Our Ashram - A beacon light to the world

1, అక్టోబర్ 2017, ఆదివారం

జీసస్ క్రీస్ట్ జాతక విశ్లేషణ - 4

ఇంకొందరు వారి రీసెర్చిలో 11-9-03 BC అనే తేదీని జీసస్ జనన తేదీగా నిర్ధారించారు. ఆ రీసేర్చిని ఈ క్రింది లింక్ లో చూడవచ్చు. అయితే ఈ రీసెర్చిలో తర్కం కంటే - చరిత్ర కంటే - మూఢనమ్మకాలూ, బైబిల్లో చెప్పబడిన కొన్ని అసంబద్ధమైన day of trumpets, revelations వంటి అసంబద్ధ విషయాలే జీసస్ జననతేదీకి ఆధారాలుగా తీసుకోబడ్డాయి. కానీ, ఇలాంటి గుడ్డి నమ్మకాలు ఎన్నెన్ని రకాలుగా చెప్పినా, గ్రహాలు అబద్దం చెప్పవు గనుక,  ఆ తేదీకి వేసిన జాతకంలో ఆ మహాపురుష లక్షణాలు కనిపించాలి. లేకపోతే ఆ సమయం కరెక్ట్ కాదు అనేదే తేలుతుంది.

కనుక ఈ తేదీకి వచ్చే జాతకానికి ఉన్న లక్షణాలను గమనిద్దాం.

https://goodnessofgodministries.wordpress.com/2011/12/22/when-was-jesus-christ-born-the-bible-says-september-11-3bc-the-day-of-the-feast-of-trumpets/

ఈ చార్ట్ లో మళ్ళీ కర్కాటక లగ్నమే అయింది. గురువు సింహరాశిలో ఆరు డిగ్రీల ప్రాంతంలో ఉంటూ 'రెగులస్' (మఖా నక్షత్రం) కు చాలా దగ్గరగా ఉన్నాడు. చంద్రుడు మళ్ళీ నీచస్థితిలో ఉంటూ తల్లికి ఉన్న మనోవేదనను సూచిస్తున్నాడు. అలాగే, ఈ జాతకునికి కూడా ఈ మనోవేదన ఉందన్న విషయాన్ని సూచిస్తున్నాడు. జాతకం -2 లో కూడా ఇదే యోగం ఉంది. కానీ దానిలో పంచమాదిపతి అయిన కుజుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు. ఈ జాతకంలో పరిస్థితి అలా లేకపోగా ఇందులో కుజుడు సప్తమంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. అంటే, దూరదేశంలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించాడని సూచన ఉన్నది. మకరం భారతదేశానికి సూచిక గనుక ఈయన missing years లో ఇండియాకు వచ్చాడని ఈ జాతకం చెబుతున్నది. నవాంశలో కూడా కుజుడు ద్వాదశంలో ఉంటూ వేరే దేశానికి పోవడాన్ని సూచిస్తున్నాడు.

సామాన్య జనాన్ని సూచించే శనీశ్వరుడు వక్ర స్థితిలో నీచ స్థితిలో పడుతూ, లోకంలోని జనసమూహంతో ఈయనకున్న బలీయమైన కర్మసంబందాన్ని సూచిస్తున్నాడు. ఇతరుల కర్మను తను మోసే ఖర్మను ఈ యోగం సూచిస్తుంది. సామాన్యంగా శనీశ్వరుడు నీచస్థితిలో పైగా వక్రస్థితిలో ఉన్న జాతకాలను cursed charts అంటారు. పూర్వజన్మలలో ఎంతో చెడుఖర్మ చేసుకుని ఉంటె తప్ప అలాంటి గ్రహయోగం ఉన్నప్పుడు జన్మ తీసుకోవడం జరగదు. అలాంటి జాతకాలు దైవత్వం ఉన్న జాతకాలని చెప్పలేము. పైగా, ఈ జాతకంలో శుక్రుడు కన్యారాశిలోకి వెళ్లిపోవడంతో సింహరాశిలో star of Bethlehem ఏర్పడే సూచన లేదు.

ఈ జాతకంలో పన్నెండో ఏట బుధదశ మొదలౌతున్నది. ఈ జాతకంలో బుధుడు తృతీయంలో ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. దూరదేశాన్ని సూచించడం లేదు. అయితే, ఈ బుధదశకూడా సరిగ్గా 17 ఏళ్ళు (25 AD) వరకూ జరుగుతూ జీసస్ జీవితంలో missing years అయిన 18 ఏళ్లతో చాలా దగ్గరగా సరిపోతున్నది.

ఆ తర్వాత మొదలైన కేతుదశలో శుక్ర అంతరంలో గాని, రవి అంతరంలో గాని ఈయన స్వదేశానికి తిరిగివెళ్లి ఉండాలి. కేతువుకీ స్వదేశానికి తిరిగి రావడానికీ సంబంధం కనిపించడం లేదు. అయితే, చతుర్ధాదిపతిగా శుక్రుడు మూడింట నీచలో ఉన్నాడు. సూర్యునితో కలసి ఉన్నాడు. కనుక అది శుక్ర అంతరం అయినా సూర్య అంతరం అయినా, తన దేశంలో తనవాళ్లైన యూదులతో గొడవలు విరోధాలు కనిపిస్తున్నాయి.

తర్వాత కేతు-గురువులో దాదాపుగా 33 ఏళ్ళ వయసులో ఈయనకు శిలువశిక్ష పడి ఉండాలి. ఇది కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా గురువు ఈ లగ్నానికి నవమాదిపతి గనుక మరణశిక్ష పడేటంతగా,అందులోనూ క్రూరంగా శిలువ వేసి చంపేటంత  హాని చెయ్యడు. కనుక ఇదీ సరిపోలేదు.

ఈ రకంగా చూస్తే, ఈ జాతకం జీసస్ జీవితంలో అంత బాగా సరిపోవడం లేదు. ఇంకా చూస్తే,  ఈ జాతకంలో కూడా ఒక అవతారపురుషుని స్థాయి యోగాలు ఏ మూలకూ కనిపించడం లేదు.

పైన ఇచ్చిన లింక్ లో ఉన్న ఎనాలిసిస్ లో కొంత లాజిక్కూ ఉన్నది, అయితే ఎక్కువభాగం గుడ్డి నమ్మకమూ, బైబిల్లోని Revelations అనే చాప్టర్ లో ఇవ్వబడిన hallucinations వంటి వివరాలను మసిపూసి మారేడుకాయ చేసి జీసస్ జననంతో అతకాలని చేసిన ప్రయత్నమూ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. Revelations అనే చాప్టర్ లో ఉన్న విషయాలన్నీ ఒక డ్రగ్ తీసుకున్నవాడికో లేదా ఒక బాగా త్రాగి పడిపోయినవాడికో కనిపించే భ్రమపూరిత గందరగోళ దృశ్యాల వంటి దృశ్యాలేగాని వాటికంటూ ఒక అర్ధమూ పర్ధమూ ఉండదు (వాటికొక అర్ధాన్ని మనం కల్పించి చెబితే తప్ప).

ఒకవేళ ఈ Revelations అనే అర్ధంపర్ధం లేని దృశ్యాలు నిజాలే అనుకున్నప్పటికీ, వాటిల్లో చూపబడిన ప్రసవ వేదన పడుతున్న స్త్రీ, జీసస్ తల్లియైన మిరియం (మేరీ) కాదు. బానిసత్వంలో మగ్గుతున్న ఇజ్రాయెల్ దేశానికి ఆ స్త్రీ ఒక సింబల్ మాత్రమే. ఆమె నెత్తిమీద ఉన్న పన్నెండు నక్షత్రాలూ యూదుల పన్నెండు జాతుల గోత్రాలకు సూచికలు. అంతేతప్ప ఈ దృశ్యం జీసస్ జననవివరాలకు సూచిక కాదు. ఎందుకంటే, బైబిల్ లో ప్రధాన అంశం ఒక్కటే. అదేంటంటే - యూదులు అనేవాళ్ళు దేవుని స్వకీయ జనం (Chosen people of God). కానీ వాళ్ళు వేలాది సంవత్సరాలుగా అనేక దేశాలకు బానిసలుగా పడున్నారు. వారిని ఉద్దరిస్తాననీ, వారికి ఒక దేశం ఏర్పాటు చేస్తాననీ, వారందరినీ ఒకచోటికి చేరుస్తాననీ, దానికోసం ఒక రాజులాంటి యోధుడిని వారిలో పుట్టిస్తాననీ, అతను ఆ ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం తెస్తాడనీ దేవుడు చేసిన ప్రామిస్ లే బైబిల్ లోని ప్రధానమైన అంశం. ఓల్డ్ టెస్టమెంట్ గానీ న్యూ టెస్టమెంట్ గానీ - ఏదైనా సరే- కధ మొత్తం ఈ ఒక్క అంశం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

ఈ అంశాన్ని గుడ్డిగా నమ్ముతున్నవారు ముందు డేవిడ్ నూ, ఆ తర్వాత సాల్మన్ నూ, ఆ తర్వాత మోషే నూ - ఇలా వరుసగా ఎవరు వాళ్లకు దారిచూపగలిగే మనిషిగా కాస్త కనిపిస్తే - అతడే ఈ promised man అని నమ్ముతూ వచ్చారు. కానీ ప్రతిసారీ వాళ్ళ నమ్మకాలు ఫెయిల్ అవుతూ వచ్చాయి.

జీసస్ ఒక్కడే లోకరక్షకుడనీ, అతను తప్ప ఇంకెవరూ లోకాన్ని ఉద్దరించలేరనీ ఇలాంటి అబద్దాలన్నీ సెయింట్ పాలూ, క్రీస్తు శిష్యులూ కలసి తర్వాత కాలంలో అల్లిన కట్టుకధలు మాత్రమే. ఓల్డ్ టెస్టమెంట్ లో ఇవేవీ చెప్పబడలేదు. అందుకనే యూదులు ఈనాటికీ క్రీస్తునూ క్రైస్తవాన్నీ నమ్మడం లేదు. ఓల్డ్ టెస్టమెంట్ లో చెప్పబడిన promised man ఇంకా వస్తాడనే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. క్రైస్తవులు కూడా క్రీస్తు మళ్ళీ వస్తాడని 2000 సంవత్సరాలుగా గుడ్డిగా నమ్ముతూ ఎదురుచూస్తున్నారు. ఆయనేమో ఎక్కడా కనిపించడం లేదు సరిగదా ఆయన మళ్ళీ వస్తున్న జాడా జవాబూ ఎక్కడా గోచరించడం లేదు.

కానీ రెండువేల సంవత్సరాల కాలం నాటి సెయింట్ పాల్ నుంచీ నేటివరకూ ప్రతి తరంలోనూ 'ఆయన త్వరగా వచ్చుచున్నాడు, Jesus is coming soon ' అనే అబద్దాన్ని ఇంకా ఇంకా ప్రచారం చేస్తూ, ప్రతితరంలోనూ లోకాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. 

క్రైస్తవంలో ఉన్న ఈ మూఢనమ్మకాలన్నింటినీ అలా ఉంచితే, ఈ జాతకం జీసస్ జీవితంలో పూర్తిగా సరిపోవడం లేదు. కనుక ఈ జాతకాన్ని కూడా తిరస్కరించడం జరిగింది.

(ఇంకా ఉంది)