మనకు ప్రస్తుతం శక్తివంతమైన జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ప్రోగ్రాములున్నాయి. అవి BC నాటి గ్రహస్థితులను కూడా ఖచ్చితంగా చూపగలవు. ఇప్పుడు మనకు దొరికిన ఈ పాయింటును ఉపయోగించి మన వెదుకులాటను ఇంకా దగ్గరకు తెద్దాం.
రాహుకేతువులు సింహరాశిలో ఉన్న ఈ ఏడాదిన్నర సమయంలో, గురువుగారు 12-8-03 BC నుంచి 9-9-02 BC దాదాపుగా ఏడాదిపాటు సింహరాశిలో ఉన్నారు.
మళ్ళీ, ఈ సంవత్సర కాలంలో --
శుక్రుడు 12-8-03 నుంచి 2-9-03 BC వరకూ 22 రోజులపాటు సింహరాశిలో ఉన్నాడు.
మళ్ళీ 3-6-02 BC నుంచి 6-7-02 BC వరకూ 34 రోజులపాటు సింహరాశిలో ఉన్నాడు.
కనుక జీసస్ జననం ఈ మొదటి 22 రోజులలోగానీ, రెండవ 34 రోజులలోగానీ జరిగి ఉండాలి.
ఈ ఎనాలిసిస్ ను బలపరుస్తున్న అంశాలు :--
1 . ఈ కాలవ్యవధులు రెండూ కూడా, చలికాలంలో లేవు. ఎండాకాలం పరిధిలోనే ఉన్నాయి. కనుక గాస్పెల్ ఆఫ్ లూక్ 2:8 లో చెప్పబడిన అంశం సరిపోతున్నది.
Luke 2:8 [Bible -King James Version]
Luke 2:8 [Bible -King James Version]
"And there were in the same country shepherds abiding in the field, keeping watch over their flock by night".
2 . ఈ రెండు కాలవ్యవధుల లోనూ, గురువు, శుక్రుడు, కేతువు ముగ్గురూ కూడా సింహరాశిలోనే మనకు కనిపిస్తున్నారు. వీరిలో కేతువు కంటికి కనిపించే గ్రహం కాదు. అది ఒక గణిత బిందువు మాత్రమే. కానీ గురువు శుక్రుడు కంటికి కనిపిస్తారు. రెగులస్ (మఖా) నక్షత్ర మండలంలో వీరిద్దరూ కూడా నిలిచి ఉండి ఒక star formation ను పూర్తి చేసినట్లు మనం భావించవచ్చు.
జీసస్ జీవిత వివరాలు అటూ ఇటూగా మనకు తెలుసు. కనుక ఈ రెండు పీరియడ్స్ నూ జల్లెడ పడితే, ఈ 56 రోజులలో ఏదో ఒక రోజున జీసస్ జనన వివరాలు, ఆయా జాతక దశలతో మనకు సరిపోవాలి. ఆ తేదీయే జీసస్ జననతేదీ అని మనం చాలా వరకూ తార్కికంగా అనుకోవచ్చు.
మనకు ప్రస్తుతం ఈ క్రింది తేదీలు లభిస్తున్నాయి.
1. 17-6-02 BC -- ఇది సరిపోతున్నది.
2. 29-9-02 BC -- ఇది సరిపోవడం లేదు.
3. 11-9-03 BC -- ఇది సరిపోవడం లేదు.
4. 12-8-03 BC -- ఇది సరిపోతున్నది.
5 . 14-9-03 BC -- ఇది సరిపోవడం లేదు.
6. 17-2-02 BC -- ఇది సరిపోవడం లేదు.
7. 8-5-02 BC -- ఇది సరిపోవడం లేదు.
8. 29-8-03 BC -- ఇది సరిపోతున్నది.
వీటిలో చార్ట్ - 1 మనం ఇప్పటికే విశ్లేషణ చేసి ఉన్నాం. మరికొన్ని ఖగోళ అంశాలను విశ్లేషించుకున్న తర్వాత ఈ తేదీలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇవిగాక ఇంకా ఏవైనా ఇతర తేదీలు దొరుకుతాయేమో కూడా పరిశీలిద్దాం. ఎందుకంటే, ఇలాంటి విషయాలలో అన్నికోణాల నుంచీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.
(ఇంకా ఉంది)
మనకు ప్రస్తుతం ఈ క్రింది తేదీలు లభిస్తున్నాయి.
1. 17-6-02 BC -- ఇది సరిపోతున్నది.
2. 29-9-02 BC -- ఇది సరిపోవడం లేదు.
3. 11-9-03 BC -- ఇది సరిపోవడం లేదు.
4. 12-8-03 BC -- ఇది సరిపోతున్నది.
5 . 14-9-03 BC -- ఇది సరిపోవడం లేదు.
6. 17-2-02 BC -- ఇది సరిపోవడం లేదు.
7. 8-5-02 BC -- ఇది సరిపోవడం లేదు.
8. 29-8-03 BC -- ఇది సరిపోతున్నది.
వీటిలో చార్ట్ - 1 మనం ఇప్పటికే విశ్లేషణ చేసి ఉన్నాం. మరికొన్ని ఖగోళ అంశాలను విశ్లేషించుకున్న తర్వాత ఈ తేదీలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇవిగాక ఇంకా ఏవైనా ఇతర తేదీలు దొరుకుతాయేమో కూడా పరిశీలిద్దాం. ఎందుకంటే, ఇలాంటి విషయాలలో అన్నికోణాల నుంచీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావలసి ఉంటుంది.
(ఇంకా ఉంది)