బాలసుబ్రమణ్యం మధురంగా ఆలపించిన ఈ గీతం 'దీక్ష' అనే చిత్రం లోనిది. హిందూస్తానీ రాగాలతో చేసిన పాటలు చిరకాలం నిలుస్తాయి. వాటిలో ఒక విధమైన మాధుర్యం ఉంటుంది.
మధురమైన రాగానికి భావుకతతో కూడిన సాహిత్యం తోడైతేనే ఇలాంటి పాటలు పుడతాయి.నారాయణరెడ్డి గారి సాహిత్యం అంటే ఇంకెలా ఉంటుంది మరి?పెండ్యాల నాగేశ్వరరావుగారి సంగీతం అంటే ఇంకెలా ఉంటుంది మరి?
కాకపోతే ఒక చిన్న మెలిక.
1966 లో వచ్చిన హిందీ సినిమా 'సూరజ్' లో మహమ్మద్ రఫీ పాడిన 'బహారో ఫూల్ బర్సావో మేరా మెహబూబ్ ఆయా హై' అనే పాట రాగానికి ఇది కాపీ పాట.ఆ సినిమా తీసింది మన తెలుగువారే.దానికి సంగీతం ఇచ్చింది శంకర్ జైకిషన్.వీరిలో శంకర్ మన తెలుగువాడే.మన రాగమేగా !!
ఏదైతేనేం? చక్కని భావగీతం! చక్కని ప్రేమగీతం !!
ఈ సినిమాలో ఎన్టీ రామారావు, జమున నటించారు.

రెండో చరణంలో 'చెలి' జాబిలి అని లిరిక్స్ దొరుకుతున్నాయి. అది 'తెలి' జాబిలేమో అని నా అనుమానం.తెల్లని జాబిలి అని అర్ధం.నారాయణ రెడ్డిగారు 'చెలి' అనే పదాన్ని ఒకే లైన్ లో రెండుసార్లు వాడరేమో అని నా ఊహ.
ఏదనేది సరిగ్గా నిర్ధారణ కాలేదు గనుక చెలిజాబిలి అనే పాడాను.
మేఘాల ద్వారా ప్రేయసికి/ప్రియునికి సందేశం పంపడం చాలా ప్రాచీన కాలం నుంచీ ఉన్నది.కాళిదాసు కంటే ముందరినుంచే ఈ ప్రక్రియ ఉన్నది. మేఘాలూ గాలీ ఒకచోట నుంచి ఇంకొక చోటికి పోతూ ఉంటాయి.పావురం వంటి పక్షులు కూడా అలాగే దేశదేశాలు ఎగిరిపోతూ ఉంటాయి.అందుకనే భావుకులు తమ భావాలను వాటికి చెబుతూ ఉంటారు.తమ ప్రేయసికో ప్రియునికో వాటిని చేరవెయ్యమని అర్ధిస్తూ ఉంటారు.
ఇప్పుడంటే మొబైల్ ఫోన్లు వచ్చాయి.అనుకుంటే క్షణంలో ఎక్కడున్నా మాట్లాడవచ్చు.కానీ పాత కాలంలో ఈ సౌకర్యాలు లేవుకదా.అందుకని అన్నింటికీ ప్రకృతి మీద ఆధారపడేవారు. గాలితో,చెట్లతో,నదులతో,భూమితో,ఆకాశంతో,సముద్రంతో తమ గోడును వెళ్ళబోసుకునేవారు.ఈ పాట కూడా అలాంటి భావగీతమే.

Movie:--Deeksha (1974)
Lyrics:--C.Narayana Reddy
Music:--Pendyala
Singer:--S.P.Balasubramanyam
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy---------------------
మెరిసే మేఘమాలిక - ఉరుములు చాలుచాలిక
చెలితో మాటలాడనీ - వలపే పాట పాడనీ
వలపే పాట పాడనీ....
మెరిసే మేఘమాలికా - ఉరుములు చాలుచాలిక
కమలాలే నా రమణి నయనాలై విరిసే
అద్దాలే నా చెలియ చెక్కిళ్ళై మెరిసే
ఆ నయనాల కమలాలలోనా
నా జిలుగు కలలు చూసుకోనీ
ఆ అద్దాల చెక్కిళ్ళ లోనా
నా ముద్దులే దాచుకోనీ...
మెరిసే మేఘమాలిక - ఉరుములు చాలుచాలిక
మధుమాసం చెలిమోవిని దరహాసం చేసే
చెలి జాబిలి చెలిమోమున కళలారబోసేమధుమాసం చెలిమోవిని దరహాసం చేసే
ఆ దరహాస కిరణాల లోనా
నను కలకాలం కరిగిపోనీ
ఆ కలల పండువెన్నెల లోనా
నా వలపులన్ని వెలిగిపోనీ
మెరిసే మేఘమాలికా....
మెరిసే మేఘమాలికా....