బ్లషింగ్ అని మనం అంటాం.ఇది అందరికీ తెలిసిందే.బుగ్గలకూ సిగ్గుకూ సంబంధం ఏమిటి? సిగ్గు అనేది reproductive system కు సంబంధించిన విషయం.మరి ఎక్కడో క్రింద ఉన్న సిస్టం లో ఏదో మార్పు జరిగితే పైన ఎక్కడో ఉన్న బుగ్గలు ఎరుపెక్కడం ఏమిటి?

ఏంటంటే - బుగ్గలకూ ఆడపిల్లల పునరుత్పత్తి వ్యవస్థకూ సూటి సంబంధం ఉన్నది.సూక్ష్మ పరిశీలన తెలిస్తే, ఆడవాళ్ళ గైనిక్ ఆరోగ్యం ఎలా ఉందో వారి బుగ్గలు చూచి ఇట్టే గ్రహించవచ్చు.దీనికి ఏ విధమైన స్కానింగ్ లూ అవసరం లేదు.పాతకాలంలో ఆయుర్వేద భిషక్ లు మనిషిని చూచి అతని రోగాలు చెప్పగలిగేవారు.జస్ట్ నాడి పట్టుకుని అతని స్కానింగ్ రిపోర్ట్ ను ఇవ్వగలిగేవారు. అదొక మార్మిక విద్య.

విపరీతంగా మొటిమలు ఉండి బుగ్గలు పుచ్చిపోయినట్లు ఉన్న ఆడపిల్లల్లో PCOD ఖచ్చితంగా ఉంటుంది.వారి మెన్సెస్ సైకిల్ ఏమాత్రం సరిగ్గా ఉండదు.ఇది నూటికి నూరుశాతం ఖచ్చితంగా జరుగుతుంది.కావాలంటే పరిశీలించి చూచుకోండి.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, స్కిన్ కూ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూ సూక్షమైన అవినాభావ సంబంధం ఉన్నది. స్కిన్ అన్నది శరీరానికి ఉత్త కవరింగ్ మాత్రమే కాదు.లోపలున్న ఒక్కొక్క అవయవం నుంచి కొన్ని నాడులు స్కిన్ లోని కొన్ని కొన్ని చోట్లకు పాకి వచ్చి సెటిలై ఉంటాయి.కనుక ఆయా ఏరియాలను ప్రేరేపిస్తే, ఆయా ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రేరేపించబడతాయి. ఆక్యు పంచర్, ఆక్యు ప్రెజర్ విధానాల మూలసూత్రం ఇదే.

ఈ సూత్రాన్ని బట్టి బుగ్గలు, ముఖంలోని ఇంకా కొన్ని భాగాలూ, reproductive system తో సూటి సంబంధం కలిగి ఉంటాయని అర్ధమైంది కదా? మరి ఆ బుగ్గలకు రసాయన క్రీములు పూస్తే, అవి స్కిన్లో ఇంకి ఎక్కడకు పోతాయో తెలుసా? నాడుల గుండా అవి సరాసరి వెళ్లి, ఫెలోపియన్ ట్యూబ్స్ లోనో, యుటెరస్ లోనూ, ఓవరీస్ లోనో తిష్ట వేసుకుని కూచుంటాయి.అందుకే సింథటిక్ సౌందర్య పోషకాలు వాడే ఆడవారిలో అనేక గైనిక్ ప్రాబ్లంస్ ఖచ్చితంగా ఉంటాయి.

గమనించండి !! మీకు యాడ్స్ లో అప్సరసల లాగా కనిపించే మోడల్స్ యొక్క ఆరోగ్యం నిజజీవితంలో చాలా ఘోరంగా ఉంటుంది.వాళ్ళు ఎన్ని మందులు రోజూ వాడతారో మీకు తెలిస్తే మీరు 'ఛీ' అంటారు.ఇదంతా పెద్ద మాయా ప్రపంచం.

మీకు అర్ధం కాని ఇంత లాజిక్, ఇంత చిన్న విషయం వెనుక ఉందని ఆశ్చర్యంగా ఉందా? ఇది మచ్చు మాత్రమే. ఈ సైన్స్ లో ఇంకా చాలా లోతుంది. ఇది బాగా అర్ధమైతే ఒక మనిషిని ఊరకే ఒక్క నిముషంపాటు పరకాయించి చూస్తే చాలు అతని/ఆమె యొక్క  MRI రిపోర్ట్ మన బ్రెయిన్లో కనపడుతుంది.

ఇప్పుడు అనేకమంది ఆడపిల్లల్లో PCOD ఎక్కడ చూచినా ఉండటానికీ, ఎవ్వరికీ మెన్సెస్ సరిగ్గా రాకపోవడానికీ,పిల్లలు పుట్టకపోవడానికీ, గర్భాశయం బలహీనంగా ఉండి మూడో నెలలోనే అబార్షన్లు కావడానికీ, ఒకవేళ పిల్లలు పుట్టినా రకరకాల అవకరాలతో పుట్టడానికీ ప్రధానకారణం ఏమిటో తెలుసా? - సౌందర్య క్రీముల వాడకం !! 

ఒక్క సన్ స్క్రీన్ లోషన్ లోనే - ఆడవారి గర్భాశయం మీద డైరెక్ట్ గా పనిచేసే 12 రకాల రసాయనాలున్నాయి. ఈ సంగతి మీకు తెలుసా? అవి మీ శరీరానికి ఎంత చెడు చేస్తాయో మీకు తెలుసా? ఈ విషయం స్పష్టంగా తెలిసిన ఏ మందుల కంపెనీ కూడా మీకు ఈ నిజాలను చెప్పదు. వాటిని మీచేత ఎడాపెడా వాడించే ఏ డాక్టరూ మీకు అసలైన నిజాలను చెప్పడు. అలా చెబితే, ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న మిలియన్ల డాలర్ల వ్యాపారం డమేలని కుప్పకూలిపోతుంది.

వినడానికి వింతగా, ఇబ్బందిగా ఉన్నది కదూ? నిజాలన్నీ ఇలాగే ఉంటాయి.

అదీ అమెరికాలో జరుగుతున్న అసలైన చరిత్ర !! అయితే, ఇండియాలో ఏదో గొప్పగా,దీనికి భిన్నంగా ఉన్నదని మాత్రం భ్రమించకండి. అన్ని MNC ఉత్పత్తులూ ఇప్పుడు మన దేశంలో కూడా విచ్చలవిడిగా వాడబడుతున్నాయి.మనవాళ్ళ ఆరోగ్యాలను కూడా గుల్ల చేసి పారేస్తున్నాయి.

ఇదంతా కర్మ ప్రభావం.

మంచి చెప్పినా ఎవరూ వినరు. వారి పద్ధతులు మానుకోరు.

అలా వినకపోవడమే ప్రకృతికి కావాలి.మానుకోకపోవడమే ప్రకృతికి కావాలి.అప్పుడే వినాశనం వైపు మానవాళి వేగంగా ప్రయాణించే వీలు కలుగుతుంది.మంచిమాట వింటే ఎలా? అంతా బాగై పోతుంది కదా? అప్పుడు మన పూర్వపు చెడుకర్మను ఎవరు అనుభవిస్తారు? మనం చేసుకున్న ఖర్మను ఇతరులు అనుభవించరు కదా? మనమే అనుభవించాలి.

అలా అనుభవించక తప్పదు కాబట్టే - మంచిమాట చెప్పినా ఎవరూ వినరు.మంచి దారి చూపినా ఎవరూ దానిలో నడవరు.

లోకం తీరు ఎప్పటికీ ఇంతే !!

స్వచ్చమైన గాలి పీలుస్తూ, స్వచ్చమైన నీరు త్రాగుతూ, చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న తిండి తింటూ, అన్ని విలాసాలతో సుఖంగా బ్రతుకుతూ ఉన్న అమెరికా వాసులలో అన్ని రోగాలు రావడానికి కారణాలు ఏమిటి? వారి రెసిస్టన్స్ పవర్ అంత వీక్ గా ఉండటానికి కారణం ఏమిటి? ఎక్కడో ఏదో తేడా ఉన్నదని మీకు అనిపించడం లేదా?

భాగ్యపు వేటలో అమెరికాకు వెళుతున్న మనవారికి నేను పైన చెప్పిన అనేక రోగాలు చాపక్రింద నీరులా స్వాగతం పలుకుతున్నాయి.మంచికి పోతే చెడు ఎదురు కావడం అంటే ఇదేనేమో??

అందుకే అమెరికాలో ఉన్న మనవారు -'ఆరోగ్యమే మహాభాగ్యము' అనే సామెతను కొంచెం మార్చి - 'ఆ రోగమే మహాభాగ్యము' అని చదువుకుంటే సరిపోతుందనడం సబబుగా ఉంది కదూ !!!

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 18 (ఆ రోగమే మహాభాగ్యము) "

5, జూన్ 2016, ఆదివారం

Maine Tere Liye Hi Saath Rang Ke - Mukesh





Maine Tere Liye Hee Saath Rang Ke

అంటూ ముకేష్ మధురంగా ఆలపించిన ఈ గీతం 1971 లో వచ్చిన 'ఆనంద్' అనే సినిమాలోది. ఈ పాటకు సాహిత్యాన్ని గుల్జార్, సంగీతాన్ని సలీల్ చౌధురీ అందించారు.

ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతి. అదొక మైకం.ఆ మైకం తలకెక్కిన వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు.ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు.ఒక్కొక్కసారి నవ్వుతారు.ఒక్కొక్క సారి ఏడుస్తారు.చాలాసార్లు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు.మొత్తానికి పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఈ పాట కూడా ఒక మధుర ప్రేమికుని అంతరంగపు లోతుల ఆవిష్కరణమే.

గత తరపు మధురగీతాలలో ఇది ఒకటి.

వినండి మరి.

Movie:--Anand (1971)
Lyrics:--Gulzaar
Music:--Salil Choudhury
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------
Maine tere liye hee saath rang ke sapne chune
Sapne sureele sapne
Kuch haske kuch gumke
Tere aakhon ke saaye churaaye raseelee yaado ne

O Maine tere liye hee saath rang ke sapne chune
Sapne sureele sapne

Choti baaten...
[Choti choti baaton ke hai yaaden badee
Bhoole nahee beete huyee ek chotee ghadee]-2
Janam janam se aakhe bichaye tere liye in raahon me

O Maine tere liye hee...

Bhole bhale....
[Bhole bhale dil ko behlaate rahe
Tanhaayi me tere khayalon ko sajathe rahe]-2
Kabhee kabhee tho aawaz dekar mujhko jagaya khabon ne

O Maine tere liye hee...

Ruthi raaten....
[Ruthi huyi raaton ko jagaya kabhi
Tere liye beethi subah ko bulaya kabhee]-2
Tere bina bhi, tere liye hee,diye jalaye raaton me

O Maine tere liye hee saath rang ke sapne chune
Sapne sureele sapne

Meaning

Only for you, I have selected dreams of seven colors
Dreams, very beautiful dreams
Few are of laughter, few are of sorrow
Sweet memories stolen from the shadows of your eyes

Small chats...
Our talks are small,but their memories are big
I have not forgotten even a small moment that is bygone
Since many ages,my eyes are waiting for you on these paths
Only for you, I have selected dreams of seven colors
Dreams, very beautiful dreams

Decent and innocent...
I have always kept my innocent heart, relaxed
When alone,I always keep thinking of you
Sometimes my dreams awakened me by calling aloud
Only for you, I have selected dreams of seven colors
Dreams, very beautiful dreams

Sad nights...
When my nights were sad, I bore them patiently
For you, I called back the bygone dawns
Even in your absence, the whole night
I keep lighting the lamps, only for you
Only for you, I have selected dreams of seven colors
Dreams, very beautiful dreams

తెలుగు స్వేచ్చానువాదం

నీకోసమే నేను కలలు కంటున్నాను
ఏడు రంగుల కలలను....
వాటిల్లో కొన్ని సంతోషంతో నిండి ఉన్నాయి
కొన్ని దుఖం తో నిండి ఉన్నాయి
నీకోసమే...

మన మధ్య జరిగిన సంభాషణలు చిన్నవే
కానీ వాటి జ్ఞాపకాలు చాలా పెద్దవి
గడచిన స్మృతులలో ఒక్కటీ నేను మర్చిపోలేదు
జన్మజన్మలుగా నీకోసం ఈ దారిలో ఎదురు చూస్తున్నాను
నీకోసమే ఏడు రంగుల కలలను సిద్ధం చేశాను
చాలా అందమైన కలలను

నా అమాయక హృదయాన్ని ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచాను
ఏకాంతంలో ఎప్పుడూ నిన్నే తలపోశాను
మరీ మత్తులో మునిగినప్పుడు
నా స్వప్నాలే నన్ను తట్టి నిద్రనుండి లేపాయి
నీకోసమే ఏడు రంగుల కలలను సిద్ధం చేశాను
చాలా అందమైన కలలను

ఎన్నో విషాద రాత్రులను మౌనంగా భరించాను
గడచిపోయిన ఉదయాలను నీకోసం వెనక్కు తెచ్చాను
నువ్వు నా ఎదురుగా లేకున్నా, నీకోసమే
రాత్రంతా దీపాలను వెలిగిస్తున్నాను
నీకోసమే ఏడు రంగుల కలలను సిద్ధం చేశాను
చాలా అందమైన కలలను

వాటిల్లో కొన్ని సంతోషంతో నిండి ఉన్నాయి
కొన్ని దుఖం తో నిండి ఉన్నాయి
కానీ అవన్నీ నీకోసమే...
read more " Maine Tere Liye Hi Saath Rang Ke - Mukesh "

మా అమెరికా యాత్ర - 17 (పైన పటారం లోన లొటారం)

అమావాస్య ఘడియలలో ఉన్నాము గనుక కొన్ని పిచ్చి మాటలు మాట్లాడుకుందాం !!

తనకు పిచ్చి అని తెలియని పిచ్చివాడు అమాయకుడు. తనకు పిచ్చి అని తెలిసీ, అది అమావాస్యకూ పౌర్ణమికీ ఉధృతం అవుతుందని కూడా తెలిసీ, అయినా ఆపుకోలేని వాడే అసలైన పిచ్చిమారాజని నా ఉద్దేశ్యం.అలాంటి పిచ్చిమారాజులూ మారాణులూ మా గ్రూపులో చాలామంది ఉన్నారు.అసలేమూలో కొంచమైనా పిచ్చి లేకపోతే మా గ్రూపులో చేరడం ఎవరికీ సాధ్యం కాదని నాకెప్పటినుంచో ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది.నా ఈ విశ్వాసం సన్నగిల్లిన ప్రతిసారీ, మా గ్రూపులో ఉన్న ఏ రాజో ఏ రాణో పిచ్చిపిచ్చిగా గోల చేసి, దాన్ని మళ్ళీ పునరుద్దరిస్తూ ఉంటారు.

సర్లే ఈ పిచ్చిగోలను అలా ఉంచి, అమెరికా పిచ్చిగోల గురించి కాస్త మాట్లాడుకుందాం.

నా అమెరికా యాత్రా విశేషాలు చదువుతున్న కొందరు లోలోపల - " పాపం మొదటిసారి అమెరికా రావడం కదా? అక్కడంతా చూచి బిళ్ళబీటుగా పడిపోయాడు గురుడు"- అనుకుంటున్నారనీ, అలా అనుకునే వారిలో నా శిష్యులూ శిష్యురాండ్రూ కూడా ఉన్నారనీ నాకు తెలీదనుకుని మీరనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.

అన్నీ తెలిసినా ఏమీ తెలీనట్లు నటించడమూ, కావాలని ఎదుటివారిని నేనే తప్పుదారి పట్టించే వేషాలు వెయ్యడమూ, ఏది నిజమో ఏది కాదో తెలియని భ్రమను సృష్టించడమూ, అప్పుడు జరిగే తమాషాను తమాషాగా చూడటమూ నాకు బాగా అలవాటేనని మీకు బాగా తెలుసుకదా !!

మొదట్నించీ కూడా, జీవితాన్ని ఒక తమాషాగా ఒక ఆటగా తీసుకోవడం నా అలవాటు. ఈ అలవాటు దురలవాటనీ, దానిని మార్చుకుంటే నలుగురిలో నీ గౌరవం పెరుగుతుందనీ చాలామంది శ్రేయోభిలాషులు నాకు చాలాసార్లు చెప్పారు.కానీ గౌరవం ఎవడిక్కావాలి? నాకు సరదా ముఖ్యంగాని గౌరవం కాదు.గౌరవం ఎక్కువై నాకు మొహం మొత్తిందన్న సంగతి వాళ్లకు తెలీదు. పాపం పిచ్చోళ్ళు !!

సెల్ఫ్ డబ్బా బాగా ఎక్కువైంది కదా? అందుకని కాస్త దీనికి ఫుల్ స్టాప్ పెట్టి, అసలు సబ్జెక్ట్ లోకి వస్తా.

అమెరికాలో నాకు నచ్చిన ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ, నచ్చని విషయాలు కూడా చాలానే ఉన్నాయి.అలాంటి కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాం.

అమెరికాలో ఫుడ్ ఇండస్ట్రీ,మెడికల్ ఇండస్ట్రీ అంతా పెద్ద మాఫియా చేతుల్లో నడుస్తోంది.ఈ విషయం నాకు ఒక వారం రోజులకే అర్ధమై పోయింది.

మన ఇండియాలో అయితే ఒక కప్పు పాలు త్రాగితే వెంటనే శక్తి వచ్చేస్తుంది.కానీ అమెరికాలో అలాంటి కప్పులు ఒక పది పట్టేంత గ్లాసుతో పాలు త్రాగినా కూడా ఏ శక్తీ రాదు.పొట్ట నిండుతుంది. కానీ నీరసం తగ్గదు. ఈ వింత ఏమిటా అని రీసెర్చి చెయ్యగా కొన్ని భయంకరమైన నిజాలు తెలిశాయి.

అమెరికాలో ఫుడ్ మొత్తం ప్రాసెస్ అయినదే.వాళ్ళిష్టం వచ్చినట్లుగా అగ్రి- కల్చర్ చేసి పాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు,సమస్త ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ మార్చిపారేసి పాడు చేసి పారేశారు.

ఒక్కొక్క కూరగాయా రాక్షసి లాగా ఇంతింత లావున ఉంటాయి గాని వాటిల్లో నీరు తప్ప ఇంకేమీ ఉండదు.అవి వండితే మన రుచీ రాదు, తింటే శక్తీ రాదు.కానీ న్యూట్రిషన్ ప్యాక్ట్స్ అని ప్రతిదానికీ పెద్ద లేబుల్ ఉంటుంది.అందులో ఉన్నవి నిజాలో కావో ఎవరికీ తెలియదు.

ప్రతి ఫుడ్ ఐటమూ,పాలతో సహా, మామూలుది ఒకటి, ఆర్గానిక్ ఒకటి, రెండు రకాలు ఉంటాయి.మామూలు ఫుడ్ చీప్.ఆర్గానిక్ ఫుడ్ కొంచం ప్రియం. ఆ ఆర్గానిక్ వి కూడా ట్రై చేసి చూచాను.అవీ అలాగే ఏడిశాయి.వెరసి ఇదంతా పెద్ద మాఫియా లాగా కనిపించింది.

ఇష్టానుసారం కల్చర్ చేసెయ్యడం వల్ల, ఆయా ఆహార పదార్ధాలలో విపరీతమైన కెమికల్స్ చేరిపోతాయి.అవి తినడం వల్ల మనుషులలో చాలా శారీరక మార్పులు వస్తాయి.

ఉదాహరణకు - పాలు బాగా ఎక్కువగా ఇవ్వాలని ఆవులకు గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లు ఇక్కడ సర్వ సాధారణంగా ఇస్తారట.ఆ పాలల్లో ఆ గ్రోత్ హార్మోన్స్ చేరి ఉంటాయి.అవి త్రాగిన పిల్లలు జెయింట్స్ లాగా ఎదిగిపోతుంటారు.పదిహేనేళ్ళు వచ్చేసరికి ఇంతెత్తు అంత లావుతో ఊబకాయులుగా మారిపోతూ ఉంటారు. ఇక ఆ శరీరాలు ఎప్పటికీ తగ్గవు.ఆ ఊబకాయంతో భవిష్యత్తులో ఎన్నెన్ని సమస్యలు వస్తాయో,అసలు వీళ్ళకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో, అయిన తర్వాత ఎన్నెన్ని బాధలు పడాలో,అన్నీఆ దేవుడికే ఎరుక.

ఈ సమస్య అమెరికన్స్ లోనూ ఉన్నది.మన ఇండియన్స్ లో అయితే బాగా ఎక్కువగా ఉన్నది. అమెరికన్స్ చేసినట్లుగా మనవాళ్ళు పడీ పడీ వ్యాయామాలు చెయ్యకపోవడం దీనికి ఒక కారణమని నా ఊహ. రోడ్లపక్కన సైడ్ వాక్స్ లో జాగింగ్ చేస్తూ పరిగెత్తుతున్న అనేకమంది అమెరికన్స్ ను నేను గమనించాను. కానీ ఒక్కడంటే ఒక్క ఇండియా అబ్బాయి గానీ అమ్మాయిగానీ అలా చేస్తూ నాకు కనిపించలేదు.

శాకాహారుల పరిస్థితి ఇలా ఉంటే, ఇక మాంసాహారుల పరిస్థితి చూద్దాం. మాంసం కోసం పెంచే పశువులను వేలాదిగా ఒక చాలీ చాలని ఆవరణలో ఉంచుతారట.వాటికి సరైన లెగ్ స్పేసూ మూవింగ్ స్పేసూ ఉండవు.అవి చాలా చిరాకుగా ఉంటాయి.ఆ చిరాకు ఫలితంగా వాటి రక్తంలో అనేక స్రావాలు విడుదలై ఉంటాయి.వాటి మాంసం అనేక మార్పులకు లోనై ఉంటుంది.ఇది చాలదన్నట్లుగా, రోగాలు రాకుండా ఉండటానికి వాటికి కనీసం 10 రకాల వ్యాక్సిన్లు ఇస్తారు.యాంటీ బయాటిక్స్ విపరీతంగా ఇస్తారు. ఆయా మందులూ వ్యాక్సిన్లూ వాటి శరీరంలో రక్తంలో మాంసంలో చేరిపోయి ఉంటాయి.ఆ మాంసాన్ని ప్రాసెస్ చేసి,చక్కగా ప్యాకింగ్ చేసి అమ్ముతారు. తినేవాళ్ళు కొనుక్కుని లొట్టలేసుకుంటూ తింటారు.

వీళ్ళ శరీరాలలోకి ఆయా వ్యాక్సిన్లూ యాంటీ బయాటిక్సూ ఆ పాడుతిండి ద్వారా చేరిపోతాయి.దాని ఫలితంగా వీళ్ళకు అంతుబట్టని అనేక రోగాలు వస్తూ ఉంటాయి.చివరకు పేగు క్యాన్సర్, లివర్ క్యాన్సర్, మలాశయ క్యాన్సర్ మొదలైన అనేక భయంకర వ్యాధులు వస్తూ ఉంటాయి.

ఆయా వ్యాధులకు చికిత్స అంతా మళ్ళీ మాఫియా మెడికల్ కంపెనీల చేతుల్లో ఉంటుంది.మెడికల్ అంతా ఇన్స్యూరెన్స్ మయం. అక్కడ ఇంగ్లీషు వైద్యం తప్ప ఇతర విధానాలకు గుర్తింపు లేదు.ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్ ను 'కల్ట్ మెడిసిన్' అని ఎగతాళిగా పిలుస్తారు.అక్కడక్కడా కొంతమంది నేచురోపత్స్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ అవి సపోర్టింగ్ మెడికల్ సిస్టమ్స్ గానే ఉన్నాయిగాని గుర్తింపుకు నోచుకోలేదు.

కనుక ఆ ఇంగ్లీషు వైద్యంలో ఉన్న చికిత్సనే ఎవరైనా చచ్చినట్లుగా తీసుకోవాలి.ఇంగ్లీషు వైద్యంలో అన్ని రోగాలకూ మందులు లేవని మనకు తెలుసు.అందుకనే ఆయా రోగాలు పూర్తిగా తగ్గవు.కనుక జీవితాంతం ఆ మందులను వాడుతూ, క్రమేణా వాటి డోసేజి పెంచుకుంటూ,లేదా ఇంకా హయ్యర్ పవర్ ఉన్న మందులు వాడుతూ పోవాలి.ఈ లోపల ఆయా మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అసలు రోగం కంట్రోల్ లో ఉన్నట్లు అనిపించినా, ఇతర అనేక రోగాలు శరీరాన్ని చాపక్రింద నీరులా ఆక్రమిస్తూ ఉంటాయి.మళ్ళీ వాటికి ఇంకో స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ మొదలౌతుంది.ఇలా నానారకాల మందులను వాడటం వల్ల శరీరం గుల్ల అయిపోతుంది.

ఇదీ అమెరికాలో జరుగుతున్న ఫుడ్ + మెడికల్ మాఫియాల వాస్తవ చరిత్ర.

ఇదంతా తెలుసుకున్న అనేకమంది - మామూలు ఫుడ్ వదిలేసి, ఆర్గానిక్ ఫుడ్ వైపు మళ్ళుతున్నారు.అలాగే - మాంసాహారం వదిలేసి శాకాహారం వైపు మళ్ళుతున్నారు.

పంచవటి US ట్రస్ట్ కు ప్రెసిడెంట్ అయిన ఆనంద్ గారికి ఒక స్నేహితుడున్నాడు.ఆయన తన సబ్జెక్ట్ లో Ph.D చేసి మంచి ఉద్యోగం చెయ్యడమేగాక, ప్రస్తుతం వాలంటరీ తీసుకుని ఒక ఇల్లు కొనుక్కుని హాయిగా ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. ఈయన, నేను వ్రాస్తున్న ఈ నిజాలన్నీ బాగా చూచి పరిశీలించి వాస్తవాలను గ్రహించిన బుద్ధిమంతుడు.కనుక, తన ఇంటి చుట్టూ ఉన్న ఖాళీస్థలంలో చక్కగా కూరగాయలు పండ్లు పండించుకుంటూ ఆ కూరలే తింటూ కాలక్షేపం చేస్తూ అమెరికాలో కూడా ఒక రుషిలాగా బ్రతుకుతూ ఆరోగ్యంగా హాయిగా ఉన్నాడు.

పాతకాలంలో మన పల్లెల్లో కూడా ఎవరింట్లో వాళ్ళకు కూరగాయల పాదులు ఉండేవి.పొలంలో ధాన్యం పప్పూ పండేవి. ఏ కెమికల్సూ వాడకుండా, చక్కగా సహజంగా పండిన పంటా, పెరిగిన కూరలూ, ఏ కెమికల్సూ తినని ఆవులు గేదెల పాలూ ఉండేవి.అవి తిన్న ఆనాటి మనుషులు 90 ఏళ్ళు వచ్చినా ఉక్కుల్లా ఉండేవారు.రోజంతా పొలం పనులు చేసేవారు. వాళ్లకు సుగర్లూ బీపీలూ ఇతర ఏ రోగాలూ ఉండేవి కావు.ఈరోజున 20 ఏళ్ళు వచ్చేసరికి తుక్కై పోతున్నారు.తేడా స్పష్టంగా కనిపించడం లేదా? అంతా తిండి మహిమ మరి !!!

అమెరికాలో చాలామంది తమ ఒళ్ళు పెరిగిపోతూ ఉండటం గమనించి - రకరకాల వ్యాయామాల వైపు మళ్లుతున్నారు. విపరీతంగా వ్యాయామం చేస్తూ ఒళ్ళు కరిగించుకునే ప్రయత్నాలు చేసున్న అనేకమందిని జిమ్ముల్లో నేను చూచాను.లేకపోతే ఆ వాతావరణానికి,  తిన్నది ఏమాత్రం అరగదు.క్రమేణా ఒంట్లో ఫ్యాట్ పెరిగిపోవడం మొదలౌతుంది.

ఇదంతా గమనించి మొత్తుకుంటుంటే చూచి మా అబ్బాయి ఒకరోజున ఇలా అన్నాడు.

'నాన్నా.మన ఇండియాలో అయితే పేదవాడు బక్కగా ఉంటాడు.ఇక్కడేమో ఊబకాయునిగా ఉంటాడు.అదే విచిత్రం.ఎందుకంటే అమెరికా పేదవాడు డబ్బుల్లేక చీప్ తిండి తింటూ ఉంటాడు.ఒక డాలర్ కే కొన్ని కంపెనీలు ఇక్కడ హాం బర్గర్లు అవీ అమ్ముతాయి.అవి కొనుక్కుని తింటారు.వాటిల్లో చాలా హానికరమైన కెమికల్స్ ఉంటాయి.అవి ఒంట్లోకి చేరి లావెక్కి పోతూ ఉంటారు.కనుక ఇక్కడ ఊబకాయులను అందరినీ డబ్బు ఎక్కువైన వాళ్ళని అనుకోకు.వాళ్ళలో చాలామంది పేదవాళ్ళే.'

ఈ లాజిక్ విని నాకు మతిపోయినంత పనైంది.కానీ ఇది నిజమే అని పరిశీలనలో తెలిసింది.

నా వరకూ నేను - అమెరికాలో ఉన్నప్పుడు పెద్దగా తిన్నది కూడా ఏమీ లేదు.కానీ ఒక్క నెలలో నేను 4 కేజీలు బరువు పెరిగాను.ఆ బరువంతా పొట్ట దగ్గరే వచ్చింది.ఇండియా వచ్చిన ఈ పది రోజులలో యోగవ్యాయామాలు చేసి ఆ 4 కేజీలూ కరిగించి పారేశాను.పొట్టను మళ్ళీ మామూలు స్థితికి తెచ్చాను.

వ్యాయామం చెయ్యకపోతే మాత్రం అమెరికాలో కొవ్వు పెరగడం చాలా తేలిక.దానివల్ల ఆరోగ్యం పాడవడం కూడా చాలా తేలిక.ఒకసారి ఒళ్ళు పట్టు తప్పాక తిరిగి వెనక్కు తేవడం దాదాపు అసాధ్యం అవుతుంది.

అమెరికాలో అంతా స్వర్గమే అని నేను అనుకోవడం లేదు. అక్కడ ఉన్న నరకం కూడా నాకు బాగా తెలుసు.ఇప్పుడు వ్రాసిన నరకాలు కాదు, ఇంకా భయంకరమైన నరకాలు అక్కడ ఏమేమి ఉన్నాయో ముందు పోస్టులలో వ్రాస్తాను.చదవండి.

ఫుడ్ అండ్ మెడికల్ ఇండస్ట్రీ వరకూ చూస్తే, మన ఇండియానే అమెరికా కంటే వెయ్యి రెట్లు నయం అని నేను అనుభవపూర్వకంగా చూచి గ్రహించాను.మనది Unorganized pollution అయితే అక్కడ అంతా Well organized scientific pollution అని నాకనిపించింది.ఇది వాస్తవం కూడా.

అంతా వెలుగే ఉండటం ప్రకృతి నియమం కాదుగా? వెలుగు పక్కనే చీకటి కూడా ఉండాలి.ఉంటుంది కూడా.

కాకపోతే - ఈ చీకటి వెలుగులనేవి ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క కుటుంబంలో, ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఈ సూత్రానికి ఏదీ అతీతం కాదు.ఎవరూ అతీతులు కారు.

అమెరికాలో నేనున్న ఒక్క నెలలో - ఆ సొసైటీలో ఉన్న పైన పటారాన్ని మాత్రమే కాక, లోన లొటారాన్ని కూడా బాగానే గమనించాను.అక్కడి సోషల్ డిసిప్లిన్ కూ, ప్రకృతిని చక్కగా ఉంచడానికీ, వాళ్ళ మర్యాదపూర్వక ప్రవర్తనకూ నేను ముగ్దుడిని అయినప్పటికీ, ఆ సొసైటీ అంతా స్వర్గమే అని నేను ఏమాత్రం నమ్మడం లేదనీె,అక్కడిదంతా చూచి నేనేమీ బిళ్ళబీటుగా పడిపోలేదనీ చెప్పడమే నా ఉద్దేశ్యం.

నేను పిచ్చివాళ్ళకు గురువునే అయినప్పటికీ, ఈ విధంగా చూచినదంతా నిజమని నమ్మడానికి నేనేమీ అమావాస్య పిచ్చోడిని కాదుగా?

అమ్మో ! అమావాస్య ఘడియలు అయిపోవస్తున్నాయి.కొన్ని తంత్రసాధనలు చేసుకోవాలి.లేకుంటే ఆ శక్తులు నన్ను బ్రతకనివ్వవు. ఉంటా మరి !!

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర - 17 (పైన పటారం లోన లొటారం) "

4, జూన్ 2016, శనివారం

మా అమెరికా యాత్ర -16 (వివేకానందస్వామి పాదాలు సోకిన Freer House)

మేము డెట్రాయిట్ లో అడుగు మోపిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజున ఆనంద్ ఫోన్లో కొచ్చారు.

'వచ్చే సోమవారం మధ్యాన్నం మూడు గంటలకు ఫ్రీర్ హౌస్ లో అపాయింట్ మెంట్ తీసుకున్నాను.మనమందరం అక్కడకు వెళుతున్నాం.' అన్నారు.

'ఏమిటి ఆ హౌస్ ప్రత్యేకత?' - అడిగాను.

'1893 లో వివేకానందస్వామి అక్కడకు వచ్చారు.ఆ ఇంటిని చూడ్డానికి మనం వెళుతున్నాం.' అన్నారు ఆనంద్.

'సరే.మేం ఇటునుంచి వచ్చేస్తాం.మీరు సరాసరి కేంటన్ నుంచి అటు వచ్చేయండి.' అన్నాను.

అనుకున్నట్లుగానే ఆరోజున మధ్యాన్నం మూడుకల్లా డెట్రాయిట్ డౌన్ టౌన్ లో ఉన్న 'ఫ్రీర్ హౌస్' కు అందరం చేరుకున్నాం.

అప్పటికే ఆ సంస్థ నుంచి ఒక అమెరికన్ మాకోసం ఎదురు చూస్తున్నాడు.మమ్మలనందరినీ సాదరంగా ఆహ్వానించి ఆ ఇల్లంతా చూపించాడు.

నన్ను అతనికి పరిచయం చేస్తూ ఆనంద్ - 'ఈయన మా గురువు గారు.వివేకానందస్వామి అంటే ఈయన అన్నీ మర్చిపోతాడు' అని చెప్పాడు.ఆ అమెరికన్ ఒక విధమైన ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుతో మమ్మల్ని గమనించాడు.

అది చాలా పెద్ద ఇల్లు. అది Charles Lang Freer అనే ఒక బిజినెస్ మ్యాన్ కు చెందినది.1893 ప్రాంతాలలో అతనక్కడ ఒక సక్సెస్ ఫుల్ వ్యాపారస్తుడు.మంచి ధనికుడు కావడంతో బాటు, కళాతృష్ణ కూడా ఉన్నవాడు కావడంతో, అనేక దేశాలనుంచి శిల్పాలు పెయింటింగ్స్ సేకరిస్తూ ఉండేవాడు.తన ఇంటిని ఒక ఆర్ట్ గ్యాలరీగా మార్చాడు.

వివేకానందస్వామి డెట్రాయిట్ కు వచ్చినపుడు ఈయనకు అతిధిగా ఉన్నాడు.ఇదే ఇంట్లోనే ఒక డైనింగ్ హాల్ ఉన్నది. అందులో ఒక పెద్ద డైనింగ్ టేబుల్ వేసి ఉన్నది. అక్కడే వివేకానంద స్వామి భోజనం చేసి ఉండవచ్చునని ఆ అమెరికన్ అన్నాడు.అప్పట్లో ఆయన టీ త్రాగిన పింగాణీ కప్పుల సెట్టు కూడా ఆ ఇంటిలో భద్రపరుచ బడి ఉన్నది.

మనమసలే ఎమోషనల్ కావడంతో - ఆ డైనింగ్ టేబుల్ చూడటంతోనే వివేకానందస్వామితో బాటు ఆయన పడిన కష్టాలూ,ఎవరి సాయమూ లేకుండా ఒక్కడే మనదేశం నుంచి అంత దూరం వచ్చి మన ధర్మాన్ని ప్రచారం చేసిన ఘట్టాలూ అవీ గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

'నిన్ను గుర్తుంచుకోని దేశం కోసం, ఆ దేశపు ప్రజలకోసం ఎంత చేశావయ్యా మహానుభావా?' అని మనసులో అనుకున్నాను. 

ఎంతో గౌరవంగా ప్రేమగా సుతారంగా ఆ డైనింగ్ టేబుల్ ను తాకాను.స్వామి చేతిని తాకినట్లే అనిపించింది.

స్వామి అక్కడ ఉన్న రోజులలో, ఆ నగరంలో అప్పుడున్న క్రైస్తవ బోధకులనూ ఫాదర్లనూ అందరినీ తన ఇంటికి ఒక పార్టీకి ఆహ్వానించాడు చార్లెస్ ఫ్రీర్. ఆ ఫాదర్లకు వివేకానందస్వామి అంటే పడదు.ఏదో బానిస దేశం నుంచి ఎవరో ఒక విచిత్రమైన వ్యక్తి వచ్చి నాగరికులమైన మనకేంటి మతం గురించి చెప్పేది? అని వాళ్ళు నిర్లక్ష్యంతో అహంకారంతో ఆ పార్టీకి వచ్చారు. స్వామినీ మన మతాన్నీ విమర్శిద్దామని అనుకున్నారు.కానీ స్వామితో కొంచంసేపు మాట్లాడే సరికి స్వామి ఎంతటి మేధావో ఎంతటి జ్ఞాన సంపన్నుడో వారికి అర్ధమైంది.ఆయన దగ్గర నుంచి తాము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని వారికి తేలికగా అర్ధమైంది.ఆయన జ్ఞానసంపద ముందు తామెంత అల్పులమో అర్ధమైంది.ఆ విధంగా తాను కలసిన అందరి అభిమానాన్నీ గౌరవాన్నీ స్వామి 150 ఏళ్ళ క్రితమే పొందాడు.

శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి ఎంతగా పాత్రుడయ్యాడో కదా స్వామి? -  అనిపించింది.

మనవాళ్ళతో ఇలా చెప్పాను.

'స్వామి అమెరికాలో ఎక్కడకు వెళ్ళినా అక్కడ సమాజంలో ఉన్న మేధావులూ,విశాల హృదయులూ, మోడరన్ తింకర్సూ ఆయన చుట్టూ చేరేవారు.ఈ విధంగా స్వామికి కలుగుతున్న పేరు ప్రఖ్యాతులు చూచి ఓర్వలేక క్రైస్తవ మిషనరీలు ఆయన్ను చంపాలని ప్లాన్ వేశారు.ఒకరోజున ఒక పార్టీకి ఆయన్ను ఆహ్వానించారు.ఒక కూల్ డ్రింక్ లో విషం కలిపి స్వామికి అందించారు.అది తెలియని స్వామి, ఆ డ్రింకును తాగాలని గ్లాసును చేతిలోకి తీసుకున్నాడు.అదే క్షణంలో తన ఎదురుగా శ్రీరామకృష్ణులు ప్రత్యక్షం అయి నిలుచోవడం స్వామి గమనించి ఆశ్చర్యపోయాడు.నోటి దగ్గరకు వచ్చిన ఆ గ్లాసును రామకృష్ణులు పట్టుకుని ఆపేశారు.ఆ డ్రింకును త్రాగవద్దని అడ్డంగా తలఊపి మాయమయ్యారు.ఆ దృశ్యాన్ని చూచిన స్వామి, నోటి దగ్గర పెట్టుకున్న ఆ గ్లాసును తిరిగి టేబుల్ మీద ఉంచాడు.ఆ పార్టీలో ఏమీ తినకుండా త్రాగకుండా ఉండి తిరిగి వెనక్కు వచ్చేశాడు.ఆ విధంగా స్వామిని చంపాలని మిషనరీలు చేసిన ప్రయత్నం శ్రీరామకృష్ణానుగ్రహంతో విఫలం అయింది.స్వామి జీవితంలో జరిగిన నమ్మలేని నిజాలలో ఇదొకటి." 

వింటున్న మనవాళ్ళు ఆశ్చర్యంగా చూచారు.

చాలాసేపు ఆ ఇల్లంతా తిప్పి అన్నీ చూపించాడు ఆ అమెరికన్. అప్పట్లో ఈ ఇల్లు ఒక ఆర్ట్ గ్యాలరీగా ఉండేది.ఇప్పుడు కూడా ఒక పెద్ద పెయింటింగ్ ఆ ఇంటిలో ఉన్నది.ఒకమ్మాయి ఇద్దరు పిల్లలతో ఒక లాన్లో నడచి వస్తున్నట్లుగా ఆ పెయింటింగ్ ఉంటుంది.ఆ పెయింటింగ్ లో నాలుగు సీజన్స్ వచ్చేలాగ చిత్రించాడు పెయింటర్.ఆ పెయింటింగ్ ను కావాలని దగ్గరుండి చార్లెస్ ఫ్రీర్ వేయించాడని మా గైడ్ అమెరికన్ చెప్పాడు.నిజంగానే ఒకమ్మాయీ,ఇద్దరు పిల్లలూ గోడమీద నిలబడి మనల్ని చూస్తున్నట్లు మంచి జీవకళగా ఆ పెయింటింగ్ ఉన్నది.అదేమాట అతనితో అన్నాను. అవునన్నట్లుగా నవ్వాడతను.

చార్లెస్ లాంగ్ ఫ్రీర్ అనేవాడు తన తర్వాత ఆ ఇంటిని Smithsonian Institution Washington కు దానంగా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఆ ఇల్లు వేన్ యూనివర్సిటీ అధ్వర్యంలో Merril Palmer Skillman Institute of Child & Family Development అనే సంస్థగా నడుస్తున్నది.

వివేకానంద స్వామి తనను కలసిన తర్వాత చార్లెస్ ఫ్రీర్ మన దేశంపైన ప్రేమ పెంచుకుని జైపూర్ కు వచ్చి కొన్నాళ్ళు ఉన్నాడు.జైపూర్ గురించి అతను వ్రాస్తూ  ఇలా అంటాడు.

"మొదటి చూపులోనే ఇండియాతో నేను ప్రేమలో పడ్డాను.ఈ నగరం (జైపూర్ సిటీ) చాలా అద్భుతంగా ఉన్నది.ఒక నూరు అద్భుతాలను చూడకుండా ఇక్కడ ఏ పక్కకూ తల తిప్పడం సాధ్యం కావడం లేదు."

ఆ తర్వాత అతను చైనా జపాన్ మొదలైన అనేక ఆసియా దేశాలు తిరిగి అనేక పెయింటింగ్స్, కళా ఖండాలు సేకరించాడు.ముఖ్యంగా జపాన్ సంస్కృతితో బాగా ప్రభావితుడైన ఇతను తన ఇంటిలో కూడా జపాన్ కళాత్మక వస్తువులను వాడేవాడు.ఇప్పుడు కూడా ఈ ఇంటి ఆవరణలో ఉన్న ఒక చెట్టును జపాన్ నుంచి తెచ్చి నాటాడు.ఆ చెట్టును ఇప్పటికీ అక్కడ మనం చూడవచ్చు.

ఆ ఇంటిలో ఉన్న ఆ కాలం నాటి ఫోటోలు చూస్తే - అప్పట్లో ఆ ప్రాంతమంతా ఖాళీగా ఉన్నది.ఎక్కడా ఇళ్ళు లేవు.ఈ ఇల్లు కడుతున్నపుడు తీసిన ఫోటోలు కొన్ని ఉన్నాయి.అప్పుడు ఎడారిలా ఉన్నా,ప్రస్తుతం మాత్రం డెట్రాయిట్ సిటీకి మధ్యభాగంగా మారింది.

వివేకానంద స్వామి అక్కడకు వచ్చిన సందర్భంలోని న్యూస్ కవరేజ్ కూడా వాళ్ళు భద్రంగా ఉంచారు.ఆనాటి ప్రెస్ వాళ్ళు Vive-Kananda అని ఆయన పేరును విడదీసి Kananda అని పేపర్లో సంబోధిస్తూ వ్రాశారు.ఆ విషయాన్ని ఆ అమెరికన్ చెబుతూ -'స్వామి పేరును సరిగ్గా పలకలేక పోయినందుకు మా వారి తరఫున నా క్షమాపణలు' అన్నాడు.వారి మర్యాదకు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.

'ఏం పరవాలేదు.మేమేమీ అనుకోవడం లేదు.మేము మీరు మాట్లాడినట్లుగా అదే యాసతో ఇంగ్లీషు ఎలాగైతే మాట్లాడలేమో, అలాగే మీరూ మా పదాలను సరిగా పలకలేరు.ఇది సహజమే.మీరు దానికి క్షమాపణ చెప్పవలసిన పని లేదు.' అని నేనన్నాను.

అతనితో నేనింకా ఇలా అన్నాను - ' For you this might be a historical house and an art gallery. For us, this is a sacred place, because it was sanctified with the touch of Swami Vivekananda's feet'.

అతనికి ఇదంతా వింతగా ఉన్నట్లుంది.మావైపు అదొక రకంగా చూచాడు.

వివేకానందస్వామి అమెరికాలో ఎక్కడెక్కడ సంచరించారో ఆయా వివరాలు ఎక్కువగా లేవని ఆయనన్నాడు.అలా కాదని, ఈ విషయం పైన రీసెర్చి చాలా జరిగిందనీ నేనంటూ Marie Louis Burke వ్రాసిన Swami Vivekananda's second visit to the west - New discoveries అనే పుస్తకం ఉన్నదనీ దానిని చదవమనీ అతనికి సూచించాను.అతను చాలా ఇంప్రెస్ అయినట్లు కనిపించాడు. గెస్ట్ బుక్ తెచ్చి అందులో మమ్మల్ని సంతకాలు చెయ్యమని అడిగాడు.

చాలాసేపు ఆ ఇల్లంతా తిరిగి చూచి, ఆ తర్వాత ఇంటి ముందు నిలబడి ఫోటోలు దిగి, అక్కడనుంచి బయలుదేరి మళ్ళీ మేముంటున్న ఆబర్న్ హిల్స్ ప్రాంతానికి చేరుకున్నాము.

"వివేకానందస్వామి వచ్చిన ఇంటికి మనం కూడా వచ్చాము. ఆయన భోజనం చేసిన డైనింగ్ టేబుల్ చూచాము.దానిని తాకాము.ఇంతకంటే ఇంకేం కావాలి?" అనుకుంటూ ఆ రోజంతా ఒకవిధమైన ఆనందంలో గడచింది.















 



 
 




   
   
(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర -16 (వివేకానందస్వామి పాదాలు సోకిన Freer House) "