“Why so much of ruckus in a small life? Can't we live happily and peacefully?" - Self Quote

16, ఏప్రిల్ 2017, ఆదివారం

Veena Venuvaina Sarigama Vinnava - Janaki, SPB


వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా

అంటూ జానకి బాలూ గార్లు మధురంగా ఆలపించిన ఈ గీతం 1979 లో వచ్చిన 'ఇంటింటి రామాయణం' అనే సినిమాలోది. దీనికి సాహిత్యాన్ని వేటూరి సుందర రామమూర్తి అందించగా, సంగీతాన్ని రాజన్ నాగేంద్ర అందించారు. నలభై ఏళ్ళు గడిచినా ఇది ఈ నాటికీ మరపురాని మధుర గీతమే.

రంగనాధ్ అంకుల్ పాటలు చాలా మధురమైనవి. ఆయన పాటలు పాడటమంటే నాకెప్పుడూ ఇష్టమే.

ఈ పాటను నేను శ్రీలలిత కలసి పాడాము.

వినండి మరి.

Movie:-- Intinti Ramayanam 1979
Lyrics:--Veturi Sundara Rama Murty
Music:--Rajan  Nagendra
Singers:--S.Janaki, SP. Balasubramanyam
Karaoke Singers:--Sri Lalitha, Satya Narayana Sarma
Enjoy
---------------------------------------------------
వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహ లాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీ వేళలో

ఊపిరి తగిలిన వేళా నే ఒంపులు తిరిగిన వేళా
నా వీణలో నీ వేణువే పలికే రాగమాలా
చూపులు రగిలిన వేళా ఆ చుక్కలు వెలిగిన వేళా
నా తనువున అణువణువున జరిగే రాసలీలా
వీణ వేణువైన సరిగమ విన్నావా

ఎదలో అందం ఎదుట ఎదుటే వలచిన వనిత
నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత
కదిలే అందం కవిత అది కౌగిలికొస్తే యువతా
నా పాటలో నీ పల్లవే నవతా నవ్య మమతా

వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహ లాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీ వేళలో

వీణ వేణువైన సరిగమ విన్నావా
తీగ రాగమైన మధురిమ కన్నావా
లాల లాల లాల లలలల లాలాలా... 

Meaning

Did you hear the music that emanates from
the symphony of lute and flute?
Did you look at the wondrous feel when
the string becomes a tune?

When your breath touches me
When my body goes into raptures
My lute and your flute create a beautiful melody
When the fire of passion glows in our eyes right
When the stars in the sky yonder twinkle bright
In every cell of my body I feel a surge of divine ecstasy

The beauty I always dreamed in my dreams
Now I see it right in front of me
Like a forest goddess
You have stepped into my garden
You are like a poem which is a moving beauty
As the liveliness of youth, you have come into my embrace
As a Pallavi in my song, you are always fresh
and my ever new delicate love

Did you hear the music that emanates from
the symphony of lute and flute?
Did you look at the wondrous feel when
the string becomes a tune?