Everything is real, because the seer is real

27, సెప్టెంబర్ 2017, బుధవారం

జీసస్ క్రీస్ట్ - జాతక విశ్లేషణ - 1

జీసస్ క్రీస్ట్ జననతేదీ ఇంతవరకూ ఎవరికీ తెలియదు. ఎందుకంటే దీనికి ఎక్కడా స్పష్టమైన ఆధారాలు లేవు. ఆయన జనన సమయాన్ని రికార్డ్ చేసి ఉంచేటంత ఖగోళ పరిజ్ఞానం ఆయన తల్లిదండ్రులకు గాని, ఆ సమయంలో చుట్టూ ఉన్న గొర్రెల కాపరులకు గాని ఎవరికీ లేదు.

క్రైస్తవ తియాలజీలో కూడా ఈయన జనన సంవత్సరం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు జీసస్ అనేవాడే పుట్టలేదు ఇదంతా కొందరు అల్లిన కట్టుకధ అని కూడా పాశ్చాత్య దేశాలలో అనేక వాదాలున్నాయి. ఎందుకంటే చరిత్రలో క్రీస్తుకు సంబంధించి క్రీస్తు శిష్యులు తమ తమ గాస్పెల్స్ లో వ్రాసిన విషయాలు తప్పిస్తే వేరే ఆధారాలు ఏవీ లేవు. అప్పటి చరిత్రకారులు ఎవరూ క్రీస్తు అనబడే ఒక వ్యక్తిని గురించి ప్రముఖంగా వ్రాయలేదు. కారణం ఏమంటే - క్రీస్తు బ్రతికున్న సమయంలో ఆయనొక ప్రముఖ వ్యక్తి కాడు. ఆయన్ను గురువుగా నమ్మిన అతి కొద్దిమంది గుంపుకు ఆయన గురువు అంతేగాని తను బ్రతికున్న సమయంలో చారిత్రకంగా కానీ, రాజకీయంగా కానీ, మతపరంగా కానీ ఆయన పేరు ఎవరికీ తెలియదు. అంతేకాదు క్రీస్తు తర్వాత కూడా దాదాపు మూడు వందల సంవత్సరాల వరకూ క్రిష్టియానిటీ ఒక నిర్దుష్టమైన బలమైన మతంగా రూపుదిద్దుకోలేదు. ఆ తర్వాత కాలంలో మాత్రమే క్రమేణా అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

అయితే, ప్రస్తుతకాలంలో పాశ్చాత్య దేశాలలో కూడా క్రీస్తును నమ్మేవారి సంఖ్య ఏడాదికేడాది గణనీయంగా తగ్గిపోతున్నది. చాలా చోట్ల అక్కడ చర్చిలన్నీ బోసిపోతున్నాయి వాటిని ఫంక్షన్ హాల్స్ గా అద్దెలకిస్తున్నారు. అందుకనే ఆ డబ్బులన్నీ థర్డ్ వరల్డ్ దేశాలకు మరలించి ఇక్కడ మతప్రచారం ఉధృతం చేస్తున్నారు. దీనికి గల కారణం ఏమంటే - బైబుల్ లో ఉన్న బోధనలు చాలావరకూ నేటి సైన్స్ కు విరుద్ధంగా ఉండటమే. కనుక వెస్ట్ లో సైన్స్ పెరిగేకొద్దీ బైబుల్ ని నమ్మేవారి సంఖ్య తగ్గిపోతూ వస్తున్నది. అక్కడ వారం వారం చర్చిలకు వెళ్ళేవారు కూడా బైబుల్ లో ఉన్నవన్నీ నిజాలే అని నమ్మడం లేదు. అందుకనే, నిరక్షరాశ్యతా, దరిద్రమూ, రోగాలూ, అపరిశుభ్రతా, కులాలూ మొదలైనవి ఉన్న థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో మాత్రమే క్రైస్తవబోధనా మతమార్పిడులూ ఎక్కువగా జరుగుతున్నాయి. వెస్ట్ లో మాత్రం క్రీస్తుభక్తులు నానాటికీ తగ్గిపోతున్నారు.

అయితే, ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో కూడా, క్రీస్తు చెప్పిన అసలైన బోధనలను మాత్రం ఈ బోధకులెవ్వరూ ప్రచారం చెయ్యడం లేదు. సెయింట్ పాల్ చేతిలో వక్రీకరించబడిన క్రైస్తవాన్ని మాత్రమే జనం మీద రుద్ది, డబ్బు ఎరచూపి, కులవిద్వేషాలను రెచ్చగొట్టి, అమాయకులను,ఇతర కులాల మీద కోపంగా ఉన్నవారినీ, తేలికగా బుట్టలో పడేవారినీ మాయ చేసి మతం మారుస్తున్నారు. ఈ విషయాన్ని ముందు ముందు వేరే పోస్టులలో చూద్దాం. ప్రస్తుతానికి క్రీస్తు జననకాల సంస్కరణ మాత్రమే చేద్దాం.

వివేకానందస్వామి జీవితంలో కూడా క్రీస్తు చారిత్రకతకు సంబంధించి ఒక సంఘటన జరిగింది.

ఆయన అమెరికా నుంచి ఓడలో తిరిగి వస్తుండగా నిద్రలో ఆయనకొక కల వచ్చింది. ఆ కలలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక గడ్డం వ్యక్తి కనిపించి 'క్రీస్తు అనేవాడు అసలు పుట్టనే లేదు. అది అల్లబడిన కధ. కైరో లోని ఈ ప్రాంతంలో త్రవ్వితే నేను చెబుతున్న దానికి ఆధారాలు దొరుకుతాయి'. అంటూ ఒక ప్రదేశాన్ని చూపిస్తాడు. స్వామి వెంటనే నిద్రలేచి ఓడ ఏ ప్రాంతంలో పోతున్నదని అడిగితే కైరో కు దగ్గరలో ఉన్నామని కెప్టెన్ జవాబిస్తాడు.

అయితే, ఈ కల యొక్క అర్ధం ఏమిటి? అసలు క్రీస్తు పుట్టాడా? లేక ఇదంతా మతప్రచారం కోసం చర్చి మరియు రోమన్ రాజులు కలసి అల్లిన కధా? అనే వాదవివాదాల జోలికి నేను ప్రస్తుతం పోదలుచుకోలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం - ఈ గడ్డం వ్యక్తి ఎవరో ఒక ముస్లిం సెయింట్ అనీ, వీళ్ళు క్రీస్తు కంటే మహమ్మద్ అధికుడని అనుకుంటారు గనుక, వివేకానందస్వామి కలలో అతనలా కనిపించి అలా చెప్పాడని నేను అనుకుంటున్నాను.

ఏది ఏమైనా, కోట్లాది మంది క్రీస్తును నమ్ముతున్నారు గనుక అతడు చారిత్రక వ్యక్తి అనేమాట నిజమే అనుకుని ప్రస్తుతం జ్యోతిశ్శాస్త్ర పరంగా ఆయన జననతేదీని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను.

అందరూ అనుకునేటట్లు జీసస్ జనన తేదీ డిసెంబర్ 25 కాదు. అంతవరకూ చారిత్రిక పరిశోధకులు ఒప్పుకుంటున్నారు. అలాగే ఆయన సరిగ్గా 0 సంవత్సరంలో పుట్టనూ లేదు. ఎందుకంటే అసలు సున్నా సంవత్సరం అనేది చరిత్రలో లేనే లేదు. క్రీ.పూ 1 నుంచి క్రీ.శ.1 అనేది వెంటనే మొదలౌతుంది గాని మధ్యలో సున్నా సంవత్సరం అనేది రాదు.

చాలామంది పాశ్చాత్య పరిశోధకులు తేల్చిన విషయం ఏమంటే - క్రీస్తు పుట్టినది క్రీ.పూ 6 నుంచి 2 మధ్యలోనని. దీనికి వారు చూపిన కారణాలు ఇవి ---

1. క్రీస్తును సిలువ వెయ్యమని ఆజ్ఞాపించిన రోమన్ గవర్నర్ Pontias Pilate పదవిలో ఉన్నది క్రీ.శ. 26 నుంచి 36 మధ్యలోనని చరిత్ర చెబుతున్నది. ఈయన రోమన్ చక్రవర్తి సీజర్ టైబీరియస్ క్రింద జుడియా ప్రాంతానికి గవర్నర్ గా ఉండేవాడు. టైబీరియస్ తర్వాత కలిగులా అనేవాడు రోమన్ చక్రవర్తి అయ్యాడు. శిలువ వెయ్యబడే సమయానికి జీసస్ కు దాదాపు 33 ఏళ్ళు కాబట్టి క్రీస్తు జననం ఎక్కువలో ఎక్కువగా క్రీ.పూ 6 లోపు జరిగి ఉండాలి.

2. హీరోద్ అనే రాజు పాలించిన కాలంలో క్రీస్తు పుట్టినట్లు సామాన్యంగా లోకం భావిస్తున్నది. ఈ హీరోడ్ అనేవాడు క్రీ.పూ 1 లో చనిపోయినట్లు ఇప్పుడు చరిత్ర చెబుతున్నది. కనుక ఆ సమయానికి క్రీస్తుకు 2 ఏళ్ళుగా ఉండాలి. ఎందుకంటే రెండేళ్ళ వయస్సులో ఉన్న బెత్లేహాం పిల్లల్ని అందరినీ చంపమని హీరోడ్ ఆజ్ఞాపించాడు. అంటే క్రీ.పూ 3 సంవత్సర ప్రాంతంలో జీసస్ పుట్టి ఉండాలి.

3. "గాస్పెల్ ఆఫ్ లూక్" ప్రకారం జాన్ ది బాప్టిస్ట్ అనేవాడు సీజర్  టైబీరియస్ రాజ్యానికొచ్చిన పదిహేనో సంవత్సరంలో తన బోధనలు మొదలు పెట్టాడు. ఈ టైబీరియస్ అనేవాడు క్రీ.శ. 14 లో సీజర్ అగస్టస్ అనేవాడు చనిపోయాక సింహాసనం ఎక్కాడు. అంటే, క్రీ.శ. 29 లో జాన్ ద బాప్టిస్ట్ అనేవాడు ప్రజలలోకొచ్చి తన బోధనలు చెయ్యడం మొదలు పెట్టాడు. అదే సమయంలోనే అతను జీసస్ కు బాప్టిజం ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దికాలానికే జీసస్ కూడా తన బోధనలు ప్రారంభించాడు. అప్పటికి జీసస్ కు దాదాపు 30 ఏళ్ళ వయసని గాస్పెల్స్ అంటున్నాయి. ఆ తర్వాత ఆయన దాదాపు మూడున్నరేళ్ళు మాత్రమే తన ప్రచారం సాగించాడు. శిలువ వెయ్యబడే సమయానికి ఆయనకు దాదాపుగా 33 ఏళ్ళు అటూ ఇటూగా ఉండవచ్చు. కనుక ఆయన పుట్టింది క్రీ.పూ. 2-3 ప్రాంతంలో అనిపిస్తుంది.

క్రీస్తును శిలువ వేసిన రోజును క్రీ.శ.1733 లో సర్ ఐజాక్ న్యూటన్ లెక్కించాడు. న్యూటన్ ఒక సైంటిస్టు గానే లోకానికి తెలుసు కానీ అతను ఒక ఖగోళ జ్యోతిష శాస్త్రవేత్త కూడా అని చాలామందికి తెలియదు. తన తర్వాత ముప్పై ఏళ్ళకు లండన్ లో పెద్ద అగ్నిప్రమాదం జరుగుతుందని న్యూటన్ జోస్యం చెప్పాడు. ఇది అక్షరాలా జరిగింది.

న్యూటన్ తన పరిశోధనల ప్రకారం మూడు తేదీలను జీసస్ సిలువ వెయ్యబడిన తేదీలుగా నిర్ధారించాడు.

అవి:--

7-4-30 శుక్రవారం
3-4-33 శుక్రవారం
23-4-34 శుక్రవారం

ఈ తేదీలను రాబట్టడానికి న్యూటన్ ఇచ్చిన లాజిక్ ఇలా ఉంటుంది.
I take it for granted that the passion was on friday the 14th day of the month Nisan, the great feast of the Passover on saturday the 15th day of Nisan, and the resurrection on the day following. Now the 14th day of Nisan always fell on the full moon next after the vernal Equinox; and the month began at the new moon before, not at the true conjunction, but at the first appearance of the new moon; for the Jews referred all the time of the silent moon, as they phrased it, that is, of the moon's disappearing, to the old moon; and because the first appearance might usually be about 18 h after the true conjunction, they therefore began their month from the sixth hour at evening, that is, at sun set, next after the eighteenth hour from the conjunction. And this rule they called Jah, designing by the letters and the number 18.
I know that Epiphanius tells us, if some interpret his words rightly, that the Jews used a vicious cycle, and thereby anticipated the legal new moons by two days. But this surely he spake not as a witness, for he neither understood Astronomy nor Rabbinical learning, but as arguing from his erroneous hypothesis about the time of the passion. For the Jewsdid not anticipate, but postpone their months: they thought it lawful to begin their months a day later than the first appearance of the new moon, because the new moon continued for more days than one; but not a day sooner, lest they should celebrate the new moon before there was any. And the Jews still keep a tradition in their books, that the Sanhedrimused diligently to define the new moons by sight: sending witnesses into mountainous places, and examining them about the moon's appearing, and translating the new moon from the day they had agreed on to the day before, as often as witnesses came from distant regions, who had seen it a day sooner than it was seen at Jerusalem....
Computing therefore the new moons of the first month according to the course of the moon and the rule Jah, and thence counting 14 days, I find that the 14th day of this month in the year of Christ 31, fell on tuesday March 27; in the year 32, on sunday Apr. 13; in the year 33, on friday Apr. 3; in the year 34, on wednesday March 24, or rather, for avoiding the Equinox which fell on the same day, and for having a fitter time for harvest, on thursday Apr. 22, also in the year 35, on tuesday Apr. 12, and in the year 36, on saturday March 31.
But because the 15th and 21st days of Nisan, and a day or two of Pentecost, and the 10th, 15th, and 22nd of Tisri, were always sabbatical days or days of rest, and it was inconvenient on two sabbaths together to be prohibited burying their dead and making ready fresh meat, for in that hot region their meat would be apt in two days to corrupt: to avoid these and such like inconveniences, the Jews postponed their months a day, as often as the first day of the month Tisri, or which is all one, the third of the month Nisan was sunday, wednesday, or friday: and this rule they called Adu, by the letters aleph, daleth, waw, signifying the numbers 1, 4, 6, that is, the 1st, 4th, and 6th days of the week, which days we call sunday, wednesday, and friday. Postponing therefore by this rule the months found above; the 14th day of the month Nisan will fall in the year of Christ 31 on wednesday March 28; in the year 32 on monday Apr. 14; in the year 33 on friday Apr. 3; in the year 34, on friday Apr. 23; in the year 35, on wednesday Apr. 13; and in the year 36, on saturday March 31.
By this computation therefore the year 32 is absolutely excluded, because the Passion cannot fall on friday without making it five days after the full moon, or two days before it; whereas it ought to be upon the day of the full moon, or the next day. For the same reasons the years 31 and 35 are excluded, because in them the Passion cannot fall on friday, without making it three days after the full moon or four days before it: errors so enormous, that they would be very conspicuous in the heavens even to the vulgar eye. The year 36 is contended for by few or none, and both this and the year 35 may be thus excluded....
Thus there remain only the years 33 and 34 to be considered; and the year 33 I exclude by this argument. In the Passover two years before the Passion, then Christ went thro' the corn, and his disciples pluckt the ears, and rubbed them with their hands to eat; this ripeness of the corn shews that the Passover then fell late: and so did the Passover AC 32, April 14, but the Passover AC 31, March 28th, fell very early. It was not therefore two years after the year 31, but two years after 32 that Christ suffered.
Thus all the characters of the Passion agree to the year 34; and that is the only year to which they all agree.

[Newton, Sir Isaac, 1733. "Of the Times of the Birth and Passion of Christ", chapter 11 in Observations upon the Prophecies of Daniel and the Apocalypse of St. John (London: J. Darby and T. Browne), pp. 144-168].


వీటిలో మూడో తేదీ నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఇదే నిజమైతే సెయింట్ పాల్ క్రైస్తవంలోకి మారిన సంవత్సరంతో క్లాష్ వస్తుంది. ఎందుకంటే దాదాపు అదే సమయానికి పాల్ కూడా క్రైస్తవుడుగా మారాడు. క్రీస్తును సిలువ వేసిన సమయానికీ పాల్ క్రైస్తవుడుగా మారిన సమయానికీ కొంత వ్యవధి ఉండాలి. కనుక మొదటి రెండు తేదీలలో ఏదో ఒకటి క్రీస్తు శిలువ వెయ్యబదిన తేదీ అయి ఉండవచ్చు. అలాంటప్పుడు క్రీస్తు పూర్వం 1-2 అనేది క్రీస్తు జననానికి సమంజసమైన సంవత్సరంగా అనిపిస్తుంది.ఏది ఏమైనప్పటికీ క్రీ.పూ 4 పైన జీసస్ జననానికి ఈ ఆధారాలను బట్టి ఆస్కారం లేదు.

ఇకపోతే క్రీస్తు జననమాసం, సమయాలను చూడాలి.

క్రీస్తు చలికాలంలో డిసెంబర్లో పుట్టాడని రెండువేల సంవత్సరాల నుంచీ జనం నమ్ముతూ వచ్చారు. కానీ ఇది నిజం కాదని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఎందుకంటే, జీసస్ పుట్టిన సమయంలో కాపరులు రాత్రిపూట ఆరుబయట గొర్రెలకు కాపలా కాస్తున్నారని 'గాస్పెల్ ఆఫ్ లూక్' అంటుంది. చలికాలంలో అది కుదరదు కనుక జీసస్ పుట్టినది చలికాలంలో కాదని తెలుస్తున్నది.

అదీగాక, జీసస్ పుట్టిన సమయంలో సీజర్ అగస్టస్ ఆజ్ఞానుసారం ఆ ప్రాంతంలో పౌరసత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది. అందులో తమ పేర్లు నమోదు చేసుకోవడం కోసమే జోసెఫ్ మేరీలు బెత్లేహెం కు వస్తారు. పౌరసత్వ నమోదు కోసం వచ్చిన జనంతో ఆ ఊరంతా నిండి,ఉండటానికి ఎక్కడా ఖాళీ లేకపోవడంతో ఒక పశువుల కోష్టంలో వాళ్ళు తల దాచుకుంటారు. వణికించే చలీ, వర్షాలతో కూడిన డిసెంబర్ నెలలో అలాంటి పెద్ద ప్రజాకార్యక్రమం జరగదు గనుక జీసస్ పుట్టినది డిసెంబర్ లో కాదని తెలుస్తున్నది.

ఇస్రాఎల్ లో రెండు రుతువులున్నాయి.

ఒకటి చలికాలం - అక్టోబర్ నుంచి మార్చి వరకు.
రెండు - ఎండాకాలం - ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు.

కనుక జీసస్ పుట్టినది ఎండాకాలమైన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపే గాని అందరూ నమ్ముతున్నట్లు డిసెంబరులో కాదని "గాస్పెల్ ఆఫ్ లూక్" ప్రకారం తెలుస్తున్నది.

ఈ విషయం అలా ఉంచితే, Star of Bethlehem అనేది జీసస్ పుట్టినపుడు ఆకాశంలో కనిపించిందనీ, దానిని చూచుకుంటూ three wise men అనేవాళ్ళు వచ్చి జీసస్ ను గుర్తించారనీ బైబుల్ చెబుతుంది. వీళ్ళు ప్రాచీన జొరోష్ట్రియన్ మతానికి చెందిన జ్యోతిష్కులై ఉండవచ్చని ఒక భావన ఉంది.

ఈ Star of Bethlehem అనేది ఒక తోకచుక్కో లేదా ఒక నక్షత్ర పేలుడో అయి ఉండవచ్చని మొన్నటి దాకా భావించారు. కానీ ఇవి కావడానికి అవకాశం లేదని ఇప్పుడు అంటున్నారు. ఎందుకంటే, తోకచుక్క అనేది ఒక చెడు శకునంగాని, ఒక మహనీయుడు జన్మించేటంత మంచి శకునం కాదు. ఇకపోతే సూపర్ నోవా పేలుడనేది ఆ సమయంలో జరిగినట్లు ఖగోళ శాస్త్రంలో దాఖలాలు లేవు.

ఈ విషయం మీద The Telegraph లో వచ్చిన ఈ కధనాలు చూడండి.

http://www.telegraph.co.uk/topics/christmas/3687843/Jesus-was-born-in-June-astronomers-claim.html

http://www.telegraph.co.uk/topics/christmas/8211389/Star-of-Bethlehem-may-have-been-caused-by-movement-of-planet-Jupiter-scientist-claims.html


ఈ భావాల ప్రకారం Star of Bethlehem అనేది గురుగ్రహం, రెగులస్ అనే నక్షత్ర మండలంలో ఉన్నప్పుడు కనిపించిన ప్రకాశవంతమైన వెలుగని వీళ్ళు భావిస్తున్నారు. ఈ నక్షత్రం నిజానికి ఒక చుక్క కాదుగాని నాలుగు నక్షత్రాల సమూహం. దీనిని Alpha Leonis అని ఖగోళ శాస్త్రంలో పిలుస్తారు. లాటిన్ భాషలో ఈ రెగులస్ అనే పదానికి అర్ధం - 'యువరాజు' అని. ఇది రాత్రిపూట ఆకాశంలో బాగా మెరుస్తూ కనిపించే నక్షత్రాలలో ఒకటి.

ఈ నక్షత్రాన్ని మన భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో 'మఖ' అని పిలుస్తారు. ఇది సింహరాశిలో ఉన్న నక్షత్రాలలో అతి ముఖ్యమైన 'యోగతార'. మఖ అంటే అర్ధం 'మహత్తరమైన' అని. బాబిలోనియాలో దీనిని 'షర్రు' అని పిలుస్తారు. దీని అర్ధం 'రాజు' అని. అరేబియాలో దీనిని 'మాలికి' అంటారు. దీనర్ధం కూడా 'రాజు' అనే. గ్రీకులో దీనిని 'బాసిలికోస్ అస్తేర్' అంటారు .దీనర్ధం 'యువరాజు' అని.

ఈ మఖా నక్షత్రం సింహరాశిలో 5 డిగ్రీల ప్రాంతంలో ఉంటుంది.

వీళ్ళు అనుకున్న ఈ ప్రకాశానికి శుక్రగ్రహం కూడా తోడైతే ఇంకా ప్రకాశవంతమైన వెలుగు ఆకాశంలో కనిపిస్తుంది. బహుశా సింహరాశిలో కనిపించిన ఈ వెలుగునే three wise men అనేవాళ్ళు చూచి Star of Bethlehem గా భావించి ఉండవచ్చు.

ఈ థియరీ ప్రకారం జీసస్ పుట్టిన తేదీగా 17-6-02 BC మనకు కనిపిస్తున్నది. ఈయన అర్ధరాత్రి పుట్టాడని సామాన్యంగా జనం నమ్ముతున్నారు. ఈ సమయానికి ఉన్న గ్రహస్థితిని గమనిద్దాం.

(ఇంకా ఉంది)