The gem of love is not cheap. It cannot be gifted to everyone just like that !

10, జనవరి 2016, ఆదివారం

Mallelu Poose Vennela Kaase - S.P.Balasubramanyam




మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా...

బాలసుబ్రమణ్యం మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం "'ఇంటింటి రామాయణం " అనే చిత్రం లోనిది.ఈ సినిమా 1979 లో విడుదలైంది. ఇప్పటికి 36 ఏళ్ళు గడచినా ఈ పాట నేటికీ మరపురాని హాంటింగ్ మేలోడీస్ లో ఒకటిగా నిలిచిపోయి ఉన్నది.దీనికి సాహిత్యాన్ని వేటూరి, సంగీతాన్ని రాజన్ నాగేంద్రలు అందించారు.ఇందులో రంగనాథ్, ప్రభ నటించారు.

రంగనాథ్ మామయ్య పాటలు కొన్ని పాడాలని అనుకున్నాను.కానీ ఎక్కువగా ట్రాజెడీ ఛాయ ఉన్న పాటలే కనిపిస్తున్నాయి.ట్రాజెడీ పాటలు నేను ఇష్టపడను. అందుకే వాటి జోలికి పోకుండా ఈ రొమాంటిక్ సాంగ్ పాడుతున్నాను.

నా స్వరంలో కూడా ఈ పాటను ఒక్కసారి వినండి మరి.

Movie :--Intinti Ramayanam (1979)
Lyrics:--Veturi Sundara Rama Murty
Music:--Rajan Nagendra
Singer:--S.P.Balasubramanyam
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
--------------------------------------


మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరేయి హాయిగా

[మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా]-2 
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరేయి హాయిగా

[ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే
నా తొలిమోజులే నీ విరజాజులై]-2
మిసమిస వన్నెలలో మిలమిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే
మనసుల పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా 
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

{ఆలాపన....}

[తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా]-2
సొగసరి కానుకలే సొదపెడుతున్నవిలే
ఏ తెరచాటునో ఆ చెర వీడగా
అందిన పొందులోని అందలేని విందులీయవే
కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా 
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా 
మల్లెలు పూసే వెన్నెల కాసే.....
ఈ రేయి.... హాయిగా.....