అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

16, జనవరి 2026, శుక్రవారం

సోమనాథ్ ఆలయ కథ - ఇస్లామిక్ నాటో

గుజరాత్ రాష్ట్రంలో అరేబియాసముద్రతీరంలో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం - సోమనాధ్ ఆలయం. 'సౌరాష్ట్రే సోమనాథం చ..' అంటూ మొదలౌతుంది మన జ్యోతిర్లింగ స్తోత్రం. పాతకాలంలో గుజరాత్ ను 'సౌరాష్ట్ర' అనేవారు.

1026 CE లో మహమ్మద్ ఘజనీ చేసిన దండయాత్రలో ఈ ఆలయం తీవ్రంగా ధ్వంసమైపోయింది. దానిని దండయాత్ర అనడం కంటే, దోపిడీ అంటే సరిపోతుంది. ఇది జరిగి నేటికి సరిగ్గా వెయ్యేళ్ళు నిండాయి. యాభైవేలమంది తురకసైనికులతో ఈ ఆలయాన్ని ముట్టడించి దానిని మూడురోజులపాటు తీరికగా ధ్వంసం చేసి, దోచుకున్నాడు గజనీ.

వందలాదిమంది హిందూవీరులు దానిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి, ఆ యుద్ధంలో చనిపోయారు. నిరాయుధులైన వందలాదిమంది బ్రాహ్మణపండితులను ఆ ఆలయపరిసరాలలో నరికేసింది గజనీ సైన్యం. స్త్రీలపైన చేసిన అరాచకాలకు లెక్కే లేదు.

సోమనాధ్ జ్యోతిర్లింగాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి, తన దేశంలోని మసీదుల మెట్లలో తాపడం చేయడానికి తీసుకుపోయాడు ఘజనీ. రోజూ మసీదులకు వెళ్లే తురకలు వాటిని తొక్కుతూ మసీదులోపలకు పోవాలన్నది ఆ ప్లాను. ఇప్పటికీ ఆ మసీదులు అలాగే ఉన్నాయి. జ్యోతిర్లింగపు ముక్కలు ఆ మెట్లలోనే ఉన్నాయి. ఈనాటికీ వాటిని వేలాదిమంది తొక్కుతూనే ఉన్నారు.

అంతకుముందు 16 సార్లు చేసిన దోపిడీ దండయాత్రలలో ఒకసారి, కురుక్షేత్రం దగ్గరలోని థానేసర్ లో ఉన్న నిలువెత్తు విష్ణుభగవానుని విగ్రహాన్ని పెకలించి అదేవిధంగా ఆఫ్గనిస్తాన్ కు తీసుకుపోయాడు ఘజనీ. దానిని కూడా ముక్కలు చేసి, ఆ ముక్కలను రోడ్లనిర్మాణంలో, మసీదుమెట్ల నిర్మాణంలో వాడేశారు.

మరొక దండయాత్రలో మధురానగరాన్ని అందులోని వందలాది కృష్ణుని దేవాలయాలను ధ్వంసం చేశాడు గజనీ. మళ్ళీ ఆ సంపదను కూడా ఆఫ్గనిస్తాన్ కు తరలించాడు.

ఆఫ్గనిస్తాన్ కు దరిద్రం పట్టడానికి, నేటికీ కూడా నిత్యయుద్ధాలతో అగ్నిహోత్రంలాగా మండుతూ, ఏ విధమైన ఎదుగుదలా లేకుండా, అందరినీ అడుక్కుంటున్న దేశంగా ఉండిపోవడానికి ఇవే ముఖ్యమైన కారణాలు.

1026 CE లో చేసిన దండయాత్రలో, సోమనాథ్ ఆలయఖజానాలో ఉన్న బంగారాన్ని, కోటిపైగా బంగారునాణేలను, వజ్రాలను, లోహవిగ్రహాలను, యాభైఏనుగులు మరియు వందలాది గుఱ్ఱాలపైన తరలించుకుని ఆఫ్గనిస్తాన్ కు తీసుకుపోయాడు ఘజనీ.

అయితే, తిరుగుప్రయాణంలో, వచ్చినదారిలో వెళ్లకుండా, రాన్ ఆఫ్ కచ్, మరియు థార్ ఎడారుల ద్వారా దారిని ఎంచుకోవడం గజనీ చేసిన ఘోరమైన తప్పై కూచుంది. తిరుగుప్రయాణం వారికి నరకాన్ని చూపించింది.

తీవ్రమైన ఎడారిఎండలో వారాలతరబడి ప్రయాణాన్ని తట్టుకోలేక, త్రాగడానికి నీళ్లు లేక, దాదాపు 30 వేలమంది సైనికులు దారిలోనే చనిపోయారు. సగంకంటే తక్కువమంది సైనికులతో తన రాజ్యానికి చేరుకున్నాడు ఘజనీ. అప్పటినుంచీ ఏదో అంతుబట్టని రోగం అతన్ని వెంటాడింది. కొంతమంది చరిత్రకారులు అది మలేరియా అన్నారు, ఇంకొంతమంది టీబీగా తేల్చారు. కొందరు ఎడారిజ్వరం అన్నారు. కొందరు మాత్రం 'రుద్రుని కోపం' అన్నారు. ఏదేమైనప్పటికీ, నాలుగేళ్లు తిరక్కుండానే, 1030 CE లో అతను చనిపోయాడు. అతని వంశం అధికారకుమ్ములాటలతో అంతమైపోయింది.

వెయ్యేళ్ళు గడిచాయి.

మనకు స్వతంత్రం వచ్చిన తరువాత సోమనాథ్ ఆలయాన్ని మళ్ళీ నిర్మించుకున్నాం. అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్, హోమ్ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈ పనికి అండగా నిలబడి ఆలయాన్ని పూర్తి చేయించారు. వారి ప్రయత్నాలను హిందూధర్మవ్యతిరేకి  అయిన ప్రధానినెహ్రూ  వ్యతిరేకించాడు. కానీ వీళ్ళు వినలేదు. ఆలయం మళ్ళీ నిర్మించబడింది.

నేడు మోడీగారి ప్రభుత్వపు చొరవతో, సోమనాథ్ ఆలయం మళ్ళీ అప్పటి కళాకాంతులతో వెలుగుతూ భవ్యమైన మందిరంగా నిలబడింది. శివలింగానికి నమకచమకాలతో రుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. వేదఘోష ఆలయంలో ప్రతిధ్వనిస్తోంది.

ఘజనీలాంటి పిచ్చికుక్కలు మాత్రం చరిత్రపుటలలో కలసిపోయారు. అమాయకులను చంపి, అద్భుతమైన ఒక సంస్కృతిని నాశనం చేశాననుకుంటూ, దోచుకున్న డబ్బుతో ఒక వెలుగు వెలిగిన ఆఫ్గనిస్తాన్ నేడు అడుక్కుతినే దేశమైపోయింది. భారతదేశమేమో అగ్రరాజ్యంగా అవతరించడానికి శరవేగంతో ముందుకు దూసుకుపోతోంది.

కానీ, వెయ్యేళ్ళు గడిచినా రాక్షసులు అంతం కాలేదు. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఇరాన్, టర్కీ, ఖతార్ మొదలైన  రూపాలలో ఇంకా ఉన్నారు. మనదేశానికి ఎసరు పెట్టాలని చూస్తూనే ఉన్నారు.  నిన్నగాక మొన్న జరిగిన సౌదీ, పాకిస్తాన్, టర్కీల డిఫెన్స్ ఒప్పందమే దీనికి తార్కాణం.  'ఇస్లామిక్ నాటో' గా రూపొంది భారతదేశాన్ని ఓడించి, ఆసియాను శాసించాలనేది వీరి వ్యూహం. దీనికి రూపకర్త, విశ్వాసం లేని కుక్క పాకిస్తాన్. దానికి అండ చైనా వంటి ఇతరదేశాలు.

గజనీ వీళ్ళరూపంలో మాత్రమే లేడు. ఇండియాలోనే ఉంటూ శత్రుదేశాలకు వంతపాడే కొంతమంది నాయకుల, ప్రజల రూపాలలో కూడా ఉన్నాడు. వీరందరి బారినుండి, భారతదేశాన్ని రక్షించడానికి బీజేపీ, ఆరెస్సెస్ లున్నాయి గనుక ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. మనం సురక్షితంగా ఉన్నాం. అదే, దేశపుపగ్గాలు వేరేపార్టీల చేతులలో ఉంటే మన దేశపరిస్థితి ఇంకెలా ఉండేదో ఊహిస్తే భయమేస్తుంది.

ఈనాటికీ మన దేవాలయాలలో దూరి నమాజ్ చెయ్యాలని ప్రయత్నించేవారు, అక్కడే మూత్రవిసర్జన చేసేవారు, విగ్రహాలను అవమానించేవారు చాలామంది ప్రతిరోజూ న్యూసులో కనిపిస్తున్నారు. వీళ్ళంతా  'మానసిక స్థిమితం లేనివాళ్లు' అనే మెడికల్ సర్టిఫికెట్ వెనుక దాక్కుని తప్పుకుంటున్నారు. బుద్ధిలేని కొన్నిరాష్ట్రాలు దీనిని చూసీచూడనట్లు పోతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు దీనిని బాహాటంగా సపోర్ట్ చేస్తున్నాయి. ఇది లాంగ్ రన్ లో మొత్తం దేశానికే చేటౌతుందన్న విషయం చాలామందికి అర్థం కావడం లేదు.

'మెత్తగా ఉంటే మొత్తబుద్ది' అని సామెతుంది. అతిమంచితనం అసలుకే మోసం అవుతుంది.

హిందూమతాన్ని, హిందూదేవతలను, హిందూదేశాన్ని, ఎవరు అవమానించినా వాళ్లకు 'షరియా' ప్రకారం తక్షణశిక్షలు పడాలి. మతిస్థిమితం లేనివాళ్లయితే, మతి వచ్చేవరకూ, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వం ఆ పనిని చేయకపోతే ప్రజలే చేయాలి. అటువంటి చైతన్యం ప్రజలలో వచ్చిననాడే మనదేశానికి రక్ష.

'హిందువులు ఒకళ్ళ జోలికి అనవసరంగా పోరు' అనేది అందరికీ తెలుసు. అదే మనకు శాపమైంది. 'వాళ్ల జోలికి పోతే ఊరుకోరు' అనే విషయం కూడా అందరికీ అర్ధం కావాలి.

సోమనాథ్ ఆలయాన్ని మనం తిరిగి నిర్మించుకున్నాం. అదేవిధంగా, గజనీకూడా మళ్ళీ బ్రతికి లేస్తున్నాడు. ఈ యుద్ధం అంత తేలికగా ముగిసేటట్లు కనిపించడం లేదు. అలా ముగియాలంటే, భారతీయులలో హిందూచైతన్యం రావాలి. 

లేకపోతే మాత్రం, ఇస్లామిక్ నాటో రూపంలో మళ్ళీ  ప్రాణం పోసుకుంటున్న ఘజనీ దాడులకు మనదేశం గురికాక తప్పేటట్లు లేదు.

ఈసారి యుద్ధంలో గజనీ గెలుస్తాడా? మనం గెలుస్తామా? చూడాలి.

read more " సోమనాథ్ ఆలయ కథ - ఇస్లామిక్ నాటో "

PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా?

మొన్న 12 వ తేదీన ప్రయోగించిన PSLV - C 62 రాకెట్ విఫలమైంది. 

టెక్నికల్ కారణాలు ఏవైనా ఉండవచ్చు గాక ! జ్యోతిష్య కారణాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. 

ఆ రోజున ఉదయం 10. 12 కి గ్రహస్థితిని నేను పరిశీలించాను. ఇంతకంటే పనికిరాని ముహూర్తం ఇంకెక్కడా ఉండదు. ఇది విఫలం కావడానికి పెట్టిన ముహూర్తంలాగా ఉంది గాని, సక్సెస్ కు పెట్టిన ముహూర్తంలాగా లేదు.

జ్యోతిష్యశాస్త్రాన్ని వారు లెక్కిస్తారో లేదో నాకు తెలియదు. కానీ, జరిగిన నష్టంతో పోల్చుకుంటే, నమ్మకం అంత ముఖ్యం కాదన్న చిన్నవిషయం వాళ్ళ లాజిక్ కు తట్టి ఉండాలి.

లేదా, సోకాల్డ్ సెలబ్రిటీ జ్యోతిష్కుల మాయలోనన్నా వాళ్ళు పడి ఉండాలి. అది అసాధ్యమేమీ కాదు.

లేదా, వివేకానందుని పుట్టినరోజు కాబట్టి మంచిరోజని భావించారా? 1863 లో వివేకానందస్వామి పుట్టినపుడు జనవరి 12 న ఉన్న గ్రహస్థితులు వేరు. 2026 లో అలా ఉండవు. ఉత్త తేదీలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఇబ్బందులు ఇవే మరి !

పైగా, లౌకికంగా చూస్తే, వివేకానందస్వామిది అంత అదృష్టజాతకమేమీ కాదు. ఆ విధంగా చూచినా, ఆ తేదీని రాకెట్ ప్రయోగానికి ఎంచుకోకూడదు.   

అయినా, PSLV రాకెట్ల ప్రయోగంలో అంత అనుభవం ఉన్న ఇస్రో, మూడవదశ ఇగ్నిషన్ లో ఎలా విఫలమౌతుంది? అన్నది అసలైన ప్రశ్న. ఇది ప్రయోగాత్మకదశ కాదుగా ! రాకెట్ టెక్నాలజీని ఇప్పుడు క్రొత్తగా ఇస్రో నేర్చుకోవడం లేదుగా ! PSLV ప్రయోగం ఇస్రోకు క్రొత్త కాదు కూడా !

తప్పులనుంచి నేర్చుకోవడం మంచిదే. కానీ నిర్లక్ష్యంవల్ల ఆ తప్పులు మాటిమాటికీ జరుగకూడదు. ప్రజాధనం విలువలేనిది కాదుగా !

నమ్మకమా? నష్టమా? అనిన ప్రశ్న వచ్చినపుడు, ఒక చిన్న నమ్మకాన్ని పాటించి నష్టాన్ని తప్పుకోవడం తెలివైనవారి లక్షణం కాదా?

read more " PSLV - C 62 విఫలం కావడానికి ముహూర్తం కారణమా? "

2, జనవరి 2026, శుక్రవారం

36 వ 'విజయవాడ పుస్తక మహోత్సవం' మొదలైంది

 


Stall Number : 186  

Dates : 2-1-2026 to 12-1-2026

Timings : 2 Pm - 9 Pm

Venue : Indira Gandhi Municipal Corporation Stadium, Vijayawada.

read more " 36 వ 'విజయవాడ పుస్తక మహోత్సవం' మొదలైంది "

31, డిసెంబర్ 2025, బుధవారం

విజయవాడ పుస్తక మహోత్సవం - 2026 లో పంచవటి స్టాల్


జనవరి 2 నుండి విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో పదిరోజులపాటు జరిగే  'విజయవాడ పుస్తక మహోత్సవం' రెండురోజులలో మొదలు కాబోతున్నది.

దీనిలో పంచవటికి 186 స్టాల్ నంబర్ కేటాయించబడింది. యధావిధిగా మా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హైద్రాబాద్ బుక్ ఫెయిర్ లో మా స్టాల్ వందలాదిమందికి జ్ఞానదాహార్తిని తీర్చింది. మేము అనుకున్నదానికంటే ఎక్కువగా ప్రజాదరణను పొందింది. ఎంతోమంది సందర్శకులు మావాళ్లు చెప్పినది శ్రద్దగా విని, మా దారిని అర్ధం చేసుకోగలుగుతున్నారు. 

సందేహసుందరాలు, విజ్ఞానప్రదర్శకులు, యూట్యూబ్ యూనివర్సిటీ పట్టభద్రులు, పాత అభిమానులు, అహంకారపూరిత వాదనాపరులు, ఈ విధంగా ఎన్నిరకాల మనుషులు మా స్టాల్ ను సందర్శించినప్పటికీ, నిజమైన జిజ్ఞాసువులు, ఆలోచనాపరులు, సాత్త్వికులు కూడా వారిలో చాలామంది ఉన్నారు. వారిదే అసలైన ప్రయోజనం.

హైద్రాబాద్ రంగస్థలాన్ని వదలి,  ఇప్పుడు విజయవాడ ప్రాంతప్రజలకు అసలైన ఆధ్యాత్మికవెలుగులను చూపించడానికి 'పంచవటి' వస్తున్నది. మీకు జిజ్ఞాస ఉంటే, ఇక్కడకూడా మా సంస్థ ముఖ్యసభ్యులను మీరు కలుసుకోవచ్చు. మీమీ సందేహాలను తీర్చుకోవచ్చు.

ఈ లోపల మూడు క్రొత్తపుస్తకాలు ప్రింట్ చేయబడుతున్నాయి. విజయవాడ స్టాల్లో లభిస్తాయి.  అవి, 

1. శ్రీ గోరక్ష వచనసంగ్రహము 

2. ధ్యానబిందూపనిషత్తు 

3. నాదబిందూపనిషత్తు.

నా రచనలను, భావజాలమును, సాధనామార్గమును అభిమానించే జిజ్ఞాసువులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.

read more " విజయవాడ పుస్తక మహోత్సవం - 2026 లో పంచవటి స్టాల్ "

26, డిసెంబర్ 2025, శుక్రవారం

బాంగ్లాదేశ్ సంక్షోభం - జ్యోతిషశాస్త్రం ఏమంటున్నది?

గతంలో యురేనస్ చారం గురించి వ్రాస్తూ, రాబోయే మూడేళ్లు భారత ఉపఖండానికి అతి గడ్డుకాలమని, సంక్షోభాలు, కుట్రలు, విప్లవాలు, యుద్ధవాతావరణం ఉంటాయని వ్రాశాను. పరిస్థితులు ఏ విధంగా నానాటికీ మారుతున్నాయో గమనిస్తే నేను వ్రాసినది జరుగుతున్నదా లేదా అర్ధమౌతుంది.

బాంగ్లాదేశ్ లో సంక్షోభాన్ని సృష్టించి, ఇస్లామిక్ తీవ్రవాదరాజ్యాన్ని స్థాపించి, ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు బాంగ్లాదేశ్ కలసి ఇండియాను చక్రబంధంలో ఇరికించి దాడిచేయాలని ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి.

సౌదీ అరేబియాతో పాకిస్తాన్ దోస్తీ, ఆసిమ్ మునీర్ ను సర్వసైన్యాధిపతిని చేయడం, కోర్టుపరిధినుండి అతడిని జీవితకాలంపాటు తప్పించడం ఇవన్నీ ఈ ప్లాన్ లోనే భాగాలు. పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ను, బాంగ్లాదేశ్ లో హసీనాను దిక్కులేనివాళ్లుగా చేయడం కూడా ఈ కుట్రలో భాగమే. వీరిద్దరూ ఇండియా చెప్పినట్లు వినేవాళ్ళు. అందుకే వీరిద్దరినీ తప్పించారు. ఇమ్రాన్ ఖాన్ దొరికిపోయి జైలుపాలయ్యాడు. హసీనా పారిపోయి ఇండియాకు వచ్చి తలదాచుకున్నది.

పాకిస్తాన్ కేంద్రంగా, ఇండియాపై దాడిచేసే కుట్ర వేగంగా రూపుదిద్దుకుంటున్నది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఇప్పుడు మరొక భారతద్వేషి తారిక్ రహమాన్ రంగప్రవేశం చేశాడు. ఇతను గత 17 ఏళ్లుగా ఎక్కడెక్కడో ఉండి ఇప్పుడు ఎన్నికల ముందు దేశానికి తిరిగి వచ్చాడు. ఎందుకిదంతా అనేది చిన్నపిల్లలకి కూడా అర్థమౌతుంది.

ఈ నేపథ్యంలో బాంగ్లాదేశ్ జాతకచక్రం ఏమంటున్నదో చూద్దాం.

దీనికి 16-12-1971 న స్వతంత్రం వచ్చింది. సమయం సాయంత్రం 5 గంటలు. ఆ సమయానికి ఢాకాలో వేసిన జాతకచక్రం ఇలా ఉంటుంది.

శనిచంద్రులు నీచస్థితిలో ఉన్నారు. ధనుస్సు మరియు మిధునరాశులు తీవ్రమైన ఆర్గళానికి గురయ్యాయి. సూర్యుడు సున్నాడిగ్రీలలో ఉన్నాడు.

ఈ దేశానికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏమీ ఉండదని, మిడిల్ ఈస్ట్, అమెరికాల చేతులలో కీలుబొమ్మగా మారి వాటికి తందానతాన అనే విధంగా తయారౌతుందని దీనిని బట్టి అర్ధమౌతుంది. 

ఈ దేశానికి చంద్రమహర్దశ 2023 లో మొదలైంది. అప్పుడే అక్కడ కుట్రలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం చంద్ర-రాహుదశ ఏప్రియల్ 2025 నుండి సెప్టెంబర్ 2026 వరకూ ఉన్నది. ఇది గ్రహణదశ. చంద్రుడు నీచస్థితిలో ఉన్నాడు. రాహువు శపితయోగంలో ఉన్నాడు.  దీనివల్ల ఈ దేశానికి తీవ్రమైన గ్రహణం పడుతుంది. ప్రస్తుతపరిస్థితి సరిగ్గా ఇదే. అయితే, ఇది అసలు డ్రామాకు మొదలు మాత్రమే. అసలైన కధ 2026-29 మధ్యలో ఉంటుంది.

ఆ సమయంలో గోచారయురేనస్ సరిగ్గా రోహిణీనక్షత్రం పైన సంచరిస్తాడు. భారత ఉపఖండానికి తీవ్రమైన గడ్డుకాలం అదే కాబోతున్నది.

ఆ సమయంలో బాంగ్లాదేశ్ జాతకంలో చంద్ర - గురు, చంద్ర - శనిదశలు జరుగుతాయి. ఇవి దృఢకర్మదశలు గనుక, ఆ దేశం ఇంకా తీవ్రమైన సంక్షోభంలో పడుతుంది. దానివెనుక పాకిస్తాన్ హస్తం ఉంటుంది. పాకిస్తాన్ వెనుక చైనా, టర్కీ, ఖతార్ మొదలైన దేశాలుంటాయి. ఇండియా చక్రబంధంలో ఇరుక్కుపోతుంది. వెరసి మనదేశంలో కూడా తీవ్రమైన గడ్డుపరిస్థితులు ఉంటాయి. మొత్తం భారతఉపఖండంలో యుద్ధవాతావరణం, అల్లర్లు, జననష్టం భారీస్థాయిలో ఉంటాయి. వీటి ప్రభావం షేర్ మార్కెట్లతో సహా అన్ని రంగాలపైనా పడుతుంది. ఇండియా అతలాకుతలమయ్యే ప్రమాదం గట్టిగా ఉన్నది.

తీవ్రవాదఇస్లాం చేతిలో చిక్కుకున్న దేశాలకు సర్వనాశనం తప్ప వేరేదారి అంటూ ఏదీ ఉండదు. అది బాంగ్లాదేశ్, పాకిస్థాన్ల విషయంలో మళ్ళీమళ్ళీ ఋజువౌతున్నది, ఈ దేశాలతో సరిహద్దులున్నందుకు ఈ కర్మను మనం కూడా పడవలసి వస్తున్నది.

దీనిని తప్పించడం అసాధ్యం. రాబోయే మూడేళ్లు చరిత్రలో గుర్తుంచుకోదగిన రోజులుగా మిగలబోతున్నాయి.

మీరే చూడండి ముందుముందు ఏం జరుగనున్నదో !

read more " బాంగ్లాదేశ్ సంక్షోభం - జ్యోతిషశాస్త్రం ఏమంటున్నది? "

22, డిసెంబర్ 2025, సోమవారం

బుద్ధుడంటే మీకు పడదా?

నిన్న ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.

' బుక్ ఫెయిర్ లో ఎవరో అడిగితే మీ నంబర్ ఇచ్చాము' అని శిష్యులన్నారు.

' అలా ఎందుకిచ్చారు?' అడిగాను ఏదో జరిగిపోయినట్టు బాధపడిపోతూ.

'మీతో అర్జెంట్ గా ఏదో చర్చించాలట. అందుకిచ్చాము. కాకపోయినా, మీ నంబర్ పాత పుస్తకాలలో ఉందిగా' అని మావాళ్లు జవాబిచ్చారు.

' సర్లే' అని ఆ సంగతిని అంతటితో వదిలేశాను.

సాయంత్రానికి ఎవరో ఫోన్ చేశారు.

'హలో మీరేనా ?' అన్నది ఒక గొంతు. 

' ఆ నేనే' అన్నాను.

' మీ బుక్స్ కొన్ని చదివాము ' అన్నది గొంతు సూటిగా టాపిక్ లోకి వస్తూ.

' అలాగా ' అన్నాను.

'మేముకూడా కొన్నిబుక్స్ ప్రింట్ చేయించాము. వాటిని మీకు పంపిద్దామనుకుంటున్నాము' అన్నది.

' ఎందుకు?' అడిగాను.

' చదువుతారని. క్రొత్త విషయాలు తెలుస్తాయి కదా మీక్కూడా ' అన్నది గొంతు.

' ఏ టాపిక్ మీద మీ పుస్తకాలు?' అడిగాను.

' బుద్ధుడి మీద ' అన్నది స్వరం.

' మీ దగ్గరే ఉంచుకోండి. ఉపయోగపడతాయి' అన్నాను.

బుద్ధుడి గురించి గత ఏభైఏళ్లుగా చదువుతూనే ఉన్నాను. ఆయనగురించి క్రొత్తగా తెలుసుకునేది ఏమీలేదు.

' ఏం? బుద్ధుడంటే మీకు పడదా?' అడిగింది స్వరం కించిత్ హేళనగా.

'ఓహో అలా అర్థమైందా నా మాట?' అనుకుని, ' అవును. గతంలో మా మధ్య విభేదాలేమీ లేవు. ఈ మధ్యనే కాస్త చెడింది' అన్నాను.

అవతలనుండి కాసేపు నిశ్శబ్దం.

'హలో' అంది మళ్ళీ స్వరం. 

' చెప్పండి లైన్లోనే ఉన్నాను' అన్నాను.

'ఎందుకు తేడాలొచ్చాయి మరి?' అడిగింది స్వరం. పక్కనుంచి ఎవరో నవ్వుతున్నారు.

'నామీద బుద్ధుడికి చాడీలు చెప్పాడు. ఆయన నమ్మేశాడు. అప్పటినుంచీ నాతో మాట్లాడటం లేదు' అన్నాను.

'మీమీద చాడీలా? ఎవరా చెప్పినది?' అన్నది స్వరం.

' ఇంకెవరు? జీసస్' అన్నాను.

మళ్ళీ నిశ్శబ్దం.

ఇద్దరు ముగ్గురు కలసి ఏదో మాట్లాడుకుంటున్నట్లు శబ్దాలు వినవచ్చాయి.

కాసేపలా అయ్యాక, ' మీతో ఒక విషయం చర్చించాలి. టైముందా?' అంది స్వరం.

' లేదు' అన్నాను. 

' పోనీ ఎప్పుడు వీలౌతుందో చెప్పండి. అప్పుడే చేస్తాం' అన్నది. 

' ఎప్పటికీ వీలు కాదు' అన్నాను.

' అదేంటి? అంత బిజీనా? అడిగింది.

' అవును' అన్నాను.

' మీరు రిటైరయ్యారుగా. ఏం చేస్తుంటారు మరి?' అడిగింది.

' చర్చికెళ్తుంటాను' అన్నాను.

' నిజంగానా? అక్కడేం చేస్తారు?' అడిగింది.

మళ్ళీ పక్కనుంచి నవ్వులు వినిపించాయి.

' చర్చిలో చర్చిస్తూ ఉంటాను' అన్నాను.

' అర్ధం కాలేదు' అన్నది.

' చర్చిల్ అని ఒక పాస్టరున్నాడు. అతను నా ఫ్రెండ్. అతనితో చర్చించడానికి వెళుతూ ఉంటాను' అన్నాను.

మళ్ళీ సైలెన్స్.

'మేం బుద్ధుడి గురించి మాట్లాడదామని ఫోన్ చేశాము' అప్పటికి అసలువిషయంలోకి వచ్చింది స్వరం.

'ఈమధ్య ఆయన కనపడటం లేదు. ఎక్కడున్నాడో నాకు తెలీదు. టీవీలో యాడ్ ఇవ్వండి' అన్నాను.

ఫోన్ కట్ అయిపోయింది.

కాసేపు చూశాను మళ్ళీ ఫోనొస్తుందేమో అని. రాలేదు.

'విషయం లేకుండా ఎందుకు ఫోన్ చేస్తారో నాకు? అవతల చర్చికెళ్ళాలి. లేటయితే మళ్ళీ ప్రభువుకు కోపమొస్తుంది' అని విసుక్కుంటూ దగ్గరలోని ఊరి చర్చివైపు హడావుడిగా బయల్దేరాను.

read more " బుద్ధుడంటే మీకు పడదా? "

World Meditation Day

Happy World Meditation Day అంటూ నిన్న ఒక శిష్యురాలు మెసేజి పంపింది.

Meditation has no special day అని తనకు రిప్లై ఇచ్చాను.

అది హైలెవల్ యోగుల స్థాయి. మనలాంటి మామూలు మనుషులకు అలా కుదరదు కదా !

ఇలా ఏదో ఒక రోజును అనుకోవడం ఆరోజున గ్రీటింగ్స్ చెప్పుకోవడం లోకుల అలవాటు. సరే మనమెందుకు కాదనడం, ఎంతో కొంత మంచిదేగా !

జూన్ 21 న వరల్డ్ యోగా డే అన్నారు. డిసెంబర్ 21 ని వరల్డ్ మెడిటేషన్ డే అంటున్నారు. లోకాచారం ప్రకారం అలాగే కానిద్దాం. మొదటిదేమో వేసవి అయనాంతం. రెండవది శీతాకాలపు అయనాంతం. అయితే ఈ వర్గీకరణ ఉత్తరార్ధగోళానికి మాత్రమే వర్తిస్తుంది. దక్షిణార్ధగోళానికి వ్యతిరేకం అవుతుంది.

డిసెంబర్ 21 ని వరల్డ్ మెడిటేషన్ డే గా మన దేశం సూచించింది. అనేక దేశాలు ఒప్పుకున్నాయి. UNGA (United Nations General Assembly) ఆమోదముద్ర వేసింది.

డిసెంబర్ 21, మార్చి 21, జూన్ 21, సెప్టెంబర్ 21 - ఈ నాలుగూ భూగోళానికి ముఖ్యమైన రోజులు. ఏమంటే, ఈ రోజులనుంచీ ఋతువులు మారుతాయి. వ్యవసాయపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా అనుకూల/ప్రతికూల మార్పులు భూవాతావారణంలో వస్తాయి.  అతిప్రాచీనకాలం నుండీ ఈరోజులను పండుగలుగా చేసుకోవడం భూమిపైన అనేక దేశాలలో అనేక సంస్కృతులలో ఆచారంగా ఉన్నది.

ఉదాహరణకు, భూమ్మీద అందరూ చేసుకుంటున్న క్రిస్మస్ పండుగ కూడా అంతకంటే ఎంతో ప్రాచీనమైన డిసెంబర్ 21 ని క్రైస్తవం కబ్జా చేసినదే. ఆరోజున గాని, 25 న గాని జీసస్ పుట్టాడనడానికి ఏవిధమైన ఆధారాలూ ఎక్కడా లేవు.

అయితే, ఈ తేదీలలో పుట్టిన మహనీయులు, జ్ఞానోదయాన్ని పొందిన మహనీయులు చాలామంది చరిత్రలో ఉన్నారు. ఉదాహరణకు శారదామాత డిసెంబర్ 22 న, అంటే ఈరోజున, జన్మించారు.

మహనీయులు జన్మిస్తూనే ఉంటారు. కొన్నాళ్ళుండి పోతూనే ఉంటారు. మనమూ అంతే. కాకపోతే, పండుగలూ పార్టీలూ చేసుకోవడం  కాకుండా, ఈ తేదీలవల్ల మనకు సత్యమైన ఉపయోగమేమిటి అన్నది ప్రశ్న !

ఏమీ లేదు.

ఆయా తేదీలను తమ వ్యాపారానికి అనుగుణంగా వాడుకోవడం తప్ప మనుషులు నిజంగా చేస్తున్నదేమీ లేదు. కారణం? వారిలో చిత్తశుద్ధి లేకపోవడమే. దేనినైనా, పార్టీ చేసుకోవడానికి మాత్రమే వాడుకోవడం వారికి తెలిసిన విద్య.

మెడిటేషన్ డే కూడా అంతే !

జూన్ 21 ఒక్కరోజున కాసేపు మొక్కుబడిగా యోగా చేసి 'మనం కూడా ఏదో ఉద్ధరించాం' అనుకోవడం ఎంతటి భ్రమో, డిసెంబర్ 21 ఒక్కరోజున కాసేపు కళ్ళుమూసుకుని కూచోడం కూడా అంతే. యోగాభ్యాసమైనా, ధ్యానమైనా నీ జీవితవిధానంగా మారిపోవాలి. లేదంటే, ఊరకే మెసేజిలు పంపుకోవడం, పార్టీలు చేసుకోవడం తప్ప శరీరానికైనా మనస్సుకైనా వేరే ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.

జీవనవిధానమూ, ఆలోచించే తీరూ మారితే తప్ప యోగమైనా, ధ్యానమైనా.  శాశ్వతఫలితాలు చూపించవు. అయితే, చాలామంది మనుషులకు చేతకానిదే అది !

పోనీలే ఇన్నాళ్ళకైనా అంతర్జాతీయంగా కనీసం ఒక గుర్తింపు వచ్చింది. చీమయాత్రలో ఒక అడుగు ముందుకు పడింది.

సంతోషం !

వాస్తవాలెలా ఉన్నా, కాస్త పాజిటివ్ గా నటిద్దాం !

read more " World Meditation Day "

21, డిసెంబర్ 2025, ఆదివారం

ఊరకే చూచిపోదామని

నిన్న  మా సెక్రటరీ మూర్తి ఫోన్ చేశాడు. తనేదో పనిమీద గుంటూరు వెళ్ళాడు. అక్కడ నుండి ఫోన్.

'ఒకాయన మిమ్మల్ని కలవాలంటున్నాడు' అన్నాడు.

'ఎవరాయన?' అడిగాను.

'తెలీదు. మీగురించి తన ఫ్రెండ్ చెప్పాట్ట. ఏదో పనిమీద ఒంగోలుకు వస్తున్నాడట. పనిలో పనిగా ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని చూచిపోతాడుట' అన్నాడు.

'మన పుస్తకాలు ఏవైనా చదివాడా? మన భావజాలం తెలుసా?' అడిగాను.

'పెద్దగా చదవలేదన్నాడు' అన్నాడు.

'మరెందుకు రావడం?' అడిగాను.

'ఊరకే మిమ్మల్ని ఒకసారి చూచిపోదామని వస్తున్నాట్ట' అన్నాడు.  

'రావద్దని చెప్పు. ఊరకే చూచిపోవడానికి ఇది పబ్లిక్ పార్కు కాదు. నేనేమీ దేవుణ్ణీ కాదు.  అలా ఊరకే చూచిపోవడం వల్ల తనకేమీ ఒరగదు. నాకేమో టైం వేస్టు. దానిబదులు, వచ్చినపని చూచుకొని, ఒంగోల్లో గుళ్ళూ గోపురాలూ చూచి వెనక్కు వెళ్ళడం మంచిది' అన్నాను.

'అతనికేం చెప్పమంటారు?' అడిగాడు.

'ఏముంది? గురువుగారు కలవరు. మీరు వచ్చినా ఉపయోగం లేదు. రావద్దు. అని సూటిగా చెప్పు' అన్నాను.

'బాగుండదేమో?' అన్నాడు.

' బాగున్నా బాగుండకపోయినా ఉన్న సత్యాన్ని చెప్పడం మంచిది' అన్నాను.

'సరే' అని మూర్తి ఫోన్ పెట్టేశాడు.

సరియైన ఆధ్యాత్మికమార్గంకోసం ప్రయత్నం చేసేవారికి మాత్రమే ఇక్కడకు వచ్చినా, నన్ను కలిసినా ఉపయోగం ఉంటుంది. ఊరకే చూచిపోదామని వచ్చేవారికి, పుణ్యంకోసం వచ్చేవారికి, కాలక్షేపంకోసం వచ్చేవారికి,  కబుర్లకోసం చర్చలకోసం వచ్చేవారికి ఏమాత్రమూ ఉపయోగం ఉండకపోగా, నా టైము వారి టైము రెండూ వేస్టు అవుతాయి.

ఆశ్రమం ఇటువంటివారికోసం కాదు.

ఊరకే చూచిపోయేవారు మాకక్కర్లేదు. ఇక్కడే ఉండిపోయేవారు, సాధనామార్గంలో నడిచేవారు మాక్కావాలి.  అప్పుడే వారి జీవితానికి సార్ధకత ఉంటుంది. నిజమైన సాధకులకు దారిని చూపించి, వారిని సత్యమార్గంలో నడిపించానన్న సంతృప్తి నాకూ ఉంటుంది. ఈ రెండూ లేనపుడు వృధాకాలక్షేపం తప్ప ఇంకేమీ జరగదు.

అందుకే అటువంటివారిని ఆశ్రమానికి రావద్దని చెబుతూ ఉంటాను. అంత్యనిష్టూరం కంటే ఆదినిష్టూరం మేలు కదూ !

read more " ఊరకే చూచిపోదామని "

19, డిసెంబర్ 2025, శుక్రవారం

హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్


నేటి నుండి  హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ మొదలౌతున్నది 

దానిలో పంచవటి స్టాల్ సిద్ధమయింది.

డిమాండ్ ను బట్టి, ఈ ఏడాది క్రొత్తగా 11 పుస్తకాలను ప్రింట్ చేయడం జరిగింది. అవి స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. పాఠకుల సూచనలమేరకు పుస్తకాల ధరలను గణనీయంగా తగ్గించడం జరిగింది.

గమనించండి.

read more " హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ "

15, డిసెంబర్ 2025, సోమవారం

హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ - 2025

 

19 వ తేదీనుండి 29 వ తేదీవరకు పై అడ్రసులో హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ జరుగబోతున్నది. దీనిలో పంచవటికి 152 వ నెంబర్ స్టాలు కేటాయించబడింది. క్రొత్తగా ప్రింట్ అయిన పుస్తకాలతో సహా మా ప్రచురణలన్నీ అక్కడ లభిస్తాయి.

'మీ మార్గమేమిటి?' అని చాలామంది నన్ను గతంలో అడిగేవారు. ఇప్పుడుకూడా మెయిల్స్ లో అడుగుతుంటారు.  వారికందరికి ఒకటే జవాబు - 'అసలైన, ఆచరణాత్మకమైన హిందూమతమే నా మార్గం. అయితే అది కొద్దిమాటలలో అర్ధమయ్యేది కాదు.  అందరూ అనుసరించగలిగేది కూడా కాదు. నా పుస్తకాలలో దానిని ఎంతో వివరంగా చర్చించాను. చదవండి. అర్ధమైనంత అర్ధమౌతుంది'.

నేడు హిందువులమనుకుంటున్న చాలామందికి హిందూమతం గురించి ఏమాత్రమూ సరియైన అవగాహన లేదు. పైగా వారిలో ఎన్నో అపోహలున్నాయి. అందుకే ఎవరికి తోచిన పిచ్చిపనులను వారు చేస్తూ అంతా హిందూమతమే అనుకుంటున్నారు. వాటన్నిటినీ సరిదిద్దడం కోసం, సరియైన అవగాహనను వారిలో పెంచడం కోసమే నేను పుస్తకాలను వ్రాస్తున్నాను. నా మార్గాన్ని కూడా వివరిస్తున్నాను.

బుక్ ఎగ్జిబిషన్లలో మా స్టాల్ ను పెడుతున్న ఉద్దేశ్యం ఇదే. ఈ సందర్భంగా, మా సంస్థ ముఖ్యసభ్యులను మీరు పంచవటిస్టాల్ లో కలుసుకోవచ్చు. వారితో మాట్లాడి,  నా పుస్తకాలగురించి గాని, మా సంస్థ గురించిగాని, హిందూమతం గురించిగాని లేదా జనరల్ గా ఆధ్యాత్మికమార్గం గురించిగాని మీకేవైనా సందేహాలుంటే తీర్చుకోవచ్చు.

ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.
read more " హైద్రాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ - 2025 "