“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, మార్చి 2016, మంగళవారం

Chamakte Chand Ko - Ghulam Ali


చమక్తే చాంద్ కో టూటా హువా తారా బనా డాలా...

గులాం అలీ మధురాతి మధురంగా ఆలపించిన ఘజల్ ఇది.ఘజల్స్ పాడటంలో గులాం అలీకి ఒక ప్రత్యేకత ఉన్నది.ఈయన స్వరంలో సున్నితమైన స్వరాలు చాలా సహజంగా పలుకుతాయి.అసలు, ఘజల్స్ ఆలపించాలంటేనే భావుకత ఉండాలి.ఆ పాటలో మనం లీనమై పాడాలి. అప్పుడే సున్నితమైన ఆ భావాలను మన స్వరంలో పలికించగలుగుతాం.

అనేక మంది ఘజల్ గాయకులలో ఎవరి ప్రత్యేకత వారిదే.ఎవరి స్వరంలో మాధుర్యం వారిదే.ఈ ఘజల్ "ఆవార్గీ" అనే సినిమాలో వాడబడింది.ఆ సినిమాలో ఈ పాట టైటిల్ సాంగ్ గా వస్తుంది.అందులో అనిల్ కపూర్ నటించాడు.ఘజల్స్ అన్నీ ఆధ్యాత్మిక అర్ధాన్ని ఇచ్చే గీతాలే.కాకపోతే సినిమాలలో వాటిని ఆయా సన్నివేశాలకు అనుగుణంగా వాడుకుంటారు. 

'నస్రత్ ఫతే ఆలీఖాన్' పాడిన "దం మస్త్ కలందర్ మస్త్ మస్త్" అనే సూఫీ ఖవ్వాలీని "తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్" అంటూ ఒక క్లబ్ డాన్స్ గా వాడారు.అలా ఉంటాయి.పోనీలే ఏదో ఒక విధంగా ఘజల్స్ కూ ఖవాలీలకూ మర్చిపోకుండా జీవం పోస్తున్నారు అనుకోవాలి.

ఈ సినిమాలో ఈపాటనొక నిరాశాగీతంగా వాడారు.కానీ దీని అసలు అర్ధం అది కాదు.

ప్రతి మనిషి జీవితంలోనూ ఒక చీకటి దశ వస్తుంది.కొన్నాళ్ళకు ఆ చీకటి పోయి వెలుగు వస్తుంది.కానీ దైవాన్ని చేరాలని తపించే ఒక జీవి హృదయంలో మాత్రం, తన గమ్యం దొరికేవరకూ చీకటే ఉంటుంది.అతని జీవితమంతా ఎక్కువభావం ఒక విధమైన అంతరిక తపనతోనే,వేదనతోనే గడుస్తుంది.ఆ తపనే ఈ గీతంలో ప్రతిఫలిస్తుంది.

ఈ గీతం యొక్క అర్ధం చాలా సున్నితమైనదే కాక చాలా లోతైనది కూడా.

నేను నీలో ఉన్నపుడు పున్నమి జాబిలిగా ఉన్నాను.నిన్ను వదలి ఈ సృష్టిలోకి వచ్చిన క్షణమే నేనొక తెగిన నక్షత్రాన్నయ్యాను.నక్షత్రం తిరిగి జాబిలిగా మారాలని తపిస్తోంది.కానీ దారి దొరకడం లేదు.ఏమిటి నీ వింత ఆట?

ఈ నగరం (సృష్టి) చాలా సుందరమైనది అని ఎందఱో కవులు వ్రాశారు.కానీ ఆ సౌందర్యం ఎక్కడుంది? ఈ లోకానికి జాలి లేదు.ఉంటే నన్నిలా ఎందుకు వదిలేస్తుంది? ఈ నగరంలో నేనొక ద్రిమ్మరినయ్యాను. జనన మరణాలనే ఈ విశ్వనగరపు వీధులలో నేను వృధాగా తిరుగుతున్నాను.నా అసలైన ఇల్లు ఎక్కడుంది?

ఇక్కడ ఉందామనీ ఇక్కడే ఒక ఇల్లును శాశ్వతంగా నిర్మించుకుందామనీ నా ఊహ.కానీ ఎన్నో జన్మలుగా ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. ప్రతి ఇంటినీ కొన్నాళ్ళ తర్వాత ఖాళీ చేస్తున్నాను గాని ఎందులోనూ స్థిరంగా ఉండలేక పోతున్నాను. ఏమిటీ వింత? అసలు నువ్వీ నగరాన్ని ఎలా నిర్మించావు? ఎందుకు నిర్మించావు? ఈ ఆట యొక్క పరమార్ధం ఏమిటి?

అంతా మా గొప్పదనమే అని మేము అనుకుంటున్నాం.కానీ ఇక్కడ మా గొప్ప ఏమీ లేదు.అంతా నీ ఇచ్చానుసారమే ఇక్కడ నడుస్తున్నది.కావాలని నువ్వే కొందరిని ఎంతో మనోహరమైన మనుషులుగా సృష్టించావు.వారి మనస్సులలో గులాబీ సుగంధాలను నింపావు.ఇంకొందరి గుండెలలో నిప్పుల కుంపట్లను ఉంచావు.నీ ఇచ్చకు మేము ఎదురుచెప్పగలమా? చెప్పి బ్రతకగలమా?

నువ్వు ఓడిపొమ్మని శాసిస్తే ఓడిపోక నేనేం చెయ్యగలను? నేను లేవడమూ పడటమూ అంతా నీ ఇచ్చానుసారమే జరుగుతున్నది.ఇంకేమేం చేస్తావో చెయ్యి.నన్ను ఎలా మలుస్తావో, నా జీవితాన్ని ఇంకెన్ని మలుపులు తిప్పుతావో తిప్పు.

నీ నగరం (సృష్టి) లోకి వచ్చాను.నీ చేతిలో ఉన్నాను.నీ నియమాలను పాటించక తప్పదు.నాకు స్వతంత్రం ఎక్కడుంది?నీ ఇష్టప్రకారమే నన్ను నడిపిస్తున్నావు.అలాగే కానియ్యి.కాదని నేను చెయ్యగలిగింది మాత్రం ఏముంది?

Movie:--Avargi (1990)
Lyrics:--Anand Bakshi
Music:--Anu Malik
Singer:--Ghulam Ali
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------
hu huuuum aaaa aaa-2
chamakte chand ko....
chamakte chand ko tuta hua tara bana dala X2
meri aawargi ne
- mujhko aawara - bana dala
chamakte chand ko tuta hua tara bana dala
huuun huuuum aaaa aaa..

bada dilkash bada rangeen hai yeh - shehar kehte hain X2
yahan par hain - hazaron ghar - gharon mein log rehte hain
mujhe is shehar ne
gali...yon ka banjara bana dala
chamakte chand ko tuta hua tara bana dala

main is duniya ko yaksar dekh kar hai- raan hota hun X2
na mujhse ban - sakaa chhota saghar,din raat rota hun
khudaya
a tune kaise - ye jahan sara - bana dala
chamakte chand ko tuta hua tara bana dala

mere malik, mera dil kyun tadapta hai - sulagta hai X2
teri marzi , teri marzi pe kiska - zor chalta hai
kisi ko gul, kisi k
O.. tune angara bana dala
chamakte chand ko tuta hua tara bana dala
umm umm aaaaa aaa,aaa

yehi aagaaz tha mera, yehi anjaam hona tha X2
mujhe barbaad hona tha, mujhe nakaam hona tha
mujhe taqdeer ne taq
q..deer ka - mara bana dala
chamakte chand ko tuta hua tara bana dala


chamakte chand ko tuta hua tara bana dala
meri aawargi ne - mujhko aawara - bana dala
chamakte chand ko tuta hua tara bana dala


ooo.oooo.aaaa.aaaa...

Meaning:--

The effulgent Moon has turned
into a broken star
My carelessness has made me
an aimless vagabond

It is said that this city is very lively and colorful
People live in its thousands of homes
But this city has made me
a wandering vagabond in its streets

I am amazed when I look at this world
Inspite of my crying day and night
I could not make a small home in it
O Lord ! How could you create such a vast universe?

O my Lord, why my heart falters
and suffers agony always?
Which force can overrule your will?
By your will,some become roses and
some become burning embers

Here is my beginning and here is my end
I was destined to fail and
I was destined to be ruined
It was my fate to be defeated by Fate

The effulgent Moon has turned
into a broken star
My carelessness has made me
an aimless vagabond

But everything happens
according to your sweet will.
Even my will is nothing
but your will in disguise.

తెలుగు స్వేచ్చానువాదం

వెలుగులు చిమ్ముతున్న జాబిలి
పగిలిన నక్షత్రంగా మారింది
నా నిర్లక్ష్యం నన్ను
ఒక గమ్యం లేనివాడిగా మార్చింది

ఈ నగరం చాలా మనోహరమనీ
అందమైనదనీ అందరూ అంటారు
కానీ ఇదే నగరం
తన వీధులలో తిరిగే ఏకాకిగా
నన్ను మార్చింది

ఈ లోకాన్ని చూచి నేను ఎంతో
ఆశ్చర్యానికి గురౌతూ ఉంటాను
ఎంత శ్రమించినా నేనొక చిన్న ఇంటిని
నిర్మించుకోలేకున్నాను
ఓ ప్రభూ! నువ్వీ విశాల ప్రపంచాన్ని ఎలా నిర్మించావు?

ఓ దైవమా !
ఎందుకు నా హృదయం తడబడుతోంది?
ఎందుకు అది విషాదానికి లోనౌతోంది?
నీ శక్తికి ఎదురు చెప్పేవారు ఎవరున్నారు?
నీ ఇచ్చ వల్ల నువ్వే కొందరిని గులాబీలుగా చేశావు
మరికొందరిని మండుతున్ననిప్పులుగా మార్చావు

నా ప్రారంభమూ ఇక్కడే నా అంతమూ ఇక్కడే
నా తలవ్రాత వల్లే నేను ఓడిపోయాను
దిగజారిపోయాను
విధిచేతిలో నేను ఓడిపోయాను

వెలుగులు చిమ్ముతున్న జాబిలి
పగిలిన నక్షత్రంగా మారింది
నా నిర్లక్ష్యం నన్ను
ఒక గమ్యం లేనివాడిగా మార్చింది...