'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

3, ఏప్రిల్ 2019, బుధవారం

ప్రణయరాగ వాహిని చెలీ వసంతమోహిని - SPB, P.Suseela

'ప్రణయరాగవాహిని చెలీ వసంతమోహిని' అంటూ బాలసుబ్రమణ్యం సుశీలలు సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1975 లో వచ్చిన 'మాయామశ్చీంద్ర' అనే సినిమాలోది. మధుర సంగీత దర్శకుడు సత్యం స్వరపరచిన ఈ పాట ఇప్పటికీ చెక్కుచెదరని మెలోడీగా నిలిచి ఉంది.

సంగీత దర్శకులలో సత్యం అంటే నాకు ప్రత్యెక అభిమానం ఉన్నది. ఎందుకంటే, ఆయన స్వరపరచిన పాటలన్నీ అద్భుతమైన మేలోడీలే. వాటిలో హిందూస్తానీ రాగాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే వారికి ఆ మాధుర్యం వస్తూ ఉంటుంది.

సత్యం అసలు పేరు, చెళ్ళపిళ్ళ సత్యనారాయణ అనీ ఆయన తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటకవి ముని మనుమదనీ చాలామందికి తెలియదు. సంగీత సాహిత్యాలు వారి వంశంలో తిష్ట వేసుకుని కూర్చోడానికి ఆ వంశం ఎంత పుణ్యం గడించిందో మరి ?

శ్రీమతి రత్నగారితో కలసి Smule లో నేనాలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినండి మరి.