'జమీందారు గారు అమ్మాయి' అనే సినిమా 1975 లో వచ్చింది. అందులో ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం పాడిన మధురగీతం ఇది.ఈ సినిమాకి జీ.కే.వెంకటేష్ సంగీతాన్ని సమకూర్చారు.వెంకటేష్ సంగీతం ఎక్కువగా మధురమైన ఘజల్స్ ఛాయలలో ఉంటుంది. అందుకనే ఆయన ట్యూన్సన్నీ వినడానికి చాలా మధురంగా ఉంటాయి.
ఈ చిత్రంలో రంగనాధ్ మామయ్య హీరోగా నటించారు.రంగనాధ్ గారు మా నాన్నగారికి మంచి స్నేహితుడు.చిన్నప్పుడు ఆయన్ను నేను మామయ్యా అని పిలిచేవాడిని.నేను రాజమండ్రిలో హైస్కూల్లో చేరేరోజున మా నాన్నకు ఉద్యోగరీత్యా కుదరకపోతే,నన్ను దగ్గరుండి Alcott Gardens Municipal High స్కూల్లో చేర్పించినది రంగనాధ్ మామయ్యే.నేనా స్కూల్లో ఆరునుంచి ఎనిమిది వరకూ చదివాను.
మా అమ్మగారికి ఎంతో ఇష్టమైన అన్నయ్య గోపాలరావుగారు అర్ధాంతరంగా 33 ఏళ్ళ వయసులో చనిపోయాడు. రంగనాధ్ మామయ్యలో ఆయన్ను చూచుకునేవారు మా అమ్మగారు.ఒక సోదరిగా మా అమ్మగారిని ఎంతో గౌరవించేవాడాయన.
అప్పట్లో రాజమండ్రి రైల్వే ఇనిస్ట్యూట్ లో 'ఓట్లా?-నోట్లా?' అని ఒక నాటకాన్ని వేశారు.అందులో రంగనాద్ మామయ్యా,మా నాన్నా,ఇంకా వాళ్ళ మిత్రబృందమూ నటించారు.అందులో మా నాన్న 'కంచు గంటయ్య' అనే రాజకీయనాయకుడి వేషమో,యూనియన్ లీడర్ వేషమో ఏదో వేషం వేశాడు.ఎండాకాలం సెలవలలో మా పల్లెటూరికి పోయినప్పుడు కూడా ఆ స్క్రిప్ట్ వెంట తెచ్చుకుని మా నాన్న దాన్ని బట్టీ పట్టడం నాకు ఇంకా గుర్తుంది.
మా అమ్మగారికి ఎంతో ఇష్టమైన అన్నయ్య గోపాలరావుగారు అర్ధాంతరంగా 33 ఏళ్ళ వయసులో చనిపోయాడు. రంగనాధ్ మామయ్యలో ఆయన్ను చూచుకునేవారు మా అమ్మగారు.ఒక సోదరిగా మా అమ్మగారిని ఎంతో గౌరవించేవాడాయన.
అప్పట్లో రాజమండ్రి రైల్వే ఇనిస్ట్యూట్ లో 'ఓట్లా?-నోట్లా?' అని ఒక నాటకాన్ని వేశారు.అందులో రంగనాద్ మామయ్యా,మా నాన్నా,ఇంకా వాళ్ళ మిత్రబృందమూ నటించారు.అందులో మా నాన్న 'కంచు గంటయ్య' అనే రాజకీయనాయకుడి వేషమో,యూనియన్ లీడర్ వేషమో ఏదో వేషం వేశాడు.ఎండాకాలం సెలవలలో మా పల్లెటూరికి పోయినప్పుడు కూడా ఆ స్క్రిప్ట్ వెంట తెచ్చుకుని మా నాన్న దాన్ని బట్టీ పట్టడం నాకు ఇంకా గుర్తుంది.
రంగనాధ్ మామయ్య ఎంత మంచి మనిషో మాటల్లో చెప్పలేము.మచ్చలేని వ్యక్తిత్వం కలిగిన మనిషి.వ్యక్తిగత జీవితంలో అంత మంచివ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు.చాలా బంధుప్రేమ కలిగిన వ్యక్తి.స్నేహానికి ప్రాణమిచ్చేవాడు.ఎంతో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు.
రంగనాధ్ మామయ్య ఆరడుగుల పైనే ఎత్తుగా స్ఫురద్రూపిగా ఉండేవాడు. ఒకసారి నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు 1972 లో అనుకుంటా,నన్ను అమాంతం పైకెత్తి రాజమండ్రి రైల్వే స్టేషన్ లో సీలింగ్ కు వేలాడుతున్న కమ్మీలకు నా చేతులు పట్టించి అక్కడ ఒదిలేశాడు.నేనా కమ్మీలకు వేలాడుతూ 'దించు మామయ్యా...' అని ఒకటే ఏడుపు.
అప్పట్లో ఆయనా నేనూ కలసి రాజమండ్రి లక్ష్మీ టాకీస్ లో 'ఆఫ్రికన్ సఫారీ' అనే ఒక జంతువుల సినిమాను చూశాం.పులీ, సింహమూ, జిరాఫీ మొదలైన జంతువులను నేను చూడటం అదే మొదటి సారి.మా నాన్నా ఆయనా కలసి విడుదలైన ప్రతి సినిమా చూసేవారు.వాళ్ళతో నన్నూ తీసికెళ్ళేవారు.
మేం రాజమండ్రిలో ఉన్నప్పుడే ఆయన సినిమాలలోకి వెళ్ళాడు.ఆయన మొదటి చిత్రం 'చందన' అని ఒక దయ్యం మిస్టరీ సినిమా.అందులో జయంతి హీరోయిన్ గా నటించింది.సినిమాలలో చేరాక ఎంత మందికి సహాయం చేశాడో లెక్కలేదు.
రంగనాధ్ మామయ్య మంచి కవే గాక,మంచి గాయకుడు కూడా.ఆయన స్వరం కూడా సరళ గంభీరంగా ఉండి వినడానికి చాలా బాగుంటుంది.చాలా మంచి టాలెంట్ ఉన్న నటుడాయన.అప్పట్లోనే చాలా కవితలు వ్రాసేవాడు.
ఆయన పాటను పాడటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది.చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి.
Movie:--Jameendaaru gaari ammaayi (1975)
Lyrics:--Dasaradhi
Music:--G.K.Venkatesh
Singer:--S.P.Balasubramanyam
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------------
మ్రోగింది వీణా
పదే పదే హృదయాలలోనా
ఆ దివ్యరాగం అనురాగమై
ఆ దివ్యరాగం అనురాగమై
సాగిందిలే(మ్రోగింది)
అధరాల మీద ఆడింది నీవే(2)
కనుపాపలందు కదిలింది నీవే(2)
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే(మ్రోగింది)
సిరిమల్లె పూవు కురిసింది నవ్వు
నెలరాజు అందం వేసింది బంధం(2)
ఆ బంధమే మరీ మరీ ఆనందమే
మ్రోగింది వీణా
పదే పదే హృదయాలలోనా
ఆ దివ్యరాగం అనురాగమై
సాగిందిలే...
అధరాల మీద ఆడింది నీవే(2)
కనుపాపలందు కదిలింది నీవే(2)
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే(మ్రోగింది)
సిరిమల్లె పూవు కురిసింది నవ్వు
నెలరాజు అందం వేసింది బంధం(2)
ఆ బంధమే మరీ మరీ ఆనందమే
మ్రోగింది వీణా
పదే పదే హృదయాలలోనా
ఆ దివ్యరాగం అనురాగమై
సాగిందిలే...