Pages - Menu

▼

Pages

▼

31, అక్టోబర్ 2026, శనివారం

నేను చెబుతున్నది నిజమా కాదా?

ఏ రాశికైనా, మొదటి డిగ్రీ మరియు చివరి డిగ్రీ చాలా ప్రమాదకరమైనవి. ఏమంటే, గ్రహాలు రాశులు మారేసమయంలో వాటివాటి ప్రభావాలను హఠాత్తుగా చూపిస్తాయి. దానినే సంధ్యాప్రభావమంటారు. అవి రాశిసంధులైతే (కర్కాటక సింహాలు, వృశ్చిక ధనుస్సులు, మీనమేషాలు) ఆ ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

గురువు కర్కాటకాన్ని వదలిన మరుక్షణం ఆయనిస్తున్న రక్షణ మాయమౌతుందని మొన్ననే వ్రాశాను. గురునిష్క్రమణ తరువాత ఏమౌతుంది? నీచకుజుడు తన ప్రభావాన్ని వెంటనే చూపడం మొదలుపెడతాడు. అదే ఇప్పుడు జరిగింది.

నిన్న బెంగుళూరులో ఒక వింత సంఘటన జరిగింది. కాన్రాడ్ అనేది ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్. నిన్న సాయంత్రం హోళసూరులో ఉన్న ఆ హోటల్ మూడో అంతస్తులో,  స్విమ్మింగ్ పూల్ లో ఒక జర్మన్, ఒక స్లొవేకియన్ ఈత కొడుతున్నారు. జర్మనేమో లుఫ్తాన్సా  విమానంలో క్రూ ఉద్యోగి. స్లొవేకియనేమో ఇక్కడి IBM కంపెనీలో సీనియర్ ఉద్యోగి. ఏమైందో ఏమోగాని, స్విమ్మింగ్ పూల్లోకి విద్యుత్తు లీకైంది. ఈతకొడుతున్న ఇద్దరూ స్విమ్మింగ్ పూల్లోనే చనిపోయారు. వాళ్ళను రక్షించాలని ఒక అమెరికను, ఒక ఇండియన్ (అదే హోటల్ ఉద్యోగి) ప్రయత్నించి వాళ్ళు కూడా షాకులు తిన్నారు. అయితే, వెంటనే ఆస్పత్రిలో చేర్చడంతో వాళ్ళు బ్రతికి బయటపడ్డారు.

రక్షించాలని చూసినవాళ్లు పూల్  లోకి దూకి ఉండరు. బయటనుంచి ఏదో అందించాలని ప్రయత్నించి ఉండవచ్చు. అందుకే షాకులతో బయటపడ్డారు. లోపలికి దూకి ఉంటే, వీళ్ళు కూడా హరీమనేవారు. 

విద్యుత్తు ప్రమాదాలకు కుజుడు కారకుడని జ్యోతిషవిద్యార్థులకు తెలిసినదే. కర్కాటకరాశి జలతత్త్వరాశి. అది నీటిమడుగులకు, కొలనులకు, సరస్సులకు సూచిక.

ఇప్పుడర్థమైందా మరి !

ఎప్పుడైతే రక్షణకవచంగా ఉన్న గురువుయొక్క శక్తి పక్కకు తప్పుకోవడం మొదలైందో, కుజుని విధ్వంసకశక్తి వెంటనే పనిచేయడం మొదలుపెట్టింది. ఈ సంఘటన వెనుకనున్నదేమిటో స్పష్టంగా కనిపిస్తోందా లేదా?

ఇదే విధంగా మీమీ జీవితాలలో కూడా చూచుకోండి. ఇళ్లలో, ఆఫీసులలో, కరెంటు సమస్యలు రావడం, విద్యుత్తు ఆధారంగా నడిచే హీటర్లు, గీజర్లు, ఏసీలు, టీవీలు, లాప్టాపులు, మొబైళ్ళు పాడవడం, మొరాయించడం ఖచ్చితంగా జరిగి ఉంటాయి.

గురువు ప్రక్కకు తప్పుకున్నాడు. ఇంకా పదిరోజులపాటు కుజుడు కర్కాటకంలోనే ఉంటాడు. ఈ గ్రహస్థితి ఇంకా పదిరోజులపాటు ఉంటూనే  ఉంటుంది. మధ్యలో నవంబరు 8 న దీపావళి అమావాస్య వస్తున్నది. ఖచ్చితంగా 6 నుండి 10 లోపు చాలా జరుగుతాయి. పెద్దవే జరుగుతాయి. 

వేచిచూడండి. మరిన్ని న్యూసులు వినడానికి !

మానవజీవితంపైన గ్రహప్రభావమనేది రేపటి సూర్యోదయమంత నిజం !