Everything is real, because the seer is real

26, మార్చి 2015, గురువారం

Entha Soundarya Kande - Raj Kumar
ఎంత సౌందర్య కండే...

అద్భుతనటుడు,మధురగాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలీ,అన్నింటినీ మించి ఒక మంచి మనిషీ అయిన కన్నడ కంఠీరవ డా||రాజ్ కుమార్ పాడిన పాటతో నా ఈ 30 వ కరావోకే పాటను ఇస్తున్నాను.

దక్షిణాది ఉన్న తెలుగు,తమిళ,కన్నడ,మళయాళ రాష్ట్రాలలోని సినిమా నటులలో నాకు ఇష్టమైన ఉత్తమ నటుడు ఎవరు అనడిగితే తడుముకోకుండా డా||రాజ్ కుమార్ అని చెబుతాను.ఎందుకంటే ఆయనలో ఒక ఎన్టీఆర్ ఉన్నాడు, ఒక ఏఎన్నార్ ఉన్నాడు.ఒక కృష్ణ,ఒక శోభన్ బాబు,ఒక కృష్ణంరాజూ ఉన్నారు.అంతేగాక ఒక ఘంటసాల ఉన్నాడు.ఒక జేసుదాస్ ఉన్నాడు. దక్షిణాదిలోనే కాదు.భారతదేశం మొత్తం మీద ఇంత వెర్సటైల్ ఆర్టిస్ట్ ఎక్కడా లేడు.

ఎందుకంటే కొంతమంది పౌరాణిక పాత్రలే చెయ్యగలరు.కొందరు సాంఘికమే చెయ్యగలరు.ఇంకొందరు జానపదం బాగా చెయ్యగలరు.ఇంకొందరు యాక్షన్ సినిమాలు బాగా చెయ్యగలరు.ఇంకొందరు హాస్యం పండించగలరు.కానీ డా||రాజ్ కుమార్ ఇవన్నీ చేసి మెప్పించగలడు.అంతేగాక మధురగాయకుడు. అందుకే దక్షిణాదిలో ఉన్న అత్యుత్తమ ఆర్టిస్ట్ ఈయనే అని నేను నమ్ముతాను.

నాకు మొదట్లో ఈయన గురించి అంతగా తెలీదు.కన్నడిగులు ఈయనంటే ఎందుకంత చెవి కోసుకుంటారా అనుకునేవాడిని.కానీ ఆయన నటించిన 'శ్రీ కాళహస్తీశ్వర మహాత్య్మం(1954)' సినిమా చూచాక ఒక్కసారిగా ఆయన అభిమానినై పోయాను.ఎంత అద్భుతంగా నటించాడో ఆ సినిమాలో!!

ఆ సినిమాలో కొన్ని అద్భుతమైన పాటలున్నాయి.

>>మధురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా...
ఈ పాటను ఘంటసాల మాస్టారు ఎంత అద్భుతంగా పాడారో?

>>మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా...
ఈపాట గురించి ఇంక చెప్పనే అక్కర్లేదు.

>>మాయజలమున మునిగేవు నరుడా...
ఇలాంటి తత్వాలను వినాలంటే అదృష్టం ఉండాలి.

ఆ తర్వాత ఆయన నటించిన కన్నడ సినిమాలు కొన్ని చూచాను.చాలా సహజంగా సులభంగా నటిస్తాడు.నటిస్తాడు అనడం చాలా తక్కువ చెయ్యడమే అవుతుంది.జీవిస్తాడు అనడం కరెక్ట్ పదం.

ఉదాహరణకి 'బభ్రువాహన' అనే సినిమానే తీసుకుంటే--కన్నడ బభ్రువాహన లో రాజ్ కుమార్ నటననూ,తెలుగు బభ్రువాహనలో ఎన్టీ ఆర్ నటననూ పోలిస్తే రామారావు నటన పేలవంగా తేలిపోతుంది.రాజ్ కుమార్ అంత గొప్ప నటుడు.

అంతేకాదు.వ్యక్తిగత జీవితంలో చాలా నిరాడంబరుడు,మంచి మనిషి.మంచి నటుడేగాక మంచి గాయకుడు కూడా.భానుమతి లాగా తన పాటలు తానే పాడుకునేవాడు.మొదట్లో పీ బీ శ్రీనివాస్ చేత పాడించాడు.ఆయన పెద్దవాడై పోయాక తానే పాడుకునేవాడు.

అందుకే నా 30 వ కరావోకే పాటగా ఈయన పాడిన 'ఎంత సౌందర్య కండే' పాటను ఇస్తున్నాను.ఈ పాట 'రవిచంద్ర' సినిమాలోనిది.అప్పటికీ ఇప్పటికీ ఉన్న అనేక కన్నడ మధురగీతాలలో ఇది ఒకటిగా నిలిచి పోయింది.

ఈ చిత్రంలో రాజ్ కుమార్, లక్ష్మి నటించారు.ఈ పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది.

Movie:--Ravi Chandra(1980)
Lyrics:--Udaya Sankar
Music:--Upendra Kumar
Singer:--Dr.Raj Kumar
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------------

[ఓ...ఓ.. ఎంత సౌందర్య కండే
ఓ.ఓ.ఓ.ఓ. ఎంత సౌందర్య కండే
ఆదిశక్తియో మహాలక్ష్మియో వాణియో కాణే నా ఆ ఆ ఆ ఆ
ఓ...ఓ.. ఎంత సౌందర్య కండే
ఓహో..ఓఓ.. ఎంత సౌందర్య కండే]-2

హోళేయువ కన్నుగళో బెళగువ దీపగళో
తుంబిద కెన్నెగళో హోన్నిన కమలగళో
అరలిదహూ నగెయాయిత్తూ చంద్రికెయే చెన్నాయిత్తూ
ననగాగె ధరెగిళిదా దేవతెయో యేనొ కాణే నా ఆ ఆ ఆ ఆ..
ఓ...ఓ.. ఎంత సౌందర్య కండే
ఓ.ఓ.ఓ.ఓ. ఎంత సౌందర్య కండే
ఆదిశక్తియో మహాలక్ష్మియో వాణియో కాణే నా ఆ ఆ ఆ ఆ
ఓ...ఓ.. ఎంత సౌందర్య కండే
ఓహో..ఓఓ.. ఎంత సౌందర్య కండే

కడలలె ముత్తిరలీ లతెయలే సుమ విరలీ
నయనవు నోడుతలీ సంతస హొందిరలీ
కరెయదిరూ కెనకదిరూ
బయకెగళా నుడియదిరూ
నిన్నన్ను నోడుదిరే కైముగివా ఆశయేకు తానే ఏ ఏ ఏ
ఓ...ఓ.. ఎంత సౌందర్య కండే
ఓ..ఓ..ఓ..ఓ ఎంత సౌందర్య కండే

ఆదిశక్తియో మహాలక్ష్మియో వాణియో కాణే నా ఆ ఆ ఆ ఆ
ఓ...ఓ.. ఎంత సౌందర్య కండే
ఓహో..ఓఓ.. ఎంత సౌందర్య కండే
ఊ..ఊఊ..ఊఊ ఊఊ...

Meaning:--

What a wonderful beauty you are
What a wonderful beauty you are
Are you Adi Shakti or Mahalaxmi or Vani
I am not able to decide
What a wonderful beauty you are
What a wonderful beauty you are

Your eyes are glittering like lamps
Your face is like a blossomed flower
with a half smile on your lips
you look more prettier than Moon
Are you a goddess came down for my sake?
What a wonderful beauty you are
What a wonderful beauty you are
Are you Adi Shakti or Mahalaxmi or Vani
I am not able to decide
What a wonderful beauty you are

You look like a pearl from the sea
and like a flowery slender creeper
By just seeing you I get immense happiness
Don't beckon me, don't give me trouble
Don't project your desires on me
On seeing your celestial beauty
I feel like saluting you with folded hands
What a wonderful beauty you are
What a wonderful beauty you are
Are you Adi Shakti or Mahalaxmi or Vani
I am not able to decide
What a wonderful beauty you are....