“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, అక్టోబర్ 2016, ఆదివారం

Waqt Ne Kiya Kya Hasi Sitam - Geeta Dutt


Waqt Ne Kiya Kya Hasi Sitam
Tum Rahe Na Tum - Hum Rahe Na Hum

అంటూ గీతాదత్ పాడిన ఈ పాట Kagaz Ke Phool అనే సినిమాలోది. ఈ సినిమా 1959 లో వచ్చింది.పాటలో గురుదత్, వహీదా నటించారు.ఇది గీతాదత్ పాడిన మరపురాని మధురగీతాలలో ఒకటి. పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది.ముఖ్యంగా లైట్ అండ్ షేడ్ ఎఫెక్ట్ ఈ పాట చిత్రీకరణలో చాలా అద్భుతంగా ఉంటుంది.


గీతాదత్ తన 16 వ ఏటనే ప్లే బ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. సంగీత దర్శకుడు S.D.Burman బాగా ఇష్టపడే గాయనీ మణులలో ఈమె ఒకరు. గురుదత్ తో వివాహం ఈమె జీవితాన్ని ఊహించని బాధాకరమైన మలుపులు తిప్పింది. గురుదత్ కు వహీదాతో సంబంధం ఉన్నదని ఒక పుకారు ఉన్నది. ఇది వీరి వివాహ జీవితంలో కలతలు సృష్టించింది.ఏది ఏమైనప్పటికీ, ఈమె పాడిన ఈ పాట మాత్రం ఒక క్లాసికల్ సాంగ్ గా మిగిలిపోయింది. ఈ పాటలో తనలోని బాధను,ఆవేదనను,ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిని గీతా దత్ చక్కగా పలికించగలిగింది.

ఇది గురుదత్ దర్శకత్వం వహించిన చివరి సినిమా. అప్పట్లో ఈ సినిమా పరాజయం పాలైంది.కానీ తర్వాతి తరంలో ఇదొక క్లాసిక్ సినిమాగా కొనియాడబడింది.

గురుదత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అంటారు.ఆ తర్వాత కొద్ది కాలానికే తన 41 వ ఏట గీతా దత్ కూడా లివర్ సిర్రోసిస్ తో 1972 లో మరణించింది.

ప్రఖ్యాత ఘజల్ సింగర్ జగ్జీత్ సింగ్ తానిచ్చిన Close to my Heart అనే ప్రోగ్రాం లో ఈ పాటను కూడా పాడాడు.ఇది ఒక గాయని పాడిన పాటైనప్పటికీ మనం పాడటానికి ఏమీ అభ్యంతరం ఉండకూడదు.ఎందుకంటే మెలొడీకి లింగభేదం లేదుగా మరి? నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు.అందుకే ముందు ముందు లతాజీ, ఆశాజీ మొదలైన గాయనీ మణులు పాడిన పాటలను కూడా పాడబోతున్నాను.

ఈ పాటలో ఏదో వేరే లోకానికి చెందిన మ్యాజిక్ ఒకటి దాగి ఉంది.కొన్ని పాటలు ఇంతే.ఒక్కరమే కూచుని తదేకంగా వింటే మనల్ని ఏవేవో లోకాలకు తీసుకెళ్ళే శక్తి వాటికి ఉంటుంది.ఈ పాట కూడా అలాంటిదే.

నా స్వరంలో కూడా ఈ అమర గీతాన్ని వినండి మరి.

Movie:--Kagaz Ke Phool (1959)
Lyrics:--Kaifi Azmi
Music:--S.D.Burman
Singer:--Geeta Dutt
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------
Waqt ne kiya – Kya hasi sitam
Tum rahe na tum – Hum rahe na hum
Waqt ne kiya – Kya hasi sitam
Tum rahe na tum – Hum rahe na hum
Waqt ne kiya..

[Beqaraar dil is tarhaa mile
Jis tarha kabhee ham juda na the]-2
Tum bhi kho gaye – Hum bhi kho gaye
Ek raah par chal ke do kadam

Waqt ne kiya – Kya hasi sitam
Tum rahe na tum – Hum rahe na hum
Waqt ne kiya

[Jayenge kahaa –Soojhthaa nahee
Chal pade magar – Raastaa nahee]-2
Kya talaash hai –Kuch pathaa nahee
Bun rahehai din – khaab dam-ba-dam

Waqt ne kiya – Kya hasi sitam
Tum rahe na tum – Hum rahe na hum
Waqt ne kiya – Kya hasi sitam
Tum rahe na tum – Hum rahe na hum
Waqt ne kiya

Meaning

What a beautiful tragedy Time has wrought?
You are no longer you
I am no longer me
What a beautiful tragedy?

Our restless hearts met in such a way
that we were never separate from each other
You were lost
I was lost too
after walking just a few steps on the same path
What a beautiful tragedy?

We cannot see where we are going
There is no path ahead, yet we are walking
What we are searching for, we don't know
With every breath we dream a new dream

What a beautiful tragedy Time has wrought?
You are no longer you
I am no longer me
What a beautiful tragedy?

తెలుగు స్వేచ్చానువాదం

కాలం ఎంత అందమైన విషాదాన్ని చెక్కింది?
నువ్వు నువ్వుగా లేవు
నేను నేనుగా లేను
కాలం ఎంత అందమైన విషాదాన్ని చెక్కింది?

మనిద్దరి విహ్వల హృదయాలూ
ఎన్నడూ ఎడబాటును ఎరుగనంతగా కలసిపోయాయి
కానీ - మన దారిలో కొన్ని అడుగులు వెయ్యగానే
నువ్వూ మాయమై పోయావు
నేనూ మాయమై పోయాను
ఎంత అందమైన విషాదం?

ఎక్కడకు పోతున్నామో మనిద్దరికీ తెలియదు
ముందు దారిలేకున్నా మనం నడుస్తూనే ఉన్నాం
మన వెదుకులాట ఎందుకో మనకే తెలియదు
కానీ ప్రతి శ్వాసతో ఒక కొత్త స్వప్నాన్ని చూస్తున్నాం

కాలం ఎంత అందమైన విషాదాన్ని చెక్కింది?
నువ్వు నువ్వుగా లేవు
నేను నేనుగా లేను
కాలం ఎంత అందమైన విషాదాన్ని చెక్కింది?