'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

31, మార్చి 2019, ఆదివారం

ఆకాశం దించాలా నెలవంక తుంచాలా - SPB, P.Suseela

'ఆకాశం దించాలా నెలవంక తుంచాలా' అంటూ బాలసుబ్రమణ్యం, సుశీలలు సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1976 లో వచ్చిన భక్త కన్నప్ప అనే సినిమాలోది. దీనికి సాహిత్యాన్ని ఆరుద్ర అందించగా, సంగీతాన్ని మధుర సంగీత దర్శకుడు సత్యం అందించారు. సత్యం స్వరపరచిన పాటల్లో హిందూస్తానీ రాగాలు ఎక్కువగా ఉంటాయి. అదిగాక ఆయన స్వయానా డోలక్ ఆర్టిస్టు. ఆయన్ను డోలక్ సత్యం అని పిలిచేవాళ్ళు. ఆయన బాంబే సినీ ఇండస్ట్రీలో చాలాకాలం డోలక్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు. అందుకే ఆ పేరు వచ్చింది.

శ్రీమతి రత్నగారితో కలసి Smule లో నేను ఆలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినండి.

చిత్రం :-- భక్త కన్నప్ప (1976)
సాహిత్యం:-- ఆరుద్ర
సంగీతం:-- చెళ్ళపిళ్ళ సత్యం