“Self service is the best service”

23, ఆగస్టు 2014, శనివారం

శ్రీకృష్ణుని జన్మకుండలి-4 (డా|| నరహరి ఆచార్ వర్గం)

25-6-3143
హేవిళంబి నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
ఆదివారం రోహిణి మూడవ పాదం






7-7-3144 BC
దుర్ముఖ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
మంగళవారం రోహిణి రెండవ పాదం
చంద్రుడు ఉచ్ఛస్తితి
కుజ శుక్రులు నీచస్థితి




18-6-3145
మన్మథ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
గురువారం రోహిణి మూడవ పాదం






1-6-3146 BC
జయనామ సంవత్సరం
శ్రావణ బహుళ దశమి
ఆదివారం రోహిణి నాలుగో పాదం






11-6-3147 BC
విజయ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
మంగళవారం రోహిణి మూడో పాదం






21-6-3148 BC
నందన నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
గురువారం రోహిణి మూడో పాదం






5-6-3149 BC
ఖర నామ సంవత్సరం
శ్రావణ బహుళ దశమి
ఆదివారం రోహిణి నాలుగో పాదం






14-6-3150 BC
వికృతి నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
రోహిణి రెండవ పాదం






24-6-3151 BC
విరోధి నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
బుధవారం రోహిణి నాలుగో పాదం






6-6-3152 BC
సర్వధారి నామ సంవత్సరం
శ్రావణ బహుళ దశమి
శుక్రవారం రోహిణి మూడవ పాదం
తిధి+నక్షత్రాలు సరిపోలేదు





16-6-3153 BC
సర్వజిత్ నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
రోహిణి ఒకటో పాదం
శనివారం





26-6-3154 BC
వ్యయ నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
సోమవారం
రోహిణి రెండవ పాదం 
9-6-3155 BC
పార్ధివ నామ సంవత్సరం
శ్రావణ బహుళ నవమి
గురువారంరోహిణి మూడవ పాదం





19-6-3156 BC
తారణ నామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి
శనివారం
రోహిణి రెండవ పాదం





ఇప్పుడు మనకు 25 ఏండ్లకూ 25 జాతకాలు వచ్చాయి.

వీటిని పరిశీలిద్దాం.కొన్ని సరళములైన సూత్రాలను ఉపయోగించి వీటిని జల్లెడ పట్టి చూద్దాం.

మొదటగా తిధి నక్షత్రాలు కలవని కుండలులను తొలగించగా,ఈ క్రింది పదకొండు సంవత్సరాలు మాత్రమే మిగిలినవి.

3132,3134,3135,3140,3142,3143,3148,3151,3153,3154,3156.

ఇప్పుడు కొన్ని ఇతర పారామీటర్స్ ఉపయోగించి ఇంకా జల్లెడ పట్టాలి.

అవేమిటి?

సాధారణంగా అవతార పురుషుల జాతకాలో రాహుకేతువులు ఉచ్చలో ఉంటారు.లేదా ఆ స్థానాలకు దగ్గరగా ఉంటారు.ఇదొక రహస్యం.అలా ఎందుకు ఉంటుంది అనేది నేనిప్పుడు వివరించను.

ఈ సూత్రాన్ని ఉపయోగించగా ఈ పదకొండు జాతకాల్లో  మళ్ళీ 3132,3151 అనే రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలాయి.

ఇప్పుడు ఈ జాతక చక్రాలను వరుసగా పరిశీలిద్దాం.

3132 BC Chart

 ఆరోజు అర్ధరాత్రికి ఈ జాతకంలో చంద్ర/కేతు/శుక్ర దశ జరిగింది.సరే, రోహిణీ నక్షత్రంలో పుట్టినవారికి జనన సమయానికి చంద్రదశే జరుగుతుంది.కేతువు అష్టమంలో ఉండి అకస్మాత్తు గండాలను సూచిస్తున్నాడు.చంద్రుడు మాతృకారకుడు గనుక తల్లివైపునుంచి(మేనమామ అయిన కంసుని నుంచి) వచ్చిన గండాలు సూచింప బడుతున్నాయి.విదశా నాధుడైన శుక్రుడు షష్టాధిపతిగా మేనమామకు సూచకుడు.మేనమామతో ఉన్న శత్రుత్వానికీ సూచకుడు.పైగా తల్లిని సూచించే చతుర్దంలో మాతృ కారకుడైన సూర్యునితో కలసి ఉన్నాడు.కనుక ఈ జాతకుడు పుట్టినపుడు మేనమామ ద్వారా ముంచుకొచ్చిన ప్రాణగండాన్ని జననకాల దశ ఖచ్చితంగా సూచిస్తున్నది.

చతుర్దంలో మూడు గ్రహాలున్నాయి.వాటిలో ఒకటి వక్రించి ఉన్నది.కనుక ఈయనకు ఇద్దరు తల్లులున్నట్లు సూచన ఉన్నది.జరిగింది అదేగా??పుట్టినది దేవకీదేవికి అయినా పెంచినది యశోదాదేవి.కనుక లెక్క సరిపోయింది.

ఇకపోతే మహాభారత యుద్ధ సమయం సరిగ్గా సరిపోతుందో లేదో చూద్దాం.

3067 BCలో ఈ జాతకానికి బుధ/బుధ దశ జరిగింది.బుధుడు శత్రుస్థానాధిపతి అయిన శుక్రునితో కలసి ఉన్నాడు.కనుక యుద్ధాన్ని సూచిస్తున్నాడు.వక్రీకరణ వల్ల తృతీయంలో ఉన్నట్లు తీసుకుంటే దగ్గర బంధువులతో యుద్ధాన్ని సూచిస్తున్నాడు.అయితే ఇదే వక్రీకరణ వల్ల ఈయన తానుగా యుద్ధం చెయ్యలేదు.సారధిగా ఉన్నాడు.ఈజాతకానికి బుధుడే ఆత్మకారకుడని గ్రహించాలి.కనుక ఆత్మకారకుని వక్రస్థితి వల్ల యుద్ధం తానూ చెయ్యకుండా ఊరకే సారధిగా ఉండి నడిపించాడని అనడం కరెక్ట్ గా సరిపోయింది.

ఇక్కడ ఇంకొక్క విషయం చూద్దాం.

ఈ యుద్ధానికీ కృష్ణునకూ సరాసరి సంబంధం లేదు.ఈ యుద్ధానికి కృష్ణుడు డైరెక్ట్ పార్టీ కాదు.బంధువుల మధ్య యుద్ధంలో తానూ ఒక పాత్ర పోషించాడు. అందుకనే ఆ సమయానికి డైరెక్ట్ గా యుద్ధాన్ని సూచించే శుక్రదశ ఈయన జాతకంలో జరగలేదు.ఇన్ డైరెక్ట్ గా సూచించే బుధ దశ మాత్రమే జరిగింది.

అయితే ఇక్కడ ఇంకొక చిక్కు వస్తుంది.

ఈ లెక్క ప్రకారం యుద్ధ సమయానికి ఆయన వయస్సు 65 మాత్రమే ఉంటుంది.కొందరు అనుకునేటట్లు 89 లేదా 90 కాదని తేలుతున్నది.దీనివల్ల ఇంకొక్క విషయం కూడా స్పష్టం అవుతున్నది.

నూట పది ఏండ్లు ఆయన బ్రతికి ఉంటే 'వర్షాణామ్ అధికం శతం' అన్నమాటను వ్యాసమహర్షి వాడడు.నూట పది అన్న మాటనే వాడి ఉండేవాడు.ఒకవేళ నూట పది దాటి నూట ఇరవై మధ్యలో ఆయన బ్రతికి ఉంటే 'నూట పది దాటి' అన్న మాట వాడి ఉండేవాడు.నూట ఇరవై దాటి ఇరవై అయిదు మధ్యలో అయితే 'నూట ఇరవై దాటి' అన్న మాట వాడి ఉండేవాడు.కానీ ఆయన అలా వాడలేదు గనుక 'వర్షాణామ్ అధికం శతం' అంటే అసలైన అర్ధం 'నూరేళ్ళు దాటి కొన్ని' అని మాత్రమే.అంటే నూరు ఇప్పుడే దాటాయి అని అనుకోవచ్చు లేదా నూరేళ్ళు దాటి ఒకటి రెండేళ్లు అయ్యాయని అనుకోవచ్చు.కనుక అందరూ అనుకునేటట్లు కృష్ణుడు నూట పాతిక ఏళ్ళు ఈ భూమ్మీద ఉండలేదన్న విషయం తెలుస్తున్నది.

కనుక కృష్ణుడు ఈ భూమి మీద జీవించినది 102 ఏళ్ళు మాత్రమే అన్న విషయాన్ని ఈ జాతకం నిర్దారిస్తున్నది.అందుకనే వ్యాసమహర్షి 'వర్షాణామ్ అధికం శతం' అన్న మాట వాడినాడు.

శ్లో||దేవైశ్చ ప్రహితో వాయు: ప్రణిపత్యాహ:కేశవమ్
రహస్యేవమహం దూత: ప్రహితో భగవన్ సురై:
వస్వస్విమరుదాదిత్యరుద్రసాధ్యాధి భిస్సః
విజ్ఞాపయతి శక్రస్త్వాం తదిదం శ్రూయతాం విభో
భారావతరణార్దాయ వర్షాణామధికం శతమ్
భగవానవతీర్ణోవ త్రిదశైస్యః చోదిత:
దుర్వృత్తా నిహతా దైత్యా భారోవతారిత:
త్వయా సనాధాస్త్రిదశా భవంతు త్రిదివే సదా
తదతీతం జగన్నాధ వర్షాణామధికం శతమ్
ఇదానీం గమ్యతాం స్వర్గో భవతా యది రోచతే
దేవైర్విజ్ఞాప్యతే దేవ తధాత్రైవ రతిస్తవ
తత్స్థీయతాం యధాకాలమాస్తేయ మనుజీవిమి:
  
(విష్ణు పురాణమ్ 5.37.16-21)   

ఇప్పుడు ఇంకొక సంఘటనను పరిశీలిద్దాం.కృష్ణ నిర్యాణం జరిగినది 3031 BC లో గనుక అప్పుడే ముసలం పుట్టి యాదవ వంశమూ నశించింది గనుక ఈ సంఘటన ఈ జాతక ప్రకారం సరిపోతున్నదో లేదో చూద్దాం.

అష్టమాధిపతి గురువు పంచమంలో ఉంటూ గురుశాపం వల్ల పుత్రనాశనాన్ని స్పష్టంగా సూచిస్తున్నాడు.

3031 BC లో ఈ జాతకానికి శుక్ర/శని దశ నడిచింది.అందులో మళ్ళీ బుధ,కేతు,శుక్ర విదశలు నడచినాయి.

వృషభ లగ్నజాతకం గనుక ఈ జాతకానికి శుక్ర శనులు ఇద్దరూ శుభులే.కనుక కాళిదాసు తన ఉత్తరకాలామృతంలో చెప్పినట్లు ఈ దశలో ఈ గ్రహప్రభావం వల్ల మహారాజు కూడా బిచ్చగాడుగా మారుతాడు.అంటే మహారాజును కూడా రోడ్లమీద అడుక్కునేటట్లు చేసేటంత దరిద్రపు దశ అన్నమాట.

కృష్ణుని జాతకంలో అదేగా జరిగింది??

తన కళ్ళెదురుగానే తన కొడుకులూ పరివారమూ అందరూ త్రాగి కొట్టుకుని చస్తుంటే చూస్తూ నిలబడ్డాడు.అంతేకాదు సాత్యకినీ ప్రద్యుమ్నుడినీ ఇంకా తన కొడుకులనూ తనవారే తన కళ్ళెదురుగానే చంపుతుంటే కూడా నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు. తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న మహానగరాన్ని తన కనుల ఎదురుగానే సముద్రం వచ్చి ముంచేస్తుంటే చూస్తూ ఉండవలసిన స్థితి పట్టింది.

ఆ తరువాత తానూ ఒక అడివిలో చెట్టుకింద పడుకుని దిక్కులేనివాడిలా ఒక బోయవాడి బాణానికి బలైపోయాడు.అంటే ఒక రకంగా చెప్పాలంటే రోడ్డు పక్కన చనిపోయినట్లే.జీవితం అంతా అలా మహారాజ భోగాలు అనుభవించి,ఎక్కడో రాజభవనంలో హంసతూలికా తల్పాలమీద పవళించి పరిచారికలు వీవనలు వీస్తుంటే సుగంధ పరిమళాలు ఆస్వాదిస్తూ ఆనందించవలసిన వాడు చివరకు అలా రోడ్డుపక్కన చనిపోవడం ఏమిటి?

ఈ మాట అన్నందుకు కృష్ణభక్తులకు కోపం రావచ్చు.నేనూ కృష్ణభక్తుడినే.కానీ జరిగినది జరిగినట్లు మనం చూడక తప్పదు.మనం ఈ ఘట్టాన్ని ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా కూడా,జరిగిన విషయం మాత్రం అదే.ఈ సంఘటనవల్ల కృష్ణుని అవతారతత్వానికి ఏమీ భంగం లేదు.రాదు.శ్రీ రామకృష్ణులు గొంతు కేన్సర్ తో చనిపోయారు.అంతమాత్రాన ఆయన దైవం యొక్క అవతారం కాకుండా ఎలా పోతారు?

శుక్రుడు పితృకారకుడు.చతుర్దంలో రవితో ఉండి పితృ వర్గాన్నీ బంధువర్గాన్నీ సూచిస్తున్నాడు.శని నవమాధిపతి.వంశాన్ని సూచిస్తున్నాడు.ఇక పోతే విదశా నాధులైన బుధుడు సుతులనూ,కేతువు నాశనాన్నీ,శుక్రుడు యుద్ధాన్నీ సూచిస్తున్నారు.

అంటే,ముసలం పుట్టి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని  యాదవవంశం మొత్తం సర్వనాశనం అవ్వడాన్నీ,అవతార పురుషుడూ మహారాజూ అయిన శ్రీకృష్ణుడు కూడా ఋషిశాపం వల్ల నిస్సహాయస్థితిలో పడిపోయిన దుస్థితినీ ఈ దశ స్పష్టంగా చూపిస్తున్నది.

నవమాధిపతి అయిన శని వక్రించి ఉండి,పైగా ఆరింట ఉన్న కుజ నక్షత్రంలో ఉండి,శపితయోగాన్నీ,ఋషి శాపాన్నీ స్పష్టంగా సూచిస్తున్నాడు.

అంతే కాదు.ఇంకొక్క విచిత్రమైన విషయం కూడా ఇక్కడ ఉన్నది.యాదవ వంశనాశనానికి ఋషి శాపం ఒక్కటే కారణం కాదు.మహాపతివ్రత అయిన గాంధారి శాపం కూడా దానికి కారణమే.

"నీవు ఆపగలిగి ఉండి కూడా భారతయుద్ధాన్ని ఆపకుండా,నా పుత్రులందరూ నాశనం కావడానికి కారకుడవయ్యావు.అలాగే నీ పుత్రులూ నీ బంధుజనమూ అంతా కూడా నీ కళ్ళముందే నాశనం అవుతారు గాక.అలా వారు నాశనం అవుతూ ఉంటె నీవు కూడా నాలాగే నిస్సహాయస్థితిలో పడి చూస్తూ ఉండటం తప్ప ఇంకేమీ చెయ్యలేక పోతావుగాక.ఇదే నా శాపం" అని గాంధారి కృష్ణుడిని శపించింది.

గాంధారి కృష్ణుడికి అత్త అవుతుంది.అంటే ద్వాదశభావంతో సూచింప బడుతుంది.ఈ జాతకంలో కుజుడు ఆ భావాదిపతి అయ్యాడు.ఆ కుజ నక్షత్రంలో ఉన్న శని అంతర్దశలో శనికుజుల కలయికతో ఏర్పడే శపితయోగంలో ఈ ఖర్మను అనుభవింప చేశాడు.కుజుడు ఈ జాతకంలో రాహు నక్షత్రమైన స్వాతిలో ఉన్నాడన్న వాస్తవాన్ని గమనిస్తే శని కుజ రాహువుల సంబంధం ఏమిటో అర్ధమౌతుంది.గాంధారి శాపమూ ఋషి శాపమూ కలసి ఒకే సమయానికి శుక్ర/శని దశలో యాదవవంశ నాశనాన్ని ఎలా కొనితెచ్చాయో అర్ధమౌతుంది.

చూచారా ఈ శపితయోగం అనేది ఎంత సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలో కూడా ఖచ్చితంగా సరిపోయిందో?

గ్రహములు ఎవ్వరినీ వదలవు.కర్మ ఎవరినీ వదలదు.ఎవరి సమయం వచ్చినపుడు వారు చచ్చినట్లు కర్మను అనుభవించవలసిందే అనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ అవసరం లేదు.

భగవంతుని అవతారానికే కర్మ తప్పలేదంటే ఇంక మనమెంత?

కనుక కాళిదాసు చెప్పిన జ్య్తోతిష్య సూత్రం ఇక్కడ అక్షరాలా జరిగినట్లు మన కళ్ళెదురుగానే కనిపిస్తున్నది.ఇన్ని రకాలైన సంఘటనలు ఖచ్చితంగా సరిపోతున్నాయి గనుక ఈ 3132 BC సంవత్సరాన్ని కృష్ణజనన సంవత్సరంగా తీసుకోవచ్చు.

ఇప్పుడు మిగిలిన 3151 BC జాతకాన్ని పరిశీలించవలసిన అవసరం ఉన్నది.

(ఇంకా ఉన్నది)