ఇదే సంవత్సరంలో ఒక నెల ముందుగా శ్రావణ బహుళ అష్టమి నాడు ఉన్న గ్రహస్థితి ఏమిటో చూద్దాం.
సామాన్యంగా చూస్తే,ఒక నెలలో గ్రహాలు వాటివాటి స్థానాలను పెద్దగా మారవు (చాలాసార్లు).బృహద్గ్రహాలు అసలే మారవు.ఈ కుండలిలో కూడా సూర్యుడు శుక్రుడు మాత్రమే మారినారు.బుధుడు కుజుడు వక్రస్థితిలోకి పోయినారు.కానీ ఈమాత్రం మార్పులే జాతకాన్ని మొత్తం మార్చివేస్తాయి.

3-6-3011 BC న రాత్రిపూట రోహిణీ నక్షత్రం వస్తున్నది.కానీ ఆరాత్రికి తిధి అష్టమి లేదు నవమి వచ్చేసింది. కనుక ఆనాడు శ్రావణ బహుళ నవమి అవుతున్నది. అయినా సరే,విష్ణుపురాణ వచనం ప్రకారం నవమి రోజుకూడా సరిపోతుంది గనుక ఈ తేదీని కూడా పరిశీలిద్దాం.
శ్రావణ బహుళ నవమి గురువారం రాత్రి రోహిణి రెండవ పాదం అయ్యింది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉన్నది.
ఆ రోజు రాత్రి 00.45 వరకూ మధురా నగరిలో మేషలగ్నం ఉన్నది.వృషభ లగ్నం ఆ తర్వాత ఉదయించింది.అభిజిత్ ముహూర్తం అని విష్ణుపురాణం స్పష్టంగా చెబుతున్నది గనుక ముందు అభిజిత్ ముహూర్తాన్ని లెక్కిస్తే ఆ సమయానికి ఏ లగ్నం ఉన్నదో చూస్తే సరిపోతుంది.
అభిజిత్ ముహూర్త గణనం
సూర్యాస్తమయం :18.58
మర్నాడు సూర్యోదయం:5.18
రాత్రికాలం:10 గం 20 ని =620 ని.
ఒక ఘడియ కాలం =620/15=41 ని 18 సె.
ఏడు ఘడియల కాలం=7x41 ని 18 సె
=289 ని 6 సె
=4 గం.49 ని.
కనుక అభిజిత్ ముహూర్తం
18.58+4.49
=23.47 నుంచి 00.29 వరకు ఉన్నది.
అంటే విష్ణు పురాణంలో చెప్పబడినట్లు సరిగ్గా అర్ధరాత్రి సమయానికి అభిజిత్ ముహూర్తమే నడుస్తున్నది.
కానీ మధురా నగరిలో ఆరోజు రాత్రి 00.45 వరకూ మేషలగ్నమే ఉన్నది. కనుక అభిజిత్ ముహూర్త సమయానికి మేషలగ్నమే ఉదయిస్తున్నది. మేషలగ్నాన్ని గనుక మనం లెక్కిస్తే జీవిత సంఘటనలకు సంబంధించిన లెక్కలన్నీ తారుమారు అయిపోతాయి.
అప్పుడు జనన సమయానికి చంద్ర/గురు/గురుదశ నడుస్తుంది.మేనమామ గండం ఎక్కడా కనిపించడం లేదు.చెరసాలలో జననం కూడా సూచితం కావడం లేదు.కనుక మేషలగ్నం పనికిరాదు.
పైగా మేషలగ్నం అనుకుంటే జననం ఒక్కటే కాదు.మిగిలిన సంఘటనలు ఏవీ సరిపోవు.ఒకవేళ 00.45 కి వృషభలగ్నం వచ్చాక జననం జరిగింది అనుకుంటే అప్పుడు అభిజిత్ ముహూర్తం తప్పిపోతుంది.వృషభ లగ్నం కావాలనుకుంటే అభిజిత్ ముహూర్తం ఉండదు.అభిజిత్ ముహూర్తం కావాలనుకుంటే వృషభ లగ్నం ఉండదు.వృషభలగ్నం కాకపోతే భావాధిపత్యాలు మారిపోయి జాతకం మొత్తం మారిపోతుంది.
కనుక ఈ తేదీ సరియైనది కాదని తోస్తున్నది.

పోనీ సంశయోపయోగం (benefit of doubt) ఇస్తూ జననసమయం రాత్రి ఒంటిగంటకు అనుకుందాం.అలా అనుకుని కొంత పరిశీలన చేసి చూద్దాం.
అప్పుడు వృషభలగ్నమే అవుతుంది.కానీ శుక్రుడు చతుర్దంలోకి వచ్చినందు వల్ల తల్లితండ్రులతో శత్రుత్వం కనిపిస్తున్నది.కృష్ణుని జాతకంలో అలాంటిది ఏమీ లేదు.తల్లికి అనేక కష్టాలు కనిపిస్తాయి.కృష్ణుడు పుట్టకమునుపు అవి ఉన్నాయేమో గాని పుట్టిన తర్వాత వారికీ కష్టాలే లేవు.కనుక ఇదీ సరియైన సూచన కాదు.

కుజ/శుక్రదశ జరిగే సమయానికి ఈ జాతకునికి 11 ఏళ్ళు ఉంటాయి.కానీ కుజ శుక్రుల షష్టాష్టక స్థితిని బట్టి రాసలీల వంటి మధుర సన్నివేశం ఆ సమయంలో జరిగే అవకాశం లేదు.
ఇకపోతే మహాభారత యుద్ధ సమయానికి ఈ జాతకంలో గురు/చంద్ర/శుక్ర/కుజ/శని దశ జరిగింది.ఇది అంత ఘోరమైన యుద్ధాన్ని సూచించే దశ కాదు.
3010-11 సమయానికి శుక్ర/రాహు దశ జరిగింది.ఇది స్వమరణాన్ని చాలా మసకగా సూచిస్తున్నది గాని బలమైన సూచన లేదు.ముసలం పుట్టడాన్ని యాదవ వంశ నాశనాన్నీ కూడా ఈ దశ అంత బలంగా సూచించడం లేదు.
కనుక ఈ తేదీని తిరస్కరించవలసి వస్తున్నది.
ఈరకంగా ఇప్పటివరకూ జల్లెడ పట్టగా మనకు మిగిలిన నాలుగు జాతకాల తులనాత్మక పరిశీలనను వచ్చే పోస్ట్ లో చూద్దాం.
(ఇంకా ఉన్నది)