Human ignorance is incurable

22, అక్టోబర్ 2018, సోమవారం

శబరిమల వివాదం - ఇంత గోల అవసరమా?

మెన్సెస్ జరిగే వయస్సులో ఉన్న ఆడవాళ్ళు కూడా శబరిమల గుడిలోకి వెళ్ళవచ్చని సుప్రీంకోర్టు మొన్నీమధ్యనే తీర్పు చెప్పింది. దశాబ్దాల నుంచీ అటక మీద మూలుగుతున్న వేలాది కేసులు ఆ కోర్టులో పెండింగ్ లొ ఉన్నాయి. అవన్నీ ఒదిలిపెట్టి ఇలాంటి తీర్పులను మాత్రం చాలా అర్జెంట్ గా ఇచ్చేస్తూ ఉంటుంది మన సుప్రీం కోర్టు !

ఇక గోల మొదలైంది. దేశంలో చాలాచోట్ల నుంచి పనీపాటా లేని ఆడాళ్ళు అక్కడికి వెళ్లాలని పొలోమంటూ ప్రయత్నించడమూ అయ్యప్ప భక్తులు రౌడీల లాగా ప్రవర్తిస్తూ వాళ్ళను బూతులు తిట్టి, రాళ్ళు విసిరి తరిమి కొట్టడమూ, అలా చెయ్యడం కోసం రోజుల తరబడి వాళ్ళు అడవిలో దాక్కోవడమూ మొదలైన డ్రామాలన్నీ శబరిమలలో జరుగుతున్నాయి.

ఈ మొత్తం ప్రహసనంలో పోలీసులు ఫూల్స్ అవుతున్నారు. కోర్టు తీర్పును వాళ్ళు అమలు పరచాలి. ఆలయంలోకి వెళ్ళాలి అనుకునే స్త్రీలకు వాళ్ళు రక్షణ కల్పించాలి. ఆడాళ్ళకు తోడుగా వెళ్ళకపోతే పై అధికారులు ఊరుకోరు. వెళితే అయ్యప్పలు రాళ్ళతో కొడుతున్నారు. మధ్యలో పోలీసులు చస్తున్నారు. అయ్యప్ప భక్తులేమో రౌడీలలాగా ప్రవర్తిస్తున్నారు. రౌడీలకు లా అండ్ ఆర్డర్ అంటే. అత్యున్నత న్యాయస్థానం అంటే, దాని తీర్పంటే ఏమిటో ఎలా తెలుస్తుంది?

ఇదే అదనుగా, రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేసి ఈ ఇష్యూను పొలిటికల్ గా మార్చి ఓట్లు దండుకునే పనిలో పడ్డాయి. కొన్నేమో ఈ తీర్పు మంచిదే అంటాయి. కొన్నేమో తప్పంటాయి. కానీ అందరికీ కావలసింది మాత్రం ఓట్లే. కొన్ని పార్టీలు వీధిరౌడీలకు అయ్యప్ప భక్తుల వేషాలేసి వాళ్ళని అడవిలో క్యాంప్ చేయించి వాళ్ళచేత ఆడాళ్ళను, పోలీసులను తరిమి కొట్టిస్తున్నాయని కొందరంటున్నారు. నిజానిజాలు దేవుడికే తెలియాలి !

డ్రామా మాత్రం చాలా రసవత్తరంగా జరుగుతోంది.

ఈ సందర్భంగా నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి.

1. సుప్రీం కోర్టు ఒక్క అయ్యప్ప గుడి విషయంలోనేనా? లేక దేశంలోని అన్ని ఇష్యూస్ లోనూ ఇలాగే తీర్పులిస్తుందా? మసీదుల్లోకి కూడా ఆడాళ్ళు రావచ్చని తీర్పునివ్వగలదా? ముస్లిం మహిళకు కూడా సమానత్వం కావాలి కదా? అసలు ఆమెకు బురఖా ఎందుకు? అది అవమానం కాదా? సుప్రీం కోర్టు బురఖాని బ్యాన్ చెయ్యగలదా? పోనీ ఏ రాజకీయ పార్టీ అన్నా అలాంటి చట్టం తేగలదా?

2. అసలు నన్నడిగితే ముస్లిం మహిళ బురఖా వేసుకోవడం ముస్లిమ్ మొగాళ్ళకే అవమానం అంటాను. ఎందుకో వినండి. అసలు బురఖా ఎందుకు వేసుకుంటారు? అది వేసుకోకపోతే ఆడదాని అందం బయటకు కనిపిస్తుందట. అలా కన్పిస్తే నేరాలు ఘోరాలు జరుగుతాయట. అందుకని అలా మొత్తం కప్పుకుని ఉండాలట. ఈ మాటను కొందరు ముస్లిమ్ స్నేహితులే నాకు చెప్పారు.

వాళ్ళు ఇంకోమాట కూడా చెప్పారు. మసీదులలోకి ఆడాళ్ళను రానిచ్చి వాళ్లను కూడా మగాళ్ళ పక్కనే నిలబడి నమాజ్ చెయ్యడానికి అనుమతిస్తే, అక్కడున్న మగాళ్ళు ఎవరూ నమాజ్ చెయ్యలేరట. వాళ్ళ దృష్టి అంతా ఆడాళ్ళ మీదే ఉంటుందట. అక్కడ రేపులు జరిగినా జరగొచ్చట. అందుకనే, ఎంతో దూరదృష్టితో మహమ్మద్ అలాంటి నియమం పెట్టాడట !

ఇదంతా విని నాకు పొట్ట చెక్కలయ్యే నవ్వొచ్చింది. ముస్లిమ్స్ లొ మగాళ్ళకు అంతగా సెల్ఫ్ కంట్రోల్ లేదన్నమాట. పక్కన నిలబడి కళ్ళు మూసుకుని అల్లాను ప్రేయర్ చేస్తున్న ఆడదాన్ని కూడా వాళ్ళు కామదృష్టితోనే చూస్తారన్నమాట. అవున్లే ! ఇస్లాం ప్రకారం ఆడదానికి ఆత్మే లేదుకదా. అదొక వాడి పారేసే వస్తువు లాంటిది. ఎవడికి బలం ఉంటే వాడు దాన్ని ఎంజాయ్ చెయ్యవచ్చు. అందుకనే, కళ్ళు తప్ప ఇంకేమీ కనపడకుండా మొత్తం బురఖాలో కప్పేశారు ఆడాళ్ళను.

ఈ బురఖా ఏం చెప్తోందసలు? "ఒరే మొగ వెధవల్లారా ! మీరంతా మృగాలు.  మీకు మానవత్వం లేదు. మీరు మనుషులు కారు, జంతువులు. కనుక మిమ్మల్నించి దాక్కోడానికి మేము ఇలా ఒళ్లంతా కప్పుకుంటున్నాము" - అని చెప్తోంది. ఈ విషయం అర్ధమైతే ముస్లిమ్స్ అందరూ సిగ్గుతో చచ్చిపోవాలి. ఇది అర్ధంగాక, అదేదో గొప్ప రెలిజియస్ నియమం అని భ్రమిస్తూ విర్రవీగుతున్నారు వాళ్ళు !! లోకం ఎంత మాయలో ఎంత అజ్ఞానంలో ఉందిరా దేవుడా ?? అనిపించింది నాకు.

3. సొసైటీలో సమానత్వం అంతగా కావాలంటే ముందుగా రిజర్వేషన్స్ ని రద్దు చెయ్యాలి. రిజర్వేషన్లతో ఒక పక్క దేశాన్ని కులాల వారీగా చీలుస్తూ, మళ్ళీ సమానత్వం ఏంటో నాకైతే ఎప్పుడూ అర్ధం కాదు. ఈ పనిని సుప్రీం కోర్టు చెయ్యగలదా? లేక రాజకీయ పార్టీలు చెయ్యగలవా? అంత ధైర్యం వాటికుందా? కులాల పరంగా, మతాల పరంగా ఇన్ని లుకలుకలున్న మన సమాజంలో సమానత్వం ఎలా వస్తుందసలు? అది జరిగే పనేనా?

4. ఈ దేశపు అత్యున్నత న్యాయస్థానం అంటే కూడా ఎవడికీ లెక్కలేదన్న విషయం అయ్యప్పల తిరుగుబాటు చూస్తే తెలుస్తోంది. వాళ్లకు వాళ్ళ రెలిజియస్ మూర్ఖత్వమే కరెక్ట్ గాని, న్యాయస్థానం, చట్టం, రాజ్యాంగం అనే పదాలు ఏవీ వాళ్లకు తెలీవు. అందుకే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసుల్ని కూడా ఎటాక్ చేస్తున్నారు. వీధి రౌడీల లాగా ప్రవర్తిస్తున్నారు. మన దేశంలో లా అండ్ ఆర్డర్ అనేది పెద్ద ఫార్స్ అన్న విషయం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు కరెక్ట్ గా తెలుస్తూ ఉంటుంది.

4. పోనీ ఈ అయ్యప్ప భక్తులు ఏమన్నా ఆజన్మబ్రహ్మచారులా అంటే అదీ లేదు. బోడి నలభైరోజుల పాటు ఉగ్గబట్టుకుని ఉండే దీక్షకు ఇంత పోజొకటి !! వాళ్ళు నిజంగా బ్రహ్మచర్యం పాటించాలంటే, అయ్యప్ప లాగా, అస్సలు పెళ్లి జోలికి పోకుండా ఉండాలి. అమ్మాయి వైపు చూడకుండా నిజంగా ఆజన్మబ్రహ్మచారులై ఉండాలి. అలా ఉండి అప్పుడు మాట్లాడమంటే సరి ! ఒక్కడు కూడా ఆ గుళ్ళో కనిపించడు ! మొక్కుబడి కోసం చేసే దీక్షకు కూడా ఎంత పోజురా దేవుడా? అనిపిస్తోంది.

5. అసలు, ఆడదంటే అంత ద్వేషం ఎందుకో వీళ్ళకి? వాళ్ళ అమ్మ ఆడది కాదా? కూతురు ఆడది కాదా? అక్కలు చెల్లెళ్ళు ఆడవాళ్ళు కారా? ఈ బోడి దీక్ష తర్వాత కావలసివచ్చే పెళ్ళాం ఆడది కాదా? నలభై రోజులు పనికిరాని ఆడది సడన్ గా నలభై ఒకటో రోజున ఎలా పనికి వస్తుందో? ఏంటో ఇదంతా? గుడిలోకి ఆడవాళ్ళు వస్తామంటే అంత కోపం ఎందుకు వీళ్ళకి? ఆ వచ్చే ఆడవాళ్ళు మెన్సస్ ఏజ్ లో ఉన్నారుగాని మెన్సస్ టైంలో గుళ్ళోకి రావడం లేదు కదా? ఎందుకంత అభ్యంతరం? ఒకవేళ అభ్యంతరం ఉన్నప్పుడు మాలికా పురత్తమ్మ అనే ఆవిడను వీళ్ళు ఎలా కొలుస్తున్నారసలు? ఆవిడ ముసలమ్మ కాదు కదా? పెళ్లి చేసుకునే వయసులోనే ఉంది కదా? అప్పుడు వీళ్ళకు అభ్యంతరం రాలేదా? ఒక ఆడదాన్ని కొలుస్తూ ఇంకో ఆడదాన్ని గుడిలోకి రావద్దు అనడం ఏంటసలు? దీనికి ఏం పేరు పెట్టాలి? మనసులో అంత ద్వేషం, కోపం, సుపీరియారిటీ ఫీలింగ్ ఉన్నవాళ్ళకు దైవత్వం ఎలా వస్తుంది? ఎక్కడనుంచి వస్తుంది?

6. అయ్యప్ప దేవాలయ ప్రధాన పూజారి, చెన్నైలో తన కీప్ ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అదేంటి మరి? అతను బ్రహ్మచారి ఎలా అవుతాడు? బ్రహ్మచారి కానివాడు అయ్యప్పకు ప్రధాన పూజారి ఎలా అవుతాడు? అది తప్పు కాదా? కీప్ తో కులుకుతున్నవాడు అయ్యప్పకి డైరెక్ట్ గా పూజలు చెయ్యగా లేనిది, ఒక ఆడది భక్తిగా గుడిలోకి వస్తే తప్పేముంది?

దీనిలో ఇంకో కోణాన్ని ఇప్పుడు గమనిద్దాం.

7. పోనీ కోర్టు ఏదో తీర్పు ఇచ్చిందే అనుకుందాం. ఈ ఆడాళ్ళకు వేరే పనీ పాటా లేదా? ఏం ఆ గుళ్ళోకి ఎగురుకుంటూ పోకపోతే ఏమైంది? దేశంలో కొన్ని వేల గుళ్ళున్నాయి కదా! అంతగా భక్తి పగిలిపోతూ ఉంటే ఆ గుళ్ళన్నీ తిరగొచ్చు కదా? అదే గుళ్ళోకి మేము కూడా పోతాం అంటూ, రాళ్ళదెబ్బలు, తిట్లు, చీదరింపులు భరిస్తూ అక్కడికి పోకపోతే ఏం? అయ్యప్ప గుడికి పోయోస్తే ఏమొస్తుంది? ముప్పై ఏళ్ళ నించీ ఆ గుడికి పోతూ దీక్ష చేస్తున్నవాళ్ళకే ఏమీ రాలేదు. మీకేమొస్తుంది అక్కడ?

వాళ్ళు "రావద్దు" అని చెబుతుంటే "మేం వస్తాం" అని మీకెందుకంత పట్టుదల? చేతనైతే మీరు కూడా ఒక దేవత గుడి కట్టుకుని అక్కడకు మగాళ్ళను రానివ్వకండి. మీ ఇద్దరి దీక్షలూ అయిపోయాక మళ్ళీ ఒకే ఇంట్లో ఇద్దరూ చక్కగా సంసారం చేసుకోవచ్చు !!

ఏడాదిలో నలభై రోజులు ఉగ్గబట్టుకున్నంత మాత్రాన ఏమొస్తుంది అన్న జ్ఞానం లేని కొందరు, వాళ్ళు వద్దంటున్నా సరే అక్కడికే మేం పోతాం అనేవాళ్ళు మరికొందరు - భలే సొసైటీరా బాబూ !

ఎంత చెత్త సొసైటీలో బ్రతుకుతున్నామో మనం! రోజురోజుకూ ఈ దేశమన్నా ఈ దేశపు మనుషులన్నా చీదర పెరిగిపోతోంది నాకు. సిద్ధాంతపరంగా ఇండియా ఎంత వెనుకబడిన దేశమో, ఎంతగా చట్టరహిత దేశమో, ఎంత ఆటవిక దేశమో ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్న తర్వాత నేనొక ఇండియన్ అని చెప్పుకోవాలంటేనే సిగ్గేస్తోంది !

ఇలాంటి మనుషులతో నిండి ఉన్న ఈ దేశం బాగుపడటం కల్ల అనిపిస్తోంది నాకు. అక్రమంగానో, సక్రమంగానో డబ్బు సంపాదించవచ్చు, కానీ సంస్కారం ఎక్కడనుంచి వస్తుంది ఈ గొర్రెలకు??