“What is the use of human life if one is not enlightened while still living?" - Self Quote

29, మార్చి 2015, ఆదివారం

Kannada Melodies-SP.Balasubramanyam-Gelathi O Gelathi..




గెళతీ ఓ గెళతీ...

'ధరణీమండల మధ్యదొగె' అనే కన్నడ సినిమాలోని అత్యంత పాపులర్ గీతం ఇది.

ఇప్పటివరకూ నేను చాలామంది గాయకుల పాటలు పాడి ఉన్నాను.కానీ ఒక్కరి పాటలు మాత్రం బ్లాగులో పోస్ట్ చెయ్యలెదు.ఆయనే ఎస్.పీ.బాల సుబ్రమణ్యం.

మన మధ్యన ఉన్న ఒక స్వరమాంత్రికుడు ఎవరయ్యా అంటే బాలుగారే అని చెప్పాలి.ఆయన పాడిన పాటలను పాడటం చాలా సులభంగా కనిపిస్తుంది కాని చాలాకష్టం.ఎందుకంటే ఒక పాటలో ఆయన స్వరాన్ని తిప్పే తిప్పుళ్ళు,నవ్వే నవ్వులు,పదాలను విరిచే విరుపులు పలికించాలంటే చాలా చాలా కష్టం.పైగా ఆయనది చాలా రిచ్ వాయిస్.

తన అభిమాన గాయకుడు మహమ్మద్ రఫీ అని ఆయన చాలాసార్లు చెప్పాడు. రఫీ కంటే ఇంకా ఎక్కువగా ఆయన తన పాటలో ప్రయోగాలు చేస్తాడు.

ఈ పాటనే తీసుకుంటే--గెళతీ ఓ గెళతీ-- అనే పదాన్ని ఒక్కొక్క చరణం తర్వాత ఒక్కొక్క రకంగా ఆయన పలికాడు.నోటేషన్ వ్రాసుకుని పాడకపోతే ఆయన పాడినట్లుగా అవే విరుపులతో పాడటం చాలా కష్టం.

ఆయన పాడేటప్పుడు మిమిక్రీ చేస్తాడని కొంతమంది అంటారు.అది మిమిక్రీనో ఇంకోటో నాకు తెలీదుగాని ఈ వయసులో కూడా వాయిస్ లో వణుకు రాకుండా ఎప్పుడో పాడిన పాటలను ఇప్పుడు కూడా చక్కగా పాడడమే గాక,పదాలను విస్పష్టంగా ఆయనలాగా దేనికి దానికి విరుస్తూ పలికేవారు ఎవ్వరూ లేరు.ఇప్పుడు ఎందఱో కుర్ర గాయకులు పాడుతున్నారు.బాలుగారి పాటలతో పోల్చుకుంటే ఆ పాటలు అసలు పాటల లాగే వినిపించడం లేదు.

ఆయనచేత మంచిమంచి పాటలను పాడించకుండా పిచ్చిపిచ్చి సాహిత్యపు పాటలను పాడించి ఆయన టాలెంట్ ను తెలుగువారు దారుణంగా వేస్ట్ చేశారని నా నిశ్చితాభిప్రాయం.

నా వరకూ నాకు ఇద్దరి పాటలే కష్టం అనిపిస్తాయి. ఒకటి బాలుగారు. రెండు తలత్ మెహమూద్.వీరిద్దరి పాటలనూ ఏదో మన స్టైల్లో మనం పాడటమే గాని పూర్తి న్యాయం చెయ్యడం చాలా కష్టం.

విజయ భాస్కర్ సంగీతం చాలా బాగుంటుంది. ఆయన అందించిన అనేక మంచి పాటలలో ఇదీ ఒక మధుర గీతం.

Movie:--Dharani Mandala Madhyadolage (1983)
Lyrics:--Siddha Lingayya
Music:--Vijaya Bhaskar
Singer:--S.P.Balasubramanyam
Karaoke Singer:--Satya Narayana Sarma.

Enjoy my version..
-------------------------------------------------------

గెళతీ ఓ గెళతీ-2
అప్పికో ఎన్నా అప్పికో-2
--బాళేల్లా ఎన్నా తబ్బికో
గెళతీ ఓ గెళతీ...

[జగద గుందన వేళా నినగె
యశయ హాళు నీనూ ననగె]-2
నిన్న మాటే జేనూ ననగె
నిన్న జొతెయే -- సాకూ ననగె-2
గెళతీ ఓఓ గెళతీ
అప్పికో ఎన్నా అప్పికో
బాళేల్లా ఎన్నా తబ్బికో ఓ ఓ ఓ
గెళతీ ఓఓఓ గెళతీ

[మేలు కీళిన బేళీ జిగిదు
ప్రేమ లోకదె నిన్న బిగిదు]-2
నూరు ముత్తను -- హోత్తి నినగె
నాను ఆగువె కణ్ణూ - నినగె
నాను ఆగువె కణ్ణు నినగె
గెళతీ ఓ గెళతీ
అప్పికో ఎన్నా అప్పికో బాళేల్లా ఎన్నా తబ్బికో
గెళతీ ఓ గెళతీ

[బాళ చెలువను ఊడు నావు
దూర పయనవ మాడబేకు]-2
బరువ సంకట ఎల్లా- బరెతు
సావు నవ్వను మీరబేకు-2
గెళతీ ఓఓఓ గెళతీ-2
అప్పికో ఎన్నా అప్పికో ఓ ఓ ఓ
అప్పికో ఎన్నా అప్పికో
బాళేల్లా ఎన్నా తబ్బి..కో
గెళతీ ఓ గెళతీ-2