On the path, ego is the greatest hurdle and love is the greatest boon

11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

వీడు మగాడ్రా బుజ్జీ !

నేనీ మాట అంటే చాలామందికి కోపాలు రావచ్చు. కానీ ఒకరికి నచ్చదనో, కోపాలొస్తాయనో నా అభిప్రాయాలు నేను మార్చుకోను.

నా దృష్టిలో, నేటి గురువులలో చాలామంది కంటే నిత్యానంద చాలా మంచివాడు, చాలా శక్తివంతుడు కూడా. మూడవ కన్ను అనబడే third eye ని తెరిచే విధానాలు అతనికి తెలుసు. అంతేకాక అతనికి చాలా అతీంద్రియ శక్తులున్నాయి కూడా. ఇది వాస్తవమే. ఇతరులలో మూడవకంటిని వికసింపజేసే శక్తి ఈయనకు నిజంగానే ఉన్నది.

ఏమీ శక్తులు లేని సత్యసాయిబాబానే ఈ పిచ్చిలోకం 50 ఏళ్ళపాటు పిచ్చిగా కొలిచింది. ఆయన దగ్గర వీధిగారడీ ట్రిక్కులు తప్ప ఇంకేమీ లేవు. పెద్ద ఫిలాసఫీ కూడా ఆయన చెప్పలేడు. ఆయన దగ్గర సబ్జెక్ట్ కూడా ఏమీ లేదు. ఆయనతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు శక్తిలో గొప్పవాడు నిత్యానంద. ఈయన తాంత్రికుడు. నిజమైన అతీంద్రియ శక్తులున్నవాడు. మరి ఈయన్ను ఎందుకో అందరూ తిడుతున్నారు? కారణం చెప్పనా? ధైర్యంగా వినండి !

మనకు దక్కని సుఖాలు ఆయన హాయిగా అనుభవిస్తున్నాడనే కుళ్ళు తప్ప ఈ ద్వేషానికి ఇంకేమీ కారణం లేదు. వయసులో ఉన్నాడు, బోలెడంత డబ్బుంది, సినిమా స్టార్స్ ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం ఒక ద్వీపాన్నే కొనుక్కుని తన రాజ్యంలో తానున్నాడు. హేపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడనే బాధతో ప్రతివాడూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది తప్ప ఆయన్ను తిట్టడానికి వేరే కారణం ఏమీ లేదు. మనకు లేనిది ఇంకొకడికి ఉంటే కుళ్ళుతో చచ్చిపోవడం ఈ చెత్త మనుషులకు పరిపాటేగా?

నేను నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్ళినపుడు ఒకమ్మాయి కళ్ళకు గంతలు కట్టుకుని, అన్నింటినీ చక్కగా చూస్తున్నట్లు చదవడాన్ని చూచాను. ఆ అమ్మాయికి నిజంగానే ఆ శక్తి ఉన్నది. ఆమె తల్లిదండ్రులను అడిగాను 'ఎవరు మీ అమ్మాయికి ఈ విద్యను నేర్పించారు? ఆ గురువెవరు?' అని. దానికి వాళ్ళు చాలాసేపు జవాబు చెప్పకుండా తటపటాయించారు. కానీ చివరకు 'స్వామీ నిత్యానంద' అని చెప్పారు.

స్వామి నిత్యానంద పెట్టిన స్కూళ్ళలో చదువుకునే పిల్లల్లో చాలామందికి ఈ శక్తి ఉన్నది. 14 ఏళ్ళ లోపు పిల్లల్లో ఈ శక్తిని త్వరగా వికసింపజేయవచ్చని ఆయనంటాడు. ఇది నిజమే. ఆ తరువాత శరీరంలో చాలా మార్పులోస్తాయి. అప్పుడు ఈ మూడవ కన్నును వికసింపజేయడం కష్టమౌతుంది అంటాడు. ఇదీ నిజమే.  యోగ - తంత్ర రహస్యాలు తెలిసిన వారికి ఈ విషయాలు అర్ధమౌతాయి. మామూలు మనుషులకు అర్ధం కావు.

నిత్యానంద రంజితల మధ్య వ్యవహారం ఒక్కటే ఆయన్ను లోకం ముందు దోషిగా నిలబెట్టింది. ఇదొక్కటి పక్కన పెడితే, వేలెత్తి చూపదగ్గ తప్పులేమీ ఇతనిలో లేవు. కానీ నా దృష్టిలో అది కూడా తప్పు కాదు. ఎందుకంటే, ఆయన వేదాంత సాంప్రదాయ సన్యాసి కాదు, ఘోటక బ్రహ్మచారిగా ఉండటానికి.  పిచ్చిలోకుల దృష్టిలో ఎర్రగుడ్డలేసుకున్న ప్రతివాడూ బ్రహ్మచర్యం పాటించాలని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిత్యానంద ఒక తాంత్రికుడు. ఆయన ఆగమశాస్త్రాన్ని అనుసరిస్తాడు. ఆ మార్గంలో స్త్రీ సాహచర్యం తప్పు కాదు. అది వారి సాధనలలో ఒకటి. అంతమాత్రం చేత వారి జ్ఞానానికీ శక్తికీ ఏమీ లోటుండదు. తంత్రమార్గం అర్ధం కానివారు ఏదేదో వాగుతూ ఉంటారు. వారిని పట్టించుకోవలసిన పని ఏ మాత్రమూ లేదు.

హిందూమతమంటే ఏమిటో సగటు హిందువుకు ఏమీ తెలియదు. దానిలో ఎన్నెన్ని శాఖలు ఉపశాఖలున్నాయో వాటి ఆరాధనా విధానాలు సాధనాపద్ధతులు ఎలా ఉంటాయో ఏమీ తెలియదు. వాడికి తెలిసిందల్లా మంగళవారం గుడికెళ్ళి బొట్టు పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి కోరికలు కోరుకుని వెనక్కు రావడం ఒక్కటే.  అదే హిందూమతమని చాలామంది అనుకుంటారు. ఇది హిందూమతంలో కనీసం ఎల్ కేజీ స్థాయికూడా కాదు. అంతకంటే తక్కువ !

శైవాగమమూ, శాక్తాగమమూ, కౌలాచారమూ, వామాచారమూ మొదలైనవేవీ ఇసుమంతైనా తెలియని హిందువులు మాత్రమే నిత్యానందను తప్పుగా అర్ధం చేసుకుంటారు. తంత్రశాస్త్రపు లోతుపాతులు తెలిసినవారు అలా అనుకోరు. నిత్యానందకు 'పరమహంస' అనీ 'మహామండలేశ్వర్' అనీ బిరుదులిచ్చిన పీఠాధిపతులకు తెలియదా మనకు తెలిసినపాటి హిందూధర్మం? వాళ్ళు చూడలేదా రంజిత వీడియో?

తత్వశాస్త్రం, శైవసిద్ధాంతం, యోగసాధన మొదలైన విషయాలలో నిత్యానంద, నేటి ఎందరో స్వామీజీలంటే ఉన్నతుడు. ఆయన దగ్గర నిజమైన సబ్జెక్ట్ ఉన్నది. కానీ అల్లరౌతున్నాడు. ఎందుకని?పైగా ఇన్ని శక్తులున్న వాడు, దేశాన్ని వదిలి పారిపోవలసిన పనేముంది? అని మీకు డౌటు రావచ్చు.

నిత్యానంద రంజితల వీడియోను బయటపెట్టడం వెనుక క్రైస్తవ మిషనరీల హస్తం ఉన్నది. అమ్ముడు పోయిన మీడియా పాత్ర ఉన్నది. సన్ టీవీ ఎవరిదో అందరికీ తెలుసు. రాకెట్ వేగంతో ఎదుగుతున్న నిత్యానందను కట్టడి చెయ్యకపోతే, లోకానికి మరొక అద్భుతమైన హిందూగురువు వస్తున్నాడన్న అసూయా, వారి మతప్రచారానికి దెబ్బ తగులుతుందన్న భయమూ, వాళ్ళ చేత నిత్యానంద మీద 'లెనిన్' అనే కారు డ్రైవర్ ను అస్త్రంగా ప్రయోగించాయి. వీడియో తీయించాయి. గాలి దుమారం రేగింది. కోర్టు కేసులు పెట్టబడ్డాయి. వేధింపులు మొదలయ్యాయి. చివరకు నిత్యానంద తన స్వదేశాన్నే వదలి పారిపోవలసిన గతి పట్టించాయి.

మీరొక్క విషయం ఆలోచించారా?

క్రైస్తవ మిషనరీలు తమిళనాడు లోనూ, కేరళలోనూ ఎన్నేన్ని రేపులు చేస్తున్నారు? ఎంతమంది చిన్నపిల్లలను ఎబ్యూస్ చేస్తున్నారు? వాళ్ళమీద ఎన్నెన్ని కేసులున్నాయి? వీళ్ళందరికీ కేంద్ర బిందువైన వాటికన్ లో ఏం జరుగుతోంది? అక్కడి పోపులమీదా, ఇతర బిషప్పులమీదా ఎన్నెన్ని కేసులున్నాయి?  ఇవెవరూ మాట్లాడరెందుకు? జీసస్ కి కోపమొస్తుందని భయమా? వాళ్ళందరూ పత్తిత్తులా? ఈయనొకడే దోషా?

ముస్లిం మతగురువులు ఎంత హింసను రేపుతున్నారు? ఎంత ద్వేషాన్ని ప్రతి శుక్రవారమూ అమాయక ముస్లిములలో నూరిపోస్తున్నారు? ఎంతమంది టెర్రరిస్టులు మదరసాలలో తయారౌతున్నారు? వాటి గురించి ఎవరూ మాట్లడరెందుకు? భయమా? 

మరి ఒక స్వామీజీని, అందులోనూ తంత్ర సాంప్రదాయానికి చెందిన వాడిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? అసలు హిందూమతంలో ఎన్నెన్ని శాఖలున్నాయో, వాటి పద్ధతులేమిటో, వాటి విధానాలేమిటో తెలుసా మీకు? తెలీనప్పుడు ఈ వాగుడెందుకు? ఇలా వాగడానికి చర్చి నుంచి ఎంత లంచం ముట్టింది మీకు?

డిల్లీ గ్యాంగ్ రేప్ దోషులకు శిక్ష పడటానికి ఎనిమిదేళ్లు పట్టింది మన వ్యవస్థలో. ఎంతోమంది అమ్మాయిల రేపిస్టులూ, హంతకులూ పొలిటికల్ సపోర్ట్ తో హాయిగా మనమధ్యనే దశాబ్దాలుగా తిరుగుతున్న దేశం మనది. నిత్యానంద మాత్రం దేశాన్ని వదలి పారిపోవాలి. భలే ఉంది కదూ ? అతనెవరినీ రేప్ చేయలేదే? స్టూడెంట్స్ ని మర్డర్ చేయలేదే? పొలిటికల్ హవాలా చేయలేదే? అండర్ గ్రౌండ్ లో టన్నులకొద్దీ బంగారం దాచలేదే? అతనేమీ ఉమనైజర్ కాదు. అతని తాంత్రికసాధనలకు స్త్రీ సహకారం అవసరం. తన పంధా ఏంటో స్పష్టంగా చెబుతున్నాడు. ఇష్టపడి వచ్చినవాళ్ళను దగ్గరకు తీస్తున్నాడు. తప్పేముంది? ఇద్దరు consenting adults మధ్యన జరిగేదాన్ని కాదనడానికి మీరెవరు?

అతని స్కూల్స్ లో చదువుకుంటున అమ్మాయిలు క్షేమంగా ఉన్నారు. ఆ తల్లిదండ్రులే దగ్గరుండి మరీ చేర్పిస్తున్నారు. చక్కని హిందూ సాంప్రదాయాన్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు. 'మా అమ్మాయి అక్కడ చేరి చెడిపోయింది' అని ఒక్క తల్లి కూడా ఇంతవరకూ చెప్పలేదు. వాళ్ళలో ఎవరినీ అతను ముట్టుకోలేదు. స్వంత కూతుళ్లలాగా చూసుకుంటున్నాడు. 

హిందూమతం గురించి ఓనమాలు తెలియని ప్రతివాడూ మాట్లాడేవాడే ! ప్రతివాడూ బురద జల్లేవాడే !

ఇండియాని సర్వనాశనం చేస్తున్నది కమ్యూనిస్టులు, క్రైస్తవ మిషనరీలు, మదరసాలు. వీళ్ళ దుష్టప్రభావం నుంచి మన దేశాన్ని కాపాడాలనుకున్న ప్రతి హిందువునూ వీళ్ళు టార్గెట్ చేస్తారు. అదే నిత్యానందకూ జరిగింది. 

ఇండియాలో ఉంటే తాననుకున్న పని చెయ్యలేనన్న విషయం అర్ధమై, వీళ్ళ హింసను వేధింపులను తట్టుకోలేక, ఎక్కడో అమెరికా క్రింద ఒక ద్వీపాన్నే కొనుక్కుని తన రాజ్యాన్ని తాను స్థాపించుకున్నాడు నిత్యానంద. చాలా మంచిపని చేశాడు. ఇంకా మోదీగారి పరిపాలన గనుక ఇండియా దాటి బయటకు పోగలిగాడు. లేకపోతే దొంగకేసులు మోపబడి ఇక్కడి జైళ్లలో జీవితాంతం మగ్గిపోయేవాడు. ఇదీ గాంధీ నెహ్రూలు మన దేశానికి పట్టించిన సెక్యులర్ దరిద్రం !

తమిళనాడుకు ఇంకొక దరిద్రం ఉన్నది. అక్కడున్నన్ని గుడులు గోపురాలు మన దేశంలో ఇంకెక్కడా లేవు. కానీ అక్కడ ఉండేది నాస్తికప్రభుత్వం.దానికి హిందూ సాంప్రదాయం అంటే పడదు. ఆస్తికప్రజలను పాలించే నాస్తిక ప్రభుత్వమే తమిళనాడు ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే హిందూప్రజలను పాలించే క్రైస్తవ ప్రభుత్వం అది. మరి అక్కడ, నిత్యానంద ఎలా బ్రతకగలడు? ఆయన ఉన్నది బెంగుళూరు లో కదా అన్న సందేహం మళ్ళీ మీకు రావచ్చు. అదీ ఇదీ ఒకటే. పెద్ద తేడా ఏమీ లేదు. బార్డర్ జిల్లాల్లో తమిళ, కన్నడ సంస్కృతులు పోకడలు కలిసే ఉంటాయి. వేధింపులకు ఎక్కడైతేనేం? అందుకే అక్కడ ఉండలేక నిత్యానంద గుజరాత్ కు పారిపోయాడు. తమిళుడైన ఆయనను గుజరాతీయులు ఆదరించారు. చివరకు అక్కడా బ్రతకలేక దేశాన్నే వదలి పారిపోయాడు.

ఏతావాతా నేను చెప్పేదేమంటే, నిత్యానంద చెబుతున్నది, చేస్తున్నది అంతా కరెక్టే. నేను నిత్యానందను ఓపెన్ గా సమర్ధిస్తున్నాను. ఓషో ఎక్కడ విఫలమయ్యాడో నిత్యానంద అక్కడ సక్సెస్ సాధించాడు. వెరీ గుడ్ !

ఇండియాకి తిరిగి రాకుండా నిత్యానంద అక్కడే ఉండాలని, హిందూసామ్రాజ్యాన్ని స్థాపించాలని, గట్టిగా నిలబడాలని, ఈ చెత్తలోకానికి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే, కంచి శంకరాచార్యనే జైల్లో పెట్టిన గొప్ప దేశం కదా మనది? మన దేశంలో పేరుకు మాత్రమే హిందువుల మెజారిటీ. కానీ అసలైన మైనారిటీలు వాళ్ళే ఇక్కడ.

నిత్యానందను ఇండియాకు సాదరంగా ఆహ్వానించినప్పుడే మళ్ళీ ఈ దేశానికి నిష్కృతి కలుగుతుంది. మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఒక నిత్యానంద ఉండాలి. హిందూ సమాజానికి పట్టిన దరిద్రం అప్పుడు మాత్రమే వదులుతుంది. 

అందుకే అంటాను 'వీడు మగాడ్రా బుజ్జీ' అని.

కాదనగలరా మీరు?