నింగీ నేలా కొండా కోనా చెట్టూ పిట్టా నదీ కడలీ నా నేస్తాలు.అవి నాతో మాట్లాడతాయి.తమ భావాలను నాతో చెప్పుకుంటాయి.మేం ఒకళ్ళ ఊసులను ఒకళ్ళతో చెప్పుకుంటాం.బాధలను కలబోసుకుంటాం.కలసి పయనం సాగిస్తాం.మా స్నేహం మచ్చలేనిది.మాయామర్మం ఎరుగనిది.కల్మషపు చేదును తెలియనిది.విశ్వాసం లేని మనుషులకంటే ప్రకృతి ఎంతో మంచి స్నేహితురాలు.
మొన్నొక రోజున ఏకాంతవాసంలో భాగంగా కడలి ఒడ్డున కొన్ని గంటలు మౌనంగా గడిపాను.తను నాతో ఎన్నో ఊసులు చెప్పింది.మనసు విప్పి...
31, మే 2013, శుక్రవారం
29, మే 2013, బుధవారం
గురుగ్రహ రాశిమార్పు -- ఫలితాలు
చాలామంది వారి వారి జీవితాలలో ఇంతకు ముందు కంటే కొన్ని మార్పులను గత కొద్దిరోజులుగా గమనించే ఉంటారు. ఒకవేళ గమనించకపోతే ఇప్పుడు చూచుకొండి.గత ఏడాదిగా మీ జీవితం నడుస్తున్న తీరుకీ ఇప్పటితీరుకీ మీకు తేడాలు ఖచ్చితంగా కనిపిస్తాయి.దానికి కారణం గురుగోచారంలోని మార్పు.
31-5-2013 న ఇప్పటివరకూ తానున్న వృషభరాశినుంచి మారి గురుగ్రహం మిధునరాశిలోకి ప్రవేశించ బోతున్నది. అక్కడ ఏడాది పాటు ఉంటుంది.ఆ సమయంలో మృగశిర ఆర్ద్ర పునర్వసు నక్షత్రాల మీద సంచరిస్తుంది....
లేబుళ్లు:
జ్యోతిషం
25, మే 2013, శనివారం
బుద్ధమతం అదృశ్యానికి కారణం
ప్రతి సంవత్సరమూ నేను అతి పవిత్రమైన రోజులుగా పరిగణించే కొన్ని రోజులలో బుద్ధపూర్ణిమ ఒకటి. ఈరోజుకోసం నేను నిజానికి ఎదురు చూస్తాను.కారణం ఏమంటే,బుద్ధుని నేను ఎంతో ఆరాధిస్తాను అభిమానిస్తాను.బుద్ధునివంటి మహానుభావుడు కొన్నివేల సంవత్సరాలకు గాని జన్మించడం జరగదు అనేది సత్యం.
బౌద్ధం మనదేశం నుంచి అదృశ్యం కావడానికి శంకరులు కారణం అని కొందరు దురుద్దేశ్య పూర్వకంగా బురద చల్లారు.అది పూర్తి నిజం కాదు.ఒక్క వ్యక్తివల్ల ఒకమతం నాశనం కావడం ఎన్నటికీ...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
23, మే 2013, గురువారం
తిక్కస్వామి తరగతిలో....
తనలో తానుండు వరకు
తనకున్నతి రాబోదోయ్
తనను తాను దాటినపుడె
తత్వమొంట బట్టేనోయ్
వేషధారులందరికి
వెంబడించి చెబుతున్నా
తత్వమెరుగ వలెనంటే
తనను తాను దాటిపోయి
తటిల్లతల లోకంలో
తళతళమని మెరవాలోయ్
వీధులలో తిరుగువాడు
ఇంటిలోకి చేరలేడు
ఇంటిలోనె యుండువాడు
వీధి సొగసు కానలేడు
దాగియున్న గుట్టునంత
విప్పి చెప్పబోతున్నా
ఇంటా బయటా నెగ్గిన
ఇష్టగురుని...
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు
18, మే 2013, శనివారం
శూన్యసముద్రం దిశగా...
నేలకట్లు తెంచుకోని
నీలిమబ్బు అలలు దాటి
శూన్యసముద్రం దిశగా
మనసు ఎగసిపోయింది
కుళ్ళు కంపు కొట్టుచున్న
మానవ బంధాలు విడచి
శుద్ధజలపు గంగోత్రిని
జలకమాడ సాగింది
మమతలన్ని మాయలనెడి
మహాసత్యమును దెలిసి
మాయాతీతపు స్వేచ్చను
మనసు వెదకి చూచింది
నానామోహ భ్రమలను
నగుబాట్లను నిలువరించు
సత్యాయుధ ఖడ్గమొకటి
మనసుకంది వచ్చింది
తనను పట్టి బంధించిన
మురికినంత...
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు
15, మే 2013, బుధవారం
సెక్స్ స్కాండల్స్ - రాహు కుజ శుక్రుల పాత్ర

భారత నేవీలో భార్యలను మార్చుకునే తతంగం (వైఫ్ స్వాపింగ్) నడుస్తోంది రక్షించమంటూ నేవీ అధికారుల భార్యలు న్యాయం కోసం పోరాడటం బయటకి వింతగా కనిపించినా,ఇలాంటివి హైసొసైటీ సర్కిళ్లలో కొన్నిచోట్ల సర్వ సాధారణమని చాలా ఏళ్ళనుంచీ వార్తలున్నాయి.కొన్నికొన్ని హై సర్కిళ్లలో జాకెట్ల పండుగలు జరుగుతాయని నేను ఇరవైఏళ్ళ క్రితమే చాలా నికార్సైన సమాచారాన్ని,అందులో పాల్గొన్న వ్యక్తి నుంచే విన్నాను.
తన సహచర అధికారులతోనూ...
లేబుళ్లు:
జ్యోతిషం
11, మే 2013, శనివారం
పాకిస్తాన్ జాతకం
మన చరిత్ర కారులు ఎప్పుడో చరిత్రకందని రోజులలో జరిగిన సంగతులు వారే చూచినట్లు పుస్తకాలు వ్రాసేస్తారు.వాటిని పాఠ్య పుస్తకాలుగా ప్రభుత్వం ఆమోదిస్తుంది.వక్రీకరించిన చరిత్రను మనం చదువుకుని అపార్ధాలు అపోహలు ఏర్పరచుకుంటాం.వాటిమీద వాదనలు ప్రతివాదనలు విభేదాలు కొనసాగుతూ ఉంటాయి.కాని విచిత్రమేమిటంటే చరిత్రలో పెద్ద విషయాలు కూడా కొన్ని మనం ఖచ్చితంగా చెప్పలేం.పాకిస్తాన్ దేశం ఎన్ని గంటలకు ఆవిర్భవించింది?అన్న ప్రశ్నకు సూటి జవాబు ఇప్పటిదాకా లేదుమరి....
లేబుళ్లు:
జ్యోతిషం
8, మే 2013, బుధవారం
దేశ జాతకం-వైశాఖ పాడ్యమి -2013

10 -5 -2013 న వైశాఖ పాడ్యమి కుండలి పరిశీలించి రాబోయే నెలలో మన దేశ రాష్ట్ర జాతకాలు ఎలా ఉంటాయో చూద్దాం. మొదటగా రాష్ట్ర పరిస్తితి ఎలా ఉన్నదో గమనిద్దాం. వైశాఖ మాస ప్రారంభంలో హైదరాబాద్ లో గ్రహస్తితి ఇలా ఉన్నది.
అగ్నితత్వ రాశిలో అన్ని గ్రహాల కూటమి వల్ల అగ్ని సంబంధ ప్రమాదాలు జరుగుతాయి.
ప్రతి విషయంలోనూ ప్రతిపక్షాల దాడిని తట్టుకోవడం ప్రభుత్వానికి కష్టం అవుతుంది.
పదిహేనురోజుల్లో రాబోయే పౌర్ణమి...
లేబుళ్లు:
జ్యోతిషం
6, మే 2013, సోమవారం
ఇపుడే తెలిసింది
నువ్వింతే..
ఎన్నేళ్ళు నీతో ఉన్నా
అర్ధం కావు
మాటలాడని మౌన చకోరంలా
నువ్వింతే
ఎన్నాళ్ళు నీకోసం వేచినా
రానేరావు
మరలిపోయిన మధుర వసంతంలా
నువ్వింతే
ఎన్ని బాధలను నీకోసం సైచినా
ఎటో ఎగిరిపోతావు
తిరిగి చూడని స్వేచ్చా విహంగంలా
ఎదురుచూచి ఎదురుచూచి
పగలంతా నీకోసం
రాత్రికి అలసి సొలసి
మాగన్నుగా నిద్రిస్తుంటే
ఏ నిశి రాత్రో విన్పించినట్లైంది
సుతిమెత్తగా...
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు
3, మే 2013, శుక్రవారం
ఎక్కడో వెతుకుతావెందుకు?
రాయీ రప్పల్లో
వెతుకుతావెందుకు నన్ను
ఇంకెక్కడా నేను లేనట్లు
లోహ పాషాణాలలో
చూస్తావెందుకు నన్ను
సజీవ ప్రతిమలలో లేనట్లు
తన రక్తాన్ని పాలుగా మార్చి
బిడ్డకు స్తన్యమిచ్చి
తన ఊపిరి దానికి నింపే
తల్లి ప్రేమలో లేనా నేను
లోకాన్నే ధిక్కరించి
ప్రాణాలకే తెగించి
ఏకమయ్యే ప్రేమికుల
మోహంలో లేనా నేను
లోకపు విలాసాల
నట్టనడిమధ్యలో
ఆకలితో...
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)