Pages - Menu

Pages

24, జులై 2017, సోమవారం

నిత్య జీవితం - 2

ఈరోజూ రేపూ ఏం జరుగుతుంది?
-------------------------------------------

విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు.

పోలీస్ స్టేషన్లు దర్శిస్తారు. లేదా పోలీసులను కాంటాక్ట్ చేస్తారు.

సెక్సు కోరికలు నిద్రలేస్తాయి లేదా హెరాస్ మెంట్ కు గురౌతారు.

మెంటల్ టెన్షన్ ఎక్కువౌతుంది.

ఇంట్లో వాళ్ళతోనూ బయట వాళ్ళతోనూ గొడవలౌతాయి.

23, జులై 2017, ఆదివారం

గుండెనిండా గుడిగంటలు - ఎస్.పీ.బాలసుబ్రమణ్యం


'గుండెనిండా గుడిగంటలు' అంటూ బాలసుబ్రమణ్యం తనదైన శైలిలో మధురంగా ఆలపించిన ఈ గీతం 1998 లో వచ్చిన 'శుభాకాంక్షలు' అనే చిత్రంలోది. ఈ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాయగా, కోటి సంగీతాన్ని అందించారు.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.
------------------------------------------------

గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు – శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా
గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు – శుభాకాంక్షలంటే

చూస్తూనే మనసు వెళ్లి నీ ఒళ్లో వాలగా
నిలువెల్లా మారిపోయా నేనేనీ నీడగా
నిలువదు నిముషం – నువు ఎదురుంటే
కదలదు సమయం – కనబడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా- కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా
పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగ ఓ ప్రేమా
గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు – శుభాకాంక్షలంటే

నీ పేరే పలవరించే నాలోని ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే - కలలకు నెలవై
కదలని పెదవే - కవితలు చదివే
ఎన్నెన్నెన్నో గాధలున్న నీ భాషని – ఉన్నట్టుండి నేర్పినావె ఈ రోజుని
నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగ మార్చేస్తుందమ్మా

గుండె నిండా గుడిగంటలు – గువ్వల గొంతులు – ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు – సంధ్యా కాంతులు – శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా

19, జులై 2017, బుధవారం

నిత్య జీవితం - 1

నేటి నుంచీ కొత్త సీరీస్ ఒకటి మొదలు పెడుతున్నాను. జీవితాలపైన గ్రహప్రభావం ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా చెప్పడమే ఈ సీరీస్ ఉద్దేశ్యం. ప్రతిరోజూ మన జీవితాలలో మన చుట్టూ జరిగే సంఘటనలు ఏ విధంగా గ్రహసంచారాన్ని బట్టి ఉంటుంటాయో ఈ సీరీస్ రుజువు చేస్తాయి. మీమీ జీవితాలలో ఇక్కడ నేను చెప్పినవి జరుగుతున్నాయో లేదో మీరే పరిశీలించుకోండి మరి.

నాతో కలసి ఈ రహస్య ప్రపంచంలో విహరించడానికి మీకిదే నా ఆహ్వానం !!

ఈరోజూ రేపూ
----------------
అనవసరంగా అనుకోకుండా జరిగిన చిన్న చిన్న సంఘటనలు మనసును బాధిస్తాయి. డిప్రెషన్ తేలికగా కలుగుతుంది. విలాస వస్తువుల కోసం కాలం వెచ్చిస్తారు. ఈగో ప్రాబ్లంస్ తలెత్తుతాయి.

మనుషుల మధ్యన కమ్యూనికేషన్ కుంటుపడుతుంది. కమ్యూనికేషన్ డివైజెస్ రిపేర్లోస్తాయి. కానీ త్వరలోనే బాగౌతాయి.

16, జులై 2017, ఆదివారం

సఖియా వివరించవే - P.Suseela


సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కధా...

అంటూ పి.సుశీల మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం 1963 లో వచ్చిన నర్తనశాల అనే సినిమాలోది. గాయనీమణులు ఆలపించిన గీతాలలో నాకు నచ్చే పాటలు కొన్నున్నాయి. అలాంటి ఎవర్ గ్రీన్ మధురగీతాలలో ఇదీ ఒకటి. ఈ పాటను రచించినది సముద్రాల రాఘవాచార్య అయితే సంగీతాన్ని సమకూర్చినది సుసర్ల దక్షిణామూర్తి.

మాధుర్యానికి లింగభేదం లేదని నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను కదా ! అందుకే నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

చిత్రం:-- నర్తనశాల (1963)
సాహిత్యం:-- సముద్రాల రాఘవాచార్య
సంగీతం:-- సుసర్ల దక్షిణామూర్తి
గానం:-- పి. సుశీల
కరావోకే గానం:-- సత్యనారాయణ శర్మ
వినండి మరి
------------------------------------------

సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కధా
సఖియా వివరించవే

నిన్ను చూసి కనులు చెదరి - కన్నె మనసు కానుక జేసి
మరువలేక మనసురాక - విరహాన చెలికాన వేగేనని
సఖియా వివరించవే

మల్లెపూల మనసు దోచి - పిల్లగాలి వీచేవేళ
కలువరేని వెలుగులోన - సరసాల సరదాలు తీరేనని
సఖియా వివరించవే

వగలెరిగిన చెలునికి నా కధా
సఖియా వివరించవే

ఈ రోజు నేనేం చేస్తున్నాను?

తిధుల ప్రకారం ఈరోజు నేను పుట్టినరోజు. పొద్దుటినుంచీ యధావిధిగా శిష్యులూ అభిమానులూ విషెస్ పంపిస్తున్నారు. కొందరు బాగా దగ్గరైన వాళ్ళు అనేక ప్రశ్నలు చనువుగా అడుగుతున్నారు. ఈరోజు నా షెడ్యూల్ ఎలా ఉంటుందా అని చాలామందికి సందేహాలున్నాయి. వారికందరికీ ఈ కవితే జవాబు.
------------------------------
ఈరోజు మామూలుగా నిద్రలేవలేదు
లోకం ఎరుగని ఎరుకలోకి
సునిశితంగా చూస్తూ నిద్రలేచాను

జన్మనిచ్చిన తల్లిని స్మరిస్తూ
జన్మజన్మల తల్లిని కూడా స్మరించాను

శరీరానికి తలంటి పోస్తూ
తలపులకూ తలంటి పోశాను

ఒంటికి పట్టిన మురికిని వదిలిస్తూ
మనసుకు పట్టిన మురికినీ కడిగేశాను

కొత్త దుస్తులు ధరిస్తూ
పాత దేహాన్ని వదలి షికారు కెళ్ళాను

రాళ్ళతో కట్టిన గుడికెళ్ళలేదు
సజీవపు గుండెలోకి తొంగి చూచాను

పనికిరాని పూజలు చెయ్యలేదు
లోపలి వెలుగును స్మరించాను

కొవ్వొత్తులు ఆర్పను
గుండెలలో దీపాలు వెలిగిస్తాను

వీధుల్లో తిరగను
లోపలి వీధుల్లో విహరిస్తాను

స్పెషల్ భోజనం చెయ్యను
స్పెషాలిటీనే వదిలేస్తాను

వస్తువులు కొనను
ఉన్నవాటినే వదిలిస్తాను

సినిమా కెళ్ళను
'లోకం' అనే సినిమా చూస్తాను

స్నేహితులను పలకరించను
నా హితులను తలచుకుంటాను

బంధువుల ఇళ్ళకెళ్ళను
నిత్యబంధువుతో ముచ్చట్లాడతాను

తాగి తందనాలాడను
నా మత్తులో నేనే చిత్తైపోతాను

పుట్టిన రోజును జరుపుకోను
ఎప్పుడూ పుట్టని వెలుగులో నిలిచి ఉంటాను

15, జులై 2017, శనివారం

నిజంగా పుట్టిన రోజు...

పుట్టిన రోజులు
గతంలో ఎన్నో చూచాను
ఈరోజు మాత్రం చచ్చే రోజును
చవి చూద్దామనుకుంటున్నాను

పుట్టిన తర్వాత జీవితంలో
ఇన్నాళ్ళూ ఓడిపోయాను
చావులోనైనా గెలుపును
రుచి చూద్దామనుకుంటున్నాను

బ్రతకాలని ఆశిస్తూ
నిరంతరం చస్తూ బ్రతికాను
చావులోనైనా నిజంగా
బ్రతకాలని అనుకుంటున్నాను

చావంటూ భయపడుతూ
ఇన్నాళ్ళూ భయంభయంగా బ్రతికాను
కనీసం చావులోనైనా భయాన్ని
గెలుద్దామనుకుంటున్నాను

నన్ను నేను మర్చిపోయి
అందరికోసం ఇన్నేళ్ళూ బ్రతికాను
ఇప్పుడు నాలో నేను మునిగిపోతూ
నాకోసం చద్దామనుకుంటున్నాను

అందరి కుళ్ళుస్వార్ధాల కోసం
నా జీవితాన్ని ఎంతో వృధా చేశాను
ఈ ఆఖరి ఆహుతిలో పరమార్ధాన్ని
అర్ధం చేసుకుందామని అనుకుంటున్నాను

నావారు కాని అందరి కోసం
జీవితాన్ని ఇన్నాళ్ళూ పందెం కాశాను
ఎవరూ లేని ఒంటరితనం కోసం
నేడు చావును పొందాలనుకుంటున్నాను

బ్రతుకు భిక్షనాశిస్తూ
ఎందరి తలుపులనో తట్టాను
ఇప్పుడు నా తలపులనే కరగించి
నేనే లేకుండా పోదామని ఆశిస్తున్నాను

నాలోని నిమ్నత్వాన్ని ఆహుతి చేస్తూ
నాలోని ధన్యత్వానికి ఆజ్యం పోస్తూ
నా అంతరిక యజ్ఞంలో నేనే సమిధనై
కాలిపోదామనుకుంటున్నాను

లోకాన్ని చదివిన తెల్లని మనసుతో
శోకాన్ని దాటిన చల్లని ఆత్మతో
జీవితవృక్షానికి పండిన పండునై
రాలిపోదామనుకుంటున్నాను

అహాలూ అసూయలూ అస్సలంటూ లేని
ద్వేషాలూ దైన్యాలూ మచ్చులే కనరాని  
విశాల గగనపు సుదూర సీమలో
తేలిపోదామనుకుంటున్నాను

వెన్నుపోట్లూ కత్తిగాట్లూ
నయవంచనలూ నమ్మకద్రోహాలూ
ఏవీ ఎరుగని అతి మంచితనంలో
సోలిపోదామనుకుంటున్నాను

అమాయకత్వపు కళ్ళతో
అసూయ నెరుగని మనసుతో
అపురూపమైన ఆత్మసౌందర్యంతో
వెలిగే నా ప్రేయసి కౌగిలిలో
వాలిపోదామనుకుంటున్నాను

బంధాలను దాటుకుంటూ బాధల్ని చీల్చుకుంటూ
భవాన్ని ఓర్చుకుంటూ బ్రతుకును నేర్చుకుంటూ
అసూయా ద్వేషాలంటని అపురూప అందాన్ని
ఆస్వాదించాలనుకుంటున్నాను

లోకపు కుళ్ళుల కంటకుండా
తక్కువ బుద్ధులు సోకకుండా
నిర్మలంగా వెలిగే ఉజ్జ్వలసీమలో
నిద్ర పోదామనుకుంటున్నాను

ఈ పుట్టిన రోజుతో
నేను నిజంగా చచ్చిపోవాలి
ఈ చావులో అసలైన నేను
నిజంగా పుట్టాలి...

14, జులై 2017, శుక్రవారం

నిన్నటి వరకూ...

నిన్నటి వరకూ
ఏసీ రూముల్లో సుఖాలు పొందిన దేహం
ఈనాడు
శవపేటికలో పురుగులకు
ఆహారమౌతోంది

నిన్నటి వరకూ
సమసమాజం కోరి తపించిన మనసు
ఈనాడు
సమంగా పంచభూతాలలో
విలీనమౌతోంది

నిన్నటివరకూ
అధికారంతో విర్రవీగిన దర్పం
ఈనాడు
ఒంటరిగా శ్మశానపు మట్టిలో
అలమటిస్తోంది

నిన్నటి వరకూ
అడుగులకు మడుగులొత్తిన సేవకులు
ఈనాడు
పత్తా లేకుండా
పారిపోయారు

నిన్నటివరకూ
అన్నీ తెలుసన్న అహం
ఈనాడు
ఏం చెయ్యాలో తెలియక
బిక్కచచ్చిపోతోంది

నిన్నటి వరకూ
లోకాన్ని మారుస్తానన్న గర్వం
ఈనాడు
తన గతేమిటంటూ
కుములుతోంది

నిన్నటి వరకూ
ఆహా ఓహో అన్నవాళ్ళంతా
ఈనాడు
' ఆ ! ఏముందిలే?'
అంటున్నారు

నిన్నటి వరకూ
చిటికెలో అన్నీ వచ్చేవి
ఈనాడు
అరిచినా ఎవరూ
రావడంలేదు

నిన్నటి వరకూ
అందరూ నావారే అనుకున్నాను
ఈనాడు
నాకెవరూ లేరని
తెలుసుకున్నాను

నిన్నటి వరకూ అంతా
నాదే అనుకున్నాను
ఈనాడు
నాకేమీ లేదని తెలుసుకున్నాను

ఒకప్పుడు నేనుంది
విలాసాల సౌధంలో
ఈనాడు నేనుంది
శ్మశానపు మట్టిలో

దీనికోసమా నేను విర్రవీగింది?
దీనికోసమా నేను గర్వంతో పొంగింది?
దేనికోసం నేనిన్నాళ్ళూ పరుగెత్తింది?
దేనికోసం ఎందరినో బాధించింది?

ఇది ముందే తెలిస్తే ఎంత బాగుండేది?
ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతికేవాడిని
ఇది ముందే గ్రహిస్తే ఎంత బాగుండేది?
ఒళ్ళు పోయాక ఇలా చచ్చేవాడిని కాదు...

జీవితం

జీవితం

దేనినో ఆశించి
ఉన్నదాన్ని చేజార్చుకోవడం
దేనినో ఊహించి
కానిదానికి ఓదార్చుకోవడం

దూరపు కొండలను చూస్తూ
ఎదురుగా ఉన్నదాన్ని విస్మరించడం
భారపు బండలను మోస్తూ
కుదురుగా ఉండలేక వెర్రులెత్తడం

దేవుడెంత ఇచ్చినా
ఇంకేదో ఇవ్వలేదని ఏడవడం
దేబిరింత లాపలేక
దేవుళ్ళాడుతూ లోకాన్ని వదలడం

ప్రేమించేవారిని దూరం చేసుకోవడం
ఆత్మీయులతో వైరం పెంచుకోవడం
అనవసరపు బరువులకు చాన్సులివ్వడం
అపసవ్యపు దరువులకు డాన్సులెయ్యడం

అన్నీ తెలుసనుకుంటూ
అడుసులో కాలెయ్యడం
అన్నీ కాలిపోయాక
ఆకులు పట్టుకోవడం

వయసు ఛాయల్లో కాలిపోవడం
మనసు మాయల్లో కూలిపోవడం
మంచి చెప్పినా వినకపోవడం
వంచనలకేమో లొంగిపోవడం

డబ్బు సంపాదన కోసం ఆరోగ్యాన్ని పణం పెట్టడం
అదే ఆరోగ్యాన్ని మళ్ళీ డబ్బుతో కొనుక్కోవడం
అహంతో అందరినీ దూరం చేసుకోవడం
ఆఖరికి వాళ్ళే కావాలని అలమటించడం

ఎందుకు బ్రతుకుతున్నామో
తెలియకుండా బ్రతకడం
ఎక్కడికి పోతున్నామో
తెలియకుండా పోవడం

ఏ నేలపై నడుస్తున్నామో
అదే మట్టిలో మట్టిగా రాలడం
ఏ గాలిని పీలుస్తున్నామో
అదే గాలిలో గాలిగా తేలడం

ఇదే జీవితం...

12, జులై 2017, బుధవారం

10-7-17 నుంచి 16-7-2017 వరకూ ఏమౌతుంది?

మేషరాశి
ఇంటిలో గొడవలు జరుగుతాయి. మానసిక చింత ఎక్కువౌతుంది. వాహన ప్రమాదాలు జరుగుతాయి.

వృషభరాశి
అనవసరమైన మాటల వల్ల చికాకులు కలుగుతాయి.

మిధునరాశి
కంటిసమస్యలు ఎదురౌతాయి. నోటి దురుసు వల్ల సమస్యలు వస్తాయి. ఇంటిలో గొడవలు జరుగుతాయి.

కర్కాటకరాశి
తలకు దెబ్బలు తగులుతాయి. జీర్ణసమస్యలు ఎదురౌతాయి.

సింహరాశి
ఆరోగ్యం మందగిస్తుంది. అలసట కలుగుతుంది. మానసిక చింత ఎక్కువౌతుంది.

కన్యారాశి
చెడు స్నేహాల వల్ల నష్టం ఉంటుంది. మంచి చెప్పినా తలకెక్కదు.

తులారాశి
వృత్తి ఉద్యోగాలలో అనుకోని ఆటంకాలు కలుగుతాయి. ఒక మంచి ఒక చెడు జరుగుతాయి.

వృశ్చికరాశి
దైవిక కార్యాలలో యాక్సిడెంట్లు కలుగుతాయి. ఆధ్యాత్మికంగా మోసపోతారు.

ధనూరాశి
దీర్ఘరోగాలు బాధిస్తాయి. మానసిక చింత ఎక్కువౌతుంది. నష్టం వాటిల్లుతుంది.

మకరరాశి
జీవితభాగస్వామితో విభేదాలు వస్తాయి. వారి ఆరోగ్యం చెడుతుంది. సంసారంలో గొడవలు జరుగుతాయి.

కుంభరాశి
ఆరోగ్యం మందగిస్తుంది. స్నేహితులతో విడిపోతారు. పెద్దలతో విభేదాలు వస్తాయి.

మీనరాశి
సంతానం గురించి చింత కలుగుతుంది. మానసికంగా అల్లకల్లోలం ఉంటుంది.

11, జులై 2017, మంగళవారం

అమర్ నాథ్ యాత్రలో మరణాలు - పౌర్ణమి ప్రభావం

సోమవారం రాత్రి 8.30 ప్రాంతంలో ఒక అమర్నాథ్ యాత్ర బస్సును కాశ్మీర్ ముస్లిం టెర్రరిస్ట్ లు ఎటాక్ చేసినప్పుడు ఏడుగురు చనిపోయారు. పదిహేడు మంది గాయపడ్డారు. వందనుంచి నూటయాభై మంది యాత్రికులను చంపడం టెర్రరిస్టుల లక్ష్యం అని చెబుతున్నారు. ఈ సంఘటన కూడా పౌర్ణమి పరిధిలోనే (ఆషాఢ బహుళ ద్వితీయ) రోజునే జరగడం గమనార్హం.

జూలై 10 నుంచీ 16 వరకూ ఉన్న కొన్ని గ్రహయోగాల వల్ల ఈ వారంలో ఇలాంటి సంఘటనలు, ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా చాలా జరుగుతాయి.

గతంలో పదిహేనేళ్ళక్రితం నా స్నేహితుడు సందీప్ కుమార్ భట్టాచార్జీ అతని భార్యా ఇద్దరూ ఇలాగే అమర్నాథ్ యాత్రలో జరిగిన బాంబు దాడిలో జమ్మూలో చనిపోయారు. పిల్లలిద్దరూ అనాధలయ్యారు. ప్రభుత్వం ఏదో డబ్బులిస్తుంది కానీ ప్రాణాలు వెనక్కు రావు కదా?

మన దేశంలో మనం యాత్ర కెళ్ళాలంటే కూడా భయపడే ఖర్మ ఇంకెన్నాళ్ళో??

9, జులై 2017, ఆదివారం

గురుతత్త్వం నీకు నిజంగా కావాలంటే ....

గురుపూర్ణిమ సందర్భంగా లోకానికి అసలైన సుప్రభాతం
-----------------------------------------------------------

గురుచరిత్ర వినోదపు పారాయణాలూ
మనుచరిత్ర వరూధిని వేషాలూ
ఇవన్నీ పరమచెత్త పనులు
గురుతత్వం నిజంగా నీకు తెలిస్తే
ఈ పనులు నువ్వసలు చెయ్యనుగాక చెయ్యవు

సామూహిక భోజనాలన్నీ
త్రైమాసిక తర్పణాలే
రెంటికీ పెద్ద తేడా లేదు
మొదటి దాంట్లో ఆత్మల్లేని దేహాలుంటాయి
రెండోదాంట్లో దేహాల్లేని ఆత్మలుంటాయి
అంతే తేడా

గుళ్ళల్లో నీక్కనిపించే భక్తులందరూ
అహంకారంతో కుళ్ళిపోయిన శవాలే
శవాలలో జీవం కోసం వెదుకుతున్నావా పిచ్చివాడా?
గురుపూర్ణిమ సెలబ్రేషన్స్ అన్నీ
మాయదారి అవినీతి వ్యాపారాలే
గురువంటే ఒక్క పూర్ణిమకే పరిమితమా వెర్రివాడా?

గురువంటే నీ కోరికలు తీర్చే వెలయాలు కాదు
గురువంటే నీ అవసరానికి గుర్తొచ్చే ప్రియురాలు కాదు
గురువంటే నువ్వేం చేసినా సమర్ధించే
ధృతరాష్ట్రపు తండ్రి కాదు
గురువంటే నిన్ను తప్పుదారి పట్టించే
మతమోహపు ఊబి కాదు

నీ దొంగపూజలు గురువుకు అక్కర్లేదు
నీ నంగివేషాలు అతని దగ్గర కాదు
నీ అక్రమ వ్యాపారంలో వాటా
అతనికి ఏమాత్రం అవసరం లేదు

నువ్వు కొట్టే కొబ్బరి కాయకు ఆశపడటానికి
అతను కోతి కాదు
హుండీలో నువ్వేసే రూపాయికి మోసపోవడానికి
అతను బిచ్చగాడు కాదు
నువ్విచ్చే బట్టలకోసం వేచిచూస్తూ
అతను దిసమొలతో లేడు
నువ్విచ్చే నగలకోసం ఆశపడి
అతను దరిద్రంలో లేడు

నాకు బట్టలు పెట్టడం కాదు
ముందు నువ్వు బట్టలు కట్టుకో
నాకు నగలివ్వడం కాదు
ముందు నీ దరిద్రాన్ని తొలగించుకో
నాకు నైవేద్యం పెట్టడం కాదు
ముందు నువ్వసలైన తిండి తిను
నాకు డబ్బులివ్వడం కాదు
ముందు నువ్వసలైన ధనాన్ని సంపాదించు

నీ హారతిని ఆశిస్తూ నేను చీకట్లో లేను
నువ్వు నిమ్నత్వపు చీకట్లో ఉన్నావు
నీ హారతి నీకే పట్టుకో
నీ నైవేద్యం ఆశిస్తూ నేను ఆకలితో లేను
నువ్వు అజ్ఞానపు ఆకలితో ఉన్నావు
నీ ఆకలి సరిగ్గా తీర్చుకో

గురుచరిత్ర పారాయణం చెయ్యడం కాదు
నీ చరిత్ర సక్రమంగా ఉండాలి
గురువారం గుడికెళ్ళడం కాదు
నీ గుండే గుడిగా మారాలి
అప్పుడప్పుడూ సరదాకి మడి కట్టుకోవడం కాదు
నువ్వే దైవానికి దడిగా మారాలి

గురువంటే విశ్వచైతన్యం
నువ్వు కదలలేని రోగివైతే
ఆ చైతన్యం నీకెలా అబ్బుతుంది?
గురువంటే ఎల్లలు లేని ఆకాశం
నువ్వు బురదలో పందివైతే
ఆ ఆకాశం నీకెలా అందుతుంది?

అసలైన గురుతత్త్వం అందరికీ అందేది కాదు
ఎందుకంటే దాని వెల చాలా ఎక్కువ
అసలైన గురుతత్త్వం మందలలో దొరికేది కాదు
ఎందుకంటే దానికి క్వాలిటీ అంటే చాలా మక్కువ

గురుతత్త్వం ఒక ధృవనక్షత్రం
దానికోసం ఆకాశంలోకి నువ్వు సుదూర ప్రయాణం చెయ్యాలి
గురుతత్త్వం ఒక ఎవరెస్ట్ శిఖరం
దానికోసం నీ ప్రాణాలనే పణంగా పెట్టగలగాలి

నువ్వు చేస్తున్న పూజలన్నీ వృధానే
అవి నీ వ్యధలను ఏమాత్రం తీర్చలేవు
నువ్వు వేస్తున్న మతవేషాలన్నీ వృధానే
అవి నీకు గురు అనుగ్రహాన్ని ఏమాత్రం అందించలేవు

నిజమైన గురు అనుగ్రహం నీకు కావాలంటే
ముందు నువ్వు మారాలి
నీ లోపలను నువ్వు కడుక్కోవాలి
నీ లోగిలిని నువ్వు శుభ్రపరచుకోవాలి
నీ పాత 'నేను' లేకుండా పోవాలి
నువ్వు కొత్త జన్మ ఎత్తాలి

అప్పుడే తెలుస్తుంది గురువంటే ఏమిటో
అప్పుడే తెలుస్తుంది గురుతత్త్వం ఏమిటో
చెయ్యలేవా ఈ పనిని?
అయితే అఘోరించు ఈ బురదలోనే
జీవించు ఈ నరకంలోనే

ఇదే నీకు సుఖంగా ఉంటే
నిన్నెవరూ రక్షించలేరు
నరకమే నీకు స్వర్గంలా తోస్తే
నిన్నెవరూ కాపాడలేరు

గురుతత్త్వం నీకు నిజంగా తెలిస్తే
గురుపూర్ణిమ నువ్వు సెలబ్రేట్ చెయ్యవు
నిన్ను నువ్వు కాలిబ్రేట్ చేసుకుంటావు
గురుతత్వం నీకు నిజంగా తెలిస్తే
ఎల్లకాలం బయట బయట తిరగవు
నీలోపలకు నువ్వు నడుస్తావు

ఇన్నాళ్ళూ తెలీలేదా?
పోనీ ఇప్పుడైనా తెలిసిందిగా?
మరి మొదలుపెట్టు నీ పనిని
వేచి చూస్తోంది నీకోసం దివ్యత్వపు అవని

7, జులై 2017, శుక్రవారం

కరిగిన వినువీధి

విసిరేసిన చీకట్లో
అకాలపు వర్షం
నిశిరాత్రపు వాకిట్లో
అకారణ హర్షం

అలుపు లేని విశ్వాసం
వినువీధిని కరిగిస్తుంది
అలవికాని నిశ్వాసం
పెనుజల్లులు కురిపిస్తుంది

పుడమి వనిత చేయిచాస్తే
ఆకాశం సొంతమౌతుంది
కడమ వరకు వేచి ఉంటే
ఆరాటం అంతమౌతుంది

ప్రతి ఎదురుచూపునూ
ఒక కలయిక కుదిపేస్తుంది
ప్రతి బెదురు గుండెనూ
ఒక యవనిక మురిపిస్తుంది

ప్రియుని కోసం ఎదురుచూస్తూ
నువ్వుండాలి
వానకోసం ఎదురుచూచే
పుడమిలా

మౌనంగా నీ విరహాన్ని
తెలపాలి
జల్లుకోసం ఎదురెళ్ళే
వేడిమిలా...

వాన

జెట్ లాగ్ తో నిద్ర పట్టక రాత్రి రెండింటికి లేచా. బయటకు వచ్చి చూస్తే వాన పడుతోంది. అంతా చీకటిగా ఉంది. నాలోకి తొంగి చూచా. వెన్నెల వెలుగు కనిపించింది.

మదిలో కవిత మెరిసింది.

చదవండి
---------------------------
బయట వాన పడుతోంది
నాలో ప్రేమ పుడుతోంది
బయటంతా చీకటిగా ఉంది
నాలో వెలుగు వెల్లువలౌతోంది

వేసవి జల్లు కురుస్తోంది
లోపల వెన్నెల విరుస్తోంది
లోకమంతా మత్తుగా పడి ఉంది
నాలో ఎరుక ఎగసి పడుతోంది

ప్రళయం వచ్చి లోకం మాయమైంది
నేను మాత్రం బ్రతికే ఉన్నా
విలయం వచ్చి మనసే ఆవిరైంది
దాన్ని చూస్తూ నిలిచే ఉన్నా 

చుట్టూ చీకటి సముద్రం
మధ్యలో బడబానలంలా నేను
చుట్టూ జలపాతంలా వర్షం
మధ్యలో శిలావిగ్రహంలా నేను

అమెరికా జీవితం

అమెరికా గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎన్నైనా వ్రాసుకోవచ్చు. అదంతా ఎందుకు? ఒక కవితలో సారం మొత్తం చెప్తా.

ఐశ్వర్యం ఉంది ఆనందం లేదు
పచ్చదనం ఉంది పవిత్రత లేదు

సుఖం ఉంది సంతోషం లేదు
పరిశుభ్రత ఉంది పాతివ్రత్యం లేదు

విలాసాల మాటున
విషాదం ఉంది
కులాసాల మాటున
కుయుక్తులున్నాయి

రహదారులున్నాయి
జీవితపు దారులు లేవు
సంసారాలున్నాయి
కమ్మని కాపురాలు లేవు

పరుగుల వేగం ఉంది
గమ్యాలు లేవు
తరగని భాగ్యం ఉంది
తపనలు పోవు

తెల్లని తోలు వెనుక
మసి బారిన మనస్సులున్నాయి
చల్లని గాలి వెనుక
కసి నిండిన తమస్సున్నాయి

అన్నీ ఉన్నా
అలవిగాని భయాలున్నాయి
ఎన్నో చెప్పినా
తొలగిపోని అహాలున్నాయి

అమెరికా జీవితం
గమ్యం లేని ప్రయాణం
అమెరికా జీవితం
అతి మోహాల ఆరాటం

డబ్బుల్లోంచి నడిచే నడకల్లో
అవుతోంది సంస్కృతి నాశనం
మబ్బుల్లోకి చేసే పయనంలో 
పోతోంది పుడమితల్లి దూరం

అక్కడ పుట్టినందుకు
ఆవిరౌతుంది బాల్యం
అక్రమ స్నేహాల మాటున
చెల్లిస్తుంది భారీ మూల్యం

భావితరం ఏమౌతుందో అంటూ
బాధపడే బాంధవ్యం
పాత చింత పచ్చడంటూ
పక్కుమనే యువతరం

అన్నీ చుట్టూ ఉన్నా
ఏమీ మిగలని నైరాశ్యం
ఎందుకొచ్చామిటంటూ
ఏదో తెలియని వైరాగ్యం

మూలాలు మరిస్తే
మూలగక తప్పదు
కాలాలు మారితే
కనుమరుగూ ఆగదు

వేర్లు లేని ప్లాస్టిక్ మొక్క
అమెరికా జీవితం
కాళ్లులేని కండల దేహం
అమెరికా జీవితం

రంగుల్లో మెరుస్తూ
జీవంలేని కాగితం పువ్వు
అమెరికా జీవితం
దిగులుతో రగుల్తూ
బయటకు నవ్వే నవ్వు
అమెరికా జీవితం

6, జులై 2017, గురువారం

అమెరికా జనజీవనం - నా అభిప్రాయాలు - 4

అమెరికా ఒక చెత్త దేశం

నిపుణుల లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తానికీ అత్యంత ఎక్కువ చెత్తను పారేసే దేశం అమెరికానే. సగటున అమెరికాలో ఒక్కొక్కడు ఒక రోజుకి రెండు కేజీల (4.4 పౌండ్ల) చెత్తను పోగేస్తున్నాడు. అమెరికా జనాభా 322 మిలియన్స్. అంటే ఏడాదికి 234 మిలియన్ టన్నుల చెత్తను అమెరికా పోగేస్తున్నది.

ఇండియా జనాభా 1.31 బిలియన్స్. అంటే దాదాపు అమెరికా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కానీ ఇండియా పారేసే చెత్త అమెరికా చెత్తలో అరవై శాతం మాత్రమే.

అమెరికాలో కన్సూమరిజం చాలా ఎక్కువ. అనవసరమైన షాపింగులు కూడా ఎక్కువే. క్రెడిట్ కార్డులు చేతిలో ఉండటంతో ఇంపల్సివ్ షాపింగ్ చేస్తూ అవసరం ఉన్నా లేకున్నా ఊరకే వస్తువులు కొని ఇంటినిండా పోగేసుకుంటూ ఉంటారు అమెరికన్స్. మినిమంలో బ్రతకడం అనేది వాళ్ళకు చేతకాదు. ప్రపంచం ఎటు పోతున్నా వాళ్లకు అనవసరం. సాధ్యమైనంతవరకూ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యడమే వాళ్ళకు తెలిసిన పని. ఈ క్రమంలో చాలా చెత్తను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అయితే అందులో చాలాభాగం రీసైక్లింగ్ అవుతుంది గనుక బయటకు కనపడదు.

వస్తువులు కొనడంలో కూడా అమెరికా వాళ్లకు భయమే. ఎప్పుడేమౌతుందో అని భయంతో ముందే అనవసరమైన ఫుడ్డును కొనేసి ఫ్రిజ్ లో దాచి పెడుతూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన చెత్తను పోగేస్తూ ఉంటారు. 

ఫుడ్ మాఫియా

అమెరికాలో ఫుడ్ ఇండస్ట్రీ అంతా పెద్ద మాఫియా. అమెరికా విస్తీర్ణం 9.8 మిలియన్ కి.మీ అయితే ఇండియా విస్తీర్ణం 3.3 మిలియన్ కి.మీ. అంటే ఇండియా కంటే అమెరికా మూడు రెట్లు పెద్దది. కానీ అమెరికాలో ఉన్న ల్యాండ్ అంతా వ్యవసాయంలో లేదు. ఎక్కువభాగం అడవిగా ఉంటుంది. వ్యవసాయం కాబడుతున్న ప్రాంతం 44.6 % మాత్రమే. అదే ఇండియాలో అయితే 60.4 % భూమి వ్యవసాయంలో ఉన్నది.

అమెరికాలో ల్యాండ్ అంతటినీ వాళ్ళు సాగు చెయ్యడం లేదు. చేస్తున్న కొద్ది భూమిలోనే ఎక్కువ ఎరువులు వేసి పంటలు పండిస్తున్నారు. అమెరికాలో పండుతున్న పంటల్లో విషపూరిత రసాయనాలు చాలా ఎక్కువ. ఆ పంటలు తింటున్న ప్రజలు ఇంకా ఇరవై ముప్పై ఏళ్ళలో కేన్సర్ మొదలైన తీవ్రరోగాల బారిన పడటం ఖాయమని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు. కానీ వాళ్ళ మాటను ఫుడ్ మాఫియా వినడం లేదు. అసలు నిజాలు తెలిసిన కొందరు మాత్రం ఆర్గానిక్ ఫుడ్ వాడుతూ గుట్టుగా బ్రతుకుతున్నారు. కానీ ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా ఖరీదు కావడంతో అమెరికాలోనైనా సరే సామాన్యుడైనవాడు దానిని రోజూ కొనలేడు తినలేడు.

ఇక అమెరికాలో అమ్మబడే మాంసం కూడా విషపూరితమే. ఎందుకంటే ఆ పశువులకు గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లు విరివిగా ఇచ్చేస్తారు. వాటికి రోగాలు రాకుండా రకరకాల టీకాలు, యాంటీ బయాటిక్స్ ఇంజక్షన్ల రూపంలో ఇస్తారు. వాటి మాంసం తిన్నవారికి ఆ హార్మోన్లు, మందులు సూటిగా సరఫరా అవుతాయి. ఇక వాళ్ళు రాక్షసుల్లా ఊరిపోతూ ఉంటారు.

వెజిటబుల్స్ ని కూడా వదలకుండా వాటినీ జెనెటిక్ గా మార్చి పారేసి కొత్త కొత్త రకాలను సృష్టిస్తూ ఉంటారు. ఒక్క యాపిల్ లోనే పది రకాల రుచులు రప్పించారు. ఉల్లిపాయల్లో కూడా స్వీట్ ఆనియన్స్ తయారు చేశారు. ఈ రకమైన మార్పులకు లోనైన కాయలు చూడటానికి పందుల్లా కన్పిస్తాయి గాని వాటిల్లో బలం ఉండదు. వంకాయలు గాని, టమోటాలు గాని, దోసకాయలు గాని, చివరకు ఉల్లిపాయలు అయినా సరే మనం మామూలుగా ఇండియాలో వండినట్లు వండినా కూడా మన కూరగాయల రుచి అక్కడ చస్తే రాదు. ఏదో చెత్త తిన్నట్లు ఉంటుంది గాని రుచీ పచీ ఉండదు. ఇక ఈ ట్రీటెడ్ వెజిటబుల్స్, వాటిని తిన్నవారిలో ఏయే దుష్పరిణామాలను కలిగిస్తాయో కొన్నేళ్ళ తర్వాత గాని తెలియదు. తెలిసే నాటికి చేయిదాటిపోయి ఏ నయంగాని రోగమో ఒంట్లో ఉన్నట్లు తేలుతుంది. ఇక అప్పుడు చేసేది కూడా ఏమీ ఉండదు.

మెడికల్ మాఫియా

అమెరికాలో చాలా గొప్ప వైద్యం అందుబాటులో ఉంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మన ఇండియాలో దొరికే వైద్యమే అక్కడ కూడా ఉంటుంది. మన ఇండియాలో ఉండే నిర్లక్ష్య డాక్టర్లు అక్కడ కూడా ఉన్నారు. మన ఇండియాలో జరిగే మెడికల్ మోసాలు అక్కడ కూడా జరుగుతున్నాయి.

వైద్యం చెయ్యకుండా దొంగ బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్ము కాజేసే మాఫియా అమెరికాలో చాలాసార్లు వెలుగు చూసింది. దీనిని చేస్తున్నది కూడా అక్కడ సెటిలైన మన ఇండియా డాక్టర్లే. ఈ మోసం అమెరికాలో నిరంతరం జరుగుతూనే ఉంది. అందుకనే హెల్త్ స్కీమ్స్ తీసి పారెయ్యాలన్నది ట్రంప్ అజెండాలో ఒకటి.

అక్కడ వైద్యం అంతా ఇన్సూరెన్స్ మయం. అందుకని 'నీకేంటి నష్టం? బిల్లు కట్టేది నువ్వు కాదుగా?' అంటూ ఇష్టం వచ్చినట్లు స్టెరాయిడ్లూ, ఇమ్యూనో సప్రెసంట్లూ పేషంట్ల చేత వాడిస్తూ వాళ్ళ ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నాయి మెడికల్ కంపెనీలు. హోమియోపతి వంటి సైంటిఫిక్ వైద్య విధానాలను 'కల్ట్ మెడిసిన్' అని పేరు పెట్టి అణగదొక్కుతున్నాయి అక్కడి ఫార్మా కంపెనీలు.

నేనక్కడ ఉన్న మూడునెలల్లో బాగా గమనించాను. అక్కడ వైద్యం ఇక్కడ వైద్యం కంటే ఏమీ మెరుగ్గా లేదు. కాకపోతే కొన్ని కొన్ని సర్జరీలు చేసే ఎక్స్ పర్ట్ లు అమెరికాలో ఉన్నారు. వైద్యం మాత్రం ఇక్కడ లాగే ఉంది. తేడా ఏమీ లేదు.

Pournami Effect - July 2017

ఈ పౌర్ణమి ప్రభావం వల్ల వచ్చే నాలుగు రోజులలో ఈ మార్పులు చాలామందిలో కనిపిస్తాయి.

కమ్యూనికేషన్ లో దూకుడు వ్యక్తమౌతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు ఏదో మంచి చేస్తున్నామన్న భ్రమలో చెడు చేస్తారు. ఆ తర్వాత విచారిస్తారు.

ఆధ్యాత్మిక, మతపరమైన నిర్ణయాలు ఎక్కువౌతాయి.

అంతచ్చేతనలో ఉండి గందరగోళ పరుస్తున్న భావాలకు అనుగుణంగా ఉద్రేకపూరిత చర్యలు కార్యరూపం దాలుస్తాయి.

5, జులై 2017, బుధవారం

అమెరికా జనజీవనం - నా అభిప్రాయాలు - 3

డబ్బు, సెక్స్, పవర్.

అమెరికాలో మూల సూత్రాలు మూడే మూడు. డబ్బు, సెక్స్, పవర్. ఇండియాలో కూడా ప్రస్తుతం ఇవేననుకోండి. కాకుంటే మనకు తరతరాలుగా వారసత్వంగా వచ్చిన సంస్కృతి ఒకటి ఏడిసింది. వాళ్లకది లేదు. మనది వేలాది సంవత్సరాల సంస్కృతి. వాళ్ళది 600 ఏళ్ళ చరిత్ర.

అక్కడ పిల్లలు చిన్నప్పటి నుంచే పోర్నోగ్రఫీకి అలవాటు పడతారు. హైస్కూల్లోనే సెక్స్ లైఫ్ మొదలు పెడతారు. టీనేజిలోనే ఒకరిని మించి పార్ట్ నర్స్ ను మార్చేస్తారు. అక్కడ స్కూళ్లలోనే సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. దాని మూలసూత్రం ఒక్కటే - "కోరికలను ఆపుకోకు. ఎంజాయ్ చెయ్యి. ఎంజాయ్ చెయ్యడం నీ హక్కు. కాకపోతే రోగాలు రాకుండా, కడుపు రాకుండా చూసుకో. దానికి కావలసిన జాగ్రత్తలు ఎలాగో మేం నేర్పిస్తాం." అందుకే పాతికేళ్ళు వచ్చేసరికి అక్కడ పిల్లలు సెక్సువల్ పెర్వర్ట్ లు గా తయారౌతున్నారు. చాలామంది అమ్మాయిలకు ఆ వయసుకే రెండు మూడు అబార్షన్లు అవుతున్నాయి. పొరపాటున టీనేజి ప్రెగ్నెన్సీ వచ్చి కడుపు తీయించుకునే అవకాశం లేకపోతే,  ఏడుస్తూ ఆ పిల్లలని పెంచుతారు. లేదా ఆ పిల్లల్ని చంపేస్తున్నారు.

నేను అక్కడ ఉన్నపుడు ఒక న్యూస్ చాలా చర్చనీయాంశం అయింది.

ఒక టీనేజి అమ్మాయికి ఇద్దరు పిల్లలు. తండ్రి / తండ్రులు ఎవరో ఆ అమ్మాయికి కూడా తెలుసో తెలీదో మనకు తెలియదు. ఒకరోజున ఆ ఇద్దరు పిల్లల్నీ తన కార్ లో పెట్టి లాక్ చేసి ఆ అమ్మాయి 50 మైళ్ళ దూరంలో ఉన్న బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి రాత్రంతా వాడితో గడిపి తెల్లారి తిరిగి వచ్చింది. ఈలోపల ఆ పిల్లలిద్దరూ కారులో ఊపిరాడకో లేదా చలికో చనిపోయి ఉన్నారు. ఈ సంఘటన జరిగి ఇంకా ఒక నెల కూడా కాలేదు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఆ పిల్లల్ని చంపేద్దామనే ఉద్దేశ్యం తోనే ఆ పిల్ల అలా చేసిందని పోలీసులు అంటున్నారు. కేసు నడుస్తోంది.

లెస్బియనిజం, హోమో సెక్సువాలిటీలు అక్కడ సర్వసాధారణమేగాక లీగల్ కూడా. పోప్ కూడా వీటిని ఒప్పుకుంటూ ఆశీర్వదించాడు. ఇంకేం కావాలి? ఆ పోపు పరిస్థితి కూడా ఏమీ బాగాలేదు. దాదాపు ఏభై మంది చిన్నపిల్లల్ని రేప్ చేసిన ఒక HIV వాటికన్ ప్రీస్ట్ గారిని ఉదారంగా క్షమించి ఆయన్ను ఏ కోర్టులూ శిక్షించకుండా అడ్డు పడుతూ పోపుగారు ఈ మధ్యనే ఆ రాక్షసప్రీస్టు గారికి క్షమాభిక్ష పెట్టేశారు. వారి లీలలు అలా ఉంటాయి మరి !!  

అమెరికా సమాజంలో ఉన్నన్ని వెర్రి తలలు ఇంకెక్కడా ఉండవు. అదేమంటే హ్యూమన్ రైట్స్ అంటారు. మా ఇష్టం అంటారు. ఇలాంటి పెర్వర్శన్స్ ను సమర్ధించుకుంటూ ఉద్యమాలు నడుపుతారు. కోర్టులకెళతారు.

అక్కడ పుట్టి పెరుగుతున్న మనవాళ్ళ పిల్లల్లో కూడా ఈ వెర్రి పోకడలు బాగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం అమెరికన్లతో స్నేహాలు. నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు. ఆయన మన ఇండియనే. అక్కడి మన ఇండియన్ సర్కిల్స్ లో చాలా పద్ధతైన మనిషిగా చలామణీ అవుతూ ఉంటాడు. మన ఇండియన్ కల్చర్ గురించి, గుళ్ళు గోపురాల గురించి లెక్చర్లు ఇస్తూ, పిల్లల్ని అలా పెంచాలి ఇలా పెంచాలి అని అందరికీ చెబుతూ ఉంటాడు.

ఇదిలా ఉంటే, ఇరవై ఏళ్ళున్న ఆయన కూతురు ఈ మధ్యనే తన ఫేస్ బుక్ లో దర్జాగా ' నేను బై సెక్సువల్ ను' అంటూ  ఒక స్టేట్ మెంట్ పారేసింది. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.

ఇండియన్ అమెరికన్స్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్న - "వాళ్ళ పిల్లల్ని అమెరికా విషసంస్కృతి చేతిలో పడకుండా కాపాడటం ఎలా?" అనేదే. అది ఎవరి వల్లా కావడం లేదు. దీనికి పరిష్కారం కూడా లేదు. డబ్బుకోసం అక్కడకు వెళ్ళినందుకు బహుశా మనవాళ్ళు పే చేస్తున్న పెనాల్టీ ఇదేనేమో?

పిల్లల్లో పెడ ధోరణులు

అక్కడ హ్యూమన్ రైట్స్ చాలా ఎక్కువ. పిల్లల్ని కూడా అరవకూడదు. కొట్టకూడదు. బెదిరించకూడదు. కనీసం గట్టిగా చెప్పకూడదు. స్కూళ్ళల్లో వారికి ఇదే నేర్పిస్తారు. 'మీ అమ్మ నాన్నా నిన్ను తిడుతున్నారా? కొడుతున్నారా? అయితే ఈ నెంబర్ కు కంప్లెయింట్ చెయ్యి' అని స్కూల్లో టీచర్లే నూరిపోస్తారు.

ఆ నెంబర్ కు నిజంగానే ఆ పిల్లో పిల్లాడో ఫోన్ చేసి తన బాధలు చెబితే వెంటనే పోలీసులొచ్చి అమ్మానాన్నలని అరెస్ట్ చేస్తారు. మరీ చిన్న పిల్లలైతే ఆ పిల్లల్ని తీసుకుపోయి హోమ్స్ లో ఉంచేస్తారు. ఆ పేరెంట్స్ ను వారితో కలవనివ్వరు.

అందుకని పిల్లల్ని పెంచాలంటే తల్లిదండ్రులే భయం భయంగా వారిని పెంచవలసి వస్తుంది. ఈ విధంగా పెరిగిన పిల్లలు పెడగా తయారౌతున్నారు. "మీకేం తెలుసు మీ మొఖాలు? డర్టీ  ఇండియన్  విలేజ్ బ్రూట్స్. కల్చర్ లెస్ మొరాన్స్" అని తల్లిదండ్రులను తిడుతున్నారు. లేదా లోలోపల అనుకుంటున్నారు. అలా ఉన్న పిల్లలను చూసి ఈ పేరెంట్స్ మురిసిపోతూ " అబ్బ ! మా పిల్లలు ఎంత ఎదిగారు? ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు?" అని చంకలు చరుచుకుంటున్నారు. ఇదీ అమెరికాలో మన ఇండియన్ తల్లిదండ్రుల ఖర్మ !!

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడటం అంటే ఇదేనా మరి??

4, జులై 2017, మంగళవారం

అమెరికా జనజీవనం - నా అభిప్రాయాలు - 2

స్వార్ధపూరిత సమాజం

అమెరికా ఒక కేపిటలిస్ట్ దేశం. అక్కడ డబ్బే మాట్లాడుతుంది గాని మనుషులు మాట్లాడరు. నీ దగ్గర డబ్బు లేకపోతే అమెరికాలో ఎవరూ నీతో మాట్లాడరు. డబ్బు లేకపోతే మన దేశంలో ఏదో ఒక రకంగా బ్రతికెయ్యచ్చు. కానీ అమెరికాలో ఆ పరిస్థితి లేదు. అక్కడ డబ్బున్నవాడిదే రాజ్యం. అక్కడ ఫ్రీ లంచ్ అనే మాటే లేదు. ప్రతిదానికీ ఒక 'వెల' ఉంటుంది.

ఒకడిలో టాలెంట్ ఉందీ అంటే వాళ్ళు అక్కున చేరుకుంటారని సామాన్యంగా అనుకుంటారు. అది నిజమే. ఎందుకంటే వాడి టాలెంట్ చూచి ముచ్చట పడి కాదు. ఆ టాలెంట్ ని వాడుకుని అందులో ముప్పావలా లాభం వాళ్ళు నొక్కేసి పావలా వీడికిస్తారు. పైకి మాత్రం మెరిట్ ని మేము నెత్తికెత్తుకుంటాం అంటారు. దేన్నైనా సరే బిజినెస్ దృష్టితో మాత్రమే వాళ్ళు చూస్తారు. నాకేంటి? అనేది అక్కడ ప్రధాన సూత్రం. అవసరం లేకపోతే కుక్క కూడా అక్కడ మనల్ని పలకరించదు.

మృగ్యమైన మానవ సంబంధాలు

అక్కడ మానవ సంబంధాలు కూడా అంతంత మాత్రమే. అక్కడున్నది అవసరమే గాని ప్రేమ అనేది అక్కడ లేదు. సగటు అమెరికా పౌరుడు తనను తానే నమ్మడు ఇంక పక్కవాడినెలా నమ్మగలడు? అందుకే చిన్న చిన్న విషయాలకే అక్కడ విడాకులు తీసుకుంటూ ఉంటారు. ఒక ఇంట్లో ఎవరి బ్యాంక్ ఎకౌంట్ వారిదే ఎవరి సంపాదన వారిదే. ఖర్చులు పంచుకుంటారు. అంతా వ్యాపారం లాగా ఉంటుంది. ఇంకో మంచి పీస్ దొరికి ఈ పీస్ అంటే ఇష్టం లేని రోజున టక్కున విడిపోతారు. అలా విడిపోయినందుకు రిగ్రెట్స్ ఏమాత్రం ఎవరికీ ఉండవు.

కృత్రిమ వేషాలు

ప్రతి మనిషినీ బిజినెస్ దృష్టితో మాత్రమే చూస్తారు. పైకి మాత్రం చాలా మర్యాదగా నవ్వుతూ మాట్లాడతారుగాని లోపల ఉద్దేశ్యాలు మనకు ఏమాత్రం అర్ధం కావు. ఆ విధంగా నటించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. దీన్నే మన భాషలో చెప్పాలంటే ' మెత్తగా గొంతు కొయ్యడం' అని చెప్పవచ్చు. పైకి ఎంతగా నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం మనమంటే వాళ్లకు చులకనభావమే. కమ్యూనికేషన్ స్కిల్స్ చిన్నప్పటి నుంచీ నూరిపొయ్యబడడం వల్ల దేన్నైనా మార్కెటింగ్ ధోరణిలో మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. 'యూస్ అండ్ త్రో' అనేది వాళ్ళ పాలసీ.

భయంతో కూడిన జీవితం

అమెరికాలో ప్రతివారికీ భయం ఎక్కువ. రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవరైనా వారివైపు అదేపనిగా చూస్తుంటే భయపడి పోతారు. ఏదైనా తగిలినా, చీమో దోమో కుట్టినా విపరీతమైన భయంతో ఆ చోట లోషన్లేసి తెగ కడుగుతారు. ఏదో అంతు తెలియని రోగం వచ్చి తమను చంపుతుందని అంతరాంతరాలలో వాళ్లకు తగని భయం ఉంటుంది. అందుకే వాళ్ళ సినిమాలు కూడా జంతువులు, కీటకాలు, పక్షులు వచ్చి ఎటాక్ చేసినట్లు, లేకపోతే ఏవో అంతు తెలియని రోగాలు వచ్చి పడినట్లు చివరకు వాటిని అంతం చేసి తమను తాము రక్షించుకున్నట్లు ఉంటాయి. మిడిల్ ఈస్ట్ నుంచో లేదా మార్స్ లాంటి ఇతర గ్రహం నుంచో ప్రపంచ వినాశనం పొంచి ఉందని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. హెల్త్ పారామీటర్స్ లో ఏ మాత్రం తేడా వచ్చినా తెగ గాభరా పడిపోయి తల్లక్రిందులు అవుతారు.

ఇంట్లో ఒక చీమ కనిపిస్తే దానిని పట్టుకుని బయట పారేయందే వాళ్లకు తోచదు. ఇక బొద్దింక కనిపిస్తే చాలు ఆ రోజు వాళ్ళు నిద్రే పోరు. మితిమీరిన కెమికల్స్ వాడకంతో తెలీకుండానే ఒళ్ళు గుల్ల చేసుకుంటూ ఉంటారు.

కుక్కలు / కార్లు

అమెరికాలో మనుషుల కంటే కుక్కలు / కార్లు ఎక్కువ. ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్లు తప్పనిసరిగా ఉంటాయి. ఎవరి ఆఫీసు వారిదే ఎవరి తిరుగుడు వారిదే. అదే విధంగా - ప్రతి ఇంటికీ మినిమం రెండు నుంచి నాలుగు లేదా ఆరు కుక్కలు ఉంటాయి. చాలామంది తమతమ జీవితాలలో మూడు నాలుగు లేదా ఇంకా ఎక్కువ మందికి విడాకులు ఇచ్చేసి చివరకు రెండు కుక్కల్ని పెంచుకుంటూ వాటితో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెళ్ళికాని అబ్బాయిలు అమ్మాయిలయితే కుక్కలతోనే కాలక్షేపం చేస్తూ వాటిని షికార్లకు తిప్పుతూ బ్రతుకుతూ ఉంటారు. మనుషులలో దొరకని ప్రేమను జంతువులలో వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. మనం ఎదుటివారిని ప్రేమిస్తేనే కదా వాళ్ళు మనల్ని ప్రేమించేది? అదీ ఇదీ లేనప్పుడు మిగిలేది జంతుప్రేమ మాత్రమే.

అంతుబట్టని రోగాలు

అమెరికాలో ఎక్కడ చూచినా కనిపించే రోగం - ఒబేసిటీ. బ్రేక్ ఫాస్ట్ నుంచీ డిన్నర్ దాకా ఫ్రైడ్ చికెన్ మాత్రమే తినేవాళ్ళు కోట్లల్లో అమెరికా నిండా ఉన్నారు. వీరిలో వైట్స్ కంటే బ్లాక్స్ ఎక్కువ. చీప్ తిండి తినేవారు కూడా బ్లాక్స్ లోనే ఎక్కువ. ఆ చీప్ మాంసంలో అనేక హానికారక హార్మోన్లు ఉంటాయి. వాటివల్ల శరీరం అడ్డదిడ్డంగా ఊరిపోయి రాక్షసుల్లా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకుండే రోగాలు కూడా తక్కువేమీ కావు. తెల్లవాళ్ళ రెసిస్టెన్స్ పవర్ మనకంటే చాలా తక్కువ.

ఒబేసిటీ వల్ల పెళ్ళికాకుండా మిగిలిపోయే ఆడపిల్లలు మొగపిల్లలు చాలామంది అమెరికాలో మనకు కన్పిస్తారు. వీరిలో బ్లాక్ ఆడపిల్లల పరిస్థితి మరీ దుర్భరం. దీనికొక కారణం ఉంది. తెల్లవాళ్ళేమో తెల్లమ్మాయిల వెంట పడుతూ ఉంటారు. తెల్లమ్మాయిలు నల్లబ్బాయిలను (బలంగా ఉంటారని) లైక్ చేస్తారు. ఎవడూ పట్టించుకోక మిగిలిపోయేది నల్లమ్మాయిలే. ఆ డిప్రెషన్లో పడి చీప్ తిండి తిని వాళ్ళు విపరీతంగా ఊరిపోతూ ఉంటారు. చివరకు పెళ్ళికాకుండా మిగిలిపోతూ ఉంటారు.

డయాబెటీస్, హైపర్ టెన్షన్, కాన్సర్ మొదలైన రోగాలు కూడా అక్కడ తక్కువేమీ కావు. వీటికి తోడు విచ్చలవిడి వాక్సినేషన్ వల్ల వచ్చే 'ఆటిజం' అక్కడ చాలా ఎక్కువగా ఉంటున్నది.

కొన్ని కొన్ని రోగాలు వచ్చాయంటే ఆ ట్రీట్మెంట్ కు వాళ్ళ జీతాలే గాక పక్కవాడి జీతాలు కూడా చాలవు. అందుకే ఏ చిన్న రోగం వచ్చినా భయపడి గజగజా వణికిపోతూ ఉంటారు. ఎక్కడ ఏ వైరస్ ఉందో ఏ బాక్టీరియా ఉందో అని తెగ శుభ్రత పాటిస్తారు.

అంత శుభ్రత పాటించినా వీళ్ళలో ఒక దరిద్రపు అలవాటు ఉంది. అదేమంటే నాలుక గీసుకోరు. ఊరకే బ్రష్ చేసుకుని ఊరుకుంటారు. ఆ తర్వాత పొద్దున్నే చికెన్ తిని చూయింగ్ గం నములుతూ ఆఫీసుకెళతారు. ఆ నోట్లోంచి వచ్చే కంపుకు ఎదుటివాడు హరీమని చావాల్సిందే. మనం నాలుక గీక్కుంటే దాన్ని కామెంట్ చేసి జోకులేసి నవ్వుతారు. మళ్ళీనేమో మనదగ్గర కర్రీ స్మెల్ వస్తున్నదని ఆఫీసులలో బాసులకు కంప్లెయింట్ చేసే అమెరికన్స్ కూడా ఉన్నారంటే మీరు నమ్ముతారో లేదో మరి? ఇక టాయిలెట్ పేపర్ యూసేజి గురించి నేను చెప్పనక్కర్లేదు. మీరే ఊహించుకోండి.

ఇటువంటి దరిద్రపు అలవాట్లు వాళ్ళు పెట్టుకుని మన ఇండియన్స్ ను 'కంట్రీ బ్రూట్స్' అన్నట్లు చూస్తారు. అదీ విచిత్రం !! విచిత్రం అనడం కంటే తెల్లవాడి దురహంకారం అంటే కరెక్ట్ గా ఉంటుందేమో?

అమెరికా నుంచి పాడిన పాటలు

అమెరికాలో ఉన్నప్పుడు కొన్ని పాటలు పాడాను. రికార్డింగ్ ఆపరేటస్ లోని తేడాల వల్ల అవి సరిగ్గా రాలేదు. రీసౌండ్ ఎక్కువ వచ్చింది. ఇండియా వెళ్ళాక వాటిని మళ్ళీ పాడి సరిచేస్తానని మావాళ్ళతో చెప్పాను. ఆ పనిలో భాగంగా ఈ పోస్టులు వస్తున్నాయి. వినండి.

Zindgi Kitni Khoobsoorat Hai 

Tum Bin Jaavu Kahaa

Ruk Jana Nahi Tu Kahi Haarke


Ek Banjara Gaye

Ajib dastan Hai Ye