భగవంతుడైన విష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించిన సమయానికి ఉన్న గ్రహస్థితులను వ్యాసమహర్షి శ్రీమద్భాగవతంలో పెద్దగా వర్ణించలేదు. సూచనాప్రాయంగా మాత్రమే చెప్పినాడు.
ఎందుకంటే అప్పటివరకూ ఆయన ఒక గ్రంధకర్తగానే మిగతా పురాణాలన్నీ వ్రాసుకుంటూ వచ్చాడు.కానీ భాగవతం వ్రాసే సమయానికి ఆయనలోని భక్తి పరాకాష్టకు చేరుకున్నది.కనుకనే భాగవత రచన చేసిన తదుపరి మాత్రమే ఆయనకు పరమశాంతి లభించింది.ఈ మార్పు దేవర్షి అయిన నారదమహర్షి ఉపదేశం వల్లనే ఆయనకు కలిగింది.
అదే,మహాభారతం వ్రాసే సమయానికి గనుక మనం చూస్తే,ఆయన ఒక్క భక్తినే ఆశ్రయించలేదు.అసలా కధకు భక్తితో ఏమాత్రం సంబంధం లేదు.అది మానవావేశాలనూ ఈర్ష్యాద్వేషాలనూ మాయామోహాలనూ ధర్మాధర్మాలనూ కుట్రలనూ కుతంత్రాలనూ సమస్తాన్నీ ప్రతిబింబించే ఒక జరిగిన కథ.రాజ్యం కోసం భూమికోసం రాజుల మధ్యన జరిగిన యుద్ధం.
కానీ భాగవతం అలా కాదు.అది భక్తిరస సామ్రాజ్యం.అందులో భౌతిక వివరాలకు పెద్దగా తావు లేదు.ఆ సీమలో భౌతికపరిధి అతిక్రమించబడి అతీతలోకాల స్పర్శ మనకు అందుతుంది.దివ్యాత్మసామ్రాజ్యపు ప్రేమరసమే అందులో సర్వే సర్వత్రా నిండి తొణికిసలాడుతూ ఉంటుంది.హృదయం భక్తిలో కరగిపోయి శ్రీకృష్ణసన్నిధిలో అన్నీ మరచి ఆనందంలో ఓలలాడుతూ ఉండిపోతుంది.
కనుకనే భౌతికపరమైన చిన్నచిన్న వివరాలు భాగవతంలో మనకు పెద్దగా దొరకవు.భక్తి పరాకాష్ఠకు చేరుకున్న స్థితిలో భౌతిక వివరాలతో పని ఏమాత్రమూ ఉండదు కదా.
ఉదాహరణకు చూద్దాం.
శ్రీకృష్ణ జనన సమయంలో ఉన్న పరిస్థితిని వ్యాసమహర్షి ఎలా వర్ణించారో గమనిద్దాం.
శ్లో||అధ: సర్వగుణోపేత: కాల:పరమశోభన:
యర్హ్యే వాజన జన్మర్క్షం శాంతర్క్ష గ్రహతారకమ్
దిశ: ప్రసేదుర్గగనం నిర్మలోడుగణోదయం
మహీ మంగళభూయిష్ఠ పురగ్రామ వ్రజాకరా
(సంస్కృత శ్రీమద్భాగవతం 10-3-1,2)
"యర్హ్యేవాజన జన్మర్క్షం శాంతర్క్ష గ్రహతారకమ్" అనిన శ్లోకపాదంలో -'అజన నక్షత్రం నడుస్తున్న విషయమూ అన్ని గ్ర్హహములూ నక్షత్రములూ శాంతస్థితిలో" ఉన్న విషయాన్నీ మాత్రమే వ్యాసమహర్షి చెప్పినారు గాని,అది ఏ మాసం ఏ వారం ఏ లగ్నం మిగతా గ్రహాలన్నీ ఏయే పరిస్థితిలో ఉన్నాయి అనిన వివరాలేమీ ఆయన చెప్పలేదు.నక్షత్రం విషయం మాత్రం ఇక్కడ తెలుస్తున్నది.ఇతరగ్రహాల పరిస్థితి ఏమీ తెలియడం లేదు.
'అజన జన్మర్క్షం' అనే పదానికి అర్ధాన్ని తీసుకుంటూ అనేకులు 'ప్రజాపతి నక్షత్రమైన రోహిణి' అనిన అర్ధాన్ని గ్రహించారు.కానీ ఈ అర్ధం ఇదే కావాలన్న నియమం ఏమీ లేదు.దీనికి కొంత విరుద్ధంగా ఉండే శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి.

హరివంశ పురాణం,విష్ణుపురాణం వంటి ఇతర గ్రంధాలలో కొన్ని ఇతర వివరాలున్నాయి.అవేమంటున్నాయో దృష్టి సారిద్దాం.
శ్లో||ముహూర్తే అభిజిత్ ప్రాప్తే సార్ధరాత్రే విభూషితే
సాగరా సమకంపంత చేలుశ్చ ధరణీధరః
జజ్వలుశ్చాగ్నయా శాంతా జాయమానే జనార్దనే
శివాశ్చ ప్రవవుర్వాతా:ప్రశాంతమభవద్రజ:
జ్యోతింష్యతివ్యకాశంత జాయమానే జనార్దన:
అభిజిన్నామ నక్షత్రం జయంతీ నామ శర్వరీ
ముహూర్తో విజయో నామ యత్ర జాతో జనార్దన:
(హరివంశ పురాణం 2:4:14-17)
ముఖ్యంగా ఈ శ్లోకం చివరిపాదం లో ఉన్న "అభిజిన్నామ నక్షత్రం జయంతీ నామ శర్వరీ ముహూర్తో విజయో నామ యత్ర జాతో జనార్దన:" అనే శ్లోకాన్ని గనుక తీసుకుంటే,శ్రీకృష్ణ జనన సమయంలో అభిజిత్ నక్షత్రం ఉన్నదన్న విషయం కనిపిస్తుంది.
అయితే మరి శ్రీకృష్ణ జనన సమయంలో ఉన్నది రోహిణీ నక్షత్రమా? లేక అభిజిత్ నక్షత్రమా?పోనీ ఈ రెండూ పక్కపక్కన లేవు ఏదో పొరపాటయిందిలే అనుకోవడానికి.ఈ రెంటికీ మధ్యన పది నక్షత్రాల తేడా ఉన్నది.
అభిజిత్ నక్షత్రం ఒకప్పుడు మన నక్షత్ర గణనంలో ఉండేది.ఇది మహా ప్రకాశవంతమైన నక్షత్రం.దానితో కలిపి 28 నక్షత్రాలను మనం పూర్వకాలంలో లెక్కించే వాళ్ళం.ప్రస్తుతం దానిని తీసివేసి 27 నక్షత్రాలను మాత్రమే లేక్కిస్తున్నాం.అది నక్షత్రపధంలోనుంచి మాయం కావడమో పక్కకు తప్పుకోవడమో జరిగింది.అప్పటి నుంచి దానిని లెక్కించడం మానివేశాము.
కృష్ణునికి ముందున్న అనేక అవతారాలు అభిజిత్ నక్షత్రంలో వచ్చాయి. చివరకు ధర్మరాజు కూడా ఈ నక్షత్రం లోనే పుట్టాడు.కానీ ఆ తర్వాత ఆ నక్షత్రం ఆకాశంలో కనుమరుగు అయ్యింది.ప్రస్తుతం దానిని ఉత్తరాషాఢ-శ్రవణా నక్షత్రాల మధ్యన ఉన్నట్లుగా మనం భావిస్తున్నాం.
ఇక్కడ ఒక అనుమానం తలెత్తుతుంది.శ్రీకృష్ణనిర్యాణ సమయంలోనే ఈ నక్షత్రం మాయమైందా?మహాపురుషుల నిర్యాణ సమయాలలో తోకచుక్కలు కనిపించడం చుక్కలు కళావిహీనంగా మారడం వంటి సంఘటనలను అతి ప్రాచీన కాలం నుంచి మనం గమనిస్తున్నాం.
శ్రీకృష్ణుడు అవతారాలలో పరిపూర్ణుడని మనం భావిస్తాం.కనుక అలాటి పరిపూర్ణ దైవావతారం భూమిని వదలి పోయేటప్పుడు అలాంటి ప్రకాశవంతమైన నక్షత్రం మాయం కావడం జరగవచ్చు.ఇది ఊహాతీతమేమీ కాబోదు.కాకుంటే ఋజువులు లభించాలి.
మన ఖర్మేమిటంటే ఉన్న గ్రంధాలన్నీ అగ్నికి ఆహుతి అయిపోగా అదృష్ట వశాత్తూ మిగిలి ఉన్న కొన్నికొన్ని గ్రంధాలలో అక్కడక్కడా మనకు లభిస్తున్న సమాచారాన్ని బట్టి మనం మన చరిత్రను వెతుక్కోవలసిన పరిస్థితి పట్టింది.ఇలాంటి పరస్పర విరుద్ధమైన శ్లోకాలు మన పురాణాలలో చాలా ఉన్నాయి.
ఉదాహరణకు విష్ణుపురాణం లోనే ఉన్న ఇంకొక శ్లోకాన్ని బట్టి -'నేను బహుళ అష్టమి రోజు రాత్రి నవమితిధిలో జన్మిస్తాను' అని విష్ణువే స్వయంగా చెప్పినట్లు ఉన్నది.కనుక ఆయన జన్మించినది అష్టమిరోజునా లేక నవమిరోజునా లేక రెండూ కలిసి ఉన్న రోజునా అనేది కూడా సందేహమే.
శ్లో|| నిద్రే గచ్ఛ మమాదేశాత్ పాతాళ తల సంశ్రయాన్
ఏకైకత్వేన షడ్ గర్భాన్ దేవకీ జఠరం నయ
హతేషు తేషు కంసేన శేషాఖ్యోంశస్తతో మయ
అంశాంశేనోదరే తస్యాస్సప్తమ: సంభవిష్యతి
గోకులే వసుదేవస్య భార్యాన్యా రోహిణీ స్థితా
తస్యాస్స సంభూతి సమం దేవి నేయస్త్వయోదరమ్
సప్తమో భోజరాజస్య భయాద్రోధో పరోధతః
దేవక్యా పతితో గర్భం ఇతి లోకో వదిష్యతి
గర్భ సంకర్షణాత్సోధ లోకే సంకర్షణేతి వై
సంజ్ఞా మవాప్స్యతే వీరశ్శ్వేతాద్రి శిఖరోపమ:
తతోహం సంభవిష్యామి దేవకీ జఠరే శుభే
గర్భం త్వయా యశోదాయ గన్తవ్యమవిలంబితం
ప్రావృట్కాలే చ నభసి కృష్ణాష్టమ్యాం నిశి
ఉత్పత్స్యామి నవమ్యాంతు ప్రసూతిం త్వమవాప్స్యసి
(విష్ణు పురాణం 5:1:62-68)
విష్ణువు మానవుడు కాదు.ఆయన దేవదేవుడు.సర్వోత్క్రుష్టుడైన భగవంతుడు.ఇదీ అని ఊహించసాధ్యం కాని మహాతేజ:స్వరూపుడు.ఈ సన్నివేశంలో దేవతలు ఆయనవద్దకు పోయి ఆయన తత్త్వాన్నీ గుణగణాలనూ బ్రహ్మముఖంగా స్తుతించగా సంతుష్టుడై ఆయన వారికి సమాధానం ఇచ్చినట్లు ఉన్నది.అప్పుడు కూడా ఆయన సరాసరి తన నిజరూప దర్శనం ఇవ్వలేదు.దేవతలకే ఆయన దర్శనం కాలేదంటే,ఇక ఆయన చెబుతుంటే ఆయన మాటలను రికార్డ్ చేసినది ఎవరు?
కనుక ఇది ప్రక్షిప్తం అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది.
ఇకపోతే ఇంతకంటే పెద్దది ఇంకొక చిక్కుముడి ఉన్నది.అసలు కృష్ణుడు పుట్టినది శ్రావణమాసంలో కాదు భాద్రపద మాసంలో అని కొంతమంది వాదిస్తారు.దానికి వారి రుజువులు వారూ బాగానే చూపిస్తారు.వారి వాదనను సమర్ధించే శ్లోకాలు కూడా మన పురాణాల లోనే ఉన్నాయి.
మాసం తెలీకుండా,నక్షత్రం తెలీకుండా,సంవత్సరం తెలీకుండా వేల సంవత్సరాల నిడివిలో ఒక్కరోజును ఎలా కనుక్కోవడం?
అసలు మన పురాణాలలో ఉన్న శ్లోకాలలో అసలైనవి ఏవి? తర్వాత చేర్చబడినవి ఏవి? అనేది ఇంకొక చిక్కు ప్రశ్న.దీనిని ఎక్కడా సమాధానం లేదు.
సంస్కృతం వచ్చిన ప్రతివాడూ వాడి ఇష్టం వచ్చినట్లు కొన్ని శ్లోకాలు వ్రాసి పురాణాలలో ఎక్కడ బడితే అక్కడ పిట్టకధలుగా పిల్లకధలుగా చేర్చి పారేశాడు.దానితో అసలు గ్రంధం రూపురేఖలే మారిపోయే పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడింది.అసలైన గ్రంధంలో ఉన్న కొన్ని శ్లోకాలకు పూర్తి భేదంగా ఉండే శ్లోకాలు కూడా ఇందువల్లే మనకు అనేక పురాణాలలో కనిపిస్తాయి.
ఉదాహరణకు మొదట 10,000 శ్లోకాలతో వ్రాయబడిన మహాభారతం ఇప్పుడు లక్ష శ్లోకాలకు చేరుకున్నది అంటే మిగతా 90,000 శ్లోకాలను వ్రాసినది ఎవరు?వ్యాసుని శిష్యులు కొందరు ఆ పని చేశారని అంటారు.కనుక ఏయే శ్లోకాలు నిజాలో ఏవి ప్రక్షిప్తాలో చెప్పలేని పరిస్థితి పురాణాలలో ఉన్నది.కొంతమంది సబ్జెక్ట్ కంటిన్యూటీని బట్టి అందులో వచ్చిన బ్రేక్ ని బట్టి అక్కడ ప్రక్షిప్త శ్లోకాలున్నాయని భావిస్తారు.కానీ ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు.తెలివైన పండితుడు ఎవరైనా సరే ఆ గ్రంధంలోని సబ్జెక్ట్ బ్రేక్ కాకుండానే,అసలు గ్రంధపు శైలి మారకుండానే,ప్రక్షిప్త శ్లోకాలను కావాలనుకున్న ప్రతిచోటా చొప్పించడానికి ఏమీ అడ్డు లేదు.అది అసాధ్యం కూడా కాదు.
ఏతా వాతా చెప్పేదేమంటే,ఇలాంటి పరస్పర విరుద్ధమైన శ్లోకాల ఆధారంతో మనం చరిత్రను పునర్నిర్మించాలని చూస్తె అది అసాధ్యమైన విషయంగా తోస్తుంది.
కనుక చివరకు మళ్ళీ ఖగోళమూ జ్యోతిష్యమే మనకు దిక్కు అవుతుంది. పురాణాలనుంచి కొన్ని సూచనలు మాత్రమె మనం స్వీకరించి ఆ తర్వాత మన పరిశోధన సాగించాలి.అది తప్ప వేరే మార్గం లేదు.
పరిశోధకులు ఏ తేదీనైనా సరే సూచించవచ్చు.వారి వారి పరిశోధనల ప్రకారం ఆ తేదీని సమర్ధించుకోవచ్చు.కానీ ఆ సమయానికి ఉన్న గ్రహస్థితులు ఒక అవతార పురుషుని జాతకాన్ని అందులోనూ పరిపూర్ణ అవతార పురుషుని జాతకాన్ని ప్రతిబింబించాలి.అలా కాకపోతే,అది ఎంతటి గొప్ప పరిశోధనైనా సరే, ఆ తేదీ తప్పే అని మనం అనుకోక తప్పదు.
(ఇంకా ఉన్నది)