ఆధ్యాత్మికత అనేది చేతలలో కూడా కనిపించాలి. ఉత్త మాటలలో మాత్రమే కాదు

14, జనవరి 2016, గురువారం

Sirimalle Neeve - S.P.Balasubramanyam
సిరిమల్లె నీవే విరిజల్లు కావే....

బాలసుబ్రమణ్యం ఎంతో మధురంగా ఆలపించిన ఈ పాట 1977 లో వచ్చిన పంతులమ్మ అనే చిత్రంలోనిది.ఇది ఇప్పటికీ అత్యంత మధురగీతాలలో ఒకటిగా ఉన్నది. రాజన్ నాగేంద్ర అందించిన మధురమైన సంగీతం ఈ చిత్ర విజయానికి చాలా దోహద పడింది.ఈ చిత్రంలోని పాటలన్నీ హిట్ సాంగ్సే.ఈ పాటలో రంగనాద్, లక్ష్మి నటించారు.రంగనాద్  మామయ్య నటించిన రొమాంటిక్ గీతాలలో ఇది కూడా ఒక మరపురాని ఒక గీతమే.అప్పట్లో బాలసుబ్రమణ్యం గొంతు చాలా మధురంగా ఉండేది. ఆయన ఈ పాటను పాడిన తీరు కూడా అనితరసాధ్యమే.చాలా మధురంగా ఈపాటను ఆలపించాడాయన.నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని ఒకసారి వినండి మరి.


చిత్రం :--పంతులమ్మ (1977)
సాహిత్యం :-- వేటూరి సుందర రామమూర్తి
సంగీతం:--రాజన్ నాగేంద్ర
గానం :-- ఎస్.పీ.బాలసుబ్రమణ్యం
కరావోకే గానం:--సత్యనారాయణ శర్మ
Enjoy
-------------------------------------
సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటే నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే

ఎలదేటి పాటా చెలరేగే నాలో చెలరేగి పోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లె
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తోలిపూత నవ్వే వనదేవతల్లే పున్నాగ పూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే

మరుమల్లె తోటా మారాకు వేసే మారాకు వేసే నీ రాకతోనే
నీ పలుకు పాటై బ్రతుకైనా వేళా బ్రతికించుకోవే నీ పదము గానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే

ఆహహాహ హాహా లలలాల లాలా....
ఆహహాహ హాహా లలలాల లాలా....