25, ఆగస్టు 2015, మంగళవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -12 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం పన్నెండవ భాగం ఇక్కడ వినండి.















యూ ట్యూబ్ లో ఇక్కడ చూడండి
https://youtu.be/bsKBofGyXpk
read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -12 (ఆడియో ప్రసంగం) "

జ్యోతిష్య శాస్త్రం నిజమని మీరు నిరూపించవచ్చుగా?

మొన్నొక అభిమాని కడప జిల్లా నుంచి ఫోన్ చేశాడు.

జ్యోతిష్యశాస్త్రం అబద్దం అని ఎవరో ఒకాయన ఫేస్ బుక్ లో తెగ అల్లరి చేస్తున్నాడనీ,ఆయన చాలా ఫేమస్ అయిపోయాడనీ చెప్పి, దీనిని మీరు ఎదుర్కోవచ్చు కదా? ఈ శాస్త్రం నిజమే అని ఆయన్ను నమ్మించవచ్చు కదా అని ప్రశ్నించాడు.

నేను సింపుల్ గా నవ్వేసి, 'నాకు ఇంటరెస్ట్ లేదు' - అన్నాను.

'ఇంటరెస్ట్ లేకుంటే మరి బ్లాగెందుకు వ్రాస్తున్నారు?' అని వెంటనే ప్రశ్న వచ్చింది.

'అది నా ఓపెన్ డైరీ.కొన్నేళ్ళ తర్వాత నేనే చదువుకోవడానికి అలా వ్రాసుకుంటూ ఉంటాను.అది ఒకరి కోసం కాదు.కాకపోతే, ఇంటరెస్ట్ ఉన్నవారు చదువుకోవచ్చు.అంతే.' అని చెప్పి ఫోన్ కట్ చేశాను.

చాలామందిలో ఒక విషయం గమనిస్తూ ఉంటాను.వాళ్ళు చెయ్యాలనుకున్న పనిని,చెయ్యలేని పనిని నన్ను చెయ్యమని పురిగొల్పుతూ ఉంటారు.'మీకు టాలెంట్ ఉంది కదా.మీరు చెయ్యండి' అంటారు. ఇలాంటి వారిని చూస్తే నాకు భలే నవ్వొస్తూ ఉంటుంది.

మీక్కావాలనుకుంటే మీరు చేసుకోండి. ఇదంతా నాకెందుకు? నా దారి వేరు.

జ్యోతిష్యశాస్త్రం కానీ, ఇంకే శాస్త్రం గానీ, నిజమే అని ఒకరికి ఋజువు చెయ్యాల్సిన పని నాకు లేదు. నా నమ్మకం నాది. నా ఈ నమ్మకానికి ఆధారాలు బోలెడన్ని ఉన్నాయి.

నా నమ్మకం లాంటిదే వాళ్ళ నమ్మకం కూడా.వారికీ కొన్ని ఆధారాలు ఉండే ఉంటాయి. వాళ్ళ నమ్మకాన్ని మార్చాలన్న దుగ్ధ నాకేమీ లేదు.

వాళ్ళంతట వాళ్ళు నన్ను అనుసరిస్తే, అప్పుడు మాత్రమే, నాకు తెలిసిన విషయాలను వారికి నేర్పగలను.వాళ్లకు ఉపయోగపడగలను.అంతేగాని లోకాన్ని ఉద్ధరించే పని నాకక్కర్లేదు. దారిన పోయేవారిని వెంటపడి పిలిచి మరీ షడ్రసోపేతమైన భోజనం పెట్టాల్సిన పని నాకెందుకు?

మొన్నామధ్యన ఒక టీవీ చానల్ వారు ఫోన్ చేశారు.

'గోదావరి పుష్కరాల మీద చర్చా కార్యక్రమం పెడుతున్నాం.జ్యోతిష్య బృందంలో మీరూ పాల్గొంటారా?' అంటూ.

'నేను రాను.నాకిష్టం లేదు.' అని చెప్పాను.

'అదేంటి?' అన్నారు. పిలిచి టీవీ ప్రోగ్రాంలో చాన్స్ ఇస్తుంటే రాను పొమ్మన్నవాడిని బహుశా నేనే అయిఉంటాను ఇప్పటివరకూ.

'ఆ చర్చలలో ఏమీ తేలదు.ఊరకే అరుచుకోవడం తప్ప అక్కడ ఏమీ ఉండదు.నేను రాను.నాకు అవసరం లేదు' అని చెప్పాను.

జ్యోతిష్యశాస్త్రం నిజమే అని 100% నాకు తెలుసు. నా జ్ఞానాన్ని నాకోసం ఉపయోగించుకుంటాను.నన్ను అనుసరించే వారికోసం ఉపయోగిస్తాను. ఫలితాలు అందుకుంటాను.అంతేగాని లోకానికి బోధించాలని, నాస్తికులను ఆస్తికులుగా మార్చాలని నాకేమీ దురద లేదు.అందరూ ఆస్తికులుగా మతవాదులుగా మారిపోతే ఎలా?లోకంలో నాస్తికులూ ఉండాలి, హేతువాదులూ ఉండాలి.వారి పాత్ర కూడా లోకానికి అవసరమే.నకిలీ స్వామీజీలనుంచీ,నకిలీ బాబాల నుంచీ,నకిలీ జ్యోతిష్కుల నుంచీ లోకాన్ని రక్షించడానికి వారు అవసరమే.వారు మారకూడదు.వారు ఉండాలి.కావాలంటే నేను కూడా వారి తరఫున నకిలీలకు వ్యతిరేకంగా వాదిస్తాను.

అయినా ఒకరికి నిరూపించడం ఎందుకు? దాని అవసరం ఏముంది? కళ్ళు తెరిచి చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.సూర్యుడున్నాడని ఒకరికి నిరూపించవలసిన పని ఏముంది? కళ్ళు తెరిచి చూస్తే చాలు."నేను కళ్ళు తెరవను.తెరిస్తే నేను చులకనై పోతాను.నాకిలాగే బాగుంది"-అని ఎవరైనా అంటుంటే వారి కళ్ళు బలవంతాన తెరిపించవలసిన పని మనకెందుకు?వారికలాగే బాగుంటే అలాగే వారిని ఉండనివ్వడమే మంచిది.ఒకరి హాయిని మనం చెడగొట్టడం ఎందుకు?

ఒకరితో మనకనవసరం.

మనకు విషయం అర్ధమైంది కదా.దానిని సక్రమంగా మన జీవితాలలో ఉపయోగించుకుంటే చాలు.ఒకరిని మార్చవలసిన పనిని తెలివైనవాడు ఎప్పుడూ పెట్టుకోకూడదు.దానివల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ ఉపయోగం ఉండదు.

ఈలోకంలో ఎవరి ఖర్మకు వారే బాధ్యులు.అది చాలదన్నట్లు ఇంకొకరి కర్మలో కూడా మనం తలదూర్చాల్సిన పని ఎందుకు?
read more " జ్యోతిష్య శాస్త్రం నిజమని మీరు నిరూపించవచ్చుగా? "

24, ఆగస్టు 2015, సోమవారం

గురు శుక్ర మౌఢ్యములకు ఋజువులివిగో

గురు శుక్ర మౌడ్యమి గురించి ఈ మధ్యనే ఒక పోస్ట్ వ్రాశాను.

అవి మొదలైన దగ్గరనుంచీ ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో కళ్ళు తెరిచి గమనించేవారికి అర్ధం అవుతూనే ఉన్నది.విమాన ప్రమాదాల నుంచి రోడ్డు ప్రమాదాల వరకూ ప్రతిరోజూ ఎన్నో జరుగుతూనే ఉన్నాయి.అవన్నీ మళ్ళీ నేను ఏకరువు పెట్టబోవడం లేదు. న్యూసులో అదంతా వస్తూనే ఉన్నది.

కానీ నిన్న రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి మాత్రం వ్రాయదలుచుకున్నాను.ఎందుకంటే ఇది చాలా విచిత్రమైనది.

అనంతపూర్ జిల్లా మడకశిర అనే ఊరిదగ్గర నిన్న రాత్రి 2.23 కి ఈ ప్రమాదం జరిగింది.బెంగుళూరు నాందేడ్ ఎక్స్ ప్రెస్ వేగంగా పోతుండగా ఒక గ్రానైట్ లోడు లారీ స్పీడుగా వచ్చి లెవెల్ క్రాసింగ్ గేటును దాటి రైలుమధ్యలో సరిగ్గా ఏసీ బోగీలను అడ్డంగా డీ కొట్టింది.లారీ డ్రైవరు తాగి ఉన్నాడని అంటున్నారు.లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని అంటున్నారు.నిజానిజాలు విచారణలో తెలుస్తాయి.

సాధారణంగా అయితే రైలు - బస్సునో లారీనో ట్రాక్టరునో గుద్దుతుంది.కానీ ఇక్కడ అందుకు రివర్స్ లో జరిగింది.లారీయే అతివేగంగా వచ్చి స్పీడుగా పోతున్న రైలును మధ్యలో గుద్దింది.అసలు విచిత్రం అది కాదు.

ఆ వేగానికి లారీలో ఉన్న గ్రానైట్ దిమ్మ ఎగిరి ఫస్ట్ ఏసీ బోగీని ఈ పక్కనుంచి ఆపక్కకు చీల్చుకుంటూ దూసుకుపోయింది.ఆ క్రమంలో ఆ ఏసీ బోగీలో నిద్రిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటేష్ నాయక్ ను తీవ్రంగా గాయపరచింది ఆ గ్రానైట్ దిమ్మ.

అతనితో బాటు నలుగురో అయిదుగురో తోటి ఏసీ ప్రయాణీకులు కూడా స్పాట్లో చనిపోయారు.ఏం జరిగిందో తెలిసేలోపు వారి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.దాదాపు 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.

నేనెప్పుడూ కర్మ గురించి, దాని విచిత్ర విధానాల గురించి వ్రాస్తూ ఉంటాను.చాలామంది దానిని చదివి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు.ఇప్పుడు కళ్ళారా చూడండి.కర్మ విధానాలు ఎంత విచిత్రంగా ఉంటాయో?

ఇందులో జ్యోతిష్య కోణం:--
సరిగ్గా ఇప్పుడు గురువు సూర్యునికి రెండే రెండు డిగ్రీల దూరంలో ఉండి deep combustion లో ఉన్నాడు.ఇప్పుడు గురుమౌడ్యమి  అతి తీవ్రంగా ఉన్నది. చనిపోయిన వారివీ గాయపడిన వారివీ జాతకాలు చూస్తే, వాటిలో భయంకరమైన గురుదోషాలు ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు.ఇది గురు మౌఢ్య ప్రభావమే.ఈ సంఘటన జరిగింది కూడా శుక్రహోర లోనే.

కర్మకోణం:--
హాయిగా ఏసీ బోగీలో ఆదమరచి నిద్రిస్తున్న ప్రయాణీకులు ఏమిటి? చీకట్లో దూసుకొచ్చిన లారీ - రైలుమధ్యలో ఉన్న ఏసీ బోగీని సరిగ్గా గురిచూచినట్లు గుద్దడం ఏమిటి? అందులోని గ్రానైట్ దిమ్మ విష్ణుచక్రంలాగా ఎగిరొచ్చి రైలు బోగీని చీల్చుకుని అందులో నిద్రిస్తున్న అయిదుగురు ప్రయాణీకులను స్పాట్లో చంపడం ఏమిటి? ఇదంతా కర్మవిచిత్రం కాకుంటే మరేమిటి?

ఏదో హాలీవుడ్ మూవీలోని సీన్ లా అనిపించడం లేదూ? కర్మరహస్యాలు అర్ధం కాకపోతే అలాగే అనిపిస్తుంది.

కర్మ అనేది హాలీవుడ్ వారినీ వదలదు.బాలీవుడ్ వారినీ వదలదు.ఎవరినీ వదలదు.తమ కర్మకు చలానా కట్టకుండా ఎవరూ ఈ లోకంలో తప్పించుకోలేరు.ఈ భూమ్మీద ఎవరు ఎక్కడున్నా తమ కర్మను మాత్రం తప్పించుకోలేరు.ఒక్క గురు అనుగ్రహమూ దైవానుగ్రహములే దానిని తప్పించగలవు.ఇంకేదీ ఈ సృష్టిలో కర్మను తప్పించలేదు.

మనిషి ఎవరినుంచైనా దాక్కోవచ్చుగాని తన కర్మ నుంచి దాక్కోలేడు.ఇది సత్యం. 

గ్రహస్థితుల సూచనలకు ఖచ్చితంగా సరిపోయే ఇలాంటి విచిత్రమైన ప్రమాదాలను ఎన్నింటినో నేను గత ఎన్నో ఏళ్ళుగా గమనిస్తున్నాను.మానవ జీవితంలో జరిగే సంఘటనలకూ ఆకాశంలోని గ్రహస్థితులకూ ఖచ్చితమైన అవినాభావ సంబంధం ఉన్నదన్న విషయం నా జ్యోతిశ్శాస్త్ర పరిశీలనలో ఎన్నోసార్లు ఋజువైంది. 

జ్యోతిశ్శాస్త్రం సత్యం.

కర్మ సత్యం.

ఇంకెన్ని రుజువులు కావాలి?
read more " గురు శుక్ర మౌఢ్యములకు ఋజువులివిగో "

ప్రాణశక్తితో జంతువులను కంట్రోల్ చెయ్యడం ఎలా?

మనుషుల కంటే జంతువులకు సెన్సిటివిటీ చాలా ఎక్కువ.ఎందుకంటే అది లేకపోతే వాటి జీవితం సాగదు.ఏ పక్కనుంచి ఏదోచ్చి చంపుతుందో అని అవి అనుక్షణం భయంతో చస్తూ బ్రతుకుతూ ఉంటాయి.ఆ భయం లేకుంటే అవి బ్రతకలేవు.అందుకే వాటికి సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.

ప్రాణశక్తి ప్రొజెక్షన్ ను జంతువులు వెంటనే పసిగడతాయి.మానవులలో ఈ శక్తి చాలా క్షీణించి ఉంటుంది.దానికి కారణం మన చుట్టూ మనం ఏర్పరచుకున్న సెక్యూరిటీ వ్యవస్థ.ఆటవిక మానవుడికి కూడా జంతువులకున్న సున్నితత్వం ఉండేది.క్రమేణా నాగరికత పెరిగేకొద్దీ అది మాయమౌతూ వచ్చింది.

మనిషికి ఇల్లూ వాకిలీ సెక్యూరిటీ వ్యవస్థా ఉన్నాయి గనుక అతనికి ఈ సున్నితత్వం బాగా క్షీణించింది.అందుకే చివరికి తనకు మూలమైన ప్రాణశక్తికూడా అసలు ఉందా లేదా అని యూనివర్సిటీలలో పరిశోధనలు చేసే స్థాయికి మనిషి దిగజారి పోయాడు.

ప్రాణశక్తి ప్రొజెక్షన్ ఎలా చెయ్యాలో తెలిస్తే దానితో జంతువులను వెంటనే ప్రభావితం చెయ్యవచ్చు.సరదాగా ఇలాంటి పనులు అప్పుడప్పుడు చేసినా, వాటికి హానికరమైన ప్రొజెక్షన్ మాత్రం చెయ్యకూడదు.అలాంటి పనులు చేస్తే ఈ శక్తి వెంటనే క్షీణిస్తుంది.

ఒక జపాన్ 'కి' మాస్టర్ తన ప్రాణశక్తి ప్రొజెక్షన్ తో జూ లోని జంతువులను ఎలా నిద్ర పుచ్చుతున్నాడో ఈ వీడియోలో చూడండి.



read more " ప్రాణశక్తితో జంతువులను కంట్రోల్ చెయ్యడం ఎలా? "

23, ఆగస్టు 2015, ఆదివారం

Sword Finger Qigong Healing Technique

'కి' - 'ప్రాణశక్తి' - ఏదైనా పేరు పెట్టుకోండి.ప్రకృతిలో ఈ శక్తి ఉన్నమాట నిజం.ఇది పనిచేసే మాట కూడా నిజమే.

ఇన్నాళ్ళూ దీనిని చాలామంది నమ్మలేదు.నేటికీ నమ్మని వారు చాలామంది ఉన్నారు.వారి ఖర్మకు వారిని అలా వదిలేద్దాం.

ప్రాణశక్తి పైన రీసెర్చి చేసిన కొన్ని యూనివర్సిటీలు ఇది అబద్దం కాదు నిజమే అని తేల్చి చెప్పాయి.ఈ వీడియోలో మిన్నెసోటా యూనివర్సిటీలో జరిగిన రీసెర్చి ప్రస్తావనను గమనించండి.

హోమియోపతి వైద్య విధానం కూడా ఈ ప్రాణశక్తి ఆధారంగానే పనిచేస్తుంది.

'కి'- మాస్టర్ చున్ యిలింగ్ చూపిస్తున్న ఈ చిన్న టెక్నిక్ ను మీరు కూడా అభ్యాసం చేసి దీని శక్తి ఏమిటో చూడండి.

ఇవన్నీ ప్రాణిక్ హీలింగ్ అభ్యాసాలు.మార్షల్ ఆర్ట్ లో ప్రాణిక్ హీలింగ్ అనేది ఒక అంతర్భాగమే.నిజమైన మార్షల్ ఆర్ట్ లో ప్రాణాన్ని దెబ్బ తియ్యడమే కాదు దానిని హీలింగ్ చెయ్యడమూ ఉంటుంది.అయితే ఈ అభ్యాసాలను సరిగ్గా చెయ్యాలంటే మీకు మంచి మనస్సూ, 'ఫీల్' అయ్యే హృదయమూ ఉండాలి. అవి చాలా ముఖ్యం.అవి లేకుంటే ఈ అభ్యాసాలు కుదరవు. ఫలితాన్ని ఇవ్వవు.

ప్రయత్నించండి మరి.
read more " Sword Finger Qigong Healing Technique "

20, ఆగస్టు 2015, గురువారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -11 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం పదకొండవ భాగం ఇక్కడ వినండి.















యూ ట్యూబ్ లో ఇక్కడ చూడండి
https://youtu.be/-3orZduTYkE
read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -11 (ఆడియో ప్రసంగం) "

మార్షల్ ఆర్ట్స్ క్లాస్ త్వరలో ప్రారంభం

దాదాపు 20 సంవత్సరాల రెగ్యులర్ ప్రాక్టీస్ తో నేను నాదంటూ ఒక మార్షల్ ఆర్ట్స్ స్టైల్ ను రూపొందించాను.అన్ని స్టైల్స్ నుంచీ దానిలో పనికొచ్చే టెక్నిక్స్ ను స్వీకరించాను.నాది ఈ స్టైల్ అని గిరి గీసుకుని కూచోవడం నాకు నచ్చదు.అలా గిరి గీసుకోవడం వల్ల మన పరిధి సంకుచితం అయిపోతుంది.అప్పుడు మనం ఎదగలేం.ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది.

నవీనకాలంలో మొదటగా ఈ పంధాను మొదలు పెట్టింది బ్రూస్ లీ అనే చెప్పాలి.అన్ని స్టైల్స్ నుంచీ పనికొచ్చే టెక్నిక్స్ ను తీసుకొమ్మని చెప్పింది ఆయనే.ఆయన కంటే ముందు కూడా అనేక మంది కుంగ్ ఫూ మాస్టర్లు రకరకాల స్టైల్స్ నుంచి కూర్చి వాళ్ళ వాళ్ళ పర్సనల్ స్టైల్స్ తయారు చేసుకున్నారు.చోయ్ లే ఫట్, హంగ్ గార్, వింగ్ చున్,యానిమల్ స్టైల్స్ ఇంకా అనేకానేక కుంగ్ ఫూ స్టైల్స్ అలా పుట్టినవే.

నా పర్సనల్ మెథడ్ నేర్పమని కొందరు చాలాకాలం నుంచి కోరుతున్నారు. మంచి స్టూడెంట్స్ దొరకక, 20 ఏళ్ళ క్రితమే చెప్పడం ఆపేసిన మార్షల్ ఆర్ట్స్ క్లాస్ ను, వారికోసం వచ్చే నెలనుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను.

మార్షల్ ఆర్ట్స్ అంటే ఫైటింగ్ మాత్రమే కాదు.అలా అనుకోవడం తప్పు.మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసే అభ్యాసాలు కూడా ఇందులో ఎన్నో ఉంటాయి. ఆరోగ్యం కావలసిన వారికి అది,ఫిట్నెస్ కావలసిన వారికి అది, ఫైటింగ్ కావలసిన వారికి అది ఇస్తుంది నా విధానం.

నా స్టైల్ నుంచి ఒక చిన్న టెక్నిక్ ను ఈ వీడియోలో చూడవచ్చు.


ఇంటరెస్ట్ ఉన్నవారు క్లాస్ లో చేరవచ్చు.
Contact Details:
Raju Sykam, M.A (Astrology)
Cell:- 9966007557
E-mail:- www.raju@gmail.com
read more " మార్షల్ ఆర్ట్స్ క్లాస్ త్వరలో ప్రారంభం "

19, ఆగస్టు 2015, బుధవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -10 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం పదవ భాగం ఇక్కడ వినండి.















యూ ట్యూబ్ లో ఇక్కడ చూడండి
https://youtu.be/mH3azblJlmw
read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -10 (ఆడియో ప్రసంగం) "

18, ఆగస్టు 2015, మంగళవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -9 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం తొమ్మిదవ భాగం ఇక్కడ వినండి.















యూ ట్యూబ్ లో ఇక్కడ చూడండి
http://youtu.be/E3_rZ1SGUyA
read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -9 (ఆడియో ప్రసంగం) "

17, ఆగస్టు 2015, సోమవారం

దక్షిణామూర్తి స్తోత్రమ్ -8 (ఆడియో ప్రసంగం)



దక్షిణామూర్తి స్తోత్రం ఆడియో ప్రసంగం ఎనిమిదవ భాగం ఇక్కడ వినండి.















యూ ట్యూబ్ లో ఇక్కడ చూడండి
https://youtu.be/TILlrCVhkto
read more " దక్షిణామూర్తి స్తోత్రమ్ -8 (ఆడియో ప్రసంగం) "