ఆధ్యాత్మికత అనేది చేతలలో కూడా కనిపించాలి. ఉత్త మాటలలో మాత్రమే కాదు

12, జులై 2020, ఆదివారం

Satya Jyotish Astrology Software వెబ్ సైట్ ఈరోజు ప్రారంభించాం


ఇప్పటివరకు ఉన్న జ్యోతిష్య సాఫ్ట్ వేర్ లలో P. V. R.  Narasimha Rao తయారుచేసిన Jagannadha Hora Software ను నేను చాలా అభిమానిస్తాను. అది చాలా చక్కని ప్రోగ్రాం. దానిని వ్రాయడానికి అతనికి ఎన్నివేల గంటలు పట్టిందో నేను అర్ధం చేసుకోగలను. కానీ మా జ్యోతిష్య అవసరాలకు అది చాలా ఎక్కువ. మాక్కావలసిన దానికంటే దానిలో చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. క్రొత్తగా రీసెర్చి చేసేవారికి అది బాగా ఉపయోగపడుతుంది. నేను జ్యోతిష్యంలో చేసే రీసెర్చి అంతా అయిపోయింది గనుక క్రొత్తగా జ్యోతిష్యంలో నేర్చుకునేది ఏమీ లేదు గనుక అన్నన్ని ఫీచర్స్ మాకవసరం లేదు. తక్కువ ఫీచర్స్ తో, ఎక్కువ క్లారిటీతో కూడిన ఫలితాలనిచ్చే విధానం మాది.

కనుక, మనదైన జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ను మనమే తయారు చేసుకుందామని కొంతకాలం క్రితం నా శిష్యుడు రాజూసైకంతో అన్నాను. ఆ మాటను పట్టుకుని ఆంజనేయుడిలా రాత్రీపగలూ  శ్రమించి నా ఆలోచనకు ఒక రూపాన్ని తెచ్చాడు. దానిపేరే Satya Jyotish Vedic Astrology Software. దాని వెబ్ సైట్ ను నా 57 వ పుట్టినరోజైన ఈ రోజున హైదరాబాద్ లో లాంచ్ చేశాము.

ఒక నెల రోజులలో దీని యాప్ ను కూడా విడుదల చెయ్యబోతున్నాము. ఆ యాప్ అన్ని ప్లాటుఫామ్స్ మీద పనిచేసేలా, మొబైల్ లో కూడా పనిచేసేలా, మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇంగ్లీష్ తో కలిపి మొత్తం పదిభాషలలో ఈ ప్రోగ్రామ్ పనిచేస్తుంది.

మా  'పంచవటి స్పిరిచ్యువల్ ఫౌండేషన్' ప్రయాణంలో ఇదొక మంచి మైలురాయిని నా ఉద్దేశ్యం.

ప్రస్తుతానికి www.satyajyotish.software అనే వెబ్ అడ్రస్ లో మా ప్రోగ్రాంను మీరు చూడవచ్చు. పరీక్షించవచ్చు. ఇది మొదటి వెర్షన్ మాత్రమే. దీనిని అంచెలంచెలుగా బాగా పెంచబోతున్నాం. ప్రస్తుతానికి బేసిక్ వెర్షన్ ను రిలీస్ చేస్తున్నప్పటికీ, ముందు ముందు ఎన్నో కొత్తకొత్త ఫీచర్స్ దీనికి జోడించబోతున్నాం. వారఫలితాలు, మాసఫలితాలు, సంవత్సరఫలితాలు, లైఫ్ మొత్తం ఫలితాలతో కూడిన ఫలితభాగాన్ని, మేరేజ్ మేచింగ్ ని, జాతకం లోని రకరకాల దోషాలకు సరియైన రెమెడీస్ విభాగాన్ని కూడా దీనికి జోడించబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ ను పరీక్షించి మీమీ సలహాలనివ్వండి. పరిగణనలోకి తీసుకుంటాం.

ఒంటిచేత్తో రాజుసైకం సాధించిన విజయాలలో ఇదొకటి. ముందుముందు మరిన్ని శిఖరాలను అతను అధిరోహించాలని ఆశీర్వదిస్తూ, గురుభక్తిని మళ్ళీ నిరూపించుకున్నందుకు అతన్ని అభినందిస్తున్నాను.

గురుభక్తి అంటే ఊరకే ఉబుసుపోని మాటలు చెప్పడం కాదు, గురువు చెప్పినదానిని సాకారం చేసి చూపించడమే దానికి నిదర్శనం. ఊరకే మాటలు మాట్లాడేవారికి, మౌనంగా పనులు చేసి చూపించేవారికీ తేడా ఈ విధంగా ఉంటుంది మరి !