“అసమర్ధుని వద్ద ధనము, సుఖము, కీర్తి, ధర్మము ఏవీ నిలచి ఉండవు"

11, డిసెంబర్ 2016, ఆదివారం

Aaja Sanam Madhur Chandni Me Ham - Latha,Mannadey


Aaja Sanam Madhur Chandni Me Ham...


అంటూ లతా, మన్నాడేలు మధురంగా ఆలపించిన ఈ గీతం 1956 లో వచ్చిన Chori Chori అనే సినిమాలోది.పాత తరం గాయకులలో మన్నాడే స్వరం అంటే నాకు చాలా ఇష్టం.ఈయన స్వరం చాలా విలక్షణంగా ఉంటుంది.ఎలాంటి పాటైనా ఈయన స్వరంలో అలవోకగా ఒదిగిపోతుంది.మాధుర్యం చెడకుండా చాలా పై స్థాయిలో అవలీలగా పాడగల అతి కొద్దిమంది గాయకులలో మన్నాడే ఒకరు.ఈ పాటలో రాజ్ కపూర్, నర్గీస్ నటించారు.


నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.


Movie:--Chori Chori (1956)
Lyrics:--Hasrat Jaipuri
Music:--Shankar Jaikishan
Singers:--Latha Mangeshkar, Manna Dey
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
------------------------------------
Aja sanam madhur chandni me hum
tum mile tho virane me Biya jayegi bahar
Jhoomne lagega aasmaa -2

Kehta hai dil aur machalta hai dil
More sajan le chal mujhe taron ke paas
Lagtaa nahi hai dil yahaa-2

Bheegi bheegi raat me – Dil ka daman thaam le
Khoyee khoyee zindgee – Har dam tera naam le
[Chaand ki behki nazar - Keh rahi hai pyar kar
Zindgi hai ek safar – Kaun jane kal kidhar]-2

Dil ye chahe aaj tho – Baadal ban ud jaavu main
Dulhan jaisa aasmaa – Dharti par le aavu main
[Chand ka dola saje – Dhoom taron me mache
Jhoom ke duniya kahe – Pyar me do dil mile]-2

Aja sanam madhur chandni me hum
tum mile tho virane me biya jayegi bahar
Jhoomne lagega aasmaa -2

Kehta hai dil aur machalta hai dil
More sajan le chal mujhe taron ke paas
Lagtaa nahi hai dil yahaa-2

Meaning

Come darling, If we meet in this moonlight
Then spring will descend into this desert
Even the sky will reel under intoxication

My heart is very restless, it says
Oh my darling, take me into the stars
My heart dislikes this world

In this rainy night, hold your heart tight
The whole world is under love's intoxication
My every breath resounds with your name
The naughty moon rays are saying
Fall in love
The world is but a journey
Who knows if tomorrow exists or not?

If my heart wishes, I would become a cloud and rise high
I will make the sky a bride and bring it down onto Earth
The Moon would shine bright, the stars will sparkle with joy
Reeling under intoxication the world says 
'Look, two hearts meet in love'

Come darling, If we meet in this moonlight
Then spring will descend into this desert
Even the sky will reel under intoxication

My heart is very restless, it says
Oh my darling, take me into the stars
My heart dislikes this world

తెలుగు స్వేచ్చానువాదం

రా ప్రియతమా ! ఈ వెన్నెలలో మనం కలుసుకుంటే
ఎడారిలో కూడా వసంతం వెల్లివిరుస్తుంది
ఆకాశం కూడా మత్తుతో జోగుతుంది

నా హృదయం చాలా కల్లోలంగా ఉంది
అది చెబుతోంది - ఓ ప్రియా నన్ను తారాలోకానికి తీసుకెళ్ళు
ఈ ప్రపంచం నాకు ఇష్టంగా తోచడం లేదు

ఈ వర్షపు రాత్రిలో, నీ హృదయాన్ని చిక్కబట్టుకో
లోకం అంతా ప్రేమ మైకంలో జోగుతోంది
నా ప్రతి శ్వాసా నీ పేరే జపిస్తోంది
చల్లని వెన్నెల ఇలా అంటోంది - 'ఇక ప్రేమలో మునగండి'
ఈ లోకం ఒక దారి తెలియని ప్రయాణం  
రేపనేది ఉందో లేదో ఇక్కడ ఎవరికి తెలుసు?

నాకనిపిస్తే, నేనొక మేఘాన్నై సుదూర గగనంలో తేలిపోతాను
ఆకాశాన్నే ఒక వధువుగా మార్చి క్రిందకు తెస్తాను
జాబిలి వెలుగుతో ప్రకాశిస్తుంది, తారలు మిలమిలా మెరుస్తాయి
ప్రేమ మైకంలో మునిగి లోకం ఇలా అంటుంది
'చూడండి! రెండు హృదయాలు ప్రేమలో ఏకమయ్యాయి'


రా ప్రియతమా ! ఈ వెన్నెలలో మనం కలుసుకుంటే
ఎడారిలో కూడా వసంతం వెల్లివిరుస్తుంది
ఆకాశం కూడా మత్తుతో జోగుతుంది

నా హృదయం చాలా కల్లోలంగా ఉంది
అది చెబుతోంది - ఓ ప్రియా నన్ను తారాలోకానికి తీసుకెళ్ళు
ఈ ప్రపంచం నాకు ఇష్టంగా తోచడం లేదు...