2, ఆగస్టు 2026, ఆదివారం

దేవుడిని తిడతారా జంతువుల్లారా?

75 ఏళ్ల వయసున్న తననూ, చనిపోయిన తన తల్లిగారినీ బూతులు తిట్టిన పదిహేనూ ఇరవైఏళ్ల జాంబీలను క్షమిస్తూ మోదీగారు ప్రకటన చేశారు. వారు దారితప్పిన పిల్లలని, వారిని సరిదిద్దటమే చేయాలిగాని, శిక్షించడం సరికాదని అన్నారు. అది ఆయనలోని మానవత్వాన్ని, దైవత్వాన్ని చూపిస్తున్నది. 

అంతేకాదు, ఆ పిల్లలు అసలెలా పెరుగుతున్నారో, ఆ తల్లిదండ్రులు వారిని ఎలా పెంచుతున్నారో కనిపిస్తున్నది. అసలంటూ వాళ్లకు తల్లిదండ్రులున్నారా అని నాకు సందేహం తలెత్తుతున్నది. బహుశా గాలికి పుట్టి, గాలికి పెరిగిన రకాలై ఉంటారు.

'వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకు తెలియదు. వాళ్ళను క్షమించు' అని జీసస్ ప్రార్ధించాడని, కనుక ఆయనలో దైవత్వం ఉన్నదని అందరూ అంటుంటారు. అదే నిజమైతే, మోదీగారిలో కూడా అదే దైవత్వం ఉన్నది. ఒక ప్రధానమంత్రి తలచుకుంటే, ఈ బచ్చాలందరూ ఏమై పోతారసలు? ఊహకికూడా అందదు.

కానీ ఆయన క్షమించారు. అది ఆయనలోని దైవత్వం !

ఇంకా చెప్పాలంటే, ఆ టైములో జీసస్ నిస్సహాయుడు. శిలువ వేయబడుతున్నాడు. ఎంతగా మొరపెట్టుకున్నా తన దేవుడు కూడా పట్టించుకోలేదు. ఆ సమయంలో ప్రార్ధించడం తప్ప జీసస్ ఇంకేం చేయగలడు? అయినా, కోప్పడకుండా క్షమించాడు. అంతవరకూ గొప్పవిషయమే !

కానీ మోదీగారు నిస్సహాయుడు కాదు. యంత్రాంగమంతా ఆయన చేతులలో ఉన్నది. ఒక కనుసైగ చేస్తే చాలు, ఏది జరగాలో అది జరుగుతుంది. కానీ ఆయనలా చేయలేదు. ఓర్పువహించాడు. క్షమించాడు. కనుక, నా దృష్టిలో జీసస్ కంటే మోదీగారే గొప్పవాడు.   

ఆయన దేశానికి క్షమార్పణ చెప్పాలట ! ఇదొక డిమాండారా అసలు?

క్షమార్పణ ఆయన చెప్పడమేంట్రా దరిద్రుల్లారా ! మనందరి చర్మాలతో ఆయనకు చెప్పులు కుట్టించినా, ఆయన ఋణాన్ని ఈ దేశం తీర్చుకోలేదురా  దేశద్రోహుల్లారా !

---------------------

పార్లమెంటు సమావేశాలను ముందుకు పోనివ్వకుండా, బిల్లులు పాసు కానివ్వకుండా  మీరు చేస్తున్న అల్లరీ గోలా ప్రజలలో అసహ్యాన్ని పుట్టిస్తున్నది. 

వీళ్లా మన MP లు? అని సిగ్గుపడవలసి వస్తున్నది. ఏదో రోడ్లమీద అరిచే జంతువులలాగా 'ఓ...' అని MP లు పార్లమెంటులో అరుస్తున్నారంటే, మన దేశానికి ప్రజాస్వామ్యం ఏమాత్రమూ సరిపోదని నేనెప్పుడూ అనేమాట నిజమేనని రుజువౌతున్నది. ఎంత డబ్బులుపెట్టి ఓట్లు కొనుక్కుని గెలిస్తే మాత్రం, కాస్త డీసెన్సీ డెకోరం ఉండద్దూ ! మేన్యుఫేక్చరింగ్ డిఫెక్టా?

----------------------

గతపదేళ్లలో మన దేశం ఎన్నో మైలురాళ్లను దాటింది. ఎన్నో దేశాలను దాటేసి ముందుకొచ్చేసింది. మోదీగారు సాధించిన విజయాలను, దాటిన మైలురాళ్లను వ్రాయాలంటే వందకు పైన ఉన్నాయి. 

దేశం బాగుపడిపోతున్నది. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నది. ఎక్కడా ఎలాంటి గొడవలూ లేవు. పెడదామన్నా వీలుకావడం లేదు. ఇంకోసారి మోదీగారి ప్రభుత్వం వస్తే ఇక మనం దుకాణాలు మూసుకోవలసిందే, అన్న తీవ్రమైన భయానికి కాంగ్రెసు, కమ్యూనిస్టులు, ఇస్లామిక్ పార్టీలు, ఇతర కొమ్ముపార్టీలు లోనయ్యాయి. వాటికి మనచుట్టూ పొంచి ఉన్న శత్రుదేశాలు కాపుకాశాయి. వీళ్ళను ఎగదోశాయి. సరే, వీళ్లకు ఫండింగ్ చేసే దొంగలెలాగూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. బొద్దింకలు పుట్టుకొచ్చాయి. 

సరే, వాటికి కూడా వాళ్ళ నిరసనను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వబడింది. దానిని సాకుగా తీసుకొని 'చలో పార్లమెంట్' అని పార్లమెంట్ వైపు పోబోయాయి. వేటు పడింది. అదికూడా లైట్ గా పడింది.

దానిని హైలైట్ చేసి, FCRA వంటి ముఖ్యమైన బిల్లులు పాసవ్వకుండా చెయ్యాలని విపక్షాలు పార్లమెంట్ సమావేశాలలో నానా అల్లరీ చేస్తున్నాయి. కానీ వాటి దేశద్రోహపోకడలను దేశం గమనిస్తూనే ఉంది. వీళ్ళవెనుక ఎవరున్నారో, ఫండింగ్ ఎక్కడనుంచి వస్తున్నదో, పార్లమెంట్లో చర్చలకు ఎందుకిలా అడ్డుపడుతున్నారో, నేడు అందరికీ తెలుసు.

విపక్షాల ఎజెండా ఒకటే. ఏదోరకంగా గొడవలు లేవనెత్తి, నేపాల్, శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో జరిగినట్టు ప్రభుత్వాన్ని కూలద్రోయాలని కంకణం కట్టుకున్నాయి. మనదేశం బాగుపడకూడదు. అగ్రరాజ్యంగా అవతరించకూడదు. మిగతాదేశాలతో సమానంగా తలెత్తుకుని గర్వంగా నిలబడకూడదు. నాశనం కావాలి. ఇదే వీళ్ళ ఆశయం.

పేపర్ లీకు జరిగింది. దానిని గుర్తించి తగిన చర్యలన్నీ వెంటవెంటనే తీసుకున్నారు. ఇంకేం కావాలి? ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేయవలసిన అవసరం ఏముంది? సరే, నైతికకోణంలో చేశాడు. ఇప్పుడు అమిత్ షాను, మోదీగారిని కూడా చేయమంటున్నారు. తర్వాత దేశం దేశద్రోహపార్టీల చేతులలోకి వెళ్ళిపోతుంది. చైనా, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ ఇంకా ఇతరశత్రుదేశాల చేతులలోకి వెళ్ళిపోతుంది. ఐదారేళ్లలో సర్వనాశనమై పోతుంది. అదేగా వీళ్లకు కావలసింది?

దీనిని మనమెందుకు జరగనివ్వాలి? మా డిమాండ్లు మాకూ ఉన్నాయ్ !

FCRA బిల్లు పాసవ్వాలి. మతమార్పిడి మాఫియాలు అంతం కావాలి. దేశద్రోహపార్టీలు అంతం కావాలి. అల్లర్లు ఆగడాలు, కుట్రలు అంతం కావాలి. ఆ దిశగా ఏమేం చెయ్యాలో అన్నీ చెయ్యాలి.  అంతేగాని, ప్రభుత్వం వెనుకకు తగ్గడానికి వీల్లేదు. ఇదే మా డిమాండ్.

ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడం మీవల్ల అవుతుందా?

---------------------

శాంతియుతంగా నిరసన చెయ్యవలసిన విద్యార్థులు విధ్వంసానికి దిగవచ్చా?

నిరసనలో పాల్గొన్నవారికి పాకిస్తాన్ నుంచి, బాంగ్లాదేశ్ నుండి ఫుడ్ ఆర్దర్లు ఎలా జరిగాయి?

నిరసనకారులు మాట్లాడిన మాటలేంటి? చేసిన నినాదాలేంటి?

పోలీసులను కొట్టటమేంటి? మహిళా జర్నలిస్టులను అల్లరి చేయడమేంటి?

ఇవన్నీ మంచిపనులేనా? శాంతియుతం అంటే ఇదేనా?  

పెల్లెట్ గన్స్ వాడారని గోలచేస్తున్న కమ్యూనిస్టులు, మీ చైనాలో జరిగిన తియానన్ మెన్ స్క్వేర్ సంఘటనకు ఏమంటారు?

పోలీసుచర్య అంటూ గోలచేస్తున్న కాంగ్రెస్, ఎమర్జెన్సీని గురించి ఏమి జవాబు చెబుతుంది?

ఇతర రాష్ట్రాలలో పేపరులీకులైనపుడు, విద్యాశాఖామంత్రులు ఎందుకు దిగిపోవడం లేదు?

సరే, శాంతియుతంగా నిరసన చేసినవారిపైన కేసులుండవు. మరి, విధ్వంసకారులను, ఆ గుంపులో దూరిపోయిన నేరస్తులను, పాతకేడీలను కూడా వదిలేయాలా? ఏ చట్టప్రకారం?

--------------------------

మోదీగారు మనిషి కాదురా దరిద్రుల్లారా ! ఆయన దైవాంశసంభూతుడు. మన దేశాన్ని రక్షించడానికి పుట్టిన దేవుడు. ఆయనే లేకపోతే, నేడు మనమందరమూ మనదేశంలోనే బానిసబ్రతుకులు బ్రతుకుతూ ఉండేవాళ్ళం. అలాంటి దేవుడిని అలా తిడుతున్నారా? మీరసలు మనుషులేనా?

పెద్దమనసుతో మీరు క్షమించినా, ఈ దేశద్రోహులను మేము క్షమించలేము. చిన్నపిల్లలైనా సరే, వీళ్లకు తీవ్రమైన శిక్షలు పడాల్సిందే. వీళ్ళనిలా వదిలేస్తే, కొన్నేళ్ళకు వీళ్ళే తీవ్రవాదులు, నేరస్తులు, సమాజానికి చీడపురుగులు అవుతారు. వీళ్ళను వదిలెయ్యడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం !

------------------

FCRA బిల్లు రావాలి. మతమార్పిడులు పూర్తిగా ఆగాలి. రిజర్వేషన్ అంతం కావాలి. మెరిట్ కు గుర్తింపు రావాలి. అవినీతి అంతం  కావాలి. రాజ్యాంగాన్ని మార్చాలి. డెమోక్రసీని తొలగించి, ఉదారవాద నియంతృత్వం రావాలి. 

ఇవి మా డిమాండ్స్.

----------------------------

మన దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు. ఉదారవాద నియంతృత్వం (Benevolent Dictatorship) ఒక్కటే మనకు సరైనది. నేడుకాకపోయినా, భవిష్యత్తులోనైనా ఇదే నిజమౌతుంది. అమ్మాబాబూ అని ఒళ్ళో కూచోబెట్టుకుంటే మనదేశంలో ఎవడూ మాటవినడు. తొక్కి నారతీస్తేనే మంచిగా ఉంటారు.

దేశద్రోహులనెవరినీ క్షమించకూడదు. వాళ్ళు ప్రజలైనా సరే ! పార్లమెంటులో లేకిగా ప్రవర్తిస్తున్న నాయకులైనా సరే ! వాళ్ళను సపోర్ట్ చేస్తున్న పార్టీలైనా సరే. ఎవరినీ వదలడానికి వీల్లేదు.

మన దేవుడైన మోదీగారిని దూషించేవాళ్లను ఆయన క్షమించినా, మనం క్షమించకూడదు. అలాంటివాళ్ళందరినీ క్షమిస్తూ కూచుంటే, దేశద్రోహుల కుట్రలకు బలై, దేశం అధోగతి పాలవుతుంది. నిజాయితీపరులు, దేశభక్తులు, కాస్తైనా ఆలోచన ఉన్నవారందరూ కళ్లుతెరవాలి. మారుమాటలేకుండా మోదీగారిని, బీజేపీని సపోర్ట్ చేయాలి. దేశద్రోహుల పనిపట్టాలి.

దేశద్రోహుల ప్రచారాలను త్రిప్పికొట్టండి. మీమీ స్థాయిలలో ప్రతిఘటించండి. న్యాయాన్ని ధర్మాన్ని రక్షించండి.

బాగా గుర్తుంచుకోండి !

ధర్మం మౌనంగా ఉంటే, అధర్మానికి వంతపాడినట్లే అవుతుంది !