'సాధ్యమైనదే సాధన' - జిల్లెళ్ళమూడి అమ్మగారి అమృతవాక్కు

19, మార్చి 2019, మంగళవారం

నీవు లేక వీణా పలుకలేనన్నది - పి. సుశీల


'నీవు లేక వీణా పలుకలేనన్నదీ' అంటూ పి. సుశీల సుమధురంగా ఆలపించిన ఈ గీతం 1964  
లో విడుదలైన 'డాక్టర్ చక్రవర్తి' అనే చిత్రంలోనిది. దీనికి ఆత్రేయ రచించగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చారు. సంగీతానికి ఆడా మగా అన్న భేదం లేదు గనుక ఈ గీతాన్ని నేనూ సరదాగా ఆలపించాను. అయితే, భాషాపరంగా మూడో చరణంలో కొన్ని మార్పులు చేశాను. గమనించండి.

ఈ ఆపాత మధురగీతాన్ని నా స్వరంలో కూడా వినండి మరి !

Movie:--Dr.Chakravarthy (1964)
Lyrics:-- Athreya
Music:--S.Rajeswara Rao
Singer:-- P. Suseela
Karaoke Singer:-- Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------
నీవు లేక వీణా పలుకలేనన్నది
నీవు రాక రాధా నిలువలేనన్నది
ఆ ఆ ఆ ఆ
నీవు లేక వీణా

జాజిపూలు నీకై రోజు రోజు పూచే
చూచి చూచి పాపం సొమ్మసిల్లి పోయే
చందమామ నీకై తొంగి తొంగి చూచీ - 2
సరసను లేవని అలకలు పోయే
నీవు లేక వీణా

కలలనైన నిన్నూ కనుల చూతమన్నా
నిదురరాని నాకూ కలలు కూడ రావే
కదలలేని కాలం - విరహగీతి రీతీ - 2
పరువము వృధగా బరువుగ సాగె
నీవు లేక వీణా

తలుపులన్ని నీకై తెరచి ఉంచినాను
తలపులెన్నో మదిలో దాచి వేచినాను
తాపమెంతో నన్నూ తల్లడిల్లజేసే - 2
నయముగ నాదరి జేరగ రావా

నీవు లేక వీణా పలుకలేనన్నది
నీవు రాక రాధా నిలువలేనన్నది
ఆ ఆ ఆ ఆ
నీవు లేక వీణా