Pages - Menu

Pages

24, మార్చి 2026, మంగళవారం

International Taijiquan Day



మార్చి 21 వ తేదీని 
International Taijiquan Day (అంతర్జాతీయ తైచి దినం) గా  UNESCO ప్రకటించింది.

మార్చి 21 అనేది చాలా పాతకాలం నుంచీ 'వసంత విషువత్ దినం' గా అనేకదేశాలలో పాటించబడుతూ వస్తున్నది. ఆయా దేశాలలో దీనిని రకరకాల పేర్లతో పిలుస్తారు.

జూన్ 21 ఇప్పటికే యోగా డే అయింది. ఇప్పుడు మార్చి 21 తైచి డే అయింది. మంచిదే. బాయ్ ప్రెండ్ డే, గర్ల్ ప్రెండ్ డే, ఎఫైర్స్ డే లాంటి దరిద్రాల బదులు తైచి డే, యోగా డే వంటివి మంచివి కదూ !

తాయ్ చి అనే చైనావారి వీరవిద్య ఇప్పుడు కోట్లాదిమందిచేత ప్రపంచవ్యాప్తంగా అభ్యాసం చేయబడుతూ వస్తున్నది.

అయితే, ఇది ఆత్మరక్షణ కోసం ప్రాక్టికల్ గా ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక వివాదాస్పదమైన విషయం అయినప్పటికీ, ఆరోగ్యపరంగా చూచినపుడు, రిలాక్సేషన్ వ్యాయామంగా, సీనియర్ సిటిజెన్స్ మరియు నడివయసుకు చేరిన ఆడవారు హాయిగా చేసుకునే శరీరవ్యాయామంగా గుర్తించబడింది.

దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి.

కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. ఇతర దీర్ఘవ్యాధులలో ఒక మంచివ్యాయామంగా ఉపయోగపడుతుంది. కదలికను మెరుగుపరుస్తుంది. flexibility ని బేలెన్స్ ను ఇస్తుంది. మంచి నిపుణుని దగ్గర నేర్చుకుని సరిగ్గా అభ్యాసం చేస్తే ప్రాణాన్ని బలోపేతం చేస్తుంది. ఆయుస్సును పెంచుతుంది.

ప్రస్తుతం నాకు 63 నడుస్తోంది. ఇప్పటికీ నేను యోగాభ్యాసాన్ని, మార్షల్ ఆర్ట్స్ ను చేస్తూనే ఉన్నాను. చాలామంది రెగ్యులర్ గా వేసుకునే మందులేవీ  ఇంతవరకూ నాకవసరం పడలేదు.  బీపీ, షుగర్, హార్ట్ సమస్య, ఊబకాయం, కీళ్ళనొప్పులు, అజీర్ణం, థైరాయిడ్ సమస్య, నిద్రసమస్యలు, ఆదుర్దా మొదలైనవాటిని ఇతరులు చెబుతుంటే నాకు నవ్వొస్తూ ఉంటుంది. వారిపైన జాలి కలుగుతుంది. జీవనవిధానం సరిగా లేనపుడు, ఇలాంటి రోగాలు రాక ఇంకేం వస్తాయి?

సరైన ఆహారం, సరైన వ్యాయామం, సరైన జీవనవిధానం ఈ మూడూ లోపించడమే నేటి రోగాలకు కారణం.

మొన్న 21 వ తేదీన మా ఆశ్రమంలో నేను చేసిన 'యాంగ్ స్టయిల్ తైచి' మొదటి భాగాన్ని పైనున్న వీడియో క్లిప్ లో చూడండి.

జూలైలో జరగబోయే ఆధ్యాత్మిక రిట్రీట్ నుండి, తైచి అభ్యాసాన్ని కూడా నా శిష్యులందరికీ నేర్పబోతున్నాను. ఇకనుంచీ, యోగాభ్యాసంతో బాటుగా దీనిని కూడా మా ఆశ్రమంలో క్రమం తప్పకుండా అభ్యాసం చేయడం జరుగుతుంది. ఎందుకంటే, రెండూ ప్రాణశక్తికి బలాన్నిచ్చి, దానిని సక్రమంగా ఉంచే అభ్యాసాలే.

కుంగ్ ఫు సూపర్ స్టార్ జెట్ లీ కూడా ఇప్పుడు తైచిని బాగా ప్రోమోట్ చేస్తున్నాడు. అతనికి థైరాయిడ్ సమస్య వచ్చి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రంగా  మొదలైనప్పటి నుండీ తైచి పైన గట్టిగా దృష్టిపెట్టినట్లు కనపడుతున్నది. బౌద్ధుడైన ఇతను ప్రస్తుతం, అమెరికాను వదలిపెట్టి,  సింగపూర్ కు మకాం మార్చాడు. తైచి ని ప్రోమోట్ చేస్తున్నాడు. ఇది మంచిపని.

వయసు 50 దాటిన తర్వాత, కండలను పెంచే హార్డ్ స్టయిల్ కుంగ్ ఫూ మంచిది కాదు. ప్రాణశక్తిని పెంచే ఇంటర్నల్ కుంగ్ ఫూ మంచిది.  దానిలో తైచి, బాగ్వా, జింగ్ యి అని మూడు విద్యలున్నాయి. మూడూ మంచివే. 50 దాటాక తైచి మంచిది.

'యోగాభ్యాసం చేయండి. తైచి అభ్యాసం చేయండి. ఆరోగ్యంగా జీవించండి', అని నా శిష్యులను, అభిమానులను కోరుతూ, ఈ సందర్భంగా జెట్ లీ కి, తైచి అభిమానులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.