Internal enemy more dangerous than the external

10, జనవరి 2009, శనివారం

మకర రాశి జాతకులు జాగ్రత్త

మకర రాశిలో ప్రస్తుత గ్రహ కూటమి వల్ల ఆ రాశి జాతకులు అనేక బాధలు పడతారు. శారీరిక, మానసిక బాధలు వెంటాడతాయి. మోసాలకు గురి కావడం తప్పదు. చెడ్డ పేరు రావడం జరుగుతుంది. మకరంలో ఉత్తరాషాఢ మూడు పాదాలు , శ్రవణం నాలుగు పాదాలు, ధనిష్ఠ రెండు పాదాలు ఉంటాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో పుట్టిన జాతకులు, మకర లగ్న జాతకులు రాబోయే రెండు మూడు నెలలు నియమ నిష్టలు పాటిస్తూ దైవ ధ్యానంలో ఉండాలి. ఇతరులకు చేతనైన సాయం చేయండి. దురాలోచనలు, దుష్ట సాంగత్యం, చెడు పనులకు దూరంగా ఉండకపోతే ఫలితాలు దారుణంగా ఉండొచ్చు. వారి వారి ఇష్ట దైవ స్మరణ నిత్యం చేసుకుంటూ ఉంటే మంచిది. ఈ రాశికి ఎదురు రాశి కర్కాటకం వారు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచన. అంటే పునర్వసు నాలుగో పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలలో పుట్టిన వారు మరియు కర్కాటక లగ్నజాతకులు తస్మాత్ జాగ్రత్త.