“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, ఫిబ్రవరి 2023, గురువారం

మనువు అల్లాని పూజించాడా? మతుందా మదానీ?

మొన్న ఆదివారం నాడు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన జమాతే ఇస్లామీ హింద్ సభలో ఆ సంస్థ లీడర్ మౌలానా అర్షద్ మదానీ మాట్లాడుతూ కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలను చేశాడు. అవి,

1. మనువు, ఆడం ఒకరే

దీనికి మా జవాబు: మనువు, ధర్మశాస్త్రాన్ని లోకానికి ఇచ్చిన మహారాజు. ఆడం, బట్టలు కట్టుకోవడం కూడా తెలియకుండా, అడవిలో తిరిగిన అడవిమనిషి. ఇద్దరూ ఒకరే ఎలా అవుతారు?

2. మనువు పూజించింది ఓం ని.

దీనికి మా జవాబు: మనువు గాయత్రిని జపించాడు. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేవాడు. వైదికహోమములు చేసేవాడు. భగవంతుడి నామమే ఓంకారం కాబట్టి, మనువు ఓంకారాన్ని ఉపాసించాడు అనడం ఒక కోణంలో కరెక్టే. ఒప్పుకుంటాము. 

3. ఓం, అల్లా ఒకరే

దీనికి మా జవాబు: ఓంకారోపాసన నేటికీ 12,000 ఏళ్ళనుంచీ భారతదేశంలో ఉంది. అల్లా, 600 CE ప్రాంతంలో మహమ్మద్ చేత సృష్టించబడ్డాడు. రెండూ ఒకటే ఎలా అవుతాయి?

ఒకవేళ రెండూ ఒకటే అయితే, అల్లా అని కొత్త పేరు ఎందుకు? ఎప్పటినుంచో ఉన్న ఓంకారాన్ని మీరు కూడా పూజించాలి కదా?

4. మనువు అల్లాని పూజించాడు.

దీనికి మా జవాబు: అల్లా కంటే 11,000 ఏళ్ల క్రితం వాడైన మనువు అల్లాని ఎలా పూజిస్తాడు? అల్లా అనే పేరే మనువుకు తెలియదు. ఆ పదాన్ని ఆయన ఎక్కడా వాడలేదు.

5. హజరత్ ఆదాం ఇండియాలో ఉద్భవించాడు కాబట్టి, ఇస్లాం ఇండియాలోనే పుట్టింది.

దీనికి మా జవాబు: బట్టలు కట్టుకోవడం కూడా రాని ఆడం, హజరత్ ఎలా అయ్యాడు? ఆడం ఇండియాలో పుడితే, ప్రాచీన హిందూమత గ్రంధాలలో ఆ పేరు ఎందుకు లేదు?

6. ఇండియానే ముస్లిముల మాతృభూమి.

దీనికి మా జవాబు: ఇస్లాం అనేది అరేబియాలో పుట్టింది. ఇస్లాంకు ఇండియా ఎలా మాతృభూమి అవుతుంది?

ఇండియా, ఇస్లాం పుట్టిన దేశమే అయితే, పాకిస్తాన్ ఎందుకు సృష్టించబడింది? పాకిస్తాన్ కావాలని ఓటేసి దేశాన్ని చీల్చిన మీరు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్లిపోలేదు? ఇంకా ఇక్కడే ఎందుకున్నారు?

7. ఇస్లాం అన్ని మతాల కంటే గొప్పది

దీనికి మా జవాబు: అన్నిమతాలనూ ఆదరించే హిందూమతం గొప్పదౌతుంది గాని, ఇతర మతాలన్నింటినీ ద్వేషించే ఇస్లాం ఎలా గొప్పదౌతుంది?

___________________

మదానీ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలే. ఇలాంటి అబద్దాలను ఎడాపెడా చెబుతూ తెలివిలేనివాళ్ళను ఇవే నిజాలంటూ నమ్మిస్తున్నారు మదానీ లాంటి వాళ్ళు.

ఈ అబద్దాలను ఖండిస్తూ, జైనాచార్యుడైన డా||లోకేష్ ముని ఆ సమావేశాన్ని బహిష్కరించి వేదిక దిగి వెళ్ళిపోయాడు. ఆయనతో బాటు కొంతమంది హిందూమత ఆచార్యులు కూడా వెళ్లిపోయారు.

మౌలానా అర్షద్ మదానీ చెప్పిన ఈ అబద్దాలను లాజికల్ గా ఖండిస్తూ, 'పంచవటి' నుండి మేము విడుదల చేసిన వీడియోను ఇక్కడ చూడండి.