'మనిషి స్వతంత్రుడు కాడు. తన కర్మ చేతిలో బానిస'

25, మార్చి 2017, శనివారం

Trouble in Uttar Pradesh in 2018-20 ?? - A research

(Astro research by Vamsi Krishna & Satya Narayana Sarma)

జ్యోతిష్య శాస్త్రంలో ఒక నియమం ఉన్నది. అదేమంటే, ఎప్పుడైతే శని, గురు, కేతువుల మధ్యన సంబంధం ఏర్పడుతుందో అప్పుడు దేశంలో గొడవలు, కొట్లాటలు, మతకలహాలు జరిగాయి. ఈ సంబంధం అనేది స్క్వేర్, ట్రైన్, కన్జక్షన్, అపోజిషన్ మొదలైన దృష్టుల పరంగానూ,లేదా ఇతర నాడీ జ్యోతిష్య సూత్రాల పరంగానూ కావచ్చు.

గతంలో గోద్రా అల్లర్లు జరిగినప్పుడు గానీ, ఇంకా ముందు అయోధ్య రామమందిరం గొడవ జరిగినప్పుడు గానీ ఈ గ్రహయోగాలు ఖచ్చితంగా కనిపించాయి.

ఇప్పుడు మళ్ళీ 2018-2020 మధ్యలో ఇవే కేతు-శని-గురు గ్రహాల మధ్యన ఇవే యోగాలు కనిపిస్తున్నాయి. కనుక మళ్ళీ ఏవో గొడవలు జరుగుతాయని ముందుగానే ఊహించగలుగుతున్నాము.

ఇప్పటికే మళ్ళీ రామజన్మభూమి వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఇరుపక్షాలనూ కోర్టు బయట విషయాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొమ్మని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. ఇది చాలదన్నట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాద్ జాతకంలో త్వరంలో కేతుమహాదశ మొదలు కాబోతున్నది.

ఈ విషయంపైన ఏదైనా చెప్పేముందు, గతంలో ఏం జరిగిందో ఒక్కసారి గమనిద్దాం.

అయోధ్య మత కలహాలు

---------------------------

06 Dec 1992


ఆ సమయంలో కేతు శనులిద్దరూ దక్షిణ దిక్కులోనే భూతత్వ రాశులలోనే ఉన్నారు.ఈ యోగం ఏర్పడిన ప్రతిసారీ మతకలహాలు జరిగాయని చరిత్ర చెబుతున్నది. గురువు కన్యలో దక్షిణ దిక్కులో ఉంటూ ఈ యోగాన్ని సపోర్ట్ చెయ్యడం వల్ల మతపరమైన గొడవలు మరణాలు జరిగాయి.గోధ్రా అల్లర్లు
--------------
27 Feb 2002


 

ఆ సమయంలో శని భూతత్వరాశిలో ఉన్నాడు.వక్ర గురువు మిధునం నుంచి ధనుస్సులో ఉన్న కేతువును వీక్షిస్తున్నాడు. గురువు వృషభంలోకి వచ్చి శనితో కలుస్తున్నాడు.ఇందువల్ల అల్లర్లలో అనేకమంది చనిపోవడం జరిగింది. కేతువు గురువుగారి ఇంట్లో ఉంటూ మతపరమైన అల్లర్లను సూచిస్తున్నాడు.

ఈ గొడవలు 27 Feb 2002 న మొదలై May 2002 లో వక్ర గురువు మళ్ళీ డైరెక్ట్ అయ్యేవరకూ జరిగాయి.

గతంలో జరిగిన ఈ గ్రహయోగాలను బట్టి మళ్ళీ అతి దగ్గరలో ఇవే యోగాలు ఉండటాన్ని బట్టి, మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో హింసాకాండ ఖచ్చితంగా జరుగుతుందని మేము ఊహిస్తున్నాము.ఏయే సమయాలలో ఇది జరుగవచ్చో స్థూలంగా ఇక్కడ చెప్పబడుతున్నది. ఆయా సంఘటనలు జరుగబోయే కొద్ది ముందుగా మళ్ళీ స్పష్టంగా చెప్పబడుతుంది.

>>March-2018
>>March-2019
>>November 2019-April 2020.

యోగి ఆదిత్యనాద్ ఈ అల్లర్లను చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యవలసి ఉంటుంది.ముందునుంచే ఎంతో ప్లానింగ్ దీనికి అవసరం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త !!