“Self service is the best service”

25, ఆగస్టు 2016, గురువారం

Ye Kaun Chitrakaar Hai - MukeshYe Kaun Chitrakar Hai అంటూ ముకేష్ ఆలపించిన ఈ గీతం Boond Jo Ban Gayi Moti అనే హిందీ సినిమాలోది.ఈ సినిమా 1967 లో వచ్చింది.దీనిని వీ.శాంతారాం నిర్మించి,తనే దర్శకత్వం కూడా వహించాడు.ఈయన సినిమాలు అన్నీ సందేశాత్మకంగా ఆదర్శాత్మకంగా ఉంటాయని వేరే చెప్పనక్కర లేదు కదా. ప్రకృతినీ, దానిని ఇంత అందంగా చిత్రించిన దైవాన్నీ స్మరిస్తూ సాగే పాట ఇది.

మొన్న 23 వ తేదీన కృష్ణానది ఆదిపుష్కరాల చివరి రోజు గనుక ఎక్కడో ఒకచోట కృష్ణలో స్నానం చేద్దామని అనుకున్నాను.పన్నెండు రోజులనుంచీ చాలామంది ఫ్రెండ్స్ స్నానాలకు వెళుతూ నన్నూ రమ్మని అడిగారు.అందరికీ ఒకటే సమాధానం చెప్పాను.

'నాకు తెలిసి నేనే పాపాలూ చెయ్యలేదు.నదిలో స్నానం చేసి ఆ పాపాలు పోగొట్టుకోవలసిన ఖర్మ నాకు లేదు.అంతకంటే గొప్పవీ, పాపాలను నిజంగా పోగొట్టే ప్రభావవంతమైన సాధనా విధానాలు నాకు తెలుసు.కనుక నేను రాను.'

కానీ చివరిరోజున కృష్ణానదిలో స్నానం చేద్దామని నాకూ అనిపించింది.ఇదే విషయం మా అమ్మాయితో ఫోన్ లో చెబితే ఇలా అంది.

'లక్షలాది మంది స్నానాలు చెయ్యడం వల్ల ఆ పాపాలు తీసుకుని కృష్ణానది అపవిత్రం అయిపోయింది కదా.నువ్వెళ్ళి స్నానం చెయ్యి తను రిలీఫ్ గా ఫీలౌతుంది.'

ఇద్దరం నవ్వుకున్నాం.

చివరి రోజు గనుక విజయవాడకు లక్షలాది జనం వస్తారని తెలుసు. అందుకని అటువైపు వెళ్ళకుండా అమరావతి వైపు వెళదామని నిశ్చయించాను.

అమరావతి రోడ్డులో తాడికొండ సెంటర్ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే, వైకుంఠపురం, తుళ్ళూరు, రాయపూడి, తాళ్లాయ పాలెం మొదలైన కృష్ణాతీర గ్రామాలు వస్తాయి.అక్కడ ఘాట్స్ చాలా బాగున్నాయనీ,జనం చాలా తక్కువగా ఉన్నారనీ అక్కడకు పోయొచ్చినవారు చెప్పారు.

ఎక్కడికి పోవాలి అనేదానిమీద క్లారిటీ లేదు. అందుకని ఏదో ఒక సూచన వస్తుందని వేచి చూస్తూ ఉన్నాను. 22 తేదీ సాయంత్రం ఒకాయన వచ్చి - రాయపూడి ఘాట్ చాలా బాగుంది.మేం వెళ్లి వచ్చాం. మీరూ అక్కడకు వెళ్ళండి - అని చెప్పాడు.

మర్నాడు ఉదయమే 5.30 కు కారులో నేనూ శ్రీమతీ బయలుదేరాం.బహుశా రాజధాని ఎఫెక్ట్ కావడం వల్లేమో రోడ్డు చాలా బాగుంది.6.30 కల్లా రాయపూడి గ్రామంలోని కృష్ణాతీరానికి చేరుకున్నాం.అక్కడకు చాలా దగ్గరలోనే కొత్తగా కడుతున్న 'అమరావతి' రాజధాని సచివాలయం భవనాలున్నాయి.

ఇది చాలా చిన్న ఊరు.కృష్ణానదికి చాలా దగ్గరగా ఉన్నది. మంచి పంట భూములు,పచ్చని చేలు,చెట్లు,తోటలతో చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఘాట్లో ఒక 40 మంది ఉన్నారు అంతే. స్నానాలు కానిచ్చి, పిండప్రదానం చేసి ఇవతలకు వచ్చాం.

అక్కడ ఒడ్డున నిలబడి మౌనంగా లోతుగా పారుతున్న కృష్ణా నదినీ, పచ్చని చేలనూ, తోటలనూ, ఉదయిస్తున్న సూర్యుడినీ చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే మనస్సు ఏమై పోయిందో,అసలెక్కడున్నానో,అసలు నేనెవరో - కాసేపు ఏమీ తెలీలేదు. ఇలాంటి ప్రదేశాలలో నాకు ఇలాంటి 'సటోరి' రావడం మామూలే గనుక శ్రీమతి కూడా మౌనంగా ఉండి నన్ను గమనిస్తున్నది.

ధ్యాన తన్మయత్వానికి గుడులూ గోపురాలూ ఎందుకు? మనచుట్టూ ఉన్న సజీవ ప్రకృతి చాలదా? ధ్యానంలో గనుక మాస్టరీ ఉంటే, ప్రకృతిలో కలిగే తన్మయత్వం ఇంకెక్కడా కలగదు.అంత అద్భుతమైన ఫీల్ ను అది అందివ్వగలదు.

ఆ స్థితినుంచి బయటకు వచ్చాక నాకు ఒక హిందీ పాట గుర్తొచ్చింది.అదే ఈ పాట. అందుకే ఈ పాటను పాడి మీకు ప్రెసెంట్ చేస్తున్నాను.ట్రాక్ కొంచం గోలగా ఉన్నది. అదీగాక ఇలాంటి భావస్ఫోరకమైన పాటలు పాడుతుంటే గొంతు గాద్గదికమై పోయి పాడటం కష్టమౌతుంది.అలాగే ఈ పాటా చాలాసార్లు మధ్యలో ఆగిపోయింది.ఆ విధంగా ఒక పదిసార్లు పాడాక ఈ విధంగా వచ్చింది. భరించండి. తప్పదు మరి.

ఇలా అవస్థ పడుతూ (?) నేను పాడుతుంటే చూచిన మా శ్రీమతి ఈ విధంగా అడిగింది.

'ఎందుకంత ఎమోషనల్ అవుతారు? మామూలుగా పాడలేరా?'

తనతో ఇలా చెప్పాను.

'ప్రొఫెషనల్ సింగర్స్ కీ, ధ్యానులకూ ఉన్న తేడా అదే. వాళ్ళు నటిస్తూ కృత్రిమంగా పాడతారు.ధ్యానులు ఇన్వాల్వ్ అయి పాడతారు కనుక భావంతో తాదాత్మ్యం చెంది ఎమోషనల్ అవుతారు.అలాగే వారిని వదిలేస్తే సమాధిలోకి వెళ్ళిపోతారు. పాడుతూ పాడుతూ పాట ఆగిపోయి, ఇంక పాడలేని స్థితికి వచ్చి అందులోనుంచి ధ్యానస్థితిలోకి వెళ్ళిపోవడమే గానానికి గల ఏకైక పరమార్ధం.త్యాగరాజు మొదలైన వాగ్గేయకారులందరూ అలాంటి వారే.'

ఈ పాట వ్రాసిన భరత్ వ్యాస్ వేదోపనిషత్తుల నుంచి కొన్ని భావాలను స్వీకరించి ఈ పాట వ్రాశాడు.

ఉదాహరణకు --

"ఏ కిస్ కవీ కీ కల్పనా" -- అనే పాదంలో - వేదంలోని - 'ఈ విశ్వం అంతా బ్రహ్మము యొక్క స్వప్నం మాత్రమే' అన్న భావాన్ని పొందు పరచాడు.

అలాగే - 'అప్నే జో ఆఖ్ ఏక్ హై ఉస్కీ హజార్ హై" - అనే పదం వింటుంటే - "సహస్రశీర్షా పురుష: సహస్రాక్ష: సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళమ్" - అన్న మంత్రం స్ఫురిస్తున్నది.

అలాగే - "ఈ పర్వతాలు ధ్యానంలో ఉన్న యోగులవలె మౌనంగా నిలిచి ఉన్నాయి" - అన్న భావం చాన్దోగ్యోపనిషత్తు లోని - 

శ్లో|| ధ్యాయం వావ చిత్తాధ్బూయో ధ్యాయతీవ పృధివీ ధ్యాయతీవాంతరిక్షమ్ ధ్యాయతీవ ద్యౌ ర్ధ్యాయన్తీవాపో ధ్యాయన్తీవ పర్వతా...........||

అనే భావానికి యధాతధ రూపమే.

ఇటువంటి అత్యున్నతమైన భావాలు ఉన్నవి గనుకనే ఇలాంటి పాటలు పాడేటప్పుడు ఎమోషనల్ కాకుండా పాడాలంటే చాలా కష్టం.

ప్రకృతిని చూచినప్పుడు దానిని సృష్టించిన దైవం మనకు స్మృతిపధం లోకి రావాలి.ఇంత వైవిధ్యంతో కూడిన అనంతమైన సృష్టి యొక్క లీలావిలాసం మనకు స్ఫురించాలి. దైనందిన జీవితానికి అతీతంగా మన మనస్సు వెళ్లిపోవాలి. తనను తాను మరచి దైవ ధ్యానంలో అది లీనం అయిపోవాలి.

సృష్టికర్తను మన ఎదుట నిలపడమేగా సృష్టి పరమార్ధం !!

నా స్వరంలో కూడా ఈ అద్భుతమైన పాటను వినండి మరి.

Movie:--Boond Jo Ban Gayi Moti (1967)
Lyrics:-- Bharat Vyas
Music:--Satish Bhatia
Singer:--Mukesh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------
Hari hari vasundhara - Neela neela ye gagan
Neela neela ye gagan

Hari hari vasundhara Pe Neela neela ye gagan
Ki jiske badalon ki paalaki uda raha pawan
Dishaye dekho rang bharee - 2
Chamak rahi umang bhari
Ye kisne phool phool se - 2
Kiya singar hai
Ye kaun chitrakaar hai
Ye kaun chitrakaar
ye kau......n Chitrakaar hai

Tapaswiyon si hai atal - ye parvaton ki chotiyaa
Ye sarp si ghumerdaar gherdaar ghaatiyaa
Dhwaja se ye khade huye - 2
Hai vriksh devdaar ki
Galeeche ye gulaab ke - Bageeche ye bahaar ke
Ye kis kavee ki kalpanaa - 2
ka chamatkaar hai
Ye kaun chitrakaar hai
Ye kaun chitrakaar
Ye kau....n Chitrakaar hai

Kudrat ki is pavitrataa ko tum nihaar lo
Iske gunon ko apne man me tum utaar lo
Chamka lo aaj laalimaa - 2
Apne lalaat kee
Kan kan se jhankatee tumhe chavi viraat ki
Apni to aankh Ek hai - 2
Uski hazaar hai
Ye kaun chitrakaar hai
Ye kaun chitrakaar
Ye kau....n Chitrakaar hai

Meaning

The Earth - so green, so green
The sky above, blue,lovely blue
The wind gently moves the clouds above, like palanquins
Vibrant and joyful colors in all quarters
glittering with rapture
Who decorated all  the Nature, with beautiful flowers?
Who is the creator of this beautiful Nature?
Who is that artiste?
Who?

The mountains are still, like the ascetics in deep meditation
The valleys are deep and curvy, like serpents
The trees around are standing tall like flags
Look at the carpets of roses and gardens of spring
Which poet's beautiful imagination is all this creation?
Who is the creator of this beautiful Nature?
Who is that artiste?
Who?

Look at the purity of Mother Nature around you
Imbibe its great qualities into yourself
Let its liveliness brighten your forehead
Through every cell of your body, the Universe touches you
You have only one pair of eyes
The universe around you, has a thousand eyes
Who is the creator of this beautiful Nature?
Who is that artiste?
Who?

తెలుగు స్వేచ్చానువాదం

పచ్చదనంతో  నిండిన ఈ నేల - పైన విశాల నీలాకాశం
మేఘాలను సుతారంగా మోసుకుపోతున్న గాలి
నలుదిక్కులా నిండిన ఈ రంగుల కాంతులు
ఆనందం  పొంగి పొర్లుతున్న ఈ ప్రకృతి
ఎవరు దీన్నంతా ఈ అందమైన పూలతో అలంకరించారు?
వరు ఈ అద్భుతమైన ప్రకృతిని సృష్టించారు?
ఆ కళాకారుడెవరు?
ఎవరు?

ధ్యానంలో నిశ్చలంగా ఉన్న ధ్యానులలా ఈ పర్వతాలు
పాము మెలికలలా ఉన్న ఈ లోతైన లోయలు
ధ్వజ స్తంభాలలా ఎత్తుగా నిలిచి ఉన్న ఈ వృక్షాలు
ఈ పూల వనాలు - ఈ  వసంత శోభలు
ఇదంతా ఏ కవి యొక్క కల్పనో?
ఎవరు ఈ అద్భుతమైన ప్రకృతిని సృష్టించారు?
ఆ కళాకారుడెవరు?
ఎవరు?

ప్రకృతి లోని ఈ పవిత్రతను నువ్వు గ్రహించు
దానిలోని సద్గుణాలను నీలోనికి స్వీకరించు
దానిలోని తేజస్సు నీ లలాటానికి కాంతిని చేకూర్చనీ
నీలోని  ప్రతి కణాన్నీ ప్రకృతి స్పర్శిస్తున్నది చూడు
నీకున్నది రెండు కన్నులే 
నీ చుట్టూ ఉన్న ప్రకృతికి వెయ్యి కన్నులున్నాయి
ఎవరు ఈ అద్భుతమైన ప్రకృతిని సృష్టించారు?
ఆ కళాకారుడెవరు?
ఎవరు?