'మనిషి స్వతంత్రుడు కాడు. తన కర్మ చేతిలో బానిస'

22, మార్చి 2017, బుధవారం

Yogi Adityanath Horoscope - Nadi Astrology Perspective

[ఈ పోస్ట్ వ్రాసినది D.Vamsi Krishna (dvk1903@gmail.com).తను హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.తనకు 17  సంవత్సరాల వయస్సు నుంచీ జ్యోతిషశాస్త్రాన్ని ఔపోసన పడుతున్నాడు. నా శిష్యుడు అయ్యేటప్పటికే తాను జ్యోతిషశాస్త్రపు అనేక శాఖలలో లోతైన ప్రజ్ఞను సంపాదించి ఉన్నాడు. చక్కని ఫలితాలను చెప్పగల శక్తిని భగవంతుడు ఇతనికి ఇచ్ఛాడు.జ్యోతిష్యశాస్త్రంలో ఇతనికి తెలియని  విషయమంటూ లేదని నేను చెప్పగలను. నేను వ్రాసిన పోస్టులనే కాక నా శిష్యులు వ్రాసిన పోస్టులను కూడా ఇకపైన ఈ బ్లాగుముఖంగా ప్రకటిస్తాను. ఇక చదవండి]


Yogi Adityanath - Chief Minister of Uttar Pradesh

Bhrigu-Nandi Naadi Analysis


Birth Data:  05 June 1972, 11:50 AM  Pauri Garhwal


అధికారులకు నాయకులకు సూర్యుడు కారకుడు. కనుక వారి  జాతకాలలో యితడు బలంగా ఉండాలి. ఒకవేళ బలహీనంగా ఉంటె, గురువు వంటి ఇంకొక బలమైన గ్రహంతో సపోర్ట్ చెయ్యబడాలి.కర్మకారకుడైన శనికి సూర్యునితో లింక్ ఉండాలి.జీవకారకుడూ, ఉన్నతవర్గాల కారకుడైన గురువు ఈ యోగాన్ని సమర్ధించాలి.బుధుడుతెలివి తేటలకు సూచకుడు. రాహువు కష్టపడి పనిచేయ్యడానికీ రహస్యాలకూ కారకుడు.కేతువుతో సంబంధం వల్ల పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. అధికారాన్ని చెలాయించడానికి కుజుని సంబంధం అవసరం. ఈ యోగాలు ఉన్నతమైన పదవిని పొందేవాని జాతకంలో తప్పనిసరిగా ఉండాలి.


యోగి ఆదిత్యనాథ్ జాతకంలో


బుధ సూర్య శని రాహువులు దక్షిణ దిక్కులో ఉన్నారు. గురువు వక్రించి తూర్పు దిక్కులో ఉన్నాడు.వక్ర శుక్రుడు కుజుడు చంద్రుడు పడమటి దిక్కులో ఉన్నారు.కేతువు ఉత్తర దిక్కులో ఉన్నాడు.బుధుడు వక్రశుక్రుడు పరివర్తనా యోగంలో ఉన్నారు.

మిధునంలోని కుజుడు వక్ర గురువును చూస్తున్నాడు. ఈ దృష్టితో వృశ్చికానికి వెళ్లిన గురువుమీద కర్కాటకం నుంచి కేతువు దృష్టి పడుతున్నది.

బుధ సూర్య శనులు భూతత్వ రాశి+భోగ రాశి అయిన వృషభంలో ఉంటూ వక్ర శుక్రునితో కలుస్తూ, గురుదృష్టి పడటం వల్ల ఈయన్ను ఒక సాంప్రదాయ మఠానికి (గోరఖ్ నాధ్ సాంప్రదాయం) అధిపతిని చేశారు.

రాజకీయ ఉన్నత పదవులను సూచించే ధనూరాశిలో వక్ర గురువు ఉంటూ వృశ్చికంలోకి వెళ్లి కర్మనూ సామాన్య జనాన్నీ సూచించే శనీశ్వరుడు, ఉన్నత రాజకీయ పదవులకు కారకుడైన సూర్యుడు, వాక్కు మరియు తెలివికి అధిపతి అయినా బుధుల దృష్టుల వల్ల ఈయనకు ఉన్నతమైన పదవిని కట్టబెట్టారు.

ఒకే దిక్కులో ఉండటం వల్ల సూర్యుడు, శని బుధుడు రాహువుతో స్థితిని పొందుతున్నాడు. వీరిపైన వెనక్కు వఛ్చిన గురుదృష్టి వృశ్చికం నుంచి పడుతున్నది. ఇందువల్లే ఈయనకు రాజకీయ పదవీ యోగం పట్టింది.

కేతువు తన ప్రయాణంలో కుజుడిని కలుస్తాడు. వీరిపైనా గురుదృష్టి పడుతున్నది. గురువు ఉత్తరదిక్కుకు వఛ్చి కేతువుతో యుతి కారణంగా పీఠాధిపత్య యోగం కలిగింది. 

గోచార ఫలితాలు

కర్మకారకుడైన శనీశ్వరుడు, జీవకారకుడైన గురువు తమ తమ సంచారంలో ఆయా రాశుల గ్రహముల కారకత్వాలను ప్రేరేపిస్తూ జాతకునికి మంచీ చెడులను కలిగిస్తూ ఉంటారు. పైన మనం చెప్పుకున్న యోగాలను గురుశనులు తమ గోచారంలో స్పర్శించినపుడు ఆయా ఫలితాలను జాతకుని ప్రస్తాదిస్తారు. 

March 1998 లో మొదటిసారి MP అయ్యాడు
------------------------------------------------------------March 10, 1998 నాటి గ్రహస్థితులు
-----------------------------------------------

సూర్య కుజ బుధ శనులు ఉత్తర దిక్కులో ఉండి జననకాల వక్ర గురువు యొక్క దృష్టిని వృశ్చికం నుంచి పొంది ఉన్నారు.కనుక జనన కాలచక్రంలో ఉన్నట్టి ఉన్నత పదవీ యోగాన్ని ఈ సమయంలో గురువు ఉత్తేజ పరచాడు.

ఈ సమయంలో గోచార శని జననకాల శనితో 3/11 దృష్టిలో ఉన్నాడు.

Oct 1999 : Re elected to 13th Lokshabha (2nd term)
-------------------------------------------------------------------------
October 1999 నాటి గ్రహస్థితులు

---------------------------------------------

వక్ర గురువు వక్ర శని మేషంలోనూ, శుక్రుడు సింహంలోనూ, కుజుడు ధనుస్సులోనూ ఉన్నారు. ఈ మూడూ ఉన్నత పదవులను సూచించే రాశులు. మీనంలోకి వఛ్చిన గురుశనులు జననకాల గురువుతో సంబంధం ఏర్పడగా జనన చక్రంలో ఉన్న పదవీయోగాన్ని మళ్ళీ ఉత్తేజపరిచారు.

May 2004:


May 2004 లో గ్రహస్థితులు
-------------------------------------

ఈ గోచారంలో, జనన కాల గురువూ గోచార గురువూ ఇద్దరూ బుధ రాహువుతో కలసి ఒకే దిక్కులోకి వఛ్చి ఉన్నారు. జననకాల గురువుమీద గోచార శనిదృష్టి కుజ శుక్రులతో కలసి ఉన్నది.ఇదంతా జననకాల సూర్య శని బుధులకు ద్వితీయ స్థానంలో ఉన్నది గనుక జననకాల యోగం ఉత్తేజ పరచబడింది.

May 2009
--------------


May 2009 నాటి గ్రహస్థితి
----------------------------------------------------------
గోచార గురువు జననకాల గురువుకు మూడింట ఉంటూ ననన కాల కుజునితో ఒకే దిక్కులోకి వఛ్చి ఉన్నాడు.

గోచార శని సింహంలో ఉంటూ జననకాల గురువుతో ఒకే దిక్కులోకి వచ్చి ఉన్నాడు. అలాగే జననకాల కుజునితో శుక్రునితో ఒకే దిక్కులో ఉన్నాడు.

గోచార సూర్యుడు బుధుడు రాహువు చంద్రుడు జననకాలా సూర్యుడు బుధుడు రాహువుతో ఒకే దిక్కులోకి వఛ్చి ఉన్నారు.

గోచార కేతువు జననకాల కేతువుమీద సంచరిస్తూ మళ్ళీ ఈయన్ను పార్లమెంట్ మెంబర్ని చేశాడు.

May 2014May 2014 లో గ్రహస్థితులు
-------------------------------------

గోచార గురువు జననకాల కుజశుక్రులపైన సంచరిస్తూ,జననకాల గురువును వీక్షిస్తూ జననకాల శని బుధ సూర్యులకు రెండింటిలో ఉన్నాడు.

గోచార వక్ర శని జననకాల కుజుడు శుక్రులతో పశ్చిమ దిశలో ఉన్నాడు.తన వక్రత్వం వల్ల కన్యారాశిలోకి వస్తూ జననకాల శని సూర్య బుధులతో జత కడుతున్నాడు. 

గోచారవక్ర కుజుడు కన్యలో ఉండటం వల్ల జననకాల శని సూర్య బుధులతోనూ వెనక్కు పోవడం వల్ల జననకాల గురువుతూ సంబంధం ఏర్పడినందువల్ల జాతక చక్రంలోని ఉన్నత పదవీ యోగాన్ని యాక్టివేట్ చెయ్యడం జరిగింది. 

సూర్య (21), శనుల (17) సంబంధం శుక్రక్షేత్రమైన వృషభంలో ఉంది. ఇది చంద్రునికి మూలత్రికోణం కూడా అయింది.దీనివల్ల ఈయన రవాణా, టూరిజం వంటి అనేక పార్లమెంట్ కమిటీలలో మెంబర్ గా ఉన్నాడు. రాహువు బుధుడు ఒకే దిక్కులో ఉండటం వల్ల విదేశీ వ్యవహారాల కమిటీలో కూడా సభ్యునిగా ఉన్నాడు.

భృగునంది నాడీ విధానంలో చెయ్యబడిన ఈ విశ్లేషణ ద్వారా ఈయన జాతకంలోని బలమైన యోగాలను మనం చూడవచ్చు.