“What is the use of human life if one is not enlightened while still living?" - Self Quote

5, నవంబర్ 2014, బుధవారం

Telugu Melodies-G.Anand-ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక...



(సౌండ్ క్లారిటీ కోసం,ఈ పాటను మంచి స్పీకర్స్ లో వినండి.కంప్యూటర్ స్పీకర్ లో మీకు ఆ క్లారిటీ రాదు)
----------------------------------------------

'అమెరికా అమ్మాయి' సినిమాలో G.ఆనంద్ గారు పాడిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి.ఆనంద్ గారి మేనల్లుడు ఉమామహేశ్వరరావు నా మిత్రుడూ కొలీగూ కూడా.మేమిద్దరం చాలాసార్లు ఆనంద్ గారి గురించి ముచ్చటించుకుంటూ ఉంటాము.'జూదగాడు' సినిమాలో ఆనంద్ గారు,సుశీల గారు పాడిన 'మల్లెలవేళా అల్లరివేళా,," నాకు చాలా ఇష్టమైన డ్యూయెట్స్ లో ఒకటి.ఆ పాట నా మొబైల్లో వింటూ ఉండగా ఉమా గమనించి 'సార్.ఆనంద్ గారి పాటలు మీకిష్టమా?' అనడిగాడు.

'అవును.నిజానికి ఘంటసాల మాస్టారి కంటే కూడా ఆనందూ,పీ.బీ.శ్రీనివాస్, ఏ.ఎం.రాజాల గానమే నాకు బాగా ఇష్టం.ఎందుకంటే ఘంటసాల గారిది డామినేటింగ్ వాయిస్.కాని వీరిది అలా కాదు.వీళ్ళ గొంతుల్లో ఏదో తెలియని సౌకుమార్యమూ,మాధుర్యమూ నిండి ఉంటాయి.భావగీతాలకు వీళ్ళ గొంతులే బాగా నప్పుతాయి.అందుకే వీళ్ళ పాటలు నాకు ఇష్టం.' అని చెప్పాను.

"ఆనంద్ గారు మా మేనమామే" - అని ఉమా అప్పుడు నాకు చెప్పాడు.

సినిమా ఫీల్డ్ లో ఉన్న కుళ్ళూ కుత్సితాలు ఏ స్థాయిలో ఉంటాయో నాకు కొన్ని వివరాలు ఉమా మహేశ్వర్ ద్వారా తెలిశాయి.సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదనీ దానికి చాలా రాజకీయాలు తోడవ్వాలన్న సత్యాన్ని మళ్ళీ ఉమా కూడా చెప్పాడు.

త్వరలో ఉమాతో కలసి వెళ్లి ఆనంద్ గారిని కలసి మాట్లాడబోతున్నాను.

ఆ విషయాలు అలా ఉంచితే,ఈ పాట వివరాలు ఇవి.

సినిమా: అమెరికా అమ్మాయి(1976)
రచన:మైలవరపు గోపి
సంగీతం:జీ.కే.వెంకటేష్
గానం:జీ.ఆనంద్
కరావోకే గానం:సత్యనారాయణ శర్మ

ఇది కూడా మధుర ప్రేమగీతమే.ఒక భావుకుడైన ప్రేమికుడు తన ప్రేయసిని తలచుకొంటూ పాడుకునే పాట.

Enjoy

----------------------
ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతిక
ఒక రాధిక అందించెను
నవరాగ మాలిక

ఒక వేణువు వినిపించెను

అనురాగ గీతిక

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో-2
నవ మల్లిక చినబోయెను-2
చిరునవ్వు సొగసులో

ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతిక

వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెను-2
రే రాణియే నా రాణికి-2
పారాణి పూసెను

ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతిక

ఏ నింగికి ప్రభవించెనొ నీలాల తారకా-2
నా గుండెలో వెలిగించెను-2
శృంగారదీపిక

ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతిక
ఒక రాధిక అందించెను
నవరాగ మాలిక

ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతిక...